భారతీయ అమెరికన్‌కు ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు | Indian-American to the 'Young Scientist' award | Sakshi
Sakshi News home page

భారతీయ అమెరికన్‌కు ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు

Published Thu, Oct 23 2014 2:39 AM | Last Updated on Thu, Apr 4 2019 3:49 PM

భారతీయ అమెరికన్‌కు  ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు - Sakshi

భారతీయ అమెరికన్‌కు ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు

వాషింగ్టన్: కార్బన్ డయాక్సైడ్ నుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసే వినూత్న పరికరాన్ని రూపొందించిన భారతీయ అమెరికన్ విద్యార్థి సాహిల్ దోషి ఈ ఏడాది ‘అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్’ అవార్డుకు ఎంపికయ్యాడు. పిట్స్‌బర్గ్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న సాహిల్ గృహ వినియోగం కోసం విద్యుత్‌ను అందించడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ పర్యావరణానికి మేలు చేసే ‘పొల్యూసెల్’ అనే పరికరాన్ని రూపొందించి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మొత్తం 9 మంది ఫైనలిస్టులతో పోటీపడి అవార్డును గెలుపొందాడు. అవార్డు కింద సాహిల్‌కు రూ.15.30 లక్షల నగదు, కోస్టా రికాకు విహారయాత్ర అవకాశం అందనున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement