సోడానీటిలో ఉండే వాయువు ఏది? | Which gas is stored in Soda water ? | Sakshi
Sakshi News home page

సోడానీటిలో ఉండే వాయువు ఏది?

Published Wed, Dec 10 2014 12:48 AM | Last Updated on Mon, Oct 22 2018 8:14 PM

సోడానీటిలో ఉండే వాయువు ఏది? - Sakshi

సోడానీటిలో ఉండే వాయువు ఏది?

మాదిరి ప్రశ్నలు
 కార్బన్ డై ఆక్సైడ్ అనేది కార్బన్ ప్రధాన ఆక్సైడ్. దీన్ని ద్రవీకరించి ఆకస్మిక వ్యాకోచం చెందిస్తే ఘన కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. దీన్నే ‘డ్రై ఐస్’ అంటారు. దీన్ని ఐస్‌క్రీం, అతి శీతల  ఆహారాల (Frozen Food) కోసం ప్రశీతకం (రిఫ్రిజిరెంట్ )గా వాడుతున్నారు. దీనికి ఘనస్థితి నుంచి నేరుగా వాయు రూపంలోకి మారే (ఉత్పతనం) గుణం ఉంటుంది. స్టేజి షోలలో బ్యాక్‌గ్రౌండ్‌లో పొగలను సృష్టించడానికి దీన్ని ఉపయోగిస్తారు.
 
 కార్బన్ కుటుంబం
 కార్బన్ (ఇ), సిలికాన్ (జీ), జెర్మేనియం (ఎ్ఛ), టిన్ (), లెడ్ మూలకాలు 14వ గ్రూప్‌లో ఉన్నాయి. కార్బన్ మూలకస్థితి అంటే స్వేచ్ఛాస్థితి (గ్రాఫైట్, డైమండ్, కోల్, కోక్)తో పాటు సంయోగస్థితి (కార్బొనేట్లు, బై కార్బొనేట్ల రూపంలో)లో కూడా లభిస్తుంది. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్  (0.03%) రూపంలో ఉంటుంది. భూపటలంపై విస్తృతంగా లభించే మూలకాల్లో సిలికాన్ రెండో స్థానంలో ఉంది. ఇది ద్రవ్యరాశిపరంగా 27.7% ఆక్రమిస్తుంది. ఆక్సిజన్ మొదటి స్థానంలో (ద్రవ్యరాశి పరంగా  46.6%) ఉంది. సిలికాన్ ప్రకృతిలో సిలికా (సిలికాన్ డై ఆక్సైడ్), సిలికేట్ల రూపంలో లభిస్తుంది. పింగాణీ, గాజు, సిమెంటులో సిలికాన్ ముఖ్యమైన అనుఘటకం.
 
 రూపాంతరత
 రసాయన ధర్మాలు ఒకేవిధంగా ఉండే భిన్న భౌతికరూపాలనే ఒక మూలక రూపాంతరాలు (అౌ్టటౌఞ్ఛట) అంటారు. కార్బన్ స్ఫటిక రూపాంతరాలు - గ్రాఫైట్, డైమండ్, ఫుల్లరీన్. అస్ఫటిక రూపాలు - కోల్, కోక్, చార్‌కోల్ మొదలైనవి. గ్రాఫైట్ పొరల నిర్మాణాన్ని కల్గి ఉంటుంది. ఈ పొరల మధ్య వాండర్‌వాల్స్ ఆకర్షణ బలాలు ఉంటాయి. ఒత్తిడిని కలిగిస్తే పొరలు ఒకదానిపై మరొకటి జారతాయి. అందువల్ల అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేసే భారీ యంత్రాల్లో గ్రాఫైట్ పొడిని కందెన (ఔఠఛటజీఛ్చ్టి)గా వాడతారు.
 
 గ్రాఫైట్‌లో స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల ఇది మంచి ఉష్ణవాహకంగానే కాకుండా విద్యుత్ వాహకంగానూ పనిచేస్తుంది. దీన్ని విద్యుత్ ఘటాల్లో ఎలక్ట్రోడులుగా, పెన్సిల్ లెడ్‌ల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తారు.
 డైమండ్ త్రిమితీయ అల్లిక కల్గిన జాలక నిర్మాణం కారణంగా అత్యంత గట్టిగా ఉంటుంది. దీన్ని గాజును కోయడానికి, దృఢమైన పనిముట్లను పదును చేయడానికి, అపఘర్షకంగా (అఛట్చటజీఠ్ఛి), ఎలక్ట్రిక్ బల్బుల్లో వాడే టంగ్‌స్టన్ ఫిలమెంట్ల తయారీలో  ఉపయోగిస్తారు.
 
 ఫుల్లరీన్‌లు పంజరాన్ని పోలిన అణువులు.  
 ఇ60 అణువుకు సాకర్‌బంతిని పోలిన నిర్మాణం ఉంటుంది. అందువల్ల దీన్ని ‘బక్ మినిస్టర్ ఫుల్లరీన్’ అంటారు. ఫుల్లరీన్ శుద్ధమైన కార్బన్ (స్ఫటిక రూపం). అస్ఫటిక రూపంలో చక్కెర బొగ్గు (ఠజ్చట ఛిజ్చిటఛిౌ్చ) శుద్ధమైంది. ఫుల్లరీన్‌ను ‘బక్కీ బాల్స్’ అని కూడా అంటారు.
 
 కార్బన్ ఆక్సైడ్‌లు:
 కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్‌లు కార్బన్ ప్రధాన ఆక్సైడ్‌లు. కార్బన్‌ను పరిమిత ఆక్సిజన్‌లో ప్రత్యక్ష ఆక్సీకరణ చేస్తే కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. ఇది మండే స్వభావం ఉన్న విషపూరిత వాయువు, మంచి క్షయకరణి. కార్బన్ డై ఆక్సైడ్‌కు మంటలను ఆర్పే గుణం ఉంటుంది. ఇది నీటిలో కరిగి (సోడా తదితర శీతల పానీయాలు) కార్బోనిక్ ఆమ్లాన్ని ఇస్తుంది. కిరణజన్య సంయోగక్రియ ద్వారా పచ్చటి చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్లూకోజ్ లాంటి కార్బొహైడ్రేట్లుగా  మారుస్తాయి.
 
 1.    కిందివాటిలో అర్ధ లోహం (Metalloid) ఏది?
     1) కార్బన్    2) సిలికాన్
     3) జెర్మేనియం    4) లెడ్
 
 2.    ఒకే రకమైన పరమాణువులు లేని పదార్థం ఏది?
     1) గ్రాఫైట్        2) డైమండ్
     3) కార్బన్ డై ఆక్సైడ్   4) కోక్
 
 3.    డైమండ్‌కు సంబంధించి సరికాని వాక్యం?
     1)    సహజంగా లభించే పదార్థాల్లో అత్యంత కఠినమైంది
     2)    అత్యధిక వక్రీభవన గుణకం కలిగింది
     3)    డైమండ్ ప్రకాశించడానికి కారణం సంపూర్ణాంతర పరావర్తనం
     4)    ఉత్తమ ఉష్ణవాహకం, మంచి విద్యుత్ వాహకం
 
 4.    లెడ్ పెన్సిళ్లలో ఉపయోగించే మూలకం?
     1) లెడ్        2) గ్రాఫైట్
     3) 1, 2    4) డైమండ్
 
 5.    సోడానీటిలో ఉండే వాయువు ఏది?
     1) CO        2) CO2    
     3) SO2    4) O3
 
 6.    అలోహం అయినప్పటికీ లోహధర్మమైన ఉష్ణ, విద్యుత్ వాహకతను ప్రదర్శించేది?
     1) డైమండ్     2) గ్రాఫైట్
     3) కోక్        4) లెడ్
 
 7.    కృత్రిమ శ్వాసను అందించడానికి, కార్బన్  మోనాక్సైడ్ విషానికి విరుగుడుగా ఉపయోగించే 10% ఇై2, 90% ై2ల మిశ్రమాన్ని ఏమంటారు?
     1) పొడిమంచు       2) వాటర్ గ్యాస్
     3) ప్రొడ్యూసర్ గ్యాస్ 4) కార్బొజెన్
 
 8.    లెడ్ పెన్సిళ్లలో లెడ్ శాతం?
     1) 100%        2) 50%    
     3) 0%    4) 75%
 
 9.    చెట్లు రాత్రివేళల్లో విడుదల చేసే వాయువు?
     1) కార్బన్ మోనాక్సైడ్     
     2) కార్బన్ డై ఆక్సైడ్
     3) ఓజోన్      
     4) సల్ఫర్ డై ఆక్సైడ్
 
 10.    అత్యంత కఠినమైన, మృదువైన మూలకం ఏది?
     1) కార్బన్    2) సిలికాన్
     3) జెర్మేనియం    4) లెడ్
 
 11.    డ్రై ఐస్‌లో ఏమి ఉంటుంది?
      (ఎస్.ఐ.-2011)
     1) భారజలం    
     2) అమ్మోనియా ద్రవం
     3) ఘనీభవించిన ఆల్కహాల్
     4) ఘనీభవించిన కార్బన్ డై ఆక్సైడ్
 
 12.    అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే భారీ యంత్రాల్లో కందెనగా దేన్ని వాడతారు?
     1) గ్రాఫైట్     2) గ్రీజు
     3) నూనె    4) వజ్రం
 
 13.    పొరల నిర్మాణాన్ని  కలిగి, జారే స్వభావం ఉన్న మెత్తని కార్బన్ రూపం ఏది?
     1) డైమండ్    2) కోక్
     3) ఫుల్లరీన్    4) గ్రాఫైట్
 
 14.    సిలికా (ఇసుక) రసాయన నామం?
     1) సిలికాన్
     2) సిలికాన్ డై ఆక్సైడ్
     3) సోడియం సిలికేట్
     4) కాల్షియం సిలికేట్
 
 15.    కిందివాటిలో సిలికా స్ఫటిక రూపం కానిది?
     1) క్వార్‌‌ట ్జ    2) క్రిస్టోబలైట్
     3) ట్రిడిమైట్    4) ఇసుక
 
 16.    రసాయనికంగా క్వార్‌‌ట ్జ అనేది?
         (పోలీస్ కానిస్టేబుల్-2013)    
     1) కాల్షియం సిలికేట్     
     2) సిలికాన్ డై ఆక్సైడ్
     3) సోడియం సల్ఫేట్
     4) కాల్షియం సల్ఫేట్
 
 17.    సరైన వాక్యాన్ని గుర్తించండి.
     1) స్వచ్ఛమైన జెర్మేనియం (ఎ్ఛ), సిలికాన్ (జీ)లను ట్రాన్సిస్టర్‌లు, అర్ధవాహకాల తయారీలో ఉపయోగిస్తారు.
     2) క్వార్‌‌ట ్జను పీజో విద్యుత్ పదార్థంగా
         ఉపయోగిస్తారు.
     3) కచ్చితమైన డిజిటల్ గడియారాల తయారీలో క్వార్‌‌ట ్జఉపయోగపడుతుంది
     4) పైవన్నీ సరైనవే
 
 18.    కిందివాటి సరైన వాక్యం ఏది?
     1)    ఇై విషపూరితం, ఇై2 విషపూరితం కాదు
     2)    ఇై తటస్థమైంది. ఇై2 ఆమ్ల స్వభావాన్ని కల్గి ఉంటుంది
     3) ఇై బలమైన క్షయకరణి    
     4) పైవన్నీ సరైనవే
 
 19.    కార్బన్ శాతం అత్యధికంగా ఉండే బొగ్గు ఏది?
     1) ఆంథ్రసైట్    2) లిగ్నైట్
     3) బిట్యూమినస్    4) పీట్
 
 20.    కిందివాటిలో సమయోజనీయ స్ఫటికం ఏది?
     1) డైమండ్     2) సోడియం క్లోరైడ్
     3) చక్కెర    4) సున్నపురాయి
 
 21.    వజ్రం దేని భిన్న రూపం?
     1) కార్బన్    2) సిలికాన్
     3) సిలికా    4) జెర్మేనియం
 
 22.    ఉష్ణగతిక శాస్త్రం పరంగా కార్బన్ స్థిరమైన ఎల్లోట్రోప్ ఏది?
     1) డైమండ్    2) గ్రాఫైట్
     3) కోల్     4) కోక్
 
 23.    పెట్రోల్‌కు యాంటీనాకింగ్‌గా కలిపే పదార్థం ఏది?
     1) టెట్రా ఇథైల్ జెర్మేనియం
     2) టెట్రా ఇథైల్ లెడ్ (ఖీఉఔ)
     3) సల్ఫర్     4) ఆల్కహాల్
 24.    {sాఫిక్ పోలీస్ కిందివాటిలో ఏ కాలుష్య కారకానికి గురవుతాడు?
     1) కార్బన్ డై ఆక్సైడ్     2) లెడ్
     3) సల్ఫర్ డై ఆక్సైడ్     4) పైవన్నీ
 
 సమాధానాలు
     1) 3;     2) 3;     3) 4;     4) 2;
     5) 2;     6) 2;      7) 4;      8) 3;
     9) 2;     10) 1;     11) 4;     12) 1;
     13) 4;     14) 2;     15) 4;     16) 2;
     17) 4;     18) 4;     19) 1;     20) 1;
     21) 1;     22) 2;    23) 2;     24) 4.
 
 - డాక్టర్ బి. రమేష్
 సీనియర్ ఫ్యాకల్టీ,
 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా.
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్
 ఆఫ్ ఇండియా
 మహారాష్ట్రలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  నర్స్ (మేల్/ ఫిమేల్): 10
 అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ (నర్సింగ్) లేదా నర్సింగ్‌తో పాటు సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 18 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.
  ఎక్స్-రే టెక్నీషియన్: 1
 అర్హతలు: ఇంటర్‌తో పాటు మెడికల్ రేడియోగ్రఫీ/ ఎక్స్‌రే టెక్నిక్ ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి.
 వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: జనవరి 6
 వెబ్‌సైట్: www.npcil.nic.in
 
 మేనేజ్‌మెంట్‌లో ఫెలో ప్రోగ్రామ్
 తిరుచిరాపల్లిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
     (ఇది పీహెచ్‌డీకి సమానం)
 విభాగాలు: కార్పొరేట్ స్ట్రాటజీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, క్వాంటిటేటివ్ మెథడ్స్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఎంఐఎస్/ఐటీ, ఓబీ అండ్ హెచ్‌ఆర్
 అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
 దరఖాస్తులకు చివరి తేది: జనవరి 30
 వెబ్‌సైట్: www.iimtrichy.ac.in
 
 కాకతీయ యూనివర్సిటీ
 కాకతీయ యూనివర్సిటీకి చెందిన దూర విద్యా కేంద్రం కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
     బీఎడ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్), బీఎడ్ అడిషనల్ మెథడాలజీ
 అర్హతలు: బీఏ/ బీకామ్/ బీఎస్సీతో పాటు తెలంగాణకు చెందిన ప్రభుత్వ/ ఎయిడెడ్/ఎంపీపీ/జెడ్‌పీపీ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా రెండేళ్లకు తగ్గకుండా పనిచేస్తూ ఉండాలి. బీఎడ్ అడిషనల్ మెథడాలజీకి సంబంధించిన వారికి బీఎడ్ తర్వాత  రెండేళ్లకు తగ్గకుండా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉండాలి.
 దరఖాస్తు: డిసెంబర్ 11 తర్వాత వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 దరఖాస్తులకు చివరి తేది: జనవరి 5
 వెబ్‌సైట్: www.sdlceku.co.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement