విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది.. | carlo ratti associates one of design company | Sakshi
Sakshi News home page

విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది..

Published Wed, Apr 23 2014 4:50 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది..

విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది..

 ‘ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుక్కు రమ్మన్నారు’ ఇదో సామెత. ఈ ఫొటోలో ఉన్నది కూడా అచ్చం ఈ సామెత లాంటిదే. కాంక్రీట్ జనారణ్యాలుగా మారిపోతున్న నగరాల్లో స్వచ్ఛమైన గాలి కరువవుతోందని అందరం అనుకుంటూ ఉంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా దీన్ని చూపిస్తున్నారు కార్లో రాట్టి అసోసియేట్స్ అనే డిజైన్ కంపెనీ. అద్దాల గది మాదిరిగా ఉన్న దీని గోడల మధ్య అసలు కిటుకు ఉంది. చెరువుల్లో, నదుల్లో మనం తరచూ చూసే నాచు మొక్కలను ఈ గోడల మధ్యలో పెంచుతారు. కార్బన్ డైయాక్సైడ్‌ను తెగ ఇష్టంగా తినేసి ఈ నాచు మొక్కలు.. ఏపుగా ఎదుగుతాయి. మొక్కలు కాబట్టి.. ఆ క్రమంలోనే ఆక్సిజన్‌ను కూడా విడిచిపెడతాయి.
 
 మామూలు మొక్కలతో పోలిస్తే చాలా ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి ఇలాంటి వాటిని ఇళ్ల పైకప్పులపై పెట్టేసుకుంటే భలే ఉపయోగమని అంటున్నారు ఈ కంపెనీ ప్రతినిధులు. ఇంకో విషయమేమంటే.. ఇదే నాచుమొక్కల నుంచి బయోడీజిల్, కాస్మెటిక్స్, స్పిరులీనా వంటి ఆహార పదార్థాలనూ తయారు చేసుకోవచ్చు. మిలాన్‌లో జరుగుతున్న ఓ ప్రదర్శనలో దీని నమూనాను ప్రదర్శిస్తున్నారు. విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement