Carbon dioxide
-
సీఓ2 నుంచి మిథనాల్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 1,200 మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కార్బన్డయాక్సైడ్ (సీఓ2) వాయువు నుంచి మిథనాల్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గు గనుల సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంట్‌ను రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోంది. థర్మల్ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రక్రియలో భాగంగా బొగ్గును మండించడంతో పెద్ద మొత్తంలో కార్బన్డయాక్సైడ్ విడుదలవుతుంది. రోజుకు 500 కేజీల కార్బన్ డయాక్సైడ్ సేకరించి, హైడ్రోజన్‌తో రసాయన చర్యకు గురిచేయడం ద్వారా మిథనాల్ ద్రావణాన్ని ఉత్పత్తి చేస్తారు. విద్యుత్ కేంద్రం చిమ్నీకి అనుసంధానం చేసి మిథనాల్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 31 నాటికి ఇది పూర్తవుతుందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సింగరేణి విద్యుత్ కేంద్రంలో వెలువడే కర్బన ఉద్గారాలను 99.9 శాతం వరకు వాతా వరణంలో కలవకుండా నివారించేందుకు ఎలక్ట్రో స్టాటిక్ ప్రెసిపి టేటర్స్ (ఈఎస్పీ)ను ఏర్పాటు చేశామని ఓ ప్రకటనలో చెప్పారు. దీంతో అనుమతించిన పరిమితులకు లోబడే కర్బన ఉద్గారాలను విద్యుత్ కేంద్రం విడుదల చేస్తుండగా, వాటినీ రీసైకిల్ చేసి మిథనాల్‌ను తయారు చేయనున్నట్లు వివరించారు. విజయవంతమైతే భారీ ప్లాంట్మిథనాల్ ప్లాంట్‌కి సంబంధించిన సివిల్ పనులు పూర్తి కాగా..కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించే యూనిట్, హైడ్రోజన్ జనరేటర్, కంప్రెషర్, మిథనాల్ డిస్టిలేషన్ యూనిట్లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోల్ ఇండియా అనుబంధ పరిశోధన సంస్థ ‘సీఎంపీడీఐఎల్’ ఆర్థిక సహకారంతో ఇథనాల్ ప్లాంట్‌ను చేపట్టారు. నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, బ్రెత్ అప్లైడ్ సైన్సెస్ సంస్థలకు అప్పగించారు. ప్లాంట్ రోజుకి 180 కేజీల మిథనాల్‌ను ఉత్పత్తి చేయనుండగా, సింగరేణి సంస్థ విక్రయించడం లేదు. ప్రయోగాత్మక ప్లాంట్ విజయవంతమైతే వ్యాపార విస్తరణలో భాగంగా భారీ మిథనాల్ ఉత్పత్తి ప్లాంట్‌ను నిర్మించి వాణిజ్య విక్రయాలు జరపాలని సంస్థ భావిస్తోంది. మిథనాల్‌ను ఎరువులు, అక్రిలిక్ ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్ వస్త్రాలు, ప్లైవుడ్, పెయింట్స్ తయారీలో వినియోగిస్తారు. దేశంలో 120 మిలియన్ టన్నుల మిథనాల్‌ను వినియోగిస్తుండగా, 80 మిలియన్ టన్నులు ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. -
గ్లోబల్ వార్మింగ్‌పై ఫైటర్.. ది మమ్మోత్
ఏటేటా పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమలు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతోంది. వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్డయాక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమ వుతోంది. దీనికి పరిష్కారంగానే.. ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి.ఈ క్రమంలోనే ఐస్ ల్యాండ్‌కు చెందిన ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బదులు.. నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సరికొత్త సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..ఏటా 36 వేల టన్నుల మేర..గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి.. దానిని నీటితో కలిపి, భూమిలోపలి పొరల్లోకి పంపేలా క్లైమ్ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఏటా 36 వేల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను గాలిలోంచి తొలగించి.. భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది. ఇది సుమారు 8 వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే వెలువడేంత కార్బన్‌డయాక్సైడ్‌తో సమానం కావడం గమనార్హం. చూడటానికి ఇది తక్కువే అనిపించినా.. ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే.. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారంగా పనికొస్తుందని ‘క్లైమ్ వర్క్స్’ సంస్థ చెప్తోంది.దీనిలో నిలువునా గోడల్లా ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి.ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడు.. అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి.. ముందు వైపునకు వదులుతాయి. ఈ క్రమంలో చాంబర్‌లోని ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తాయి.ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్తో నిండిపోతే.. ఆటోమేటిగ్గా చాంబర్ సీల్ అయిపోతుంది. అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో 100 సెంటిగ్రేడ్ల మేరకు వేడెక్కుతుంది. దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డయాక్సైడ్ ఆవిరి అవుతుంది.ఎలా పనిచేస్తుంది?ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు. ఆ పైపుల్లోకి నీటిని పంపే ఏర్పాట్లు చేస్తారు. దీనితో కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్‌గా మారిపోతుంది. భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది.ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం, పైపుల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీరు పంపింగ్ చేయడం కోసం వాడే విద్యుత్‌ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు.ఇది వేడినీటి బుగ్గల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కాబట్టి.. దాని వినియోగంతో పర్యావరణానికి సమస్యేమీ లేదని ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.అమెరికాలోని లూసియానాలో 2030 నాటికి ఏటా 10 లక్షల టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను సంగ్రహించగలిగే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
విషవాయువుతో ఇంధనం పొడి!
ప్రపంచవ్యాప్తంగా గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించాలని దాదాపు అన్నిదేశాలు చాలా సదస్సుల్లో ఏకవాక్కు చేస్తున్నాయి. కానీ ఆ విషవాయువును తగ్గించడంలో చర్చలపై చూపుతున్న శ్రద్ధ.. ఆశించిన మేర చర్యలపై చూపడంలేదనేది అన్ని దేశాలకు మింగుడుపడని సత్యం. ఈ నేపథ్యంలో కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించడానికి జరుగుతున్న చర్యలతోపాటు వాతావరణం నుంచి దాన్ని వెలికి తీయడానికి ఇంజినీర్లు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ విషవాయువును సైతం వినియోగించుకునే విధంగా వివిధ పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చే సమర్థ విధానాన్ని కనుగొన్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్ను ద్రవ లేదా ఘన పదార్థం రూపంలోకి మారుస్తుంది. దీన్ని హైడ్రోజన్ లేదా మెథనాల్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. ఫ్యూయెల్ కణాలకు శక్తిని అందించటానికి, విద్యుత్తు ఉత్పత్తికి వాడుకోవచ్చు. ప్రయోగశాల స్థాయిలోనే దీన్ని సాధించినప్పటికీ పెద్దఎత్తున అమలు చేయొచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇళ్లకు ఉద్గార రహిత విద్యుత్తు, వేడిని అందించొచ్చని ఆశిస్తున్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్ను 90% వరకు ఇంధనంగా మారుస్తుండటం గమనార్హం. ఇదీ చదవండి: ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండిలా..! ఈ ప్రక్రియలో ముందుగా కార్బన్ డయాక్సైడ్ను మాధ్యమిక రూపంలోకి.. అంటే ద్రవ లోహ బైకార్బోనేట్‌గా మారుస్తారు. అనంతరం అణు, వాయు, సౌర విద్యుత్తు వంటి స్వల్ప కర్బన విద్యుత్తుతో పనిచేసే ఎలక్ట్రోలైజర్లో విద్యుత్‌రసాయన పద్ధతిలో ద్రవ పొటాషియం లేదా సోడియం ఫార్మేట్గా మారుస్తారు. దీన్ని ఎండబెట్టి ఘన పొడిగా చేస్తారు. దాంతో ఇది స్థిరంగా ఉంటుంది. చాలాకాలం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని ఇళ్ల నుంచి పరిశ్రమల అవసరాల వరకూ ఇంధనంగా వాడుకోవచ్చని ఇంజినీర్లు వివరించారు. -
గోబర్.. గాభరా !
ఇప్పుడంటే ప్రతి ఇంట్లోనూ గ్యాస్ స్టవ్లొచ్చాయిగానీ కొన్నాళ్లు ‘గోబర్ గ్యాస్’ (పశువుల పేడతో తయారైంది) కూడా ఓ వెలుగు వెలిగింది! గ్రామాల్లో పశు సంపద అధికంగా ఉండే ఇళ్లలో వీటిని బాగానే ఆదరించారు. చిన్నపాటి బావి లాంటి గుండ్రటి ఇనుప డ్రమ్ముల్లో నిల్వ చేసిన పేడ కరగడం ద్వారా నెమ్మదిగా మీథేన్ విడుదలవుతుంది. దీన్ని పైపు ద్వారా తరలించి వంటకు వినియోగించడం తెలిసిందే. అంత చాకిరీ చేసే ఓపిక లేకపోవడంతో కాల క్రమంలో గోబర్ గ్యాస్ కనుమరుగైంది. అలా వంటకు ఉపయోగపడ్డ మీథేన్ ఇప్పుడు వాతావరణంలో మంటకు కూడా కారణమవుతోంది!! – పల్లా రవికిరణ్, ఏపీ సెంట్రల్ డెస్క్ వాహనాల పొగ, ఏసీలు, ఫ్రిడ్జ్‌ల నుంచి విడుదలయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్లకు మించి పశువుల నుంచి వెలువడే గ్యాస్ భూతాపానికి దారి తీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో, వాటి వ్యర్థాల నుంచి వెలువడే మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువులు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. వాతావరణంలో ప్రతికూల మార్పులకు కారణమవుతున్నాయి. ఎంత ఆలస్యంగా జీర్ణం అయితే అంత ఎక్కువగా గ్యాస్ విడుదల అవుతుంది. కాబట్టి వాటికి తేలిగ్గా జీర్ణమయ్యే, సహజ సిద్ధమైన ఆహారాన్ని అందించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నైట్రస్ఆక్సైడ్.. నిప్పుల కొలిమి కార్బన్డయాక్సైడ్ కంటే మీథేన్ గ్యాస్ 28 రెట్లు అధికంగా భూ తాపానికి కారణమవుతోంది. నిల్వ చేసిన పశువుల పేడ నుంచి అధిక మోతాదులో వెలువడే నైట్రస్ ఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు కంటే దాదాపు 265 రెట్లు అధికంగా వాతావరణం వేడెక్కటానికి దారి తీస్తోంది. పశువులు తీసుకునే ఆహారంలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి కొంతవరకూ కారణం. ప్రస్తుతానికి ఈ సమస్యను పూర్తి స్థాయిలో అరికట్టలేకున్నా మెరుగైన యాజమాన్య పద్ధతులు, పాల దిగుబడిని పెంచుకోవడం, దాణాలో కొన్ని రకాల మందులను చేర్చడం ద్వారా కొంతవరకు నియంత్రించవచ్చు. 2070 నాటికి జీరో కర్బన ఉద్గారాల లక్ష్యంగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా ఊపందుకుంటోంది. సౌర విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో గ్రీన్హౌస్ వాయువులను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత నెలకొంది. సమతుల్య ఆహారంతో.. అమెరికాలోని హోల్స్టీన్ ఆవులతో పోలిస్తే మన దేశంలో సంకర జాతికి చెందిన పశువులు 4.8 శాతం అధికంగా గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఇక దేశవాళీ ఆవులు 11.8 శాతం అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. భూతాపాన్ని అరికట్టేందుకు 2030 నాటికి మీథేన్ఉద్గారాలను 11–30 శాతం వరకు నియంత్రించాలని, 2050 నాటికి 24–47 శాతం వరకు కట్టడి చేయాలని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సూచించింది. 3 ఎన్వోపీ (నైట్రాక్సీ ప్రొఫెనాల్)ను పశువులకు అందించే దాణాలో కలపడం ద్వారా మీథేన్ ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతున్నట్లు కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్(సీజీఐఏఆర్) తాజా నివేదిక వెల్లడించింది. పశువుల ఆరోగ్యానికి ఇది సురక్షితమేనని సూచించింది. సంతులిత (సమతుల్య) ఆహారాన్ని ఇవ్వడం ద్వారా కూడా 15 శాతం దాకా ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని మరో సర్వే తెలిపింది. 98 శాతం మీథేన్ వీటి నుంచే 1. వ్యవసాయం 2. ఆయిల్ అండ్ గ్యాస్ 3. బొగ్గు తవ్వకాలు 4. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఘన వ్యర్థాల నిర్వహణ) 5. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ (వ్యర్థ జలాల నిర్వహణ) స్వల్పంగా పెరిగినా మంటలే! ♦ మీథేన్ ఎంత ఎక్కువగా విడుదలైతే పుడమి అంత అధికంగా వేడెక్కుతుంది. ♦ ఉష్ణాన్ని బంధించి ఉంచే శక్తి కారణంగా మీథేన్ శాతం స్వల్పంగా పెరిగినావాతావరణంలో భారీ మార్పులకుదారి తీస్తుంది. ♦ పశువులు తీసుకునే ఆహారం మీథేన్ విడుదలను ప్రభావితం చేస్తుంది.ఎక్కువ మొత్తంలో తీసుకోవడం, నాసిరకం మేతను ఇవ్వడం మీథేన్ విడుదలను పెంచుతుంది. ♦ పశువుల ఆరోగ్యానికి చేటు చేయకుండా మీథేన్ విడుదలను నియంత్రించే టీకాపై న్యూజిలాండ్ పరిశోధన చేస్తోంది. ♦ బ్రోమోఫార్మ్ లాంటివి పశువుల శరీరంలోని బ్యాక్టీరియా మీథేన్ ఉత్పత్తి చేయటాన్ని 65 శాతం వరకు తగ్గించినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నా దీని వాడకానికి సంబంధించి పలు సందేహాలున్నాయి. పశువుల శరీరంలోకి చేరిన శైవలాలు (ఆల్గే) వాటి పాలు, మాంసం ద్వారా మనుషుల దేహంలోకి ప్రవేశించి థైరాయిడ్ గ్రంథి పనితీరును అస్తవ్యస్థం చేసే ప్రమాదం ఉందనే వాదనలున్నాయి. అందువల్లే అన్ని రకాల ఔషధాలను శాస్త్రవేత్తలు సిఫారసు చేయడం లేదు. సంక్లిష్ట జీర్ణ ప్రక్రియ.. పశువులు ఆహారాన్ని జీర్ణం చేసుకునే క్రమంలో మీథేన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. వాటిలో జీర్ణ ప్రక్రియ కొంత సంక్లిష్టంగా పొట్ట నాలుగు అరలుగా (రూమినెంట్స్) ఉంటుంది. పీచు పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మళ్లీ నోటిలోకి తీసుకొచ్చి నెమరు వేస్తాయి. తిన్న ఆహా రం కిణ్వ ప్రక్రియకు (పులవడం) గురైనప్పుడు మీథేన్ విడుదలవుతుంది. ఇది నోటి ద్వారా త్రేన్పులు రూపంలో, అపాన వాయువు రూపంలో వెలువడుతుంది. ఎంత తక్కువ సమయంలో ఆహారం జీర్ణం అయితే మీథేన్ ఉత్పత్తి అంత తగ్గిపోతుంది. బోవర్, రెడ్సీ వీడ్, అగోలిన్, ఒరిగానో లాంటి వాటిని పశువుల మేత, దాణాలో కలిపి ఇవ్వడం ద్వారా త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఎఫ్‌డీఏ ఆమోదించిన నైట్రాక్సీ ప్రొఫనాల్ను దాణాలో కలపడం వల్ల మీథేన్ శాతం బాగా తగ్గుతుంది. జొన్నలు, సజ్జలు తగినంత మోతాదులో అందిస్తే పీచు పదార్థాలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగిన మోతాదులో ఇవ్వాలి. ఇక పశువుల ఎరువును సరైన విధంగా నిల్వ చేయనప్పుడు నైట్రస్ ఆక్సైడ్ పెద్ద మొత్తంలో విడుదలవుతుంది. యాసిడ్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు పేడను ఆర్గానిక్ ఆమ్లాలుగా మారుస్తాయి. మీథేన్‌ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు దీన్ని మీథేన్, కార్బన్‌డయాక్సైడ్‌గా మారుస్తాయి. గ్రీన్హౌస్ వాయువుల్లో మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాతావరణం వేడెక్కడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పశువులకు సహజ సిద్ధమైన మేత, దాణా అందిస్తూ పాల దిగుబడి పెరిగేలా నాణ్యమైన జాతులను సాకాలి. -
డేంజర్ జోన్లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా..
భూతాపం కారణంగా తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సిన దేశాలలో భారత్ కూడా ఉంది.రాబోయే 30 ఏళ్ళల్లో ఈ తీష్ణత మరింతగా పెరుగుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.భారతదేశంలోని 50 శాతం మందిపై కరువు బరువు పడే సూచనలు కనిపిస్తున్నాయి.భూతాపం 3డిగ్రీల సెల్సియస్ పెరిగితే చాలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగినా పరిణామాలు తీవ్రంగానే ఉండనున్నాయి.ముఖ్యంగా వ్యవసాయభూమి దాదాపు సగానికి పైగా కరువుక్షేత్రంగా మారిపోతుందని పరిశోధకులు చెబుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ప్యారిస్ ఒప్పందంలో చెప్పినట్లుగా ఉష్ణోగ్రతలను పారిశ్రామిక యుగం నాటికి తీసుకురాగలిగితే చాలా వరకూ ముప్పును తప్పించుకో గలుగుతాం. ఆచరణలో అది జరిగేపనేనా? అన్నది పెద్దప్రశ్న. భూమి వేడిక్కిపోతోందిరా! బాబూ అంటూ శాస్త్రవేత్తలు నెత్తినోరు మొత్తుకుంటూనే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఎప్పటి నుంచో ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలు కలుసుకున్నప్పుడల్లా చర్చించే అంశాల్లో ఇదొకటి.ఉపన్యాసాలు, ఒప్పందాలు, నినాదాలు తప్ప అంతటా ఆచరణ శూన్యం. భూమి వేడిక్కిపోతున్న ప్రభావంతో శీతోష్ణస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలను కొలవడం ద్వారా దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఆ వివరాలను సంబంధిత విభాగాలు ప్రపంచానికి తెలియజేస్తూనే ఉన్నాయి.వాతావరణంలో మార్పులు చేర్పులు అన్నది అనాదిగా జరిగే పరిణామం. శీతోష్ణస్థితుల ప్రభావం ప్రపంచంపై, మానవుల మనుగడపై ఎంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా, 20వ శతాబ్దం మధ్యకాలం నుంచీ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అసాధారణ స్థితికి చేరిపోయింది.ఈ ప్రభావంతో రుతువుల ప్రయాణం కూడా గతితప్పింది. అకాల వర్షాలు, ప్రకృతి భీభత్సాలు, కరువుకాటకాలు, వింత వింత జబ్బులు అన్నింటికీ భూమి వేడెక్కిపోవడమే ప్రధాన కారణం. పారిశ్రామికం వెర్రితలలు వేసి,ఆర్ధిక స్వార్థం ప్రబలి, హరిత చైతన్యం అడుగంటడం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి.ఆరోగ్యకరమైన అభివృద్ధికి అవరోధాలు పెరుగుతున్నాయి.కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారమే కొంప ముంచుతోంది. భూమి వేడెక్కిపోవడం వల్ల ఏర్పడుతున్న పరిణామాలు విస్తృతంగా ఉంటాయి.సముద్ర మట్టాలు పెరిగిపోవడం, మహా సముద్రాల ఆమ్లీకరణం,అడవులు మండిపోవడం, అనేక జాతులు అంతరించిపోవడం, పంటల దిగుబడి తగ్గిపోవడం, ఆహారకొరత చుట్టుముట్టడం మొదలైన ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు కూడా తరలిపోవాల్సి వస్తుంది.భూతాపాన్ని అడ్డుకోవడం అందరి సమిష్టి బాధ్యత. ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు, ప్రజలు అందరూ కలిసి రంగంలోకి దిగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ దుస్థితికి కారణం మనిషి. మనిషిలోని స్వార్ధ చింతన, బాధ్యతా రాహిత్యం, రేపటి పట్ల ఏ మాత్రం స్పృహ లేకపోవడం ఈ దుస్థితికి చేర్చాయి. ఐక్య రాజ్య సమితి ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ ఈ అంశం బలంగా చర్చకు వచ్చింది. ఉద్గారాలను పెద్దఎత్తున తగ్గించాలి.భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలని 2016లో పారిస్ లో ఒప్పందం జరిగింది. ఈ ఆరేడేళ్లలో అది తగ్గకపోగా మరింత పెరిగింది.భూమిని, వనరులను వాడుకొనే విధానంలో పెను అనారోగ్యకరమైన విధానాలు వచ్చాయి. నివాసయోగ్య భూమి -అటవీ భూమి మధ్య ఉన్న నిష్పత్తులు మారిపోయాయి. వ్యవసాయభూమిని వాడుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. వ్యవసాయం కంటే మిగిలిన వాటికి ఆ భూమిని వాడే సంస్కృతి పెరిగిపోయింది. పర్యవసానంగా అటవీ భూమి, వ్యవసాయ భూమి తగ్గిపోయింది. కొన్ని రసాయనాల సమ్మేళనం మేఘాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.భూమికి చేరే సూర్యకాంతి పరిమాణంలో కూడా తగ్గుదల మొదలైంది. దీనిని 'గ్లోబల్ డిమ్మింగ్ ' అంటారు. భూమికి సూర్యుడే ప్రధానమైన శక్తి.ఆ వనరులు తగ్గిపోవడం అత్యంత ప్రమాదకరం.ఇప్పటికైనా మేలుకోవాలి. గ్రీన్ వాయివులను తగ్గించుకోవాలి. సౌరశక్తి, పవన శక్తిని ఎక్కువగా సద్వినియోగం చేసుకోవాలి. కార్బన్ వాడకాన్ని తగ్గించడం ఎంత ముఖ్యమో,అడవులను పెంచడం అంతకంటే ముఖ్యం. పబ్లిక్ రవాణా విధానంలో చాలా మార్పులు రావాలి.కార్లు మొదలైన వాహనాల వాడకం తగ్గించి, నడక, సైకిళ్ల వాడకం పెంచమని నిపుణులు సూచిస్తున్నారు.భూతాపం వల్ల 2030 నాటికి మరో 12 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికంలోకి వెళ్ళనున్నారని నివేదికలు చెబుతున్నాయి.వాతావరణాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆరోగ్యకరమైన విధానాలను పాటిస్తే ఉధృతి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ప్రకృతిని గౌరవిస్తే, అది మనల్ని కాపాడుతుంది. -మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
Pudami Sakshiga : భూమ్మీద ఆక్సిజన్ శాశ్వతం కాదా? ఆ తర్వాత అంతమేనా?
ఆక్సిజన్..ప్రాణాలు నిలబెట్టే వాయువు. ఐ–కొలి లాంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మినహా భూమ్మీద సమస్త జీవజాలాల మనుగడకు ఈ ఆక్సిజన్ అవసరం. అయితే ఈ ప్రాణవాయువుకు జన్మనిచ్చింది ఓ బ్యాక్టీరియా అంటే వింతగా అన్పించినా వాస్తవం. కోటాది కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఆక్సిజన్ అనేది లేదు. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం వాయువులు, దుమ్ము, ధూళి ఒకచోట స్థిరపడి భూగోళం ఏర్పడింది. ఆ తరువాత మరో వంద కోట్ల సంవత్సరాలకు భూమిపై ఏకకణ జీవితో జీవం ఆవిర్భవించింది. అప్పటికి ఇంకా భూమి మీద ఉన్న అనేక రకాల వాయువుల్లో ఆక్సిజన్ లేదు. ఆ కాలంలో ప్రోక్లొరోకాకస్ అనే బ్యాక్టీరియా తన మనుగడ కోసం నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్‌ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరిగించి అవసరమైన శక్తిని పొందడం మొదలుపెట్టింది. సముద్రంలో ఉండే ఈ బ్యాక్టీరియా నిర్వహించిన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ వాతావరణంలో కలవడం మొదలయ్యింది. సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఓ మోస్తరు ఆక్సిజన్ లభించడం మొదలయ్యింది. దీన్నే శాస్త్రవేత్తలు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్‌గా అభివర్ణించారు. అలా మొదలైన ఆక్సిజన్ ఇప్పటికి భూమిపై ఉన్న వాతావరణంలో 21 శాతానికి పెరిగింది. కోటాను కోట్ల జీవరాశుల జన్మకు, మనుగడకు కారణమయ్యింది. నైట్రోజన్దే రాజ్యం భూ వాతావరణంలో అత్యధికంగా నైట్రోజన్ 78 శాతం ఉంది. అంటే ఆక్సిజన్, నైట్రోజన్ కలిసి గాలిలో 99 శాతం ఉన్నాయన్నమాట. ఇక ఆగాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులన్నీ కలిపి ఒక్క శాతం ఉన్నాయి. సౌర కుటుంబంలోని మిగతా గ్రహాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దాదాపుగా లేదు. ఒకవేళ ఉన్నా ఇతర వాయువుల సంయోగంలో మాత్రమే ఉంది. ఉదాహరణకు వీనస్ (శుక్రుడు), మార్స్ (అంగారకుడు) గ్రహాల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ కలిసి 98 శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ కారణంగానే ఇతర గ్రహాలతో పాటు వీటిల్లోనూ జీవావిర్భావానికి అనుకూలమైన వాతావరణం లేదు. కిరణాలే జన్మదాతలు భూమ్మీద లభించే ఆక్సిజన్ దాదాపుగా కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథసిస్) సృష్టించిందే. అయితే కేవలం భూమ్మీది వృక్ష జాతుల్లో జరిగే ఫొటోసింథసిస్ వల్లే మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందనుకుంటే పొరపాటే. సగం సముద్రంలో కూడా పుడుతోంది. సముద్రంలో ఉండే మొక్కలు, నాచు వంటి వృక్ష సంబంధమైనవి కూడా తమకు కావలసిన శక్తి కోసం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి మాదిరిగానే ప్రోక్లోరొకాకస్ బ్యాక్టీరియా కూడా ఫొటోసిం«థసిస్ ద్వారా ఆక్సిజన్‌ను సృష్టిస్తోంది. అయితే సముద్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో భూ వాతావరణంలో కలిసేది అత్యల్పమనే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ చాలావరకు సముద్ర జీవజాలాల మనుగడకే సరిపోతుంది. కాబట్టి భూమ్మీద మనకు లభ్యమయ్యే ఆక్సిజన్ దాదాపుగా వృక్ష జాతుల పుణ్యమే. ఎంత చెట్టుకు అంత.. ఎదిగిన చెట్టుకు ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు ఉంటాయి. అయితే చెట్టులో ఐదు శాతంగా ఉండే ఆకులు మాత్రమే ఆక్సిజన్‌ను తయారు చేస్తాయి. వేర్ల నుంచి వచ్చే నీరు, సూర్యరశ్మి, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ను ఆకులు గ్రహించి కిరణ జన్య సంయోగక్రియ ద్వారా చెట్టు ఎదుగుదలకు కావలసిన గ్లూకోజ్‌ను తయారుచేస్తాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదిలేస్తాయి. చెట్లు కూడా కొంత ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి కానీ విడుదల చేసే ఆక్సిజన్‌తో పోల్చుకుంటే అది అతిస్వల్పం. ఇలా వాతావరణంలో ఆక్సిజన్ చేరుతూ ఈ రోజు మొత్తం గాలిలో 21 శాతాన్ని ఆక్రమించింది. సమయం, కాలం ఇతర వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక చెట్టు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే చెట్టు లేదా మొక్క రకాన్ని బట్టి ఆక్సిజన్ ఉత్పత్తి పరిమాణం మారుతూ ఉంటుంది. చాలావరకు మొక్కలు, చెట్లు పగలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తా యి. కొన్ని అరుదైన వృక్ష జాతులే 24 గంటలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు చాలామంది ఇంట్లో పెంచుకునే తులసి చెట్టు రోజులో 20 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది. అలాగే అరెకాపామ్గా పిలిచే పోకచెట్టు 24 గంటల పాటూ ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతూనే ఉంటుంది. ఆరేడు చెట్లు = ఓ మనిషి మనుగడ ఒక అంచనా ప్రకారం ఒక ఆకు గంటకు ఐదు మిల్లీలీటర్ల ఆక్సిజన్‌ను తయారుచేస్తుంది. వంద అడుగుల భారీ వృక్షం ఏడాదికి 6,000 పౌండ్ల ఆక్సిజన్‌ను ఉత్తత్తి చేయగలదు. చిన్నా పెద్ద చెట్లు సగటున 260 పౌండ్లు అంటే సుమారు 120 కిలోల ఆక్సిజన్ని ఏడాదికి సృష్టిస్తాయి. మనిషి సగటున ఏడాదికి 9.5 టన్నుల గాలిని పీల్చుకుంటాడు. అయితే ఇందులో ఆక్సిజన్ 21 శాతమే ఉంటుంది. మనిషి పీల్చుకునే ఆక్సిజన్‌లో కూడా మూడోవంతు మాత్రమే దేహం ఉపయోగించుకుని మిగతాది గాలిలోకి వదిలేస్తుంది. ఈ లెక్కన మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్‌ను వాడుకుంటాడు. అంటే సగటున ఆరు నుంచి ఏడు చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ఓ మనిషి మనుగడకు సరిపోతుందన్నమాట. భూమ్మీద శాశ్వతం కాదా? ఆక్సిజన్ భూమ్మీద శాశ్వతంగా ఉంటుందా అన్నది సందేహాస్పదమేనంటున్నారు సైంటిస్టులు. ఒకప్పుడు భూమిపై ఆక్సిజన్ లేదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చునన్నది వారి అభిప్రాయం. నాసాకు చెందిన కజుమి ఒజాకి, క్రిస్టఫర్ రైన్హర్ట్ అనే శాస్త్రవేత్తలు.. ఓ ప్రయోగం ద్వారా ఇంకో వంద కోట్ల సంవత్సరాల తరువాత భూమ్మీద ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుందనే అంచనాకు వచ్చారు. వంద కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు మరింత వేడిగా మారడం వల్ల భూమిపై కార్బన్ డైఆక్సైడ్ స్థాయి విపరీతంగా పెరిగి, ఆక్సిజన్ వెళ్లిపోయేలా చేస్తుందనేది వారి అంచనా. 20 వేల టన్నుల సామర్థ్యం కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక రోగులు పడిన అవస్థలు గుర్తుండే ఉంటాయి. భారతదేశం కోవిడ్ కాలానికి ముందు రోజుకి 6,900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేది. అందులో 1,000 టన్నులు మాత్రమే వైద్య అవసరాలకు అందుబాటులో ఉండేది. మొదటి విడత కోవిడ్ సమయంలో దీని అవసరం 3,095 టన్నులకు, రెండో విడత అంటే 2021లో 5,500 టన్నులకు పెరిగిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ప్రస్తుతం మనదేశంలో రోజుకు 20,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ వైద్య పరంగా ఇప్పుడు మనకు సగటున రోజుకు 1,250 టన్నుల ఆక్సిజన్ సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ద్వారా 7,054 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
కొమ్మలు, ఆకులు లేని చెట్టు.. లిక్విడ్ ట్రీ
చెట్లు అంటే.. పెద్ద కాండం, కొమ్మలు, ఆకులు ఉంటాయి. గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని, మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. కానీ ఈ చెట్లకు కాండం, కొమ్మలు, ఆకులు వంటివేవీ ఉండవు. అయినా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి, ఆక్సిజన్ ఇస్తాయి. వీటిని ఎక్కడ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు. మరి ఏమిటా చెట్లు? వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా.. కాలుష్యానికి పరిష్కారంగా.. బొగ్గును కలపను మండించడం నుంచి వాహనాల పొగ దాకా వాతావరణం కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా చెట్లను పెంచడం దీనికి పరిష్కారమైతే.. అందుకు విరుద్ధంగా అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో యూరప్‌లో అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచిన సెర్బియా శాస్త్రవేత్తలు.. వాతావరణ కాలుష్యానికి పరిష్కారం చూపేలా ‘లిక్విడ్ ట్రీస్’ను రూపొందించారు. ఏమిటీ ‘లిక్విడ్ ట్రీస్’? నీళ్లు, ఒక రకం నాచు (మైక్రో ఆల్గే) నింపి, ప్రత్యేకమైన కాంతి వెలువర్చే విద్యుత్ దీపాలను అమర్చిన ట్యాంకులే ‘నీటి చెట్లు (లిక్విడ్ ట్రీస్)’. సాంకేతికంగా వీటిని బయో రియాక్టర్లు అని పిలుస్తారు.నీటిలోని నాచు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని.. విద్యుత్ బల్బు నుంచి వెలువడే కాంతి సాయంతో ఫొటో సింథసిస్ (కిరణజన్య సంయోగ క్రియ) జరుపుతుంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఈ నీటి చెట్ల ట్యాంకులకు ‘లిక్విడ్3’ అని పేరు పెట్టారు. పదేళ్ల వయసున్న రెండు పెద్ద చెట్లతో, లేదా 200 చదరపు మీటర్ల స్థలంలోని గడ్డి, మొక్కలతో సమానమైన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ను ‘లిక్విడ్ 3’ పీల్చుకుంటుందని దీనిని అభివృద్ధి చేసిన బెల్గ్రేడ్ యూనివర్సిటీ మల్టీడిసిప్లీనరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త ఇవాన్ స్పాసోజెవిక్ చెప్తున్నారు. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎలా తగ్గుతుంది? సాధారణంగా నీటిలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వివిధ శాతాల్లో కరిగి ఉంటాయి. ఏదైనా కారణంతో నీటిలో వాటి శాతం తగ్గిన ప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి నీటిలోకి చేరుతాయి. ‘లిక్విడ్ 3’లోని కార్బన్ డయాక్సైడ్ను నాచు పీల్చుకున్నప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలోకి చేరుతుంది. అంటే చుట్టూ ఉన్న గాలిలో కాలుష్యం తగ్గుతుంది. ఉదాహరణకు అక్వేరియంలలోని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను చేప పిల్లలు పీల్చుకుంటాయి. ఇలా నీటిలో తగ్గిపోయే ఆక్సిజన్ శాతాన్ని తిరిగి పెంచేందుకే గాలి బుడగలను వెలువర్చే పంపులను అమర్చుతుంటారు. అయితే ‘లిక్విడ్ 3’లో ఇలా కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంటుంది. బెంచ్గా.. చార్జర్‌గా.. సెర్బియాలోని బెల్గ్రేడ్లో మున్సిపాలిటీ ఆఫీసు ముందు మొట్టమొదటి ‘లిక్విడ్ 3’ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. దీనిని భూమి నుంచి కాస్త లోతుగా ఏర్పాటు చేయడం వల్ల కూర్చునే బెంచ్‌లా ఉపయోగపడుతుంది. పైన సోలార్ ప్యానల్‌తో నీడ అమర్చారు. ఆ ప్యానెల్ నుంచి వచ్చే విద్యుత్‌తోనే ట్యాంకులో బల్బు వెలుగుతుంది. మొబైల్ ఫోన్లు వంటివి చార్జింగ్ చేసుకునే సాకెట్ కూడా ఉంటుంది. ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రోగ్రాం (యూఎన్డీపీ)’ కింద ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 11 ఉత్తమ వినూత్న ఆవిష్కరణల్లో ‘లిక్విడ్ 3’ కూడా చోటు సాధించడం గమనార్హం. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఎస్‌యూవీలతో పర్యావరణ ముప్పు
బెర్లిన్: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) 100 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లాయి. ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్‌తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్‌యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్‌యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దూసుకెళ్లింది. 2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్‌యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్ నాన్–ఎస్‌యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్‌తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్‌ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. -
సందేహాలు తీరకుండా చర్యలెలా?
వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చేపట్టే చర్యలకు కొన్ని వైరుద్ధ్యాలు అడ్డుపడుతున్నాయి. ఉష్ణోగ్రతలను తక్కువ పెరిగేలా చూడాలంటే, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. కానీ పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆధారపడే బొగ్గును తగ్గించే అంశానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కాలుష్యానికి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత వాటిపైనే ఉండగా, ఆ దాతల జాబితాలోకి భారత్, చైనాలను కూడా చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్‌కే ప్రత్యేకమైనది చైనాతో వ్యవహారం. చైనా తనకు అనుకూలంగా జీ77+ చైనా గ్రూపులో ఉంటూ వాతావరణ చర్చల్లో పాల్గొంటోంది. ఉద్గారాల్లో యూరప్, అమెరికాను మించనున్నందున దాతల జాబితాలోకి చైనా చేరేలా భారత్ ఒత్తిడి తేవాలి. వాతావరణం విషయంలో గత ఏడాది ఎన్నో వైపరీత్యాలను చూశాం. ఉత్తర భారతం అసాధారణ వడగాడ్పులతో అట్టుడికింది. పాకిస్తాన్లో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు జనావాసాలను ముంచెత్తాయి. యూరప్, చైనా కరవును చవిచూశాయి. వాతావరణ మార్పులను ఎదుర్కోవ డంలో భాగంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచం ఇప్పటికే చాలా చర్యలు చేపట్టింది. అయినా సరే... గత ఏడాది మానవాళి ఐదు కీలకమైన వైరుద్ధ్యాలను ఎదుర్కొంది. వీటిని తొల గించుకోకుంటే, ప్రకృతి వైపరీత్యాలు ఈ ఏడాదీ మనల్ని పలకరించక మానవు! వైరుద్ధ్యాల్లో మొట్టమొదటిది ‘శిలాజ ఇంధనాలు వర్సెస్ బొగ్గు’ అన్న అంశం నుంచి పుట్టుకొచ్చింది. వాతావరణ మార్పుల ప్రభా వాన్ని తగ్గించేందుకు భూమి సగటు ఉష్ణోగ్రతలను వీలైనంత తక్కువ పెరిగేలా చూడాల్సిన అవసరముంది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు దీన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలని అనుకుంటున్నాయి. ఈ అంశంపై ఇతర దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి శాస్త్రీయ మదింపు ప్రకారం, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఈజిప్టులో గత ఏడాది జరిగిన 27వ కాప్ సమావేశాల్లో పాశ్చాత్య దేశాలు బొగ్గు వాడకం తగ్గిద్దామనే అంశానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చాయి. అభి వృద్ధి చెందిన దేశాల్లో అత్యధికం చమురు, సహజవాయువుల ప్రధాన ఎగుమతిదారులు లేదా ఎక్కువ మోతాదుల్లో వినియోగించేవారు కావడం ఇక్కడ ప్రస్తావనార్హం! ఇక రెండో వైరుద్ధ్యం గురించి: కాప్–27 సమావేశాల్లో ఇది వ్యక్తమైంది. ఆర్థికాంశాలపై చర్చలో ‘లాస్ అండ్ డ్యామేజీ’ అంశంలో ఈ వైరుద్ధ్యం ఏమిటన్నది తెలిసింది. వాతావరణ కాలుష్యానికీ, భారీ కర్బన ఉద్గారాలకూ అభివృద్ధి చెందిన దేశాల బాధ్యతే ఎక్కువ. కాబట్టి జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కూడా వాటిపైనే ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించుకునేందుకు ఇతర దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఆర్థిక వనరులను సమ కూర్చాల్సి ఉంది కూడా. ఇందుకోసం ఏటా సుమారు వెయ్యి కోట్ల డాలర్ల అవసరముండగా... ఇప్పటికి సమకూర్చింది పిసరంతే. ఎందు కిలా అన్న ప్రశ్నకు అభివృద్ధి చెందిన దేశాలు విచిత్రమైన వాదన చేస్తున్నాయి. దాతల జాబితాలోకి భారీ ఆర్థిక వ్యవస్థలున్న దేశాల (భారత్, చైనా అని)ను చేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. అకస్మాత్తుగా పుట్టుకొచ్చిన ఈ కొత్త వాదన... ఇప్పటివరకూ నిర్ణయించిన విషయాలకు భిన్నం. మూడో వైరుద్ధ్యం కాప్–27 తీర్మానం తుది ప్రతిలో ‘జస్ట్ ట్రాన్సిషన్’, ‘జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్’ (జేఈటీపీ) అన్న పదాలను చేర్చడంతో ఉత్పన్నమైంది. ఈ రెండు పదాలూ చూసేం దుకు ఒకేలా అనిపిస్తాయి. కానీ వీటి అర్థాలు చాలా భిన్నం. ‘జస్ట్ ట్రాన్సిషన్’ అనేది సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకానికి మళ్లేందుకు ఒక్కో దేశానికి కావాల్సిన అంశాలకు సంబంధించినది కాగా, జేఈటీపీ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో బొగ్గు వాడకాన్ని నిలిపివేసేందుకు జీ7 దేశాలు అమలు చేస్తున్న అజెండాకు సంబం ధించిన విషయం. భారత్ సహా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా బొగ్గుపై ఆధారపడ్డ దేశాలు. వీటిని జేఈటీపీలోకి చేర్చేందుకు జీ7 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఏతావాతా... కాప్–27 తుది తీర్మానంలో జస్ట్ ట్రాన్సిషన్ అనే మాట చేరిక ఆహ్వానించదగ్గదైతే... జేఈటీపీ మాత్రం అనుమానించదగ్గది. నాలుగో వైరుద్ధ్యం విషయానికి వద్దాం. కార్బన్ మార్కెట్లపై జరిగిన చర్చల్లో ఇది బయటపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ కార్బన్ మార్కెట్లను (క్యోటో ప్రొటోకాల్‌లో భాగంగా ఏర్పాటైన క్లీన్ డెవలప్మెంట్ మెకనిజమ్స్; క్లుప్తంగా ‘సీడీఎం’) ఆర్థిక వనరు లను సమకూర్చుకునే సాధనంగా చూస్తూవచ్చాయి. అభివృద్ధి చెందిన దేశాల దృక్పథం దీనికి పూర్తిగా భిన్నం. తక్కువ ఖర్చుతో కర్బన ఉద్గారాలను తొలగించుకునేందుకు సీడీఎంను వాడుకోవచ్చునని ఈ దేశాలు భావిస్తున్నాయి. క్యోటో ప్రొటోకాల్, ప్యారిస్ అగ్రిమెంట్ల రెండింటిలోనూ కార్బన్ మార్కెట్ల ప్రస్తావన ఉన్నప్పటికీ వాటి నేపథ్యాలు మాత్రం వేర్వేరు. మొదటిదాని ప్రకారం దేశాలకు నిర్దిష్టమైన కర్బన ఉద్గార తగ్గింపు లక్ష్యాలు లేవు. ప్యారిస్ ఒప్పందం ప్రకారం ‘నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్’ (ఎన్డీసీ) ఉన్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఆయా దేశాలు చేసే ప్రయత్నాలే ఈ ‘ఎన్డీసీ’. భారతదేశం క్లైమేట్ ఫైనాన్స్ కోసం ఇతర దేశాలకు కార్బన్ క్రెడిట్స్ అమ్మితే, అవి ఉద్గారాల తగ్గింపు జాబితాలోకి చేరవు. దీనివల్ల మనం ఎన్‌డీసీలో వెనుకబడిపోతాం. కార్బన్ క్రెడిట్స్ అమ్ముకుని వాతావరణ మార్పులను తట్టుకునేందుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం... ఆయా దేశాలు కర్బన ఉద్గారాలపై ఇచ్చిన మాటను పూర్తి చేసిన తరువాతే సాధ్యమవుతుందన్నమాట. చిట్టచివరి... ఐదవ వైరుద్ధ్యం గురించి. ఇది భారతదేశం తనకుతాను సమాధానం ఇచ్చుకోవాల్సిన ప్రశ్న. వాతావరణానికి సంబంధించిన రాజకీయాల్లో చైనాతో ఎలా వ్యవహరించాలి? తన ఆర్థిక బలంతో రాజకీయాలు చేస్తున్న చైనా విదేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు వీటిల్లో ఒకటి మాత్రమే. ఫలితంగా కర్బన ఉద్గారాలు ఎన్నో రెట్లు ఎక్కువయ్యాయి. మన మంత్రులు ఈ విషయాలను ఇప్పటికే పలుమార్లు ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్(సీఈఈడబ్ల్యూ) అంచనా ప్రకారం చైనా గత, భవిష్యత్తు ఉద్గారాలు అమెరికా, యూరప్‌లను కూడా మించిపోతాయి (2060 నాటికి శూన్యస్థాయికి తేవాలన్న లక్ష్యంతో చైనా ఉంది). అంటే అమెరికా, యూరప్‌ల మాదిరిగానే చైనాను కూడా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేర్చాలన్నమాట. కానీ చైనా తనకు అనుకూలంగా ఉండేలా జీ77 + చైనా గ్రూపులో ఉంటూ వాతావరణ చర్చల్లో పాల్గొంటోంది. ఈ విషయంలో భారత్ ఒక స్పష్టత ఏర్పరచుకోవాలి. చైనా పాత్ర ఎలా ఉండాలో కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఈ ఏడాది భారతదేశం జీ20 సమావేశాల అధ్యక్ష స్థానంలో ఉంది. దీని ఆసరాతోనైనా భారత్ ప్రపంచ వాతావరణ మార్పుల చర్చల్లో అగ్రస్థానాన్ని మరింత పదిలపరచుకోవాలి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధిగానూ స్థిరపడాలి. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు వాడకం మాత్రమే కాకుండా... అన్ని శిలాజ ఇంధనాలను దశలవారీగా తగ్గించేలా ప్రపంచాన్ని ఒప్పించాలి. శిలాజ ఇంధనాల నుంచి సంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం వైపు మళ్లేందుకు కావాల్సిన అంశాల ఆధారంగా జేఈటీపీ ఉండేలా... జీ7 దేశాల పెత్తనం మాదిరిగా కాకుండా చూసుకోవాలి. చైనా అపరిమిత ఉద్గారాల విషయంలో భారత్ విస్పష్టంగా వ్యవహరించాలి. దాతల జాబితాలోకి చైనా కూడా చేరేలా ఒత్తిడి తేవాలి. కార్బన్ మార్కెట్లను అవకాశంగా తీసుకుని మరింత పర్యావరణ హితమైన టెక్నాలజీలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటివరకూ ప్రస్తావించిన ఐదు వైరుద్ధ్యాలు పరిష్కార మవుతాయా? లేక అలాగే కొనసాగుతాయా? అన్నది ఇంకోదఫా వాతావరణ మార్పుల చర్చలు జరిగినప్పుడే తేలుతుంది. కాకపోతే ఈ ఐదు అంశాలు ప్రపంచం, మరీ ముఖ్యంగా భారతదేశం వాతావరణ మార్పుల విషయంలో ఈ ఏడాది ఎలా వ్యవహరించాలో నిర్దేశిస్తాయ నడంలో సందేహం లేదు. వైభవ్ చతుర్వేది వ్యాసకర్త ఫెలో, ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Hyderabad: ద్విచక్ర వాహనాలే టాప్.. మెట్రోకు ఆదరణ అంతంతే !
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ ప్రజా రవాణాలో సింహభాగం వాటా ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. నిత్యం సిటీలో వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించే వారు 39 శాతం ఉండగా.. బస్సుల్లో జర్నీ చేసే వారు 34 శాతం ఉన్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌ల్లో రాకపోకలు సాగించేవారు 17 శాతం మంది.. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో జర్నీ చేసేవారు కేవలం 10 శాతం మించకపోవడం గమనార్హం. నగరంలో కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. ఇవే శాపం.. ► నగర మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. ఒక కిలోమీటరు మేర ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.272 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగర మెట్రో నిత్యం రూ.కోటి నష్టంతో నెట్టుకొస్తోంది. మెట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, సాంకేతిక నష్టాలను అరికట్టేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ► ఇక రెండో దశ మెట్రో ఏర్పాటుకు అవసరమైన రూ.8,400 కోట్లు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయిలో నిధులు విడుదల చేసే పరిస్థితులో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెండో దశ మెట్రో మార్గాన్ని పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశంపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. మెట్రోతో కాలుష్యం తగ్గిందిలా.. ► గతేడాది సరాసరి లెక్కను పరిశీలిస్తే సుమారు 3.8 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నగర వాతావరణంలో చేరకుండా మెట్రో నివారించడం విశేషం. నగర మెట్రో రైళ్లు విద్యుత్ ఆధారంగా పని చేస్తున్న విషయం విదితమే. స్టేషన్లలో విద్యుత్ అవసరాలకు సౌర విద్యుత్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. మెట్రో రైళ్లు గతేడాది సుమారు 1.6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని సైతం ఆదా చేసినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ► మూడు బోగీలుండే మెట్రో రైలులో ఏకకాలంలో 975 మంది ప్రయాణించవచ్చు. ఇక కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే 30 కిలోమీటర్లు మెట్రోలో జర్నీ చేస్తే కేవలం 190 కిలోల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం విడుదల అవుతుంది. అదే బస్సులో కేవలం 50 మంది ప్రయాణించవచ్చు. కాగా.. ఒక మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య 20 సిటీ బస్సులతో సమానం. వీటిలో జర్నీ చేస్తే ఏకంగా 405 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలై పర్యావరణ హననం జరుగుతోంది. ► ద్విచక్ర వాహనంపై ఇద్దరు జర్నీ చేసే వీలుంది. సుమారు 975 మంది జర్నీ చేయాలంటే 488 వాహనాలు అవసరం. వీటిపై 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే 730 కిలోల సీఓ 2 కాలుష్యం విడుదల అవుతుంది. కారులో నలుగురు వ్యక్తులు జర్నీ చేయవచ్చు. 975 మంది 30 కి.మీ మేర జర్నీ చేసేందుకు 244 కార్లు అవసరం అవుతాయి. ఇన్ని కార్లలో జర్నీ చేస్తే ఏకంగా 1200 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి. అంటే బస్సు, కారు, ద్విచక్రవాహనాలతో సిటీ కిక్కిరిసిపోయి.. పొగచూరుతుండగా.. మెట్రోతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్ చేయండి: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ) -
సీవో2ను రాకెట్ ఇంధనంగా మారుస్తా..!
ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడు పోతున్న విద్యుత్ కార్లు (టెస్లా) మొదలు అంత ర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు, సరుకులను పంపే రాకెట్ల (స్పేస్–ఎక్స్) వరకూ తనదైన ముద్రవేయడం ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ సొంతం. అసాధ్యం అని ఎవరైనా చెబితే దాన్ని సుసాధ్యం చేసే వరకూ అతడికి నిద్ర పట్టదంటే అతిశయోక్తి కాదు. మనిషి కేవలం భూమికే పరిమితం కారాదని.. అంగారకుడితో మొదలుపెట్టి వీలైనన్ని గ్రహాలకు విస్తరించాలన్న ఆలోచనలూ అతడివే. అందుకేనేమో ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక ‘టైమ్’ 2021కిగాను మస్క్‌ను ఈ ఏటి మేటిగా ప్రకటించింది. ఈ సందర్భంగా మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భూతాపోన్నతి ద్వారా వస్తున్న వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్నే తాను రాకెట్ల ఇంధనంగా మార్చుకొని మనుషులను అంగారకుడిపైకి చేరుస్తానన్నది ఆ ట్వీట్ సారాంశం. ఆసక్తి ఉన్నవారు తనతో చేతులు కలపాలని, యుద్ధప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపడుతున్నామని తరువాతి ట్వీట్లలో మస్క్ పేర్కొన్నాడు. మరి చెప్పాడంటే.. చేస్తాడంతే టైపు మస్క్ ఈ సవాలనూ జయించగలడా? కొత్త పనా? నిజానికి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా కంపెనీలు రకరకాల పద్ధతులను ఉపయోగించి ఈ పని చేస్తున్నాయి. ఇంధనం మాత్రమే కాదు.. ఈ విషవాయువును వోడ్కా వంటి మద్యంలా మార్చేందుకు, శరీరానికి అవసరమైన ప్రొటీన్లను తయారు చేసేందుకూ కొన్ని కంపెనీలు పరిశోధించి విజయం సాధించాయి. ఇంకొందరు వాతా వరణంలోంచి కార్బన్‌డయాక్సైడ్‌ను వేరు చేసి అత్యధిక పీడనానికి గురి చేయడం ద్వారా సూక్ష్మస్థాయి కృత్రిమ వజ్రాలను తయారు చేయ గలిగారు. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్వెల్వ్’... రెండు వినూత్న ఎలక్ట్రొలైజర్ల సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను సింథటిక్ గ్యాస్ లేదా కృత్రిమ గ్యాస్‌గా మార్చేందుకు ఒక టెక్నా లజీని తయారు చేసింది. ఇందులో సిన్గ్యాస్తో పాటు హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ రెండింటి సాయంతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఈ రకమైన కంపెనీలు ఎన్ని ఉన్నా అవి ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌లో ఓ 10 శాతం మాత్రం తగ్గించగలవు. అంగారక యాత్రకు అవసరమైనంత ఇంధనం మాట ఎలా ఉన్నా.. భారీ ఎత్తున సీవో2ను ఇంధనంగా మార్చగల టెక్నాలజీ అందు బాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. మస్క్ అనుకున్నది నిజమైతే మాత్రం అద్భుతం జరిగినట్లే! – సాక్షి, హైదరాబాద్ -
మరో సంచలన ప్రయోగానికి సిద్దమైన ఎలన్ మస్క్..!
ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్ తన క్రేజీ చేష్టలతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఒక్కోసారి తను చేసే ట్విట్స్తో అందరినీ షాక్‌కి గురి చేస్తారు.. మరికొన్ని ట్విట్స్తో ఎంటర్టైన్ చేస్తారు. తాజాగా మరోసారి, ఎలన్ మస్క్ ఆసక్తికరమైన ఒక ట్వీట్ చేశారు. టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ట్వీట్లో ఇలా పేర్కొన్నారు.. "స్పేస్ ఎక్స్ వాతావరణం నుంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు తీసి రాకెట్ ఇంధనంగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఆసక్తి ఉంటే దయచేసి చేరండి. అంగారక గ్రహానికి కూడా ఇది ముఖ్యం" అని మస్క్ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధన్యవంతుడైన ఎలన్ మస్క్ టైమ్ మ్యాగజైన్ "2021 పర్సన్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికచేయబడ్డారు. అంతరిక్ష రవాణా ఖర్చులను తగ్గించి, అంగారక గ్రహాన్ని నివాస యోగ్యంగా మార్చాలనే లక్ష్యంతో పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ 2002లో స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించారు. మనుషులను అంతరిక్షంలోకి తసుకెళ్లడానికి స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌకను కూడా తయారు చేస్తోంది. అది అంగారక గ్రహం మీద స్థిరపడే ప్రక్రియను ప్రారంభిస్తుంది. స్టార్ షిప్ అనే పెద్ద అంతరిక్ష నౌక 100 మెట్రిక్ టన్నులకు పైగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. Will also be important for Mars — Elon Musk (@elonmusk) December 13, 2021 (చదవండి: బిట్‌కాయిన్ గాలి తీసేసిన బిలియనీర్ కింగ్!) -
ఫిట్స్‌గా పొరబడే హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్..
చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ ఉన్నప్పుడు) పానిక్ అటాక్స్కు కారణమయ్యే అంశాల్లో ‘హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ ఒకటి. హైపర్ వెంటిలేషన్ అంటే ఏమిటో చూద్దాం. కొందరు బాగా లోతుగా గాలి పీల్చుకుంటూ ఉంటారు. యాంగ్జైటీ సమయంలో లోతుగా, వేగంగా శ్వాసించడం వల్ల ఊపిరితిత్తుల్లోని కార్బన్ డైఆక్సైడ్‌ను ఎక్కువగా బయటకు వదులుతుంటారు. దాంతో దేహంలో కార్బన్‌డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. ఈ కండిషన్‌ను హైపోకాప్నియా అంటారు. ఇలా ఎక్కువగా గాలి పీల్చడం వల్ల జరిగే పరిణామాలను ‘హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ అంటారు. ఫలితంగా వారి ధమనుల్లో బైకార్పొనేట్ స్థాయులు పెరుగుతాయి. ఈ కండిషన్‌ను ఆల్కలోసిస్ అంటారు. ఇలాంటి కండిషన్స్‌లో పేషెంట్‌కు గుండెవేగం పెరుగుతుంది. శ్వాస తీసుకునే వేగం హెచ్చుతుంది. నిద్రమత్తుగా అనిపిస్తుంది. తేలికపాటి తలనొప్పి కూడా కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషి తాత్కాలికంగా స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో రోగి కాళ్లూచేతులు బిగుసుకునిపోతాయి. దీన్నే ఒక్కోసారి ఫిట్స్‌గా అపోహపడుతుంటారు. అవి ఫిట్సా లేక హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కారణంగా వచ్చిన ప్యానిక్ అటాకా అని నిర్ధారణ చేసుకునేందుకూ వెంటనే వైద్యులను సంప్రదించాలి. చదవండి: ‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా! -
గాలి నుంచి ఆక్సిజన్ వచ్చేదెలా?
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమ్మీద జీవులకు ఆక్సిజనే కీలకం. ఆక్సిజన్ అందకుండా కొన్ని నిమిషాల పాటు కూడా బతకలేం. మనం ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ను సంగ్రహించి, శరీరంలో ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ను వదిలేస్తుంటాం. కానీ ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు.. శరీరానికి ఆక్సిజన్ సరిగా అందక, ప్రత్యేకంగా అందించాల్సి వస్తుంది. గాలిలో ఆక్సిజన్ ఉండగా మళ్లీ ఎందుకు అందించడం అనే సందేహాలు రావొచ్చు. మనం పీల్చే గాలిలో 78శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్, 0.9శాతం ఆర్గాన్, మిగతా 0.1 శాతం ఇతర వాయువులు ఉంటాయి. మనం శ్వాసించినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే 21%ఆక్సిజన్‌నే గ్రహించాల్సి ఉంటుంది. అదే 90 శాతానికిపైగా ఆక్సిజన్ ఉంటే.. మరింత మెరుగ్గా శరీరానికి అందుతుంది. శ్వాస సరిగా ఆడనివారికి ఆక్సిజన్ పెట్టడానికి కారణమిదే. సాధారణ గాలిలో నుంచి నైట్రోజన్ వాయువును తొలగించేస్తే.. మిగిలే గాలిలో 90 శాతానికిపైగా ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్లు ఇదే పనిచేస్తాయి. ఈ సాంకేతికతను ‘ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ)’గా పిలుస్తారు. పీఎస్ఏ ప్లాంట్లు పనిచేసేదిలా.. 1. సాధారణ గాలిని ప్రత్యేక పరికరాల ద్వారా సేకరిస్తారు. 2. గాలిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తారు. అందులో తేమను తొలగిస్తారు. 3. దుమ్ము, ధూళి లేకుండా ఫిల్టర్ చేస్తారు. 4. ఒక చిన్నపాటి ట్యాంకు (ఎయిర్ బఫర్) మీ దుగా అడ్సార్ప్షన్ ట్యాంకులకు పంపుతారు. 5. అడ్సార్ప్షన్ స్టేజీలో రెండు ట్యాంకులు ఉంటాయి. వాటిల్లో జియోలైట్గా పిలిచే ప్ర త్యేక పదార్థాన్ని నింపి ఉంచుతారు. వేర్వేరు వాయువులను పీల్చుకునేందుకు వేర్వేరు జియోలైట్లు ఉంటాయి. నైట్రోజన్‌ను పీల్చేం దుకు ‘జియోలైట్ 13’ను వాడుతారు. ముం దుగా ఒక ట్యాంకు (ఏ)లోకి తీవ్ర ఒత్తిడితో ఉన్న గాలిని పంపుతారు. అందులోని జియోలైట్ నైట్రోజన్‌ను పీల్చుకుంటుంది. 93–95 శాతం ఆక్సిజన్‌తో కూడి న గాలి మిగులుతుంది. దీనిని ఆక్సిజన్ ట్యాంకుకు పంపుతారు. తర్వాత ట్యాంకు (ఏ)లో నుంచి వృధా నైట్రోజన్‌ను బయటికి వదిలేస్తారు. ఇదే సమయంలో మరో ట్యాంకు (బి)లో నైట్రోజన్ పీల్చుకునే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత మ రో ట్యాంకులో ఉత్పత్తవుతూ ఉండటం వల్ల.. నిరంతరంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. 6. ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను వార్డులకు సరఫరా చేస్తారు. 7. వృధా నైట్రోజన్‌ను బయటికి వదిలేస్తారు. -
వారెవ్వా! కార్బన్‌డయాక్సైడ్‌తో పిండిపదార్థం..
బ్రెడ్డు ముక్క మొదలు.. కాగితం ముక్క వరకూ దేనినైనా పిండిపదార్థం లేకుండా తయారు చేయడం అసాధ్యం. పిండి పదార్థం తయారీకి బోలెడంత నీరు, భూమి అవసరం. కానీ, ఇవేవీ లేకుండా.. కేవలం కాలుష్య కారక కార్బన్డయాక్సైడ్ అనే వాయువునే పిండిపదార్థంగా మార్చగలిగితే? చైనా శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మారుస్తుంటాయి. ఈ ప్రక్రియలో దాదాపు 60 వరకూ జీవరసాయనిక చర్యలు జరుగుతుంటాయి. ఇంతకంటే సులువుగా పిండిపదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు ఉన్న మార్గాలపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగప్రక్రియ కంటే ఎన్నోరెట్లు వేగంగా కృత్రిమ పద్ధతుల్లో కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చడంలో విజయం సాధించారు. సేంద్రియ ఉత్ప్రేరకం సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను మెథనాల్‌గా, ఆ తరువాత కృత్రిమ ఎంజైమ్‌ల సాయంతో చక్కెరలుగా మార్చడం, వీటి నుంచి పిండిపదార్థం తయారు చేయడం ఈ ప్రక్రియ సారాంశం. మొక్కజొన్న కంటే 8.5 రెట్లు ఎక్కువ పిండి పదార్థాన్ని తయారు చేయగలగడం కొత్త పద్ధతి ప్రత్యేకత. పిండిపదార్థాన్ని ఇలా కొత్తపద్ధతిలో తయారు చేసుకుంటే పర్యావరణానికి నష్టం చేకూరుస్తున్న కీటకనాశినులు, ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, పిండిపదార్థం కోసం ఉపయోగిస్తున్న పంటభూమిని కూడా ఇతర అవసరాలకు వాడవచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త చీ టావో తెలిపారు. చదవండి: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు! -
ఓర్కా.. టన్నుల్లో బొగ్గుపులుసును మింగేస్తది
పర్యావరణ కాలుష్యానికి కార్బన్ ఉద్గారాలు ప్రధాన కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహన కాలుష్యంతో పాటు ప్రకృతి వైపరిత్యాల కారణంగా గత రెండేళ్లుగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే గాల్లోని బొగ్గుపులుసు వాయువును సంగ్రహించి.. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ప్రయత్నాలు అక్కడక్కడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఐస్‌ల్యాండ్‌లో ప్రపంచంలోనే భారీ ఫ్యాక్టరీని నెలకొల్పి సంచలనాలకు తెర లేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద Co2 సంగ్రహణ పరిశ్రమను ఐస్‌ల్యాండ్‌లో బుధవారం(సెప్టెంబర్ 8, 2021) ప్రారంభించారు. దీనిపేరు ఓర్కా(ఆర్కా). ఇది ఐస్‌ల్యాండిక్ పదం. ఇంగ్లిష్ మీనింగ్ ‘ఎనర్జీ’ అని. మొత్తం నాలుగు యూనిట్లు.. రెండు మెటల్ బాక్స్‌ల సెటప్‌తో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. స్విట్జర్ల్యాండ్కు చెందిన క్లైమ్‌వర్క్స్, ఐస్‌ల్యాండ్‌కు చెందిన కార్బ్‌ఫిక్స్ కంపెనీలు సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని భారీ నిధులు వెచ్చించి నెలకొల్పాయి. ఎలా పని చేస్తుందంటే.. ఏడాది నాలుగు వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్ని ఇది సంగ్రహిస్తుంది. ఇది దాదాపు 870 కార్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలతో సమానమని యూఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) పేర్కొంది. ఈ ఫ్యాక్టరీ యూనిట్లలోని ఫ్యాన్లు.. వాతావరణంలోని Co2ను సంగ్రహిస్తాయి. ఫిల్టర్ మెటీరియల్ సాయంతో వాయువును ఫిల్టర్ చేస్తుంది. అక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద గాఢత ఉన్న Co2 గ్యాస్‌గా మారుతుంది. ఆపై నీటిని చేర్చి.. వెయ్యి మీటర్ల లోతులో బాసాల్ట్ బండరాళ్ల మీదకు వదిలేస్తారు. అంటే కార్బన్ క్యాప్చుర్ అండ్ స్టోరేజ్(CCS) ద్వారా కార్బన్ డయాక్సైడ్ను రాళ్లురప్పల్లో కలిపేయడం ఈ ప్రక్రియ విధానమన్నమాట. అయితే విమర్శకులు మాత్రం ఈ సాంకేతికత మంచిది కాదని చెప్తున్నారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇది అమలు చేయడానికి సంవత్సరాలు పడుతుందని వాళ్లు విబేధిస్తున్నారు. చదవండి: రియల్మీ ట్యాబ్! ఇవాళ్టి నుంచే.. -
నయా సవాల్: గెలిస్తే రూ. 730 కోట్లు
వాషింగ్టన్: సాంకేతికత పెరిగిన కొద్ది కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అభివృద్ది మోజులో పడి ముందు ప్రకృతిని పట్టించుకోము. పూడ్చలేని నష్టం వాటిల్లిన తర్వాత కళ్లు తెరిచి.. పరిష్కారం గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం ప్రపంచ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కర్భన ఉద్గారాలు. అభివృద్ధి పెరిగిన కొద్ది ఉద్గారాలు ఎక్కువవుతున్నాయి. దాంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. అతివృష్టి, అనావృష్టి తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఓ నయా సవాల్‌ని తెర మీదకు తెచ్చారు. అంతే కాదండోయ్ గెలిచిన వారికి 100 మిలియన్ డాలర్ల(7,30,05,50,000 రూపాయలు) భారీ ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు. ఇంతకు చాలెంజ్ ఏంటంటే.. కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేయాలి. వాతావరణ మార్పులను అదుపులో ఉంచే అనేక ప్రణాళికలలో భూమిని వేడేక్కించే ఉద్గారాలను సంగ్రహించడం చాలా కీలకమైనదిగా మారుతోంది. కాని ఈ రోజు వరకు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వెనకబడే ఉన్నాం. గాలి నుంచి కార్బన్‌ను బయటకు తీయడం కంటే ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ తన ట్విట్టర్ వేదికగా.. ‘‘కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందిస్తాను. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: ఔను.. భారత్‌కు వస్తున్నాం..!) Am donating $100M towards a prize for best carbon capture technology — Elon Musk (@elonmusk) January 21, 2021 ఇక గతేడాది చివర్లో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దేశాలు గనుక నికర సున్నా ఉద్గారలను చేరుకోవాలంటే వాటిని సంగ్రహించే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. -
అంచనాలకన్నా వేడెక్కుతున్న భూగోళం
సాక్షి, న్యూఢిల్లీ : వాతావరణ శాస్త్రవేత్తలు అంచనాల కన్నా భూగోళం 0.3 ఫారిన్‌హీట్ డిగ్రీలు ఎక్కువగా వేడెక్కుతోంది. ఈ మేరకు ‘హాడ్‌క్రుట్’ గతంలో వేసిన అంచనాలను ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీకి చెందిన వాతావరణ విభాగం మార్చింది. భూగోళం ఉష్ణోగ్రత డేటాలను ఎప్పటికప్పుడు సేకరించి డేటా బేస్‌లో భద్రపర్చే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూ వాతావరణ అంచనాల సంస్థ ‘హాడ్‌క్రుట్’. 1850లో ఉన్న భూగోళం ఉష్ణోగ్రతకన్నా 2010–18 కాలం నాటికి భూగోళం ఉష్ణోగ్రత 1.90 ఫారిన్‌హీట్ డిగ్రీలు పెరగుతుందని హాడ్‌క్రుట్ అంచనా వేసింది. అయితే వాస్తవానికి భూతాపం 1.93 ఫారిన్‌హీట్ పెరిగింది. భూతాపోన్నతి గత 170 సంవత్సరాలుగా పెరగడానికి ప్రధాన కారణం మనుషుల వల్ల వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలేనని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన నాసా, నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) అంచనాలకన్నా భూతాపం పెరగడం తక్కువగా ఉంది. హాడ్‌క్రుట్ అంచనాలే ఇంతకాలం నిజం అవుతూ వచ్చాయి. ఈసారి కూడా అంచనాల్లో 0.3 ఫారిన్‌హీట్ డిగ్రీల తేడామాత్రమే వచ్చింది. 1986లో మొదటి సారి తమ విభాగం భూతాపోన్నతిని అంచనా వేసిందని, ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీలోని క్లైమెట్ రిసర్చ్ యునిట్ డైరెక్టర్ టిమ్ ఆస్బోర్న్ తెలిపారు. ఆ తర్వాత తమ విభాగం మరింత కచ్చితత్వంతో భూతాపోన్నతని అంచనా వేస్తూ వస్తోందని ఆయన తెలిపారు. -
కాలుష్యం తగ్గించే టెక్నిక్
పరిశ్రమల గొట్టాల నుంచి వెలువడే పొగలోని కార్బన్ డైయాక్సైడ్‌ను మరింత సమర్థంగా తొలగించేందుకు ఒరెగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నిక్‌ను కనుక్కున్నారు. భూతాపోన్నతిని తగ్గించడంలో ఈ టెక్నిక్ కీలక పాత్ర పోషించగలదని అంచనా. పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి గాల్లో కార్బన్‌డై యాక్సైడ్ మోతాదు సుమారు 40 శాతం వరకూ పెరిగిపోగా దీని ఫలితంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు 0.84 డిగ్రీ సెల్సియస్ వరకూ ఎక్కువైంది. ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కార్బన్‌డైయాక్సైడ్ మోతాదు ప్రతి పదిలక్షల కణాలకు 407.4గా ఉంది. భూమిపై గత ఎనిమిది లక్షల ఏళ్లలో ఇంత స్థాయి కాలుష్య వాయువు ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిశ్రమల పొగగొట్టాల నుంచి కార్బన్‌డై యాక్సైడ్‌ను తగ్గించేందుకు ఏం చేయాలన్న విషయంపై ఒరెగాన్‌తోపాటు అనేక ఇతర వర్సిటీలు సంయుక్తంగా పరిశోధనలు ప్రారంభించాయి. వందల, వేల నానో పదార్థాల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వీరు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంఓఎఫ్) ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని నిర్ధారించుకున్నారు. ఈ ఎంఓఎఫ్ల్లో రెండిని పరీక్షించినప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక పదార్థాల కంటే ఇవి 13 రెట్లు ఎక్కువ మెరుగ్గా పనిచేసినట్లు తెలిసింది. మరింత విస్తృత స్థాయి పరిశోధనలు చేయడం ద్వారా ఈ ఎంఓఎఫ్‌లను మెరుగుపరచవచ్చునని, పరిశ్రమల్లో వీటిని వాడటం ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
విషవాయువుతో బ్యాటరీ..!
గాలిలో కార్బన్ డయాక్సైడ్ మోతాదు పెరిగిపోతోందన్న వార్తలు తరచూ కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో భూమ్మీద మనిషి మను గడ కూడా కష్టమన్న హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే బోలెడన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇంకో ముందడుగు వేసి కార్బన్ డయాక్సైడ్‌తోనే పనిచేసే ఓ రీచార్జబుల్ బ్యాటరీని సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లిథియం అయాన్ బ్యాటరీతో పోలిస్తే తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్ నిల్వ చేసుకోగలగడం దీని ప్రత్యేకత. కచ్చితంగా చెప్పాలంటే లిథియం అయాన్ బ్యాటరీ కంటే 7 రెట్లు ఎక్కువ విద్యుత్ నిక్షిప్తం చేసుకోగలదీ కొత్త బ్యాటరీ. గతంలోనూ ఇలాంటి బ్యాటరీలు తయారు చేసినప్పటికీ అవి ఎక్కువసార్లు రీచార్జ్ చేసుకునేందుకు ఉపయోగపడేవి కావు. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొన్ని కొత్తరకం పదార్థాలను వాడటం ద్వారా ఒక్కో బ్యాటరీ కనీసం 500 సార్లు రీచార్జ్ చేసుకునేలా తయారు చేశారు. మాలిబిడనం డై సల్ఫైడ్ను కాథోడ్ తయారీలో వాడగా.. అయానిక్ లిక్విడ్, డైమిథైల్ సల్ఫాక్సైడ్లను ఎలక్ట్రొలైట్తోనూ ఉపయోగించడం ద్వారా తాము కొత్త బ్యాటరీని తయారు చేశామని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సలేహీ ఖోజిన్ తెలిపారు. వాణిజ్య స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ బ్యాటరీల తయారీకి ఇంకొంచెం సమయం పట్టే అవకాశమున్నట్లు చెప్పారు. -
ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఒకపక్క వర్షాభావం, మరో పక్క భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతుండం, అన్నార్థులు, అభాగ్యులు అకారణంగా మత్యువాత పడుతుండడం పర్యావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమని శాస్త్రవేత్తలు నెత్తి, నోరు మొత్తుకొని చెబుతున్న విషయం విషయం తెల్సిందే. ప్రధానంగా చెట్లను కాపాడుకోలేకపోవడం వల్ల దేశంలో అటవీ ప్రాంతం తగ్గిపోయి కార్బన్‌డై ఆక్సైడ్ పెరిగి భూతాపోన్నతి పెంచడం వల్ల ఈ అకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పర్యావరణ పరిస్థితుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నానని అంతర్జాతీయ వేదికల ముందు బాకా ఊది మరి చెబుతున్న భారత్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దొంగ లెక్కలూ ఉన్నాయి. భారత్‌లో 2005 నుంచి 2017 సంవత్సరాల మధ్య 2,152 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం (వక్ష సంపద) విస్తరించిందని ‘ది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా’ గతంలో ఓ డేటాను విడుదల చేసింది. వాస్తవానికి 2001 నుంచి 2018 సంవత్సరాల మధ్య భారత్‌లో 16 లక్షల హెక్టార్లలో వృక్ష సంపద నాశనం అయిందని యూనివర్శిటీ ఆఫ్ మేరిలాండ్, గూగుల్, యూఎస్ జియోలోజికల్ సర్వే, నాసాలు సేకరించిన డేటా, ఛాయా చిత్రాలను అధ్యయనం చేయడం ద్వారా లాభాపేక్ష లేని ‘వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా వెల్లడించింది. భారత్ ప్రభుత్వం దేశంలో వృక్ష సంపద పెరగిందంటే ‘వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ తగ్గిందని చెబుతున్నది ఇందులో ఏది సబబు, ఏది కాదు ? దేశంలో అటవి ప్రాంతం విస్తరించిందని చెబుతున్న అటవీ సర్వే మరోపక్క తరుగుతున్న అటవీ ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకోలేదా? గనులు, వివిధ ప్రాజెక్టుల కారణంగా దేశంలో వక్ష సంపద తగ్గిపోతోందంటూ ప్రజాందోళన పెరుగుతున్న నేపథ్యంలో వక్ష సంపద పెరిగిందనడం వారిని బుజ్జగించడం కోసమా? కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అలా ప్రకటించిందా ? ఇక్కడ మరో అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఏది వాస్తవమో, ఏది అబద్ధమో! ఇట్టే తెలిసిపోతుంది. 2030 సంవత్సరం నాటికల్లా భూవాతావరణంలో 250 టన్నుల నుంచి 300 టన్నుల వరకు కార్బన్‌డై ఆక్సైడ్‌ను తగ్గించేందుకు సరిపడా వృక్ష సంపదను పెంచుతామని, అందుకోసం అటవులను అభివద్ధి చేస్తామని 2015, డిసెంబర్లో పారిస్‌లో పర్యావరణ పరిస్థితులపై జరిగిన అంతర్జాతీయ సమావేశంలో తీర్మానంపై భారత ప్రభుత్వం సంతకం చేసింది. ఇందుకోసం 2030 సంవత్సరం నాటికి 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామంటూ ఉదారంగా హామీ కూడా ఇచ్చింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు కేవలం 89.53 కోట్ల రూపాయలను, 2017–18 ఆర్థిక సంవత్సరానికి 47.8 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పార్లమెంటరీ కమిటీ నివేదికనే వెల్లడించింది. అంటే పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ మూడేళ్ల కాలంటో 136 కోట్లను మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం రానున్న 12 ఏళ్ల కాలంలో 60 వేల కోట్లలో ఎన్నికోట్లను కేటాయించగలదు? ఒకప్పుడు పండుగలకు, పబ్బాలకు, పిల్లలు పుడితే వారి మీద చెట్లను నాటి, వాటిని పిల్లలతో సమానంగా చూసుకునే సంస్కతి ప్రజల్లో ఉండేది. అది అంతరించడంతో చెట్లు నాటేందుకు ఎక్కడికక్కడ ప్రభుత్వాలే ముందుకు వచ్చాయి. వస్తున్నాయి. అన్నింట్లో అవినీతికి అలవాటుపడ్డ ప్రభుత్వాల వల్ల చెట్లు ఊపిరిపోసుకోవడం లేదు. ఇక అడవులను పెంచడం తమ వల్ల కాదన్న అభిప్రాయానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అడవుల పెంపకం బాధ్యతలను కార్పొరేట్లకు ఇవ్వాలంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై విస్తృతంగా చర్చ జరపాలని కోరుకుంటోంది. -
కార్బన్‌డైయాక్సైడ్‌ను ఆహారంగా మార్చేశారు!
కార్బన్‌డైయాక్సైడ్ పేరు చెబితేనే... విషవాయువు అన్న భావన మన మనసులో మెదలుతుంది. ఇది నిజం కూడా. అయితే ఈ విషం నుంచే శరీరానికి పుష్టినిచ్చే ప్రొటీన్లను ఉత్పత్తి చేసేందుకు సోలార్ ఫుడ్స్ అనే కంపెనీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గాల్లోంచి సేకరించే కార్బన్‌డైయాక్సైడ్ ను సోలిన్ అనే ప్రొటీన్‌గా మార్చేందుకు ఈ కంపెనీ ఓ వినూత్నమైన టెక్నాలజీని రూపొందించింది. ఆకు కూరలు, కాయగూరల వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్ల కంటే సోలిన్ ప్రొటీన్ వందరెట్లు ఎక్కువ వాతావరణ అనుకూలమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త, సోలార్ ఫుడ్స్ సీఈవో పసి వైనిక్కా తెలిపారు. సోలార్ ఫుడ్స్ అభివృద్ధి చేసిన ప్రక్రియలో మొట్టమొదటగా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొడతారు. ఇందులోని హైడ్రోజన్‌కు కార్బన్‌డైయాక్సైడ్, పొటాషియం, సోడియం, కొన్ని ఇతర పోషకాలను చేరుస్తారు. ఫలితంగా తయారైన పదార్థాన్ని సూక్ష్మజీవులకు ఆహారంగా ఇచ్చినప్పుడు 50 శాతం ప్రొటీన్‌తోపాటు 25 శాతం కార్బోహైడ్రేట్ల్రు, పదిశాతం వరకూ కొవ్వులు ఉంటాయి. వ్యవసాయంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ ప్రొటీన్ ఉత్పత్తి కావడం గమనార్హం. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో సోలిన్ ప్రొటీన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రొటీన్‌షేక్ లేదా పెరుగులాంటి పానీయం రూపంలో దీన్ని అందుబాటులోకి తెస్తామని పసి వైనిక్కా తెలిపారు. -
వాతావరణంలో అధికంగా సీఓ2
పారిస్: మానవ తప్పిదాల కారణంగా భూ వాతావరణంలో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల స్థాయి ప్రమాదకర స్థాయిని దాటుతోంది. భూమిని వేడెక్కించే కార్బన్డయాక్సైడ్(సీఓ2) స్థాయిలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. హవాయ్‌లోని మౌనా లోవా అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు శనివారం ఉదయం వాతావరణంలో 415.26 పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్) సీఓ2 ఉన్నట్లు గుర్తించారు. 1950ల నుంచి వాతావరణంలోని సీఓ2 స్థాయిలను ప్రతి రోజూ రికార్డు చేస్తున్న ఈ అబ్జర్వేటరీ ఇంతటి గరిష్ట స్థాయిలను గుర్తించడం ఇదే ప్రథమం. ఈ స్థాయిలో భూ వాతావరణంలో సీఓ2 ఎప్పుడో 30 లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. భూ ఉష్ణోగ్రత సరాసరిన ఏడాదికి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుతోందన్నారు. -
లక్ష కోట్ల మొక్కలతో భూతాపోన్నతికి చెక్!
భూతాపోన్నతితో వచ్చే నష్టాలను తగ్గించుకునేందుకు మొక్కల పెంపకం పెద్ద ఎత్తున జరగాలని మనం తరచూ వింటూ ఉంటాం. అయితే ఎన్ని మొక్కలు పెంచితే వాతావరణంలోని కార్బన్ డైయాక్సైడ్‌ను గణనీయంగా తగ్గించవచ్చు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన టెక్నికల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొంచెం అటు ఇటుగానైనా సరే.. మొత్తమ్మీద ఒక లక్ష ఇరవై వేల కోట్ల మొక్కలు.. అది కూడా పూర్తిగా కొత్తవి నాటితే మేలన్నది వీరి అంచనా. కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించేందుకు సౌర, పవన విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు, మాంసాహారాన్ని త్యజించడం మొదలైన చాలా పనులకంటే మొక్కల పెంపకం లాభదాయకమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త థామస్ క్రోథర్ తెలిపారు. వాతావరణంలో ఇప్పుడు దాదాపు 400 గిగాటన్నుల కార్బన్‌డైయాౖMð్సడ్ ఉంటే.. నేలపై ఉజ్జాయింపుగా మూడు లక్షల కోట్లు మొక్కలు ఉన్నాయని.. ఇంకో లక్ష కోట్ల మొక్కలను నాటితే గత దశాబ్ద కాలంలో వాతావరణంలోకి విడుదలైన విష వాయువు మొత్తాన్ని తొలగించవచ్చునని వివరించారు. గాల్లోంచి కార్బన్‌డైయాక్సైడ్‌ను వేరు చేయడం వంటి పనులు కాకుండా ప్రతి ఒక్కరూ చేపట్టగల మొక్కల పెంపకం పనితో ప్రయోజనమెక్కువని వివరించారు. -
సీవో2.. హాంఫట్!
ఇంట్లో రోజంతా కరెంటు ఉంటే గొప్ప కాకపోవచ్చు. కానీ... నెల తిరిగినా బిల్లు రాకపోతే అదీ గొప్ప! బాగానే ఉందిగానీ.. ఇదేమీ అయ్యే పని కాదు అనుకుంటున్నారా? సాధ్యం చేసేస్తున్నారు శాస్త్రవేత్తలు... కృత్రిమంగా తయారు చేసిన ఆకుల శక్తిని పదింతలు పెంచేశారు! కృత్రిమ ఆకులేమిటి? వాటి సామర్థ్యం పెంచేయడం ఏమిటి? ఇవేనా మీ ప్రశ్నలు. ఒక్కసారి చిన్నప్పటి సైన్స్ పుస్తకాల్లో చదువుకున్న ‘కిరణజన్య సంయోగక్రియ’ను నెమరేసుకుందాం. మొక్కల ఆకుల్లోని పత్రహరితం సూర్య కిరణాల సాయంతో శక్తిని తయారు చేసుకుంటుందని.. దీన్ని మొక్క పెరుగుదలకు వాడుకుంటుందని మనం చదివే ఉంటాం. ఈ క్రమంలో మనం వదిలేసే కార్బన్డయాక్సైడ్ (సీఓ2)ను పీల్చేసుకుని మొక్కలు ఆక్సిజన్ ఇస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అచ్చం ఇదే పద్ధతిలో పనిచేసే కొన్ని పరికరాలను శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్నింటిని తయారు చేశారుగానీ.. వాటి సామర్థ్యం తక్కువ.. ఖర్చు బోలెడంత ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇల్లినాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మినీశ్ సింగ్, చేసిన తాజా పరిశోధనలు.. వాటి ఫలితాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆకుల్లా పనిచేసే గాడ్జెట్లు (కృత్రిమ ఆకులు) పదింతలు ఎక్కువ విద్యుత్‌ను లేదా శక్తిని ఉత్పత్తి చేసేందుకు వినూత్నమైన డిజైన్‌ను సూచిస్తున్నారు. నమూనాలను కూడా రూపొందించి ఈ విషయాన్ని నిరూపించారు కూడా.. సమస్య ఏమిటి? శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ తయారు చేసిన కృత్రిమ ఆకులు ఒత్తిడితో కూడిన కార్బన్‌డయాక్సైడ్‌ను వాడుకుంటాయి. ఇది వాస్తవ పరిస్థితుల్లో అసాధ్యం. ఎందుకంటే.. గాల్లోంచి వాడుకోవాలంటే.. కార్బన్‌డయాక్సైడ్‌ను వేరు చేయాలి.. ఒత్తిడికి గురి చేసి ట్యాంకుల్లో భద్రపరచాలి. ఆ తర్వాతగానీ ఇంధనం తయారు కాదన్నమాట. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం. మినీశ్ సింగ్ ఈ సమస్యలకు ఓ చక్కటి పరిష్కారాన్ని సిద్ధం చేశారు. కృత్రిమ ఆకులను నీటితో నిండిన ఓ పెట్టెలో పెట్టడం.. ప్రత్యేకమైన లక్షణాలున్న పదార్థాన్ని కృత్రిమ ఆకు చుట్టూ ఏర్పాటు చేయడం ఇందులో కీలకం. సూర్యరశ్మి తాకిడికి నీరు వేడెక్కి ఆవిరైనప్పుడు అదికాస్తా.. ప్రత్యేక లక్షణాలున్న కవచం గుండా బయటకు వెళ్లిపోతూంటుంది. అదే సమయంలో గాల్లోని కార్బన్‌డయాక్సైడ్‌ను లోపలికి పీల్చుకునేలా ఈ ప్రత్యేక పదార్థంపై సూక్ష్మస్థాయి రంధ్రాలు ఉంటాయి. కృత్రిమ ఆకుపైన పూసిన పూత కారణంగా కార్బన్డయాక్సైడ్ కాస్తా కార్బన్ మోనాక్సైడ్గా మారిపోతుంది. కొంత మోతాదులో ఆక్సిజన్ కూడా విడుదల అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్‌ను పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాల తయారీకి ముడిసరుకుగా పనిచేస్తుందన్నది తెలిసిందే. గాలినీ శుభ్రం చేస్తాయి.. మినీశ్ సింగ్ బృందం సిద్ధం చేసిన డిజైన్‌తో కొత్త తరం కృత్రిమ ఆకులను వాడటం వల్ల గాలి కూడా శుభ్రమవుతుంది. ఒక్కోటి 1.7 మీటర్ల పొడవు, 0.2 మీటర్ల వెడల్పు ఉండే కొత్త కృత్రిమ ఆకులను 500 చదరపు మీటర్ల వైశాల్యంలో అమర్చి చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్న గాల్లోని కార్బన్డయాక్సైడ్ 10 శాతం వరకూ తగ్గిందని రుజువైంది. భవనాల పైకప్పులు మొదలుకొని అన్ని ప్రదేశాల్లోనూ వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటం వల్ల అటు గాలిని శుభ్రం చేస్తూనే ఇటు ఇంధనాల ఉత్పత్తి చేసుకోవచ్చని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆదిత్య ప్రజాపతి అంటున్నారు. దాదాపు 360 కృత్రిమ ఆకులతో ఉత్పత్తి అయ్యే కార్బన్‌మోనాక్సైడ్ 500 కిలోల వరకూ ఉంటుందని.. చౌకైన, అందుబాటులో ఉన్న పదార్థాలతోనే తయారు చేస్తుండటం వల్ల ఇంధన ఉత్పత్తి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని ఆదిత్య చెబుతున్నారు. వాతావరణంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న కార్బన్‌డయాక్సైడ్‌ను నిరపాయకరంగా తొలగించడంతోపాటు ప్రయోజనకరంగా మార్చుకోగలగడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత.. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పంటలు.. ఇబ్బడి ముబ్బడి!
పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా అత్యధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గం కనుక్కున్నారు. కిరణజన్య సంయోగ క్రియ వ్యవస్థలో ఉన్న లోపాన్ని సరిచేయడం ద్వారా మొక్కలు అతితక్కువ కాలంలో ఎక్కువ కాపునిచ్చేలా చేయవచ్చునని దీనిద్వారా పంట దిగుబడులు కనీసం 40 శాతం వరకూ పెరుగుతాయని పాల్ సౌత్ అనే శాస్త్రవేత్త తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు శక్తిగా మార్చుకునే ప్రక్రియకు కిరణ జన్య సంయోగ క్రియ అంటారన్నది తెలిసిందే. అయితే యుగాలుగా ఈ ప్రక్రియ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఒక దశలో కార్బన్డయాక్సైడ్ కణాలను లాక్కునేందుకు రుబిస్కో అనే ఎంజైమ్ ఉపయోగపడుతూంటుంది.అయితే కొన్నిసార్లు ఈ ఎంజైమ్ కార్బన్‌డయాక్సైడ్‌కు బదులుగా ఆక్సిజన్‌ను లాగేసుకుంటుంది. దీని ప్రభావం దిగుబడులపై ఉంటుంది. సౌత్ తన బృందంతో కలిసి చేసిన పరిశోధనల్లో ఈ ఎంజైమ్‌ను నియంత్రించేందుకు ఒక పద్ధతిని తెలుసుకోగలిగారు. ఈ పద్ధతితో సాగైన పొగాకు పంట తక్కువ కాలంలోనే 40 శాతం వరకూ ఎక్కువ దిగుబడిని ఇచ్చింది. సోయా, వరి, బంగాళాదుంప, టమోటా వంటి పంటల్లోనూ ఈ పద్ధతిని పరీక్షించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఆ తరువాత విస్త్రత వినియోగానికి అందుబాటులోకి తెస్తామని సౌత్ తెలిపారు. -
ఈ పౌడర్‌తో కార్బన్‌డైయాక్సైడ్‌కు చెక్!
వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తనలోకి పీల్చేసుకోగల సరికొత్త పౌడర్ ఒకదాన్ని వాటర్లూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్యాక్టరీలు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఈ పౌడర్‌ను వాడటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని అంచనా. అంతేకాదు.. కార్బన్‌తో తయారైన ఈ పౌడర్‌లోని రంధ్రాల సైజును నియంత్రించడం, రంధ్రాల సంఖ్యను పెంచడం ద్వారా ఈ టెక్నాలజీని మరింత సమర్థమైన వాటర్ ఫిల్టర్లు, బ్యాటరీల తయారీకి కూడా వాడుకోవచ్చునని ఝాంగ్వీ ఛెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మొక్కల పదార్థాన్ని వేడి చేయడం.. ఉప్పును వాడటం ద్వారా తాము కార్బన్‌ను తయారు చేశామని, ఈ క్రమంలో ఏర్పడిన సూక్ష్మమైన కర్బన గోళాలపై మీటర్లో పదిలక్షల కంటే తక్కువ సైజున్న రంధ్రాలు ఏర్పడ్డాయని ఛెన్ వివరించారు. ఫలితంగా ఈ కర్బన పదార్థం వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఇతర పదార్థాల కంటే రెట్టింపు వేగంగా, తనలో ఇముడ్చుకోగలదని చెప్పారు. వాతావరణంలోకి చేరకముందే కాలుష్యకారక వాయువును నిల్వ చేసుకోవడం వల్ల భూ తాపోన్నతి తగ్గింపునకు ఇదో మెరుగైన తాత్కాలిక పరిష్కారం అవుతుందన్నది తమ అంచనా అన్నారు. -
మధుమేహం ఉపవాసంతో చెక్!
ప్రణాళికా బద్ధంగా చేసే ఉపవాసం ద్వారా టైప్–2 రక్తంలోని చక్కెర మోతాదులను నియంత్రించడంతోపాటు ఇన్సులిన్‌పై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చునని వైద్యులు అంటున్నారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ఓ పరిశోధనా వ్యాసం ప్రకారం.. రోజులో ఎక్కువ కాలంపాటు ఆహారం తీసుకోకుండా ఉండటం మధుమేహులకు మేలు చేస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న, మధుమేహంతో బాధపడుతున్న ముగ్గురు పురుషులపై ఒక ప్రయోగం జరిగింది. పోషకాహారంపై జరిగిన ఒక సదస్సు ద్వారా ఈ ముగ్గురికి మధుమేహం ఎలా వస్తుంది? ఎలాటి ప్రభావం చూపుతుంది? ఇన్సులిన్ నిరోధకత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఆ తరువాత వారికి నిర్దిష్ట వేళలు, ఆహారాన్ని సూచించారు. ఆ తరువాత ఇద్దరు వ్యక్తులు రోజు విడిచి రోజు 24 గంటల ఉపవాసం ఉంటే.. ఇంకొకరు వారంలో మూడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న రోజుల్లో టీ/కాఫీ, నీళ్లు తాగడంతోపాటు కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని సాయంకాలం అందించారు. పదినెలల తరువాత ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, సగటు చక్కెర మోతాదు, శరీర బరువు, నడుము చుట్టుకొలత వంటి వివరాలు సేకరించారు. మునుపటితో పోలిస్తే పది నుంచి 18 శాతం బరువు తగ్గడంతోపాటు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మోతాదులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్లు గుర్తించారు. అయితే మరింత విస్తృత స్థాయి ప్రయోగాలు జరిపి ఫలితాలను రూఢి చేసుకున్న తరువాతే ఈ పద్ధతిని అందరూ వాడేందుకు అవకాశం ఉంటుందని అంచనా. ఈ టెక్నాలజీ భూతాపోన్నతిని ఆపుతుందా? భూతాపోన్నతి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. గాల్లో ఏటికేడాదీ ఎక్కువైపోతున్న బొగ్గుపులుసు వాయువును తీసేయడంతోనే సమస్య పరిష్కారం కాదు. కానీ.. ఇది కూడా కీలకమవుతుందని అంటున్నారు క్లైమ్‌వర్క్స్ శాస్త్రవేత్తలు. భారీసైజు ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టి గాలిని పీల్చేయడం.. దాంట్లోని కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చేయడం.. ఆ క్రమంలోనే విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడం కోసం క్లైమ్‌వర్క్స్ ఓ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు వాడుతున్నప్పటికీ ఈ టెక్నాలజీ ద్వారా విద్యుత్తు నికరంగా మిగులుతోందేగానీ ఖర్చు మాత్రం కావడం లేదు. పైగా విషవాయువులను గాల్లోంచి వేరు చేస్తున్నారు. 2017లో క్లైమ్‌వర్క్స్ ఈ టెక్నాలజీని మొదటి సారి పరీక్షించింది. జ్యూరిచ్ సమీపంలోని హిన్విల్ ప్రాంతంలో ఏర్పాటైన ప్లాంట్ ఏడాదికి 900 టన్నుల కార్బన్ డైఆక్సైడ్‌ను ఒడిసిపట్టగలదు. ఈ విషవాయువును కాంక్రీట్ మొదలుకొని సౌర ఇంధనాల వరకూ అనేక రూపాల్లో వాడుకోవచ్చునని క్లైమ్‌వర్క్స్ చెబుతోంది. మనిషి ఏటా వాతావరణంలోకి పంపుతున్న కార్బన్‌డైఆక్సైడ్ 30–40 గిగా టన్నులు ఉంటుందని, సాధారణ పద్ధతుల ద్వారా లేదా మొక్కలు పెంచడం ద్వారా ఇంత భారీ మొత్తంలో కార్బన్‌డైఆక్సైడ్‌ను వాతావరణంలోకి చేరకుండా ఆపడం కష్టం కాబట్టి క్లైమ్‌వర్క్స్ టెక్నాలజాలు అవసరమవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
సరికొత్త పోటీ ప్రారంభించిన నాసా
-
చేతులు కాలాక ‘చెట్లు’ పట్టుకున్నామా?
తెలంగాణలో హరితహారం.. ఆంధ్రప్రదేశ్‌లో వనం.. మనం! కోస్టారికాలో ఒకటి.. పాకిస్తాన్, చైనాల్లో మరోటి.. ఇంకోటి! పేరు ఏదైనా జరుగుతున్నది మాత్రం ఒక మహా ఉద్యమం. కోటానుకోట్ల మొక్కల పెంపకం! భూమాతకి పచ్చాని కోక కట్టే యత్నం! భూమాత కోపానికి బలికాకూడదని అనుకున్నారో... తిండితిప్పలకు కరవొచ్చి.. ఆయువు తీరుతుందన్న బెంగ వెంటాడిందో... కారణం ఏదైతేనేం.. చేతులు కాలాక అయినా సరే.. మనిషి మళ్లీ ప్రకృతి బాట పట్టేందుకు గట్టి ప్రయత్నం మొదలెట్టాడు! సాహో అందాం.. మనమూ ఓ చేయి వేద్దాం! అభివృద్ధి పేరుతో ఇప్పటివరకూ జరిగింది ప్రకృతి వినాశనమే. చెట్లు కొట్టేశాం.. అడవుల్ని నరికేశాం. ఫలితం అనుభవిస్తున్నాం. ఎప్పుడు వస్తాయో తెలియని వానలు..మండువేసవిలో పలుకరించే వరదలు, గడగడలాడించాల్సిన చలికాలంలోనూ చెమట్లు! కలియుగంలో ప్రకృతి చిత్ర విచిత్రంగా మారిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దపు అంతానికి భూమ్మీద మనిషి మనుగడే కష్టమైపోతుందన్న ఆందోళన వ్యక్తమైన సంగతి మనకు తెలిసిన విషయమే. దశాబ్దాల పరిశోధనలు, చర్చోపచర్చల తరువాత శాస్త్రవేత్తలు భూమి భవిష్యత్తును స్పష్టం చేసిన నేపథ్యంలో.. ప్రపంచదేశాలు మేల్కొన్నాయి. భూతాపోన్నతికి కారణమవుతున్న ప్రధాన విష వాయువు కార్బన్ డైయాక్సైడ్‌ను కట్టడి చేసేందుకు కోటానుకోట్ల మొక్కలు నాటేందుకు నడుం బిగించాయి.! ఎవరెంత? ఏ పని చేసినా.. భారీగా చేసే చైనా మొక్కల విషయంలోనూ ఈ పంథాను వదల్లేదు. ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా కోటీ అరవై మూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో.. మొక్కలు నాటేందుకు రంగం సిద్ధం చేసింది. ఇంకోలా చెప్పాలంటే ఐర్లాండ్ దేశమంత సైజులో పచ్చదనం నింపే ప్రయత్నం అన్నమాట! మన దాయాది పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని కొండల్లో వంద కోట్ల మొక్కల్ని నాటడం లక్ష్యంగా పెట్టుకుంటే.. ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. లాటిన్ అమెరికా దేశాలు ఐదు కోట్ల ఎకరాల్లో అడవుల పెంపకానికి రెడీ అవుతున్నాయి. కూటికి పేదలని అందరూ అనుకునే ఆఫ్రికా దేశాలు.. తామూ పచ్చధనులమే అంటూ ఇంకో 25 కోట్ల ఎకరాలను లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంగ్లాండ్, ఐర్లండ్, నార్వే, ఫ్రాన్స్, భారత్.. ఆ దేశం, ఈ దేశం అని లేదు.. 120కి పైగా దేశాల్లో ఈ పచ్చదనాన్ని పెంచే కార్యక్రమం సాగుతోంది. చెట్లు అంటే కేవలం కలప మాత్రమే కాదని అర్థం చేసుకున్నాం. వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనల్ని కాపాడతాయని, నీటి వనరుల్ని సంరక్షిస్తాయని, జీవ వైవిధ్యాన్ని పెంచుతాయని, భారీగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల్ని తగ్గిస్తాయని ప్రపంచ దేశాలు గ్రహించుకున్నాయి. వాతావరణ సంక్షోభం నుంచి బయటపడాలంటే అడవుల్ని పెంచడమే పరిష్కారమార్గమని భావించి 2015లో భారీగా అటవీ విస్తీర్ణం పెంచుతామని ప్రతిజ్ఞ చేశాయి. 2030 నాటికి 350 మిలియన్ హెక్టార్లలో అడ వుల్ని (విస్తీర్ణంలోభారత్ కంటే కూడా ఎక్కువ) పునరుద్ధరించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా నిర్ణయించింది. అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టసాధ్యమైనా అన్ని దేశాలు చెట్ల పెంపకంలో చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం 21.7శాతం అటవీ విస్తీర్ణం ఉంది. 2020 నాటికి 23 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ఉంది. గత అయిదేళ్లుగా చైనాలో 51 కోట్ల ఎకరాల్లో అటవీవిస్తీర్ణం పెరిగింది. పాకిస్తాన్ కూడా 100 కోట్ల మొక్కలు నాటుతాం అంటూ తనకు తానే లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించడంలో కూడా అందరికంటే ముందుంది. అక్కడ ప్రతిఊరూ ఒక నందనవనంగా మారిపోతోంది. మొక్కలు నాట డమనేది నేడు ప్రపంచ దేశా లకు ఒక చారిత్ర క అవసరంగా మారి పోయింది. అదొక రాజ కీయ, ఆర్థిక, పర్యావరణ అవసరం. ముప్పు తీరలేదు... బోలెడన్ని మొక్కలు నాటేశాం కదా.. ఇక చిక్కులు తీరినట్టేనా? అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పటివరకూ జరిగిన వినాశనంతో పోలిస్తే.. నాటిన మొక్కలు, పెరిగిన అటవీ విస్తీర్ణం పిసరంతే. చాలా దేశాల్లో పలు కారణాలతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతూనే ఉంది. కలప స్మగ్లింగ్, కార్చిచ్చులు, చీడపీడలు ఇందుకు ప్రధాన కారణాలు. అమెజాన్ అడవులుండే బ్రెజిల్లో అటవీ విస్తీర్ణం తగ్గిపోవడానికి స్మగ్లింగ్ కారణమవుతూంటే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్‌లలో కార్చిచ్చులు అడవులను బలితీసుకుంటున్నాయి. గత 25 ఏళ్లలో అటవీ విస్తీర్ణం సగానికి పైగా తగ్గిపోయిందన్న వాస్తవం తెలిస్తే ఈ నష్టం పూడ్చటం అంత సులువు కాదని ఇట్టే అర్థమైపోతుంది. పరిష్కారం ఏమిటి? మొక్కలు పెంచే కార్యక్రమాలు.. పర్యావరణాన్ని కాపాడేలా, ప్రపంచం ఆకలి తీరేలా, కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేసేలా మారాలంటే.. ఏదో కొన్ని మొక్కలు నాటేస్తే సరిపోదన్నది నిపుణుల అభిప్రాయం. గంపగుత్తగా కొన్ని చోట్ల మొక్కలు నాటేసి అడవులను పెంచేశాం అని కాకుండా.. సాధారణ వ్యవసాయంలోనూ అడవులను పెంచాలని వీరు అంటున్నారు. ఆగ్రోఫారెస్ట్రీ అని పిలిచే ఈ పద్ధతిలో పంటపొలాల చుట్టూ కొంతమేరకు నీడనిచ్చే, ఫలా లందించే చెట్లు పెంచాలి. అలాగే మైదాన ప్రాంతాల్లో పచ్చికబీళ్లను ఏర్పాటు చేస్తే పాడిపశువుల మేత కరువు తీరడంతోపాటు అనేక ఇతర ప్రయోజనాలు ఉంటాయని వారు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటిభూమి 200 కోట్ల హెక్టార్లు ఉంది. వాటిల్లో వేర్వేరు రకాల మొక్కలను పెంచడం ద్వారా జీవవైవిధ్యతను కాపాడుకోవాలని అప్పుడే వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోవడం సాధ్యమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ రకమైన ఆగ్రోఫారెస్ట్రీతో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అనేందుకు నైజీరియానే నిదర్శనం. సుమారు 30 ఏళ్ల క్రితం నైజీరియాలో దుర్భర పేదరికం ఉండేది. కరువు కాటకాలతో ఆ దేశం అల్లాడిపోయింది. ధనిక దేశాల సూచనలు, సలహాల మేరకు చెట్లు, చేమల్ని తొలగించి చదును చేసి వేలాది హెక్టార్లలో గోధుమ, మొక్కజొన్న పంట లు వేశారు. కానీ అదో విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. ఆ తర్వాత కొందరు యువ శాస్త్రవేత్తలు చెట్లు చేమలు తొలగించకుండానే పంటలు వేస్తే అద్భుతమైన దిగుబడులు వచ్చాయి. అప్పుడే వారికి తెలిసింది. చెట్లు ఉంటే పంటలు కూడా బాగా పండుతాయని. అప్పట్నుంచి నైజీరియా దాదాపుగా 20 కోట్ల మొక్కల పెంపకాన్ని చేపట్టింది. దీంతో ఆహార ఉత్పత్తుల దిగుబడి ఏడాదికి ఆరు లక్షల టన్నుల వరకు పెరిగింది. మలావి, మాలి, ఇథియోపియా వంటి దేశాల్లో ఇప్పుడు రైతులే తమ వ్యవసాయ భూముల్లో చెట్లను కూడా పెంచుతున్నారు. భారత్‌లోనూ పెరుగుతున్న పచ్చదనం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ టాప్–10లో ఉందంటేనే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాలు రకరకాల పేర్లతో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి. 2030 నాటికి అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలన్నది లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. 2015 నాటి పారిస్ ఒప్పందం ప్రకారం మొక్కల పెంపకానికే రూ.43 వేల కోట్లు వెచ్చించడానికి అంగీకరించింది. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో నర్మద నదీ తీరం వెంబడి ఒక్కరోజే 6.6 కోట్ల మొక్కల్ని నాటడం ఇందులో భాగమే. రాష్ట్రాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి ఫలితంగా రెండేళ్లలో అడవుల విస్తీర్ణం 6,778 చదరపు కిలోమీటర్ల మేర పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ (2,141 చ.కి) మొదటి స్థానంలో ఉంటే... ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (1,101చ.కి), కేరళ (1,043 చ.కి.), ఒడిశా (885 చ.కి.), తెలంగాణ (565 చ.కి.)æ ఉన్నాయి. అయితే ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయాల్లో అభివృద్ధి పేరుతో చెట్లను నరికేయడం కొనసాగుతూనే ఉంది. భారత్ ఇదే స్థాయిలో మొక్కల పెంపకాన్ని కొనసాగిస్తే ఏడాదికి 520 మిలియన్ల గ్రీన్హౌస్ వాయువుల్ని తగ్గించగలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలా? ఆంధ్రప్రదేశ్‌లో వనం.. మనం.. తెలంగాణలో హరితహారం కొంతవరకు సత్ఫలితాల్నే ఇస్తున్నాయి. అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయినప్పటికీ మొక్కల్ని పెంచాలన్న అవగాహనను భవిష్యత్ తరాల్లో నింపుతున్నాయి. 2015లో మొదలైన హరితహారం కార్యక్రమంలో నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం. ఇప్పటివరకు 82 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. అయితే 20 కోట్ల విత్తనాలను కొండ ప్రాంతాల్లోనూ, అడవుల్లోనూ చల్లారు. ఆ విధంగా చూస్తే 102 కోట్ల మొక్కల్ని నాటినట్టుగా లెక్క. రికార్డు స్థాయిలో 75 శాతం మొక్కల్ని పరిరక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 23 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 50 శాతానికి పెంచడం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ప్రజా భాగస్వామ్యంతోనే ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఏపీలోని అరకు ప్రాజెక్టులో భాగంగా స్థానిక గిరిజనులే లక్షల సంఖ్యలో పండ్ల మొక్కలు, కాఫీ చెట్లు పెంచారు. దీంతో పదిహేను వేల హెక్టార్లు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. కథనాలు సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కూరగాయలకు కష్టకాలం
రోజూ వంటల్లోకి కూరగాయలో, ఆకుకూరలో కావాల్సిందే. కానీ త్వరలోనే కూరగాయలు, ఆకుకూరలు మాయమైపోయే పరిస్థితి నెలకొందట. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలకు కూరగాయలంటే తెలియని పరిస్థితి వస్తుందట. అమెరికాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గత 40 ఏళ్లలో (1975–2016 మధ్య) ప్రచురితమైన అధ్యయనాలన్నింటినీ సమీక్షించి ఈ అంచనాకు వచ్చింది. వాతావరణ మార్పులు, గాలిలో కార్బన్డయాక్సైడ్ మోతాదు పెరగడం వంటి కారణాల వల్ల భవిష్యత్తులో కూరగాయల దిగుబడులు 35 శాతం వరకూ తగ్గిపోతాయని తేల్చింది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పింది. ఇక భూగర్భజలాలు అడుగంటిపోవడంతో భూమి లోతుల్లోంచి తోడుతున్న నీటిలో లవణాల శాతం ఎక్కువగా ఉండటం కూడా దిగుబడులపై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. నష్టమే ఎక్కువ? వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ఎక్కువైతే కొన్ని పంటలకు మేలు జరుగుతుందని గతంలోనే కొన్ని అంచనాలుండగా.. తాజా పరిస్థితులను చూస్తే నష్టమే ఎక్కువని శాస్త్రవేత్తలు లెక్కకట్టారు. దక్షిణాసియా, ఉత్తర అమెరికా సహా మొత్తం 40 దేశాల్లో 1975 నుంచి 2016 మధ్య కాలంలో.. 174 పరిశోధనలు, 1,540 ప్రయోగాలను తాము సమీక్షించామని వారు వెల్లడించారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు, వర్షపాతంలో మార్పుల కారణంగా వరి, గోధుమ దిగుబడి తగ్గుతోందని గత పరిశోధనలు తేల్చినా.. కాయగూరలు, చిక్కుడు జాతికి చెందిన కూరగాయల ఉత్పత్తిని సైతం వాతావరణ మార్పులు తీవ్ర ప్రభావానికి గురిచేస్తాయన్న విషయం కొత్తదంటున్నారు లండన్ యూనివర్సిటీ అధ్యాపకుడు అలన్ డాన్‌గౌర్. పర్యావరణ మార్పులను తట్టుకోగలిగే ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన తక్షణావశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోతే, కాలుష్యాన్ని నివారించకపోతే.. మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమతులాహారమైన ఆకుకూరలు, కూరగాయలు, చిక్కుడుజాతి గింజల కొరత తలెత్తుతుందని.. ఇది ఆహార భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. -
కార్బన్ డయాక్సైడ్తో వరికి ముప్పు..
టోక్యో: మానవాళి మనుగడకు అవసరమైన ఆహార వనరుల్లో వరి ప్రధానమైంది. ఐరన్, జింక్, ప్రొటీన్లతోపాటు బీ1, బీ2, బీ5, బీ9 లాంటి విటమిన్లు వరిలో పుష్కలంగా దొరుకుతాయి. అయితే ఇది ఇప్పటి మాట.. రాబోయే రోజుల్లో వరిలో ఉండే ఈ పోషకాల శాతం క్రమంగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికంతటికి మానవుడి చేతల కారణంగా వాతావరణంలో విపరీతంగా పెరిగిపోతున్న కార్బన్ డయాక్సైడ్ అని వారు చెబుతు న్నారు. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతున్న కొద్దీ వరిలో పోషక విలువలు పడిపోతుంటాయని తాజా అధ్యయనంలో టోక్యో వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. కార్బన్ డయాక్సైడ్ వాయువుల మధ్యనే ఈ శతాబ్దపు రెండో భాగంలో వరి ఎక్కువగా పండుతుందని, దీంతో వరిలో పోషక విలువలు తగ్గిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. తక్కువ ధరకు దొరికే వరి లాంటి అధిక పోషక విలువలు ఉన్న పంట గనుక ఇలా ప్రమాదంలో పడితే.. వరి ప్రధాన ఆహార వనరుగా ఉన్న దేశాల్లో పోషకాహారలోపం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వరిలోని అన్ని రకాలకు ఈ విధంగానే జరుగుతుందని ఇప్పుడే చెప్పలేమని.. దీనిపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని అంటున్నారు. -
ప్రాణాయామంతో ఏకాగ్రత మెరుగు
యోగాలో ప్రాణాయామం అతి ముఖ్యమైన ప్రక్రియ. ఊపిరి తీసుకోవడం, వదలడంలో ఒక క్రమపద్ధతిని అనుసరించే ప్రాణాయామం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు కానీ.. ఎలా అన్నది మాత్రం ఇప్పటివరకూ చాలామందికి తెలియదు. డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ లోటును భర్తీ చేశారు. ప్రాణాయామం మెదడులోని లోకస్ కొయిరులియస్ ప్రాంతంపై ప్రభావం చూపుతుందని గుర్తించారు. ఈ మెదడు ప్రాంతం నోరా అడ్రినలిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒత్తిడి పెరిగినప్పుడు ఈ హార్మోన్ ఎక్కువగాను, ఆలోచనలు మందకొడిగా సాగినప్పుడు తక్కువగానూ ఉత్పత్తి అవుతుందని, ఈ రెండింటి ఫలితంగా ఏకాగ్రత కోల్పోతామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మైకేల్ మెలిన్ఛుక్ తెలిపారు. ఊపిరి తీసుకుని, వదిలేసే క్రమంలో శరీరంలోని కార్బన్డయాక్సైడ్ మోతాదుల్లో మార్పులు వస్తాయని.. ఈ మార్పులకు స్పందిస్తూ లోకస్ కొయిరులియస్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తూంటుందని వివరించారు. గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఎక్కువగా, వదిలేసినప్పుడు తక్కువగా పనిచేసి మన ఉద్వేగాలను, ఏకాగ్రతను కూడా ప్రభావితం చేస్తుందని చెప్పారు. మతిమరపుతో బాధపడే వారికి, ఏకాగ్రత కుదరని పిల్లలకు మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపకరిస్తుందని మైకేల్ తెలిపారు. -
సిరల్లో రక్తాన్నిసులువుగా పరీక్షించొచ్చు
సాక్షి, హైదరాబాద్: ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మోకాలు, మోచేతుల కండరాలు తీవ్ర ఒత్తిడికిలోనై రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి గట్టిగా బిగుసుకుపోతాయి. దీంతో రక్తం సరఫరా నిలిచిపోయి తిమ్మిర్లు వస్తాయి. దీనికితోడు శరీరంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువైనప్పుడు గడ్డలు ఏర్పడి సిరలు బయటికి ఉబ్బినట్లు కన్పిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించకపోతే.. రక్తం సరఫరా లేక కాలిపాదాలు చచ్చుబడి చివరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను ముందే గుర్తించే అత్యాధునిక ‘వీనస్ క్లాట్ ప్రివెంటర్’ను రూపొందించాడు బయోమెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థి మనోజ్‌ఖన్నా. ఈ వీనస్‌క్లాట్ ప్రివెంటర్‌ను బీపీ మానిటర్, గ్లూకోమీటర్ మాదిరిగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించి పరీక్షలు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ వర్క్ కోసం రూపకల్పన.. నాంపల్లికి చెందిన మనోజ్‌ఖన్నా ప్రస్తుతం ఈస్ట్ మారేడుపల్లిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొత్తగా ఆలోచించడం, ఎలక్ట్రానిక్ వస్తువులను రూపొందించడంపై అతడికి ఆసక్తి ఉంది. కాలేజీ ప్రాజెక్ట్‌వర్క్‌లో భాగంగా పాదాలు, చేతులకు సంబంధించిన రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను గుర్తించే డివైజ్‌ను రూపొందించాలని భావించాడు. విద్యార్థులకు ట్యూషన్ చెప్పగా వచ్చిన రూ.25 వేలు ఖర్చు చేసి డిజిటల్ సీఆర్వో(కాథోడ్ రే ఒస్సిల్లోస్కోప్)ను సమకూర్చుకున్నాడు. 8 నెలలు కష్టపడి ‘వీనస్ క్లాట్ ప్రివెంటర్’ను రూపొందించాడు. దీన్ని సీఆర్వోకు అనుసంధానించాడు. ఈ ప్రివెంటర్ సెన్సర్‌ను పాదాలు, చేతులపై ఉంచి సంకేతాలను నమోదు చేశాడు. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ‘డీప్వేయిన్ త్రోంబసిస్’తో బాధపడుతున్న 20 మంది బాధితులపై పరీక్షించగా మంచి ఫలితాలొచ్చాయి. ఈ వీనస్ క్లాట్ ప్రివెంటర్‌ను మహారాష్ట్రలోని కేకేవార్ వర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ సహా నగరంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల టెక్ ప్రదర్శనల్లో పెట్టగా అందరి మన్ననలు వచ్చాయి. పేటెంట్ రైట్స్ కోసం ప్రయత్నం ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారు, వాహనాల డ్రైవర్లు ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చుంటారు. దీని వల్ల మోకాలు కింద భాగంలోని కండరాలు తీవ్ర ఒత్తిడికిలోనై రక్తం సరఫరా నిలిచిపోయి తిమ్మిర్లు వస్తుంటాయి. దీనికితోడు శరీరంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువైనప్పుడు గడ్డలు ఏర్పడి సిరలు ఉబ్బినట్లు కన్పిస్తాయి. రక్తం సరఫరా లేక పాదాలు చచ్చుబడిపోతాయి. ఈ వ్యాధిపై అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తే చివరికి కాలును పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. ఒక్కోసారి కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావాల్సి రావచ్చు. ఈ తరహా కేసులు ఇటీవల బాగా పెరిగాయి. ఇవే ‘వీనస్ క్లాట్ ప్రివెంటర్’రూపకల్పనకు పురికొల్పాయని, ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదని మనోజ్ చెప్పాడు. సాధారణంగా ఇలాంటి కేసులను అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. అయితే ఈ పరీక్షలకు అధిక సమయం పట్టడంతో పాటు ఖర్చుతో కూడినవి. అదే ఈ వీనస్‌క్లాట్ ప్రివెంటర్‌ను బీపీ మానిటర్, గ్లూకోమీటర్ మాదిరిగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. దీనికి త్వరలోనే పేటెంట్ హక్కులు లభించే అవకాశం ఉంది. మరో ప్రాజెక్ట్‌లో నిమగ్నం ప్రొఫెసర్ కె.సుజాత, ప్రొఫెసర్ వెంకటేశ్వర్రావు మార్గదర్శకత్వంలో దీనిని రూపొందించాను. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రతి విద్యార్థి శిక్షణ పూర్తి చేయాలి. కానీ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ సహా మరే ఇతర ఆస్పత్రిలో బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ విభాగం ఏర్పాటు చేస్తే.. నాలాంటి వారికి ఉపయోగకరం. ప్రస్తుతం ‘మైండ్ మ్యాపింగ్’ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాను. తరగతిలో టీచర్ చెప్పింది ఏ మేరకు పిల్లలకు అర్థమయ్యిందో గుర్తించే పరికరాన్ని కూడా రూపొందిస్తున్నాను. – మనోజ్‌ఖన్నా -
విష వాయువులను ఇంధనంగా మార్చారు!
కార్బన్ డైయాక్సైడ్, మీథేన్! భూతాపోన్నతి పెరిగిపోయేందుకు, తద్వారా వాతావరణ మార్పులతో భూమ్మీద మనుగడ కష్టమయ్యేందుకూ కారణమైన రెండు విషవాయువులు. వాతావరణంలోకి చేరుతున్న వీటి మోతాదును ఎలా తగ్గించాలని ఒకవైపు ప్రయత్నాలు సాగిస్తూంటే.. ఇంకోవైపు సర్రే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విష వాయువులను ఎంచక్కా మన వంటగ్యాస్ మాదిరిగా మార్చేసేందుకు ఓ వినూత్న ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు. వాతావరణంలోకి చేరుతున్న కార్బన్ డైయాక్సైడ్, మీథేన్‌ల మోతాదు గత నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉంటే... ఈ ఏడాది మళ్లీ హెచ్చడం మొదలైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిని ఒడిసిపట్టి వేర్వేరు పద్ధతుల్లో నిల్వ చేసేందుకు కొన్ని టెక్నాలజీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో సర్రే శాస్త్రవేత్తలు నికెల్ ఆధారిత ఉత్ప్రేరకం సాయంతో ఈ వాయువులను కత్రిమ వంటగ్యాస్‌గా మరికొన్ని ఇతర ప్రయోజనకరమైన పదార్థాలుగా మార్చవచ్చునని నిరూపించారు. పైగా ఈ ఉత్ప్రేరకాన్ని వాడటం కూడా సులువు అని, చౌకగానూ ఉపయోగించుకోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ థామస్ ఆర్. రీనా తెలిపారు. వాతావరణంలోంచి ఈ విషవాయువులను తొలగించడం వాటిని ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చుకోవడం రెండూ చౌకగా జరిగిపోతే భూతాపోన్నతి సమస్యను సులువుగా పరిష్కరించవచ్చునన్నది తెలిసిందే. -
మట్టిని కాపాడి.. భూతాపం తగ్గించండి!
భూతాపాన్ని తగ్గించేందుకు చెట్లు పెంచడం మొదలుకొని.. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో అందరూ మట్టిని మరచిపోతున్నారని.. మట్టిని నమ్ముకుంటే వాతావరణంలోని కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించడం పెద్ద కష్టమేమీ కాదని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మట్టిని సక్రమంగా వినియోగించుకోగలిగితే ఎలాంటి దుష్ప్రయోజనాలు లేకుండానే వాతావరణంలోని విష వాయువులను తగ్గించొచ్చని, అదే సమయంలో ఇతర ప్రయోజనాలూ పొందొచ్చని అంటున్నారు. మట్టిలో ఉండే కుళ్లిపోతున్న మొక్కల అవశేషాలు, జంతు కళేబరాలు వగైరాలు వాతావరణం, చెట్ల కంటే ఎక్కువ కార్బన్‌ను నిల్వ చేసుకోగలుగుతా యని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అడవులు నరికివేయడం, కాల్చడం, ఎరు వులు వాడటం వంటి చర్యల వల్ల మట్టిలోని కార్బన్ వాతావరణంలోకి చేరి ప్రమాదరకంగా మారుతోందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవత్త రాబ్ జాక్సన్ అంటున్నారు. ఏడాది పొడవునా పశువుల గడ్డి, ఇతర మొక్కలను పెంచడం.. మేపడం, వ్యవసాయం కోసం దుక్కి దున్నడాన్ని తగ్గించడం ద్వారా కార్బన్‌ను మట్టిలోనే ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయొచ్చని.. సారవంతమైన నేల పైపొర కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించడం ద్వారా మొక్కల వేళ్ల ద్వారా కార్బన్ మరింత లోతుల్లోకి చేరిపోతుందని రాబ్ వివరించారు. పరిశోధన వివరాలు యాన్యువల్ రివ్యూ ఆఫ్ ఎకాలజీ, ఎవల్యూషన్ అండ్ సిస్టమాటిక్స్ అండ్ గ్లోబర్ చేంజ్ బయాలజీలో ప్రచురితమయ్యాయి. -
కార్బన్ డయాక్సైడ్తో ఇంధనం!
సూర్యకాంతిని ఉపయోగించి వాతావరణంలోని కార్బన్ డైయాక్సైడ్‌ను ఇంధనంగా మార్చేందుకు లారెన్స్ బెర్క్లీ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. ఇది మొక్కల కంటే మెరుగ్గా ఉండటం విశేషం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకుంటాయన్నది తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను ఇంధనంగా మార్చేందుకు ఇప్పటికే ఎన్నో ఇతర పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే. లారెన్స్ బెర్క్లీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించారు. కార్బన్ డయాక్సైడ్ను వాయుస్థితి నుంచి ద్రవ స్థితికి మార్చేందుకు, ఆ తర్వాత దాన్ని ఇథనాల్, ఇథిలీన్ వంటి ఇంధనాలుగా మార్చేందుకు ప్రత్యేక పదార్థాలు, పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే అతితక్కువ ఇంధనాన్ని ఖర్చుపెట్టి కార్బన్ డయాక్సైడ్ను వేర్వేరు కర్బన పరమాణువులుగా మార్చేందుకు ఓ ప్రత్యేకమైన ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు. రాగి–వెండితో కూడా నానోకోరల్ క్యాథోడ్, ఇరీడియం ఆక్సైడ్ నానోట్యూబ్ ఆనోడ్తో మొక్కల కంటే సమర్థంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలిగారు. సౌరశక్తితోనే వాతావరణంలోని విషవాయువును తగ్గించేందుకు తమ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని బెర్క్లీ శాస్త్రవేత్త గురుదయాళ్ తెలిపారు. -
ఆరో మహా వినాశనం తప్పదా!
ఇంకో 83 ఏళ్లలో అంటే.. 2100 సంవత్సరానికల్లా భూమ్మీద బతకడం చాలా కష్టమన్న వార్తలు మనం వినే ఉంటాం.. తాజాగా అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన లారెన్జ్ సెంటర్ కూడా ఈ విషయాన్ని రూఢీ చేసింది. ఈ శతాబ్దం చివరికల్లా సముద్రాల్లో బోలెడంత కార్బన్ డయాక్సైడ్ వాయువు చేరిపోయి భూమి చరిత్రలో ఆరో మహా వినాశనం మొదలవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 54 కోట్ల ఏళ్లలో భూమ్మీద ఐదు మహా వినాశనాలు చోటు చేసుకున్నాయిని.. వీటిల్లో ఒకదాంట్లో రాకాసి బల్లులు నాశనమై పోయాయని తెలిసిన విషయమే. ఎంఐటీ శాస్త్రవేత్తలు భూ వాతావరణంలోని కార్బన్డయాక్సైడ్ మోతాదులో గతంలో వచ్చిన మార్పులను విశ్లేషించడం ద్వారా మహా వినాశనానికి అవకాశాలను గుర్తించారు. వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ మోతాదుల్లో మార్పులు ఎక్కువ కాలం పాటు ఉంటే, అది కాస్తా జీవజాతులు అంతరించిపో యేందుకు దారితీస్తుందని.. ప్రస్తుతం అతితక్కువ సమయంలోనే ఈ వాయువు వాతావరణంలో, సముద్రాల్లోకి చేరిపోతున్నందున 2100 నాటికల్లా మహా వినాశనానికి బీజం పడేందుకు అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డేనియల్ రోథ్‌మన్ తెలిపారు. -
ప్రమాద ఘంటికలు
''భయమేస్తుందని హారర్ సినిమాలు చూడ్డం మానేస్తామా'' అని ఈ మధ్య వచ్చిన ఓ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ వీడియో చూస్తే ఆ డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం. భూగోళంపైని అన్ని భాగాలు రంగు రంగుల్లో కనిపిస్తున్నాయి.. బాగానే ఉంది కదా అనుకుంటున్నారా? చూసేందుకు బాగానే ఉంటుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసిన ఈ త్రీడీ వీడియో.. అందులో విషయం తెలిస్తే మాత్రం కొంచెం డీలా పడటం ఖాయం. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను మండించడం, అడవులను విచ్చల విడిగా నరికేయడం వంటి అనేకానేక చర్యల వల్ల భూమి వేడెక్కుతోందని, దానివల్ల అనేక ప్రమాదాలు ముంచుకొస్తాయని మీరూ వినే ఉంటారు. ఈ విపత్తుకు కారణమైన విషవాయువు అదేనండి.. కార్బన్‌డైయాక్సైడ్ భూ వాతావరణంలో ఎలా విస్తరిస్తుందో చూపుతుంది ఈ వీడియో. ధ్రువ ప్రాంతాల్లోని నీలాల రంగు వాతావరణంలో తక్కువ మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ ఉన్న విషయాన్ని సూచిస్తూంటే.. జనావాసాలు ఉన్న చోట కనిపించే పసుపు, నారింజ, ఎరుపు రంగులు ఈ వాయువు మనకు ముప్పు తెచ్చే స్థాయిలో ఉన్న విషయాన్ని చెబుతోంది. ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ -2 శాటిలైట్ ద్వారా 2014 నుంచి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి సిద్ధమైంది ఈ వీడియో. ఇటీవలే విడుదలైన ఈ వీడియో ఇప్పటికే నెట్లో వైరల్ స్థాయికి చేరుకుంది. మహా సముద్రాలు, చెట్టూ చేమ వీలైనంత పీల్చేసుకున్న తరువాత కూడా వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డైయాక్సైడ్ వాయువులు ఉండటం శాస్త్రవేత్తల్లోనే కాదు... మనకూ ప్రమాద ఘంటికలే! -
ప్రమాద ఘంటికలు
-
హెచ్‌ఎఫ్‌సీలపై చారిత్రక ఒప్పందం
భారత్ సహా 200 దేశాల అంగీకారం కిగాలి(రువాండా): పర్యావరణానికి పెను ముప్పుగా మారిన హైడ్రోఫ్లోరోకార్బన్(హెచ్ఎఫ్సీ)ల వాడకాన్ని గణనీయంగా తగ్గించేందుకు భారత్ సహా 200 దేశాలు అంగీకరించాయి. సుదీర్ఘ చర్చల తర్వాత చారిత్రక ఒప్పందానికి అంగీకారం కుదిరింది. సాధారణంగా వెలువడే కార్బన్ డయాక్సైడ్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా భూతాపానికి కారణమయ్యేవే ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్. వీటిని ఎక్కువగా రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో ఉపయోగిస్తుంటారు. రువాండా రాజధాని కిగిలిలో జరిగిన భేటీలో.. చట్టబద్ధత ఉన్న మాంట్రియల్ ప్రొటోకాల్‌కు సవరణలు చేసే అంశంపై విధానకర్తలు చర్చలు జరిపారు. సవరణకు 197 దేశాలు అంగీకరించాయి. ఈ శతాబ్ది చివరి నాటికి ఓజోన్ పొరను కాపాడేందుకు గ్లోబల్ టెంపరేచర్‌ను 0.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించాలని, ఓజోన్ పొర రక్షణ చర్యలు కొనసాగించాలని నిర్ణయించారు. సవరణ ప్రకారం.. తొలుత వర్ధమాన దేశాలు హెచ్ఎఫ్సీల వాడకాన్ని తగ్గించాలి. తర్వాత చైనా, భారత్ తదితర 9 దేశాలు అనుసరించాలి. 2045 నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎఫ్సీల వినియోగాన్ని 85% తగ్గించాలనేది ఈ సవరణ ఉద్దేశం. -
నీలగిరి చెట్ల నుంచి జెట్ ఇంధనం!
మెల్బోర్న్: తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే జెట్ విమానాల ఇంధనాన్ని యూకలిప్టస్(నీలగిరి) చెట్లను ఉపయోగించి తయారు చేయొచ్చని తేలింది. ‘ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల యూకలిప్టస్(జామాయిల్)చెట్లను పెంచినట్లయితే విమానయాన పరిశ్రమకు కావాల్సిన 5 % ఇంధనాన్ని వాటి నుంచి తయారు చేయొచ్చు’ అని ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీకి చెందిన కార్స్టెన్ కుల్హీమ్ పేర్కొన్నారు. మొత్తం ఈ పరిశ్రమ ద్వారా 2 శాతం కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతోంది. శిలాజ ఇంధనాలతో పోల్చితే యూకలిప్టస్ ఇంధనం ఖరీదైందని, కాకపోతే వీటివల్ల కార్బన్‌డై ఆక్సైడ్ తక్కువగా విడుదలవుతుందన్నారు. జెట్ విమానాలకు శిలాజేతర ఇంధనాలు వాడడం కాస్త కష్టమని, అయితే పునరుత్పాదక ఇథనాల్, బయోడీజిల్ కొంతమేరకు ఫర్వాలేదని చెప్పారు. యూకలిప్టస్ నూనెలో మోనోటర్పీన్లు ఉంటాయని, వాటిని అధిక శక్తినిచ్చే ఇంధనాలుగా మార్చొచ్చని తెలిపారు. -
డస్ట్‌కి... బెస్ట్ షర్ట్
టెక్ టాక్ ఈకాలంలో ఇంటా, బయటా అన్నిచోట్లా కాలుష్యమే. కానీ ఎక్కడ ఎంత కాలుష్యముందో తెలిస్తే... అలాంటిచోట్ల ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడవచ్చు. సరిగ్గా ఇలాంటి ఆలోచనతో రూపుదిద్దుకున్నదే ఫొటోల్లో కనిపిస్తున్న షర్ట్. న్యూయార్క్ డిజైనర్ బెన్టెల్ సిద్ధం చేసిన ఈ హైటెక్ షర్ట్ కాలుష్యం స్థాయికి తగ్గట్టుగా తన డిజైన్లను మార్చేస్తుంది. ఏరోక్రోమిక్స్ అని పిలుస్తున్న ఈ హైటెక్ షర్ట్‌కు ఉపయోగించిన వస్త్రంలో కొన్ని రకాల రసాయన లవణాలు ఉంటాయి. కార్బన్‌డైయాక్సైడ్ వాయువు తగిలినప్పుడు ఈ లవణాల అణువుల్లో ఒక ఆక్సిజన్ పరమాణువు తగ్గుతుంది. ఫలితంగా షర్ట్ నల్లగా మారిపోతుంది. కాలుష్యం లేని చోటకు రాగానే లవణాలు ఆక్సిజన్‌ను పీల్చుకుని మళ్లీ తెల్లగా మారిపోతుంది. ఈ లవణాలన్నింటినీ ప్రత్యేకమైన డిజైన్ రూపంలో ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం స్థాయికి తగ్గట్టు డిజైన్‌లో మార్పులు కనిపిస్తాయన్నమాట. కార్బన్‌డైయాక్సైడ్ కాలుష్యంతోపాటు దుమ్మూ, మసి వంటి ఇతర కాలుష్యాలను గుర్తించేందుకు, అందుకు అణుగుణంగా రంగులు మార్చేందుకు ఈ షర్ట్‌లో రెండు సెన్సర్లూ ఏర్పాటు చేశారు. ఇవి కాలర్ ప్రాంతంలో ఉన్న మైక్రోకంట్రోలర్ల సాయంతో పనిచేస్తాయి. అయితే ప్రస్తుతానికి ఈ షర్ట్లు కొనాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఒకొక్కటీ దాదాపు రూ.40 వేలు ఖరీదు చేస్తాయి మరి! -
‘రాతి’గా విష వాయువు!
ఈ ఫొటోలోని యువతి చేతిలో ఉన్నదేంటో తెలుసా..? ఆ ఏముంది ఏదో రాయి అంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే మామూలు రాయి కాదు.. కార్బన్ డయాక్సైడ్ రాయి! వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన ఈ విష వాయువును వదిలించుకునేందుకు చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్న శాస్త్రవేత్తలు.. చివరికి ఇలా రాయి రూపంలోకి మార్చగలిగారు. ఐస్‌ల్యాండ్‌లోని ఓ థర్మల్ విద్యుత్ కేంద్రంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల ప్రయత్నాల ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ వాయువు ఘన రూపాన్ని సంతరించుకుంది. 2012 నుంచి వారు ఆ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడే కార్బన్డయాక్సైడ్ వాయువును నీటితో కలిపి భూమి లోపలి పొరల్లోకి జొప్పించడం మొదలుపెట్టారు. బసాల్ట్ రాతి నిర్మాణం ఉన్నచోటుకు చేరిన ఆ మిశ్రమం రెండేళ్లలో గట్టిపడి రాయిగా మారిపోయింది. వాస్తవానికి ఇలా జరిగేందుకు వందల ఏళ్లు పడుతుందని ఇప్పటివరకు భావించడం గమనార్హం. -
పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు!
లండన్: పర్యావరణ కాలుష్యానికి ముఖ్య కారణమైన కార్బన్ డైఆక్సైడ్ వాయువును తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న ప్రయోగాల్లో కీలక ముందడుగు పడింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు బృందం నిర్వహించిన ప్రయోగాల్లో ఈ గ్రీన్హౌస్ కారక వాయువు బసాల్ట్ రకపు శిలలతో వేగంగా చర్యజరుపుతోందని కనుగొన్నారు. దీంతో పర్యావరణానికి హాని చేయని ఖనిజాలు ఏర్పడుతాయని ఈ ప్రయోగానికి సంబంధించిన ఫలితాలను 'జర్నల్ సైన్స్'లో ప్రచురించారు. పర్యావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గించడానికి గతంలో శాస్త్రవేత్తలు నిరుపయోగంగా ఉన్నటువంటి ఆయిల్, గ్యాస్ రిజర్వాయర్లలో సీల్ చేయాలని భావించారు. అయితే దీనిలో లీకేజీ సమస్య ఉండటంతో ఈ దిశగా ముందడుగు పడలేదు. దీంతో కార్బన్ డైఆక్సైడ్‌ను మినరలైజ్ చేసే అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇప్పటి వరకూ కార్బన్ ఖనిజాలుగా రూపాంతరం చెందడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందని భావించారు. అయితే శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా ప్రయోగంలో బసాల్ట్ రకపు శిలలతో కార్బన్ డైఆక్సైడ్ వేగంగా చర్య జరుపుతుందని, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఖనిజంగా రూపాంతరం(మినరలైజ్) చెందుతుంది అని గుర్తించారు. ఈ రకమైన శిలలు భూమిపై విరివిగా అందుబాటులో ఉన్నాయని.. పర్యావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ పరిమాణాన్ని తగ్గించడానికి ఈ ఫలితాలు దోహదం చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్త జ్యూర్గ్ మేటర్ తెలిపారు. -
విషం మింగి..ఇంధనం ఇస్తుంది!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కార్బన్డయాక్సైడ్ మోతాదు పెరిగిపోతూ వాతావరణ మార్పులకు కారణమవుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.. మరోవైపు పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయమేమిటా అనే ఆలోచనా సతమతం చేస్తోంది.. కానీ ఈ రెండు సమస్యల్నీ తీర్చేశానంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డేనియల్ నోసెరా. తాను అభివృద్ధి చేసిన బ్యాక్టీరియా వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకుని పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలను ఇస్తుందని ఆయన చెబుతున్నారు. ఆయన ఇంతకుముందే మొక్కల ఆకుల మాదిరిగా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా హైడ్రోజన్‌ను తయారు చేసే కృత్రిమ ఆకుల్ని సృష్టించారు. తాజాగా ఈ సరికొత్త బ్యాక్టీరియాను అభివృద్ధి చేశారు. హైడ్రోజన్, కార్బన్‌డయాక్సైడ్‌లను పీల్చుకుని అడినైన్ ట్రైఫాస్పేట్ (ఏటీపీ)ని తయారుచేసే రాల్స్టన్ రాల్ యుట్రోఫా బ్యాక్టీరియాలోకి మరిన్ని జన్యువులను జొప్పించడం ద్వారా అది నేరుగా ఐసోప్రొపనాల్, ఐసోబ్యూటనాల్లను విడుదల చేసేలా మార్చారు. ఒక లీటర్ పరిమాణమున్న ఈ బ్యాక్టీరియా ఫ్యూయల్సెల్ ద్వారా రోజుకు 500 లీటర్ల పరిమాణంలో కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించవచ్చని నోసెరా అంటున్నారు. తాను రూపొందించిన కృత్రిమ ఆకు టెక్నాలజీ మురుగునీటి నుంచి కూడా హైడ్రోజన్‌ను సృష్టించగలదని, దీనికి రాల్స్టన్ యూట్రోఫా బ్యాక్టీరియా తోడైతే ప్రపంచంలో ఏ మూలనైనా విద్యుత్ వెలుగులు సృష్టించవచ్చని చెబుతున్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్సభ్యుడు కూడా అయిన నోసెరా... ఇలాంటి టెక్నాలజీలు భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంచి ఫలితాలు కనబరుస్తాయని, అందుకే తాను ఇక్కడి నుంచి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొంటున్నారు. -
గాలి+నీరు = ఈ-డీజిల్!
అవసరమనండి... పెరిగిపోతున్న డిమాండ్ కానివ్వండి. ముంచుకొస్తున్న వాతావరణ మార్పుల ముప్పు అనండి.. కారణమేదైనా పర్యావరణానికి హాని కలిగించని ఇంధనాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలైతే ముమ్మరమవుతున్నాయి! ప్రఖ్యాత కార్ల కంపెనీ ఆడీ ఈ దిశగా కీలకమైన ముందడుగు వేసింది! కేవలం గాల్లోని కార్బన్ డైయాక్సైడ్, నీళ్లు మాత్రమే వాడుతూ కృత్రిమ డీజిల్‌ను తయారు చేయడంలో విజయం సాధించింది... ఆర్డర్లు రావాలేగానీ... ఈ-డీజిల్‌ను తయారు చేసి అమ్మేందుకు మేం రెడీ అంటోంది! పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భూమ్మీద బతకటమే కష్టంగా మారిపోతుందని తరచూ వింటూంటాం. అందుకు తగ్గట్టుగానే అకాల వర్షాలు, వరదలు, కరవు కాటకాల వార్తలూ వినిపిస్తూన్నాయి. భూతాపోన్నతికి కారణమవుతున్న గ్రీన్హౌస్ వాయువుల్లో 13 శాతం రవాణా రంగం నుంచి వస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే పర్యావరణ హితమైన ఇంధనాల తయారీకి ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. మొక్కజొన్నలు మొదలుకొని రకరకాల పంటల ద్వారా ఎథనాల్ తయారీకి పూనుకున్నా... వ్యర్థ పదార్థాల నుంచి గ్యాస్ తయారు చేసి వాడుకున్నా ఇందుకోసమే. అయితే ఇప్పటివరకూ సాధించినవన్నీ ఒక ఎత్తు. ఆడి పరిచయం చేస్తున్న ఈ డీజిల్ కాన్సెప్ట్ మరో ఎత్తు. కృత్రిమంగా డీజిల్లాంటి ఇంధనాన్ని తయారు చేయడమొక్కటే దీని ప్రత్యేకత కాదు.. ఈ క్రమంలో కార్బన్‌డైయాక్సైడ్ వంటి గ్రీన్హౌస్ వాయువును మళ్లీ డీజిల్‌గా మార్చడం... వాహనాల్లో వాడినప్పుడు కూడా అతితక్కువ మోతాదులో వ్యర్థవాయువులను విడుదల చేయడం చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు! తయారీ ఇలా... ఈ-డీజిల్ తయారీ కోసం ఆడి కంపెనీ జర్మనీలోని డ్రెస్డెన్లో ఓ పెలైట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పవన, సౌరవిద్యుత్తులతో నడిచే ఈ ప్లాంట్‌లో ముందుగా రివర్సిబుల్ ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా నీటిని హైడ్రోజెన్, ఆక్సిజన్లుగా విడగొడతారు. ఆ తరువాత దీనికి కార్బన్‌డైయాక్సైడ్ వాయువును కలిపి కార్బన్ మోనాక్సైడ్గా మారుస్తారు. మరో రెండు రసాయన ప్రక్రియల తరువాత ఈ కార్బన్ మోనాక్సైడ్ కాస్తా... ముడిచమురును పోలిన ద్రవంగా మారుతుంది. రిఫైనరీల్లో మాదిరిగా శుద్ధి చేయడం ద్వారా దీన్నుంచి డీజిల్‌ను రాబడతారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కోసం బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన కార్బన్‌డైయాక్సైడ్‌ను ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో అక్కడికక్కడే వాతావరణం నుంచి ఈ వాయువును సేకరించి వాడుకోవచ్చునని కంపెనీ అంటోంది. డీజిల్ కంటే మెరుగు... ఆడి కంపెనీ తయారు చేసిన కృత్రిమ డీజిల్ సంప్రదాయ డీజిల్ కంటే మెరుగైన లక్షణాలు కలిగి ఉంటుంది. పైగా గంధకం అసలు లేని ఈ కొత్త డీజిల్ ద్వారా వెలువడే విష వాయువులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇంజిన్ ద్వారా వెలువడే శబ్దం కూడా తగ్గుతుందని, ఆడితో కలిసి ఈ ఇంధనాన్ని అభివృద్ధి చేసిన సన్ఫైర్ కంపెనీ సీటీవో క్రిస్టియన్ వాన్ అంటున్నారు. డ్రెస్డెన్లోని పెలైట్ ప్లాంట్‌లో ప్రస్తుతం రోజుకు 160 లీటర్ల ఈ-డీజిల్‌ను తయారు చేస్తున్నారు. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తికి పెద్దసైజు ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. -
సోడానీటిలో ఉండే వాయువు ఏది?
మాదిరి ప్రశ్నలు కార్బన్ డై ఆక్సైడ్ అనేది కార్బన్ ప్రధాన ఆక్సైడ్. దీన్ని ద్రవీకరించి ఆకస్మిక వ్యాకోచం చెందిస్తే ఘన కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. దీన్నే ‘డ్రై ఐస్’ అంటారు. దీన్ని ఐస్‌క్రీం, అతి శీతల ఆహారాల (Frozen Food) కోసం ప్రశీతకం (రిఫ్రిజిరెంట్ )గా వాడుతున్నారు. దీనికి ఘనస్థితి నుంచి నేరుగా వాయు రూపంలోకి మారే (ఉత్పతనం) గుణం ఉంటుంది. స్టేజి షోలలో బ్యాక్‌గ్రౌండ్‌లో పొగలను సృష్టించడానికి దీన్ని ఉపయోగిస్తారు. కార్బన్ కుటుంబం కార్బన్ (ఇ), సిలికాన్ (జీ), జెర్మేనియం (ఎ్ఛ), టిన్ (), లెడ్ మూలకాలు 14వ గ్రూప్‌లో ఉన్నాయి. కార్బన్ మూలకస్థితి అంటే స్వేచ్ఛాస్థితి (గ్రాఫైట్, డైమండ్, కోల్, కోక్)తో పాటు సంయోగస్థితి (కార్బొనేట్లు, బై కార్బొనేట్ల రూపంలో)లో కూడా లభిస్తుంది. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ (0.03%) రూపంలో ఉంటుంది. భూపటలంపై విస్తృతంగా లభించే మూలకాల్లో సిలికాన్ రెండో స్థానంలో ఉంది. ఇది ద్రవ్యరాశిపరంగా 27.7% ఆక్రమిస్తుంది. ఆక్సిజన్ మొదటి స్థానంలో (ద్రవ్యరాశి పరంగా 46.6%) ఉంది. సిలికాన్ ప్రకృతిలో సిలికా (సిలికాన్ డై ఆక్సైడ్), సిలికేట్ల రూపంలో లభిస్తుంది. పింగాణీ, గాజు, సిమెంటులో సిలికాన్ ముఖ్యమైన అనుఘటకం. రూపాంతరత రసాయన ధర్మాలు ఒకేవిధంగా ఉండే భిన్న భౌతికరూపాలనే ఒక మూలక రూపాంతరాలు (అౌ్టటౌఞ్ఛట) అంటారు. కార్బన్ స్ఫటిక రూపాంతరాలు - గ్రాఫైట్, డైమండ్, ఫుల్లరీన్. అస్ఫటిక రూపాలు - కోల్, కోక్, చార్కోల్ మొదలైనవి. గ్రాఫైట్ పొరల నిర్మాణాన్ని కల్గి ఉంటుంది. ఈ పొరల మధ్య వాండర్‌వాల్స్ ఆకర్షణ బలాలు ఉంటాయి. ఒత్తిడిని కలిగిస్తే పొరలు ఒకదానిపై మరొకటి జారతాయి. అందువల్ల అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేసే భారీ యంత్రాల్లో గ్రాఫైట్ పొడిని కందెన (ఔఠఛటజీఛ్చ్టి)గా వాడతారు. గ్రాఫైట్‌లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల ఇది మంచి ఉష్ణవాహకంగానే కాకుండా విద్యుత్ వాహకంగానూ పనిచేస్తుంది. దీన్ని విద్యుత్ ఘటాల్లో ఎలక్ట్రోడులుగా, పెన్సిల్ లెడ్‌ల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తారు. డైమండ్ త్రిమితీయ అల్లిక కల్గిన జాలక నిర్మాణం కారణంగా అత్యంత గట్టిగా ఉంటుంది. దీన్ని గాజును కోయడానికి, దృఢమైన పనిముట్లను పదును చేయడానికి, అపఘర్షకంగా (అఛట్చటజీఠ్ఛి), ఎలక్ట్రిక్ బల్బుల్లో వాడే టంగ్స్టన్ ఫిలమెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఫుల్లరీన్లు పంజరాన్ని పోలిన అణువులు. ఇ60 అణువుకు సాకర్బంతిని పోలిన నిర్మాణం ఉంటుంది. అందువల్ల దీన్ని ‘బక్ మినిస్టర్ ఫుల్లరీన్’ అంటారు. ఫుల్లరీన్ శుద్ధమైన కార్బన్ (స్ఫటిక రూపం). అస్ఫటిక రూపంలో చక్కెర బొగ్గు (ఠజ్చట ఛిజ్చిటఛిౌ్చ) శుద్ధమైంది. ఫుల్లరీన్ను ‘బక్కీ బాల్స్’ అని కూడా అంటారు. కార్బన్ ఆక్సైడ్లు: కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్లు కార్బన్ ప్రధాన ఆక్సైడ్లు. కార్బన్‌ను పరిమిత ఆక్సిజన్‌లో ప్రత్యక్ష ఆక్సీకరణ చేస్తే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇది మండే స్వభావం ఉన్న విషపూరిత వాయువు, మంచి క్షయకరణి. కార్బన్ డై ఆక్సైడ్‌కు మంటలను ఆర్పే గుణం ఉంటుంది. ఇది నీటిలో కరిగి (సోడా తదితర శీతల పానీయాలు) కార్బోనిక్ ఆమ్లాన్ని ఇస్తుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా పచ్చటి చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్లూకోజ్ లాంటి కార్బొహైడ్రేట్లుగా మారుస్తాయి. 1. కిందివాటిలో అర్ధ లోహం (Metalloid) ఏది? 1) కార్బన్ 2) సిలికాన్ 3) జెర్మేనియం 4) లెడ్ 2. ఒకే రకమైన పరమాణువులు లేని పదార్థం ఏది? 1) గ్రాఫైట్ 2) డైమండ్ 3) కార్బన్ డై ఆక్సైడ్ 4) కోక్ 3. డైమండ్‌కు సంబంధించి సరికాని వాక్యం? 1) సహజంగా లభించే పదార్థాల్లో అత్యంత కఠినమైంది 2) అత్యధిక వక్రీభవన గుణకం కలిగింది 3) డైమండ్ ప్రకాశించడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం 4) ఉత్తమ ఉష్ణవాహకం, మంచి విద్యుత్ వాహకం 4. లెడ్ పెన్సిళ్లలో ఉపయోగించే మూలకం? 1) లెడ్ 2) గ్రాఫైట్ 3) 1, 2 4) డైమండ్ 5. సోడానీటిలో ఉండే వాయువు ఏది? 1) CO 2) CO2 3) SO2 4) O3 6. అలోహం అయినప్పటికీ లోహధర్మమైన ఉష్ణ, విద్యుత్ వాహకతను ప్రదర్శించేది? 1) డైమండ్ 2) గ్రాఫైట్ 3) కోక్ 4) లెడ్ 7. కృత్రిమ శ్వాసను అందించడానికి, కార్బన్ మోనాక్సైడ్ విషానికి విరుగుడుగా ఉపయోగించే 10% ఇై2, 90% ై2ల మిశ్రమాన్ని ఏమంటారు? 1) పొడిమంచు 2) వాటర్ గ్యాస్ 3) ప్రొడ్యూసర్ గ్యాస్ 4) కార్బొజెన్ 8. లెడ్ పెన్సిళ్లలో లెడ్ శాతం? 1) 100% 2) 50% 3) 0% 4) 75% 9. చెట్లు రాత్రివేళల్లో విడుదల చేసే వాయువు? 1) కార్బన్ మోనాక్సైడ్ 2) కార్బన్ డై ఆక్సైడ్ 3) ఓజోన్ 4) సల్ఫర్ డై ఆక్సైడ్ 10. అత్యంత కఠినమైన, మృదువైన మూలకం ఏది? 1) కార్బన్ 2) సిలికాన్ 3) జెర్మేనియం 4) లెడ్ 11. డ్రై ఐస్‌లో ఏమి ఉంటుంది? (ఎస్.ఐ.-2011) 1) భారజలం 2) అమ్మోనియా ద్రవం 3) ఘనీభవించిన ఆల్కహాల్ 4) ఘనీభవించిన కార్బన్ డై ఆక్సైడ్ 12. అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే భారీ యంత్రాల్లో కందెనగా దేన్ని వాడతారు? 1) గ్రాఫైట్ 2) గ్రీజు 3) నూనె 4) వజ్రం 13. పొరల నిర్మాణాన్ని కలిగి, జారే స్వభావం ఉన్న మెత్తని కార్బన్ రూపం ఏది? 1) డైమండ్ 2) కోక్ 3) ఫుల్లరీన్ 4) గ్రాఫైట్ 14. సిలికా (ఇసుక) రసాయన నామం? 1) సిలికాన్ 2) సిలికాన్ డై ఆక్సైడ్ 3) సోడియం సిలికేట్ 4) కాల్షియం సిలికేట్ 15. కిందివాటిలో సిలికా స్ఫటిక రూపం కానిది? 1) క్వార్ట ్జ 2) క్రిస్టోబలైట్ 3) ట్రిడిమైట్ 4) ఇసుక 16. రసాయనికంగా క్వార్ట ్జ అనేది? (పోలీస్ కానిస్టేబుల్-2013) 1) కాల్షియం సిలికేట్ 2) సిలికాన్ డై ఆక్సైడ్ 3) సోడియం సల్ఫేట్ 4) కాల్షియం సల్ఫేట్ 17. సరైన వాక్యాన్ని గుర్తించండి. 1) స్వచ్ఛమైన జెర్మేనియం (ఎ్ఛ), సిలికాన్ (జీ)లను ట్రాన్సిస్టర్లు, అర్ధవాహకాల తయారీలో ఉపయోగిస్తారు. 2) క్వార్ట ్జను పీజో విద్యుత్ పదార్థంగా ఉపయోగిస్తారు. 3) కచ్చితమైన డిజిటల్ గడియారాల తయారీలో క్వార్ట ్జఉపయోగపడుతుంది 4) పైవన్నీ సరైనవే 18. కిందివాటి సరైన వాక్యం ఏది? 1) ఇై విషపూరితం, ఇై2 విషపూరితం కాదు 2) ఇై తటస్థమైంది. ఇై2 ఆమ్ల స్వభావాన్ని కల్గి ఉంటుంది 3) ఇై బలమైన క్షయకరణి 4) పైవన్నీ సరైనవే 19. కార్బన్ శాతం అత్యధికంగా ఉండే బొగ్గు ఏది? 1) ఆంథ్రసైట్ 2) లిగ్నైట్ 3) బిట్యూమినస్ 4) పీట్ 20. కిందివాటిలో సమయోజనీయ స్ఫటికం ఏది? 1) డైమండ్ 2) సోడియం క్లోరైడ్ 3) చక్కెర 4) సున్నపురాయి 21. వజ్రం దేని భిన్న రూపం? 1) కార్బన్ 2) సిలికాన్ 3) సిలికా 4) జెర్మేనియం 22. ఉష్ణగతిక శాస్త్రం పరంగా కార్బన్ స్థిరమైన ఎల్లోట్రోప్ ఏది? 1) డైమండ్ 2) గ్రాఫైట్ 3) కోల్ 4) కోక్ 23. పెట్రోల్‌కు యాంటీనాకింగ్గా కలిపే పదార్థం ఏది? 1) టెట్రా ఇథైల్ జెర్మేనియం 2) టెట్రా ఇథైల్ లెడ్ (ఖీఉఔ) 3) సల్ఫర్ 4) ఆల్కహాల్ 24. {sాఫిక్ పోలీస్ కిందివాటిలో ఏ కాలుష్య కారకానికి గురవుతాడు? 1) కార్బన్ డై ఆక్సైడ్ 2) లెడ్ 3) సల్ఫర్ డై ఆక్సైడ్ 4) పైవన్నీ సమాధానాలు 1) 3; 2) 3; 3) 4; 4) 2; 5) 2; 6) 2; 7) 4; 8) 3; 9) 2; 10) 1; 11) 4; 12) 1; 13) 4; 14) 2; 15) 4; 16) 2; 17) 4; 18) 4; 19) 1; 20) 1; 21) 1; 22) 2; 23) 2; 24) 4. - డాక్టర్ బి. రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా. జాబ్స్, అడ్మిషన్స: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహారాష్ట్రలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నర్స్ (మేల్/ ఫిమేల్): 10 అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్) లేదా నర్సింగ్‌తో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 18 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎక్స్-రే టెక్నీషియన్: 1 అర్హతలు: ఇంటర్‌తో పాటు మెడికల్ రేడియోగ్రఫీ/ ఎక్స్‌రే టెక్నిక్ ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 6 వెబ్సైట్: www.npcil.nic.in మేనేజ్మెంట్లో ఫెలో ప్రోగ్రామ్ తిరుచిరాపల్లిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఇది పీహెచ్‌డీకి సమానం) విభాగాలు: కార్పొరేట్ స్ట్రాటజీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఎంఐఎస్/ఐటీ, ఓబీ అండ్ హెచ్ఆర్ అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 30 వెబ్సైట్: www.iimtrichy.ac.in కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రం కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. బీఎడ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్), బీఎడ్ అడిషనల్ మెథడాలజీ అర్హతలు: బీఏ/ బీకామ్/ బీఎస్సీతో పాటు తెలంగాణకు చెందిన ప్రభుత్వ/ ఎయిడెడ్/ఎంపీపీ/జెడ్పీపీ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా రెండేళ్లకు తగ్గకుండా పనిచేస్తూ ఉండాలి. బీఎడ్ అడిషనల్ మెథడాలజీకి సంబంధించిన వారికి బీఎడ్ తర్వాత రెండేళ్లకు తగ్గకుండా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉండాలి. దరఖాస్తు: డిసెంబర్ 11 తర్వాత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది: జనవరి 5 వెబ్సైట్: www.sdlceku.co.in -
భారతీయ అమెరికన్‌కు ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు
వాషింగ్టన్: కార్బన్ డయాక్సైడ్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసే వినూత్న పరికరాన్ని రూపొందించిన భారతీయ అమెరికన్ విద్యార్థి సాహిల్ దోషి ఈ ఏడాది ‘అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్’ అవార్డుకు ఎంపికయ్యాడు. పిట్స్‌బర్గ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న సాహిల్ గృహ వినియోగం కోసం విద్యుత్‌ను అందించడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పర్యావరణానికి మేలు చేసే ‘పొల్యూసెల్’ అనే పరికరాన్ని రూపొందించి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మొత్తం 9 మంది ఫైనలిస్టులతో పోటీపడి అవార్డును గెలుపొందాడు. అవార్డు కింద సాహిల్‌కు రూ.15.30 లక్షల నగదు, కోస్టా రికాకు విహారయాత్ర అవకాశం అందనున్నాయి. -
పాలకూరలో ‘ఇంధన’ సూత్రం!
మొక్కలు సూర్యకాంతిని ఉపయోగించుకుని కార్బన్ డయాక్సైడ్, నీటి అణువులను విడగొట్టి కార్బోహైడ్రేట్ల(పిండి పదార్థాల)ను తయారు చేసుకుంటాయని, ఈ పద్ధతిని కిరణజన్య సంయోగక్రియ అంటారనీ మనకు తెలిసిందే. అయితే.. సూర్యకాంతిని బాగా ఉపయోగించుకుని ఎక్కువ శక్తిగా మార్చుకోవడంలో మిగతా మొక్కల కంటే.. పాలకూర రెండాకులు ఎక్కువే చదివిందట! దీని ఆకుల్లో ఉండే ‘ఫోటోసిస్టమ్ 2’ అనే ప్రత్యేక ప్రొటీన్ల వ్యవస్థ మిగతా మొక్కల కంటే సూర్యకాంతిని ఎక్కువ సమర్థంగా ఉపయోగించుకుంటోందని పుర్దీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంతవరకూ ఎవరూ తయారు చేయలేనంతగా సూర్యరశ్మి ద్వారా 60 శాతం సమర్థంగా హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయాలని ప్రయోగాలు మొదలుపెట్టిన ప్రొఫెసర్ యులియా పుష్కర్ నేతృత్వంలోని బృందం ఈ మేరకు పాలకూరలో అరుదైన సూత్రాన్ని గుర్తించింది. పాలకూర ఫొటోసిస్టమ్-2లోని ప్రొటీన్ల పనితీరు ఆధారంగా.. కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ జరిపే పరికరాలను తయారు చేస్తే.. హైడ్రోజన్ ఇంధనాన్ని సులభంగా, పెద్ద మొత్తంలో తయారు చేయొచ్చని వారు భావిస్తున్నారు. -
విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది..
‘ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుక్కు రమ్మన్నారు’ ఇదో సామెత. ఈ ఫొటోలో ఉన్నది కూడా అచ్చం ఈ సామెత లాంటిదే. కాంక్రీట్ జనారణ్యాలుగా మారిపోతున్న నగరాల్లో స్వచ్ఛమైన గాలి కరువవుతోందని అందరం అనుకుంటూ ఉంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా దీన్ని చూపిస్తున్నారు కార్లో రాట్టి అసోసియేట్స్ అనే డిజైన్ కంపెనీ. అద్దాల గది మాదిరిగా ఉన్న దీని గోడల మధ్య అసలు కిటుకు ఉంది. చెరువుల్లో, నదుల్లో మనం తరచూ చూసే నాచు మొక్కలను ఈ గోడల మధ్యలో పెంచుతారు. కార్బన్ డైయాక్సైడ్‌ను తెగ ఇష్టంగా తినేసి ఈ నాచు మొక్కలు.. ఏపుగా ఎదుగుతాయి. మొక్కలు కాబట్టి.. ఆ క్రమంలోనే ఆక్సిజన్‌ను కూడా విడిచిపెడతాయి. మామూలు మొక్కలతో పోలిస్తే చాలా ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి ఇలాంటి వాటిని ఇళ్ల పైకప్పులపై పెట్టేసుకుంటే భలే ఉపయోగమని అంటున్నారు ఈ కంపెనీ ప్రతినిధులు. ఇంకో విషయమేమంటే.. ఇదే నాచుమొక్కల నుంచి బయోడీజిల్, కాస్మెటిక్స్, స్పిరులీనా వంటి ఆహార పదార్థాలనూ తయారు చేసుకోవచ్చు. మిలాన్‌లో జరుగుతున్న ఓ ప్రదర్శనలో దీని నమూనాను ప్రదర్శిస్తున్నారు. విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది.. -
Co2 నుంచి చౌకగా మిథనాల్
వాషింగ్టన్: కార్బన్ డయాక్సైడ్ (సీవోటూ) నుంచి చౌకగా స్వచ్ఛమైన మిథనాల్ (మిథైల్ ఆల్కహాల్)ను ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని అమెరికా, డెన్మార్క్ శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. వాహనాలకు ఇంధనంగా ఉపయోగపడటంతోపాటు ప్లాస్టిక్ వస్తువులు, జిగురు పట్టీలు, పెయింట్లు, పాలిమర్ల వంటి వాటి తయారీలో కీలకమైన మిథనాల్‌ను ప్రస్తుతం ఫ్యాక్టరీలలో అత్యధిక పీడనం వద్ద హైడ్రోజన్, సీవోటూ, కార్బన్ మోనాక్సైడ్ల నుంచి తయారు చేస్తున్నారు. అయితే ‘నికెల్-గాలియం’ ఉత్ప్రేరకం సమక్షంలో తక్కువ పీడనం వద్దే హైడ్రోజన్, సీవోటూల నుంచి మిథనాల్‌ను తయారు చేయవచ్చని తాము గుర్తించినట్లు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్, డెన్మార్క్‌లోని టెక్నికల్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రక్రియలో కార్బన్ మోనాక్సైడ్ కూడా చాలా స్వల్ప మొత్తంలోనే విడుదలవుతుందని వారు తెలిపారు. ఈ పద్ధతిలో మిథనాల్ తయారీకి నీటి నుంచి హైడ్రోజన్‌ను, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఫ్యాక్టరీల పొగ గొట్టాల నుంచి విడుదలయ్యే సీవోటూను ఉపయోగిస్తారు కాబట్టి పర్యావరణపరంగా ఇది ఎంతో మేలైన విధానమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
నికోటిన్ దుష్ర్పభావాల పొగాకు..!
అగ్నికి ఆజ్యం తోడైతే మంట మరింత పెరుగుతుంది. మరి ఆ అగ్నికి విషం తోడైతే? అది స్టైలిష్ సిగరెట్‌గా మారుతుంది. దాంతో జీవితం ఫూలిష్‌గా కాలిపోతుంది. ఇంత ఫ్యాషనబుల్‌గా జీవితాలను తగలబెట్టుకోడానికి మనం ఏటా రూ. 24 లక్షల కోట్లు తగలేస్తున్నాం. స్టైలే డెవిలై కబళిస్తుంటే... ప్రతి పది సెకన్లకు ఒకరం చొప్పున నికరంగా పొగాకుకు బలవుతున్నాం. పొగాకు గురించి చాలాసార్లు చాలామంది చెప్పారు, చదివారు, విన్నారు. అయితే వాటితో పాటు కొన్ని అంతగా వినని వాటినీ ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. సిగరెట్ నుంచి రక్షించుకోవడం ఎంతగా అవసరమో చెప్పడానికే ఈ కథనం. జీవితం పొగచూరిపోవడానికి ఈజీ మార్గం... పొగాకు. ఆ విషాన్ని పెట్టెలో దాచి మరీ జాగ్రత్తగా జేబులో పెట్టుకుని తిరుగుతుంటాం. ఆ విషాన్ని అగ్గితో రగిలించి స్వీకరిస్తాం. అగ్నికి ఆజ్యం తోడయ్యే బదులు ఇక్కడ మనం అగ్నికి గరళం తోడయ్యేలా చేస్తాం. అగ్గిపుల్లతో మంట పెచ్చరిల్లుతుంది. అది సిగరెట్‌కు తాకగానే జీవితం కునారిల్లుతుంది. దాన్ని ఎందుకు వదలాలో తెలుసుకోడానికి తోడ్పడే కొన్ని ప్రధాన విషయాలివి... మీకో విషయం తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ ఆయుధాలను అమ్ముతూ మనుగడ సాగిస్తున్న అమెరికా మరో విషయంలోనూ ముందంజలో ఉంది. ఈ వాణిజ్యం ద్వారా అది దేశాల మధ్య చిచ్చు పెడుతుంటే... ఈ బిజినెస్ ద్వారా అది దేహాలకు ముప్పు తెస్తోంది. అదే సిగరెట్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రఖ్యాత సిగరెట్ బ్రాండ్లలో 70 శాతం అమ్మకాలు అమెరికన్ బ్రాండ్స్ అయిన మార్ల్బోరో, కూల్, క్యామెల్ సిగరెట్స్వే. ఇలా ఆయుధాల బాటలోనూ, సిగరెట్ల చేటు లోనూ అమెరికా తన అగ్రాధిపత్యాన్నీ, అగ్రరాజ్యాధి-పైత్యాన్నీ చాటుకుంటూనే ఉండటం విశేషం. సిగరెట్లో ఆర్సినిక్, ఫార్మాల్డిహైడ్, లెడ్, హైడ్రోజన్ సైనైడ్, నైట్రోజెన్ ఆక్సిడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా లాంటి 43 రకాల తెలిసిన కార్సినోజెన్లు (క్యాన్సర్ కారకాలు) ఉన్నాయి. ఇక పేరు తెలియని హానికర రసాయనాలు దాదాపు 4000 రకాలు ఉన్నాయి. వీటి ఫలితంగా ఊపిరితిత్తులు, స్వరపేటిక, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణకోశం వంటి అన్ని అవయవాలూ క్యాన్సర్‌కు గురికావచ్చు. బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి జబ్బులూ రావచ్చు. ఆ తర్వాత వారికి సెకండరీ ఇన్ఫెక్షన్గా నిమోనియా వస్తే మృత్యువుకు గెస్ట్ అయినట్లే. ప్రతి 10 సెకండ్లకు ఒకసారి ప్రపంచంలోని ఏదోమూల ఎవరో ఒకరు పొగాకు వల్లనే చనిపోతున్నారు. గుండెకు సంబంధించిన రుగ్మతలతో చనిపోయేవారిలో కనీసం 35% మంది నేరుగా స్మోకింగ్ వల్ల ప్రభావితమై మృతిచెందేవారే. మీరు సిగరెట్ పొగను పీల్చిన 10 సెకండ్లలో అందులోని నికోటిన్ మెదడును చేరుతుంది. సిగరెట్ తాగేవారి ప్రతి అవయవంలోనూ నికోటిన్ ఉంటుంది... అంటే ఒకవేళ తల్లికి పొగతాగే అలవాటుంటే ఆమె చనుబాలలో కూడా చేరుతుంది. మీకు తెలియని విషయం ఒకటి ఉంది. సిగరెట్లో 20 శాతం చక్కెర ఉంటుంది. చాలామంది డయాబెటిక్ రోగులకు ఈ విషయం తెలియదు. అలాగే చక్కెరను కాల్చి పీల్చితే కలిగే దుష్పరిణామాల గురించి ఇంకా ప్రపంచానికి పూర్తిగా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే... అది నేరుగా చక్కెరను తీసుకోవడం కంటే చాలా ప్రమాదమని. చాలామంది ‘లైట్’ సిగరెట్స్ తాగితే అందులో రసాయనాల ఘాటు, జరగాల్సిన కీడు చాలా లైట్‌గా ఉంటాయని నమ్ముతారు. సిగరెట్‌ను లైట్‌గా చేయడానికి పొగాకును కార్బన్‌డయాక్సైడ్‌తో కలిసి సూపర్ హీట్ వద్ద మండించాలి. అప్పుడది మామూలు పొగాకు పొడికి బదులుగా పఫ్డ్ మెటీరియల్‌గా మారిపోతుంది. (పఫ్డ్ మెటీరియల్‌ను వివరించాలంటే... ఉదాహరణకు నీళ్లకూ, నురగ కూ ఉన్న తేడాతోనూ, బియ్యానికీ, మరమరాల కూ ఉన్న తేడాతోనూ పోల్చుకోవచ్చు). అప్పుడు అలా మారిన దాన్ని కాగితపు గొట్టంలోకి ఎక్కిస్తారన్నమాట. లైట్ అంటే దాని తాలూకు ప్రభావం లైట్‌గా ఉంటుందన్నది మన అపోహ మాత్రమే. నిజానికి దాన్ని మరింత విషపూరితమైన కార్బన్‌డయాక్సైడ్‌తో మరింత అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చి మరింత విషపూరితం చేస్తున్నామన్న సత్యాన్ని మరిచిపోతున్నాం. లైట్ సిగరెట్ లో పొగాకు ఫ్లేక్స్ మధ్య ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల పొగ మరింత ఘాటుగా, నేరుగా, బలంగా ఊపిరితిత్తులకు తాకుతుంది. మీరు ఈ కింది మాట వింటే... ఆహా సిగరెట్ చేసే మేలెంతో కదా అని ‘పొగాకులో కాలేస్తారు’. ఆ తర్వాత కాలు కాలినట్లు కాస్త ఆలస్యం గా గ్రహిస్తారు. అదేమిటం టే... పొగ తాగేవారిలో వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) చాలా చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడే అబ్బా, ఆహా... అనుకోకండి. ఇక్కడే ఉంది ట్విస్టు. ఎంత త్వరగా పనిచేస్తుందో, అంత త్వరగా బలహీనపడిపోతుంది. సిగరెట్ తాగడం మొదలుపెట్టాక... లోపలికి పీల్చుకునేవి విష పదార్థాలు కావడంతో వాటితో పోరాడటానికి వ్యాధినిరోధక వ్యవస్థ ఉపక్రమిస్తుంది. అయితే అదేపనిగా సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతుండటం వల్ల అది బలహీనపడుతుంది. అందుకే సిగరెట్ తాగేవారిలో ఇమ్యూనిటీ వేగంగా ప్రతిచర్య జరిపి వేగంగా బలహీనపడి అంతేవేగంగా నిర్వీర్యమైపోతుంది. అదే పొగతాగనివారిలో ఇమ్యూనిటీ కాస్తంత ఆలస్యంగా మేలుకున్నా... బలంగా, ప్రభావపూర్వకంగా పనిచేస్తుంది. సిగరెట్ తాగడం వల్ల జీర్ణక్రియ జరగాల్సిన దానికంటే ఆలస్యంగా జరుగుతుంది. అంటే జీర్ణమయ్యే ఆహారం ఉండాల్సిన వ్యవధికంటే ఎక్కువసేపు పేగుల్లో ఉంటుంది. దీనివల్ల కుళ్లాల్సిన దానికంటే ఎక్కువగా కుళ్లుతుంది. ఫలితంగా జీర్ణమైన ఆహారం రక్తంలోనికి ఇంకేటప్పుడు... అందులోకి వెళ్లాల్సిన దానికంటే అధికమోతాదులో విషాలు ప్రవేశిస్తుంటాయి. విషపూరితమైన రక్తకణాలు మెదడుకు చేరడంతో అది పనిచేయాల్సిన దానికంటే ఆలస్యంగా పనిచేస్తూ క్రమంగా తన పనితీరును మందకొడిగా మార్చేసుకుంటుంది. గర్భవతులకు ఒకసారి ఎక్స్-రే తీయించాల్సి వస్తేనే డాక్టర్లు వద్దని నిరాకరిస్తుంటారు. అయితే ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగితే... అది దాదాపు 2000 ఛాతీ ఎక్స్-రేలు తీయించుకున్న దాని దుష్ర్పభావంతో సమానం. పొగాకు మొక్కలో హార్మలా అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. అది భ్రాంతులను కలగజేసే రసాయనం. అయితే మనం సిగరెట్ తాగేప్పుడు అలా భ్రాంతులు కలగకపోవడానికి కారణం... సిగరెట్ తయారీలో పొగాకు ను ప్రాసెస్ చేసే సమయంలో హార్మలాను తొలగించడమే. కానీ ఎంతో కొంత స్వల్ప మోతాదుల్లో అది మెదడుకు చేరుతుండటం వల్ల హార్మలాతో కలిగే హార్మ్ అంతా ఇంతా కాదు. అలా కాల్చగా కాల్చగా కొన్నేళ్ల తర్వాత సిగరెట్ దుష్ర్పభావం మన శరీరంపై పడుతుందని మీకు ఇప్పటివరకూ ఒక నమ్మకం ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పుడు సరికొత్త పరిశోధనల వల్ల తెలుస్తున్న సత్యం ఏమిటంటే... సిగరెట్ తాగిన 15 నుంచి 30 నిమిషాల లోపు అందులో ఉండే పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పీయేహెచ్) ప్రభావం శరీరంలోని కణాలన్నింటి పైనా పడుతుంది. అందువల్ల డీఎన్ఏ స్వరూపం మారుతుంది. డీఎన్ఏ స్వరూపం మారడం అంటేనే క్యాన్సర్ అన్నమాట. ఈ పని మొట్టమొదటి సిగరెట్‌తోనూ జరగవచ్చు. అయితే ఇన్ని సిగరెట్లు కాల్చాక కూడా ఇంకా మీపై పీఏహెచ్ల ప్రభావం పడలేదంటే అది మీ అదృష్టమే. పడేలోపే ఆ అలవాటును మానుకోండి. ఇన్ని కారణాలతో తక్షణం నిర్వీర్యం చేసి... క్రమంగా శరీరంలోని అన్ని అవయవాలనూ శక్తిహీనం చేసేసి, ఆ తర్వాత మెల్లగా ప్రాణాలను తీసేసే సిగరెట్‌ను వదులుకోండి. అది ప్రాణాల ను మెలివేయకముందే... దాన్ని వెలివేయండి. అలవాటు మానేశానంటూ గర్వంగా మీసం మెలివేయండి. -నిర్వహణ: యాసీన్ ఇవీ టాపింగ్స్: ఆహారపదార్థాలకు మరింత రుచిని ఆపాదించడానికి రుచికరమైన వాటిని వాటి పైన పూస్తారు. ఈ ప్రక్రియనే వంటల్లో టాపింగ్ అంటారు. అలాగే పొగాకును టాపింగ్ చేయడానికి... లవంగ నూనె, ఆప్రికాట్ స్టోన్, నిమ్మనూనె, లావెండర్‌నూనె, డిల్సీడ్ నూనె, కోకా, క్యారట్ నూనె, బీట్ జ్యూస్, ఓక్, రమ్, వెనీలా, వెనిగార్‌లను పైపూత పదార్థాలుగా ఉపయోగిస్తారు. ఇది తెలిశాక కూడా మీరు సిగరెట్ తాగగలరా...? సిగరెట్‌కు ఫ్లేవర్ (రుచి, వాసన) ఆపాదించడానికి దానికి ‘యూరియా’ ను జతచేస్తారు. యూరియాతో ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా పొగాకులోని ముతకదనం తగ్గి, ఘాటు మరింతగా పెరగాలన్నది ఈ ప్రక్రియ ఉద్దేశం. మీకు తెలుసా? మన శరీరానికి విషపూరితం అంటూ మూత్రం ద్వారా మన కిడ్నీలు బయటకు పంపేది ఈ యూరియా అనే వ్యర్థాన్నే. అంటే మన మూత్రంలో ఉండే పదార్థాన్నే సిగరెట్‌కు రుచి తేవడానికి ఉపయోగించి మళ్లీ శరీరంలోకి పంపిస్తున్నారన్నమాట. మార్ల్బోరో కోసం పనిచేస్తే... జీవితమే బోర్లా! వేన్ మెక్ క్లారెన్, డేవిడ్ మెక్ క్లీన్... వీళ్లిద్దరూ సదరు కంపెనీ యాడ్ కోసం పనిచేసే రోజుల్లో ఒక్కొక్కరినీ విడివిడిగా ‘మార్ల్బోరో మ్యాన్’ అంటూ ఆదరంగా పిలిచేవారు. ఎందుకంటే కౌబాయ్ గెటప్‌లో, రగ్డ్గా, రఫ్‌గా దేన్నైనా తట్టుకోగల ధీరులుగా, వీరులుగా ఆ కంపెనీ యాడ్స్‌లో వాళ్లను చూపించేవారు. యాడ్స్ తయారీలో భాగంగా వారు రోజూ సిగరెట్లు తాగాల్సి వచ్చేది. విచిత్రం ఏమిటంటే... ఆ ఇద్దరూ తమ కాంట్రాక్ట్ ముగిశాక... పదేళ్లలోపే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయారు. ఇంకో విషయం ఏమిటంటే... డేవిడ్ మెక్‌క్లీన్ చావుకు సిగరెట్ల కంపెనీయే కారణమంటూ కుటుంబసభ్యులు కేసు కూడా పెట్టారు. మృత్యువును వడపోసి మరీ తెచ్చే ‘ఫిల్టర్’... పొగతాగడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్యసమస్యలేమీ రావంటూ కొందరు చమత్కారంగా చెప్పేమాట అక్షరాలా వాస్తవం. కాకపోతే కాస్త నెగెటివ్‌గా. ఎందుకంటే వారు వృద్ధాప్యం వచ్చేవరకు ఉండరు కదా..! ఇక స్మోకింగ్ అనే దురలవాటు వల్ల వ్యక్తులు ఎంత త్వరగా చనిపోతున్నారన్నది సైంటిస్టులు గణాంకాలతో లెక్కగట్టారు. సగటున చూస్తే స్మోకర్లు 14 ఏళ్ల ముందుగానే చనిపోతున్నారు. అంటే పొగతాగడం మొదలుపెట్టారంటే మీ జీవితంలో 14 ఏళ్లను త్యాగం చేస్తున్నారన్నమాట. దీనికి తోడు గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, అనేక కిడ్నీ, లివర్, మెదడు సంబంధమైన జబ్బులు బోనస్. బోరిస్ ఐవాజ్ అనే హంగేరియన్ సైంటిస్ట్ 1925లో కార్క్‌తో తొలిసారి సిగరెట్ ఫిల్టర్‌ను తయారుచేసి, ఆ తర్వాత క్రేప్ పేపర్‌తో ఫిల్టర్‌ను రూపొందించి, పేటెంట్ పొందాడు. నిజానికి మామూలు సిగరెట్ లో ప్రమాదకరమైన ముతకపదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తే... ఫిల్టర్ ఉన్న సిగరెట్ ద్వారా అవి మరింత వడపోతకు గురై మరింత ప్రమాదకరమైనవిగా రూపొంది మరీ ప్రాణం తీస్తాయి. విషాన్ని మరింత మేలురకమైనదిగా రూపొందించుకోడానికి పొందిన పేటెంట్ అది అని గ్రహించండి. ఇక కెంట్ అనే ఒక పాపులర్ బ్రాండ్ సిగరెట్ ఫిల్టర్ కోసం మరింత నాణ్యమైన కార్సినోజెన్ (క్యాన్సర్‌ను తెచ్చే రసాయనం) ‘క్రోసిడోలైట్ ఆస్బెస్టాస్’ను ఉపయోగించేవారు. మనం మన జీవితాల ను చాలా నాణ్యంగా తగలబెట్టుకుంటున్నామని గ్రహించి 1950లో ఆ ఫిల్టర్‌ను వాడటం మానేశారు సదరు తయారీదారులు. ప్రతికూల ప్లాసెబో ఎఫెక్ట్: మనం ఏదైనా మందు తీసుకున్న తర్వాత ఉపశమనం పొందితే, నిజానికి అది మందు కారణంగా కాకపోయినా దాన్ని మందుకే ఆపాదిస్తాం. దాన్నే ప్లాసెబో ఎఫెక్ట్ అంటారు. అలాగే సిగరెట్ తర్వాత మనం కుదుటపడినట్లుగా, రిలాక్స్‌గా ఫీలవ్వడం, చురుగ్గా మారడం... ఇవన్నీ సిగరెట్ తాలూకు ప్రతికూల ప్లాసెబో ప్రభావాలే. డాక్టర్ సునంద కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్