వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తనలోకి పీల్చేసుకోగల సరికొత్త పౌడర్ ఒకదాన్ని వాటర్‌లూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్యాక్టరీలు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఈ పౌడర్‌ను వాడటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని అంచనా. అంతేకాదు.. కార్బన్‌తో తయారైన ఈ పౌడర్‌లోని రంధ్రాల సైజును నియంత్రించడం, రంధ్రాల సంఖ్యను పెంచడం ద్వారా ఈ టెక్నాలజీని మరింత సమర్థమైన వాటర్ ఫిల్టర్లు, బ్యాటరీల తయారీకి కూడా వాడుకోవచ్చునని ఝాంగ్‌వీ ఛెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.
మొక్కల పదార్థాన్ని వేడి చేయడం.. ఉప్పును వాడటం ద్వారా తాము కార్బన్‌ను తయారు చేశామని, ఈ క్రమంలో ఏర్పడిన సూక్ష్మమైన కర్బన గోళాలపై మీటర్‌లో పదిలక్షల కంటే తక్కువ సైజున్న రంధ్రాలు ఏర్పడ్డాయని ఛెన్ వివరించారు. ఫలితంగా ఈ కర్బన పదార్థం వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఇతర పదార్థాల కంటే రెట్టింపు వేగంగా, తనలో ఇముడ్చుకోగలదని చెప్పారు. వాతావరణంలోకి చేరకముందే కాలుష్యకారక వాయువును నిల్వ చేసుకోవడం వల్ల భూ తాపోన్నతి తగ్గింపునకు ఇదో మెరుగైన తాత్కాలిక పరిష్కారం అవుతుందన్నది తమ అంచనా అన్నారు.
ఈ పౌడర్‌తో కార్బన్‌డైయాక్సైడ్‌కు చెక్!
Published Wed, Dec 26 2018 1:26 AM | Last Updated on Wed, Dec 26 2018 1:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment