Bio-diesel
-
వాడేసిన వంటనూనెతో బయోడీజిల్
భలేబుర్ర వేపుళ్లకు అలవాటు పడ్డ మనదేశంలో వంటనూనె వృథా అంతా ఇంతా కాదు. వాడేసిన వంటనూనెను ఇలా వృథా పోనివ్వకుండా తిరిగి ఉపయోగించు కునేలా తయారు చేయాలనుకున్నారు ముగ్గురు ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు. ఆలోచన వచ్చిందే తడవుగా అభిషేక్ శర్మ, హర్షిత్ అగ్రవాల్, మోహిత్ సోనీ అనే ఈ విద్యార్థులు ప్రయోగాలు ప్రారంభించారు. ఇళ్లలోను, హాస్టళ్లలోను వాడేసిన వంట నూనెను సేకరించడం ప్రారంభించారు. దాన్ని బయోడీజిల్‌గా మార్చే ప్రక్రియపై నానా ప్రయోగాల తర్వాత ‘ఫేమ్ వన్’ పేరిట ఓ నమూనా యంత్రాన్ని రూపొం దించారు. దీంతో వంటనూనెను జీవ ఇంధనంగా తయారు చేయగలిగారు. మామూలు డీజిల్‌లో దీనిని ఏ నిష్పత్తిలో నైనా కలుపుకోవచ్చట. వంటనూనె, నీరు, ఆల్కహాల్‌తో పాటు ఒక ఉత్ప్రేరక రసా యనాన్ని వేసి ఆన్ చేస్తే చాలు... గంట సేపట్లోనే బయోడీజిల్ సిద్ధమైపోతుంది. విడతకు ఇరవై కిలోల వాడేసిన వంటనూనెతో ఇరవై కిలోల బయోడీజిల్ తయారు చేయగలుగు తున్నారు. ఈ యంత్రం రూపకల్పనకు అయిన ఖర్చు రూ. 30 వేలు మాత్రమే. కానుగనూనె వంటి వాటితో కూడా బయో డీజిల్ తయారు చేయవచ్చని చెబుతున్నారు. -
పొదుపు బాటలో ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎట్టకేలకు పొదుపుబాట పట్టింది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలను అధిగమించేందుకు ఖర్చులను నియంత్రించుకోవటంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు అంతర్గత సామర్థ్యానికి పదును పెట్టాలన్న సీఎం ఆదేశంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. దీంతో తొలుత ఇంధన రూపంలో అవుతున్న ఖర్చును ఆదా చేయటంతో ఆయ న మాటలను అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి బయో డీజిల్ వాడకాన్ని ప్రారంభించబోతోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇంధనంలో 10 శాతం మేర బయోడీజిల్‌ను వాడబోతోంది. సాధారణ డీజిల్‌తో పోలిస్తే బయో డీజిల్ ధర లీటరుకు రూ.8 మేర తక్కువగా ఉన్నందు న నిత్యం రూ.అరకోటి వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్కలేస్తున్నా రు. వెరసి ప్రతినెలా రూ.15 కోట్ల మేర ఇంధన రూపంలో ఖర్చు తగ్గనుంది. గతంలోనే నిపుణుల సూచన ధర పరంగా డీజిల్ కంటే బయో డీజిల్ చవకైంది కావటంతోపాటు వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే ఉద్గారాలనూ నియంత్రిస్తుంది. ఆర్టీసీ కూడా దీన్ని వినియోగిస్తే ఖర్చు తగ్గుతుందని చాలాకాలం క్రితమే నిపుణులు సూచించారు. దీంతో ఆ దిశగా ఆర్టీసీ కూడా అప్పట్లో చర్యలు చేపట్టింది. కానీ రాష్ట్ర విభజన ఉద్యమాల నేపథ్యంలో అంతర్గతంగా సరైన పరిస్థితులు లేకపోవటంతో అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మధ్యలో కొన్నిసారి టెండర్లు పిలిచినా దాన్ని అమలులోకి తేలేకపోయారు. ఓసారి గట్టిగానే ప్రయత్నించినా... దాని ధర ఎక్కువే ఉందన్న కారణాన్ని పేర్కొంటూ ప్రతిపాదనను అటకెక్కించారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లీటరు డీజిల్‌తో పోలిస్తే రూ.8 వరకు బయోడీజిల్ ధర తక్కువగా ఉంది. ఆ ఇంధనాన్ని సరఫరా చేసే సంస్థలు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ నిత్యం 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఈ రూపంలో రోజూ అవుతున్న ఖర్చు రూ.3.5 కోట్లు. ఇందులో 10 శాతం వరకు బయోడీజిల్‌ను ఇంధనంగా వాడాలనేది తాజా ప్రతిపాదన. ప్రస్తుతం మార్కెట్లో బయో డీజిల్ ధర లీటర్‌కు రూ.51 వరకు ఉంది. ఇది డీజిల్ కంటే రూ.8 వరకు తక్కువ. ఈలెక్కన ప్రతి లీటరు ఇంధనం వ్యయంలో అంతమేర ఆదా చేస్తే నిత్యం రూ.అరకోటి వరకు ఖర్చు తగ్గుతుంది. రాష్ట్రంలో తొలుత వెయ్యి బస్సులతో ప్రారంభించే యోచనలో అధికారులున్నారు. దాని ఫలి తాల ఆధారంగా ఆ ఇంధనాన్ని మిగతా బస్సులకు కూ డా విస్తరించనున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
ఆర్టీసీకి బయోడీజిల్!
* 10% ప్రత్యామ్నాయ ఇంధనం వాడాలని నిర్ణయం * డీజిల్ ఖర్చును తగ్గించేందుకు కసరత్తు షురూ * టెండర్లు ఆహ్వానించిన అధికారులు * ఏటా రూ.30 కోట్లు ఆదా అవుతుందని అంచనా సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో నష్టాలను తగ్గించేందుకు యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సం స్థను ఆదుకునేందుకు గ్రాంటు రూపంలో ఆర్థిక సాయం చేయాలని రెండు రాష్ట్రప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదు. దీంతో ఖర్చుకు ముకుతాడు వేయటం ద్వారా నష్టాలను తగ్గిం చాలని నిర్ణయించిన ఆర్టీసీ డీజిల్ వ్యయంపై దృష్టి సా రించింది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడకంతో ఖర్చును నియంత్రించే దిశగా శ్రీకా రం చుట్టింది. బయోడీజిల్‌ను ఎక్కువగా వాడాలని నిర్ణయించింది. బయోడీజిల్ వాటా కనీసం 10 శాతం ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ఇంధనం సరఫరా కు టెండర్లు పిలిచింది. భవిష్యత్తులో బయోడీజిల్ వినియోగాన్ని పెంచి, డీజిల్ ఖర్చును వీలైనంత మేర తగ్గించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ ఏటా 50 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. గతేడాదికాలంలో దీనికి రూ.2,367 కోట్లను ఖర్చు చేసింది. ప్రతినెలా డీజిల్‌పై లీట రుకు 50 పైసలు చొప్పున ధర పెరుగుతుండటంతో ప్రతినెలా అదనంగా రూ.400 కోట్ల వర కు ఖర్చు పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో బయోడీజిల్ ధర లీటరుకు రూ.53 నుంచి 56 వరకూ ఉంది. డీజిల్‌తో పోలిస్తే.. ఏడెనిమిది రూపాయలు తక్కువ. డీజిల్ వినియోగాన్ని 10 శాతం మేర తగ్గించి దాని స్థానంలో బయోడీజిల్‌ను వాడితే ఏటా రూ.30 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్క తేల్చారు. అయితే ఆర్టీసీలో బయోడీజిల్ వినియోగం కొత్తకాదు. 2008లోనే దీన్ని వినియోగించటం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో 19 డిపోల పరిధిలో రెండేళ్లపాటు కొన్ని బస్సుల్లో వాడారు. కానీ అప్పట్లో డీజిల్ కంటే బయోడీజిల్ ధర ఎక్కువగా ఉండటంతో ఖర్చు పెరిగింది. దీంతో ఆ ప్రయోగం విఫలమైనట్లయింది. -
విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది..
‘ఇటు నుంచి వీలు కాకపోతే అటు నుంచి నరుక్కు రమ్మన్నారు’ ఇదో సామెత. ఈ ఫొటోలో ఉన్నది కూడా అచ్చం ఈ సామెత లాంటిదే. కాంక్రీట్ జనారణ్యాలుగా మారిపోతున్న నగరాల్లో స్వచ్ఛమైన గాలి కరువవుతోందని అందరం అనుకుంటూ ఉంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా దీన్ని చూపిస్తున్నారు కార్లో రాట్టి అసోసియేట్స్ అనే డిజైన్ కంపెనీ. అద్దాల గది మాదిరిగా ఉన్న దీని గోడల మధ్య అసలు కిటుకు ఉంది. చెరువుల్లో, నదుల్లో మనం తరచూ చూసే నాచు మొక్కలను ఈ గోడల మధ్యలో పెంచుతారు. కార్బన్ డైయాక్సైడ్‌ను తెగ ఇష్టంగా తినేసి ఈ నాచు మొక్కలు.. ఏపుగా ఎదుగుతాయి. మొక్కలు కాబట్టి.. ఆ క్రమంలోనే ఆక్సిజన్‌ను కూడా విడిచిపెడతాయి. మామూలు మొక్కలతో పోలిస్తే చాలా ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి ఇలాంటి వాటిని ఇళ్ల పైకప్పులపై పెట్టేసుకుంటే భలే ఉపయోగమని అంటున్నారు ఈ కంపెనీ ప్రతినిధులు. ఇంకో విషయమేమంటే.. ఇదే నాచుమొక్కల నుంచి బయోడీజిల్, కాస్మెటిక్స్, స్పిరులీనా వంటి ఆహార పదార్థాలనూ తయారు చేసుకోవచ్చు. మిలాన్‌లో జరుగుతున్న ఓ ప్రదర్శనలో దీని నమూనాను ప్రదర్శిస్తున్నారు. విషం తింటుంది..ప్రాణవాయువిస్తుంది..