వాషింగ్టన్: కార్బన్ డయాక్సైడ్ (సీవోటూ) నుంచి చౌకగా స్వచ్ఛమైన మిథనాల్ (మిథైల్ ఆల్కహాల్)ను ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని అమెరికా, డెన్మార్క్ శాస్త్రవేత్తలు అభివృద్ధిపర్చారు. వాహనాలకు ఇంధనంగా ఉపయోగపడటంతోపాటు ప్లాస్టిక్ వస్తువులు, జిగురు పట్టీలు, పెయింట్లు, పాలిమర్ల వంటి వాటి తయారీలో కీలకమైన మిథనాల్‌ను ప్రస్తుతం ఫ్యాక్టరీలలో అత్యధిక పీడనం వద్ద హైడ్రోజన్, సీవోటూ, కార్బన్ మోనాక్సైడ్‌ల నుంచి తయారు చేస్తున్నారు.
అయితే ‘నికెల్-గాలియం’ ఉత్ప్రేరకం సమక్షంలో తక్కువ పీడనం వద్దే హైడ్రోజన్, సీవోటూల నుంచి మిథనాల్‌ను తయారు చేయవచ్చని తాము గుర్తించినట్లు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్, డెన్మార్క్‌లోని టెక్నికల్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రక్రియలో కార్బన్ మోనాక్సైడ్ కూడా చాలా స్వల్ప మొత్తంలోనే విడుదలవుతుందని వారు తెలిపారు. ఈ పద్ధతిలో మిథనాల్ తయారీకి నీటి నుంచి హైడ్రోజన్‌ను, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఫ్యాక్టరీల పొగ గొట్టాల నుంచి విడుదలయ్యే సీవోటూను ఉపయోగిస్తారు కాబట్టి పర్యావరణపరంగా ఇది ఎంతో మేలైన విధానమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Co2 నుంచి చౌకగా మిథనాల్
Published Tue, Mar 4 2014 5:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement