సాక్షి, న్యూఢిల్లీ : వాతావరణ శాస్త్రవేత్తలు అంచనాల కన్నా భూగోళం 0.3 ఫారిన్‌హీట్ డిగ్రీలు ఎక్కువగా వేడెక్కుతోంది. ఈ మేరకు ‘హాడ్‌క్రుట్’ గతంలో వేసిన అంచనాలను ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీకి చెందిన వాతావరణ విభాగం మార్చింది. భూగోళం ఉష్ణోగ్రత డేటాలను ఎప్పటికప్పుడు సేకరించి డేటా బేస్‌లో భద్రపర్చే ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూ వాతావరణ అంచనాల సంస్థ ‘హాడ్‌క్రుట్’. 1850లో ఉన్న భూగోళం ఉష్ణోగ్రతకన్నా 2010–18 కాలం నాటికి భూగోళం ఉష్ణోగ్రత 1.90 ఫారిన్‌హీట్ డిగ్రీలు పెరగుతుందని హాడ్‌క్రుట్ అంచనా వేసింది. అయితే వాస్తవానికి భూతాపం 1.93 ఫారిన్‌హీట్ పెరిగింది. భూతాపోన్నతి గత 170 సంవత్సరాలుగా పెరగడానికి ప్రధాన కారణం మనుషుల వల్ల వాతావరణంలో కలుస్తున్న కర్బన ఉద్గారాలేనని పరిశోధకులు పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన నాసా, నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పిరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఓఏఏ) అంచనాలకన్నా భూతాపం పెరగడం తక్కువగా ఉంది. హాడ్‌క్రుట్ అంచనాలే ఇంతకాలం నిజం అవుతూ వచ్చాయి. ఈసారి కూడా అంచనాల్లో 0.3 ఫారిన్‌హీట్ డిగ్రీల తేడామాత్రమే వచ్చింది. 1986లో మొదటి సారి తమ విభాగం భూతాపోన్నతిని అంచనా వేసిందని, ఈస్ట్ ఆంగ్లియా యూనివర్శిటీలోని క్లైమెట్ రిసర్చ్ యునిట్ డైరెక్టర్ టిమ్ ఆస్‌బోర్న్ తెలిపారు. ఆ తర్వాత తమ విభాగం మరింత కచ్చితత్వంతో భూతాపోన్నతని అంచనా వేస్తూ వస్తోందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment