పారిస్: మానవ తప్పిదాల కారణంగా భూ వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల స్థాయి ప్రమాదకర స్థాయిని దాటుతోంది. భూమిని వేడెక్కించే కార్బన్‌డయాక్సైడ్(సీఓ2) స్థాయిలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. హవాయ్‌లోని మౌనా లోవా అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు శనివారం ఉదయం వాతావరణంలో 415.26 పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్) సీఓ2 ఉన్నట్లు గుర్తించారు. 1950ల నుంచి వాతావరణంలోని సీఓ2 స్థాయిలను ప్రతి రోజూ రికార్డు చేస్తున్న ఈ అబ్జర్వేటరీ ఇంతటి గరిష్ట స్థాయిలను గుర్తించడం ఇదే ప్రథమం. ఈ స్థాయిలో భూ వాతావరణంలో సీఓ2 ఎప్పుడో 30 లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. భూ ఉష్ణోగ్రత సరాసరిన ఏడాదికి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment