
భూతాపోన్నతితో వచ్చే నష్టాలను తగ్గించుకునేందుకు మొక్కల పెంపకం పెద్ద ఎత్తున జరగాలని మనం తరచూ వింటూ ఉంటాం. అయితే ఎన్ని మొక్కలు పెంచితే వాతావరణంలోని కార్బన్ డైయాక్సైడ్‌ను గణనీయంగా తగ్గించవచ్చు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన టెక్నికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొంచెం అటు ఇటుగానైనా సరే.. మొత్తమ్మీద ఒక లక్ష ఇరవై వేల కోట్ల మొక్కలు.. అది కూడా పూర్తిగా కొత్తవి నాటితే మేలన్నది వీరి అంచనా.
కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించేందుకు సౌర, పవన విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు, మాంసాహారాన్ని త్యజించడం మొదలైన చాలా పనులకంటే మొక్కల పెంపకం లాభదాయకమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త థామస్ క్రోథర్ తెలిపారు. వాతావరణంలో ఇప్పుడు దాదాపు 400 గిగాటన్నుల కార్బన్‌డైయాౖMð్సడ్ ఉంటే.. నేలపై ఉజ్జాయింపుగా మూడు లక్షల కోట్లు మొక్కలు ఉన్నాయని.. ఇంకో లక్ష కోట్ల మొక్కలను నాటితే గత దశాబ్ద కాలంలో వాతావరణంలోకి విడుదలైన విష వాయువు మొత్తాన్ని తొలగించవచ్చునని వివరించారు. గాల్లోంచి కార్బన్‌డైయాక్సైడ్‌ను వేరు చేయడం వంటి పనులు కాకుండా ప్రతి ఒక్కరూ చేపట్టగల మొక్కల పెంపకం పనితో ప్రయోజనమెక్కువని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment