చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ ఉన్నప్పుడు) పానిక్ అటాక్స్‌కు కారణమయ్యే అంశాల్లో ‘హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ ఒకటి. హైపర్ వెంటిలేషన్ అంటే ఏమిటో చూద్దాం. కొందరు బాగా లోతుగా గాలి పీల్చుకుంటూ ఉంటారు. యాంగ్జైటీ సమయంలో లోతుగా, వేగంగా శ్వాసించడం వల్ల ఊపిరితిత్తుల్లోని కార్బన్ డైఆక్సైడ్‌ను ఎక్కువగా బయటకు వదులుతుంటారు. దాంతో దేహంలో కార్బన్‌డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. ఈ కండిషన్‌ను హైపోకాప్నియా అంటారు. ఇలా ఎక్కువగా గాలి పీల్చడం వల్ల జరిగే పరిణామాలను ‘హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ అంటారు. ఫలితంగా వారి ధమనుల్లో బైకార్పొనేట్ స్థాయులు పెరుగుతాయి.
ఈ కండిషన్‌ను ఆల్కలోసిస్ అంటారు. ఇలాంటి కండిషన్స్‌లో పేషెంట్‌కు గుండెవేగం పెరుగుతుంది. శ్వాస తీసుకునే వేగం హెచ్చుతుంది. నిద్రమత్తుగా అనిపిస్తుంది. తేలికపాటి తలనొప్పి కూడా కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషి తాత్కాలికంగా స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో రోగి కాళ్లూచేతులు బిగుసుకునిపోతాయి. దీన్నే ఒక్కోసారి ఫిట్స్‌గా అపోహపడుతుంటారు. అవి ఫిట్సా లేక హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కారణంగా వచ్చిన ప్యానిక్ అటాకా అని నిర్ధారణ చేసుకునేందుకూ వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment