atmosphere
-
తప్పును సరిదిద్దుకునే మార్గాలు..!
పర్యావరణం సమతుల్యత కోల్పోయింది. కాదు... పర్యావరణాన్ని మనమే ప్రమాదంలోకి నెట్టేశాం. మన పనుల ద్వారా భూ ఆవరణాన్ని కాలుష్య కాసారంగా మార్చాం. ప్రకృతిని పీల్చి పిప్పి చేస్తున్నాం. ఈ పూట గడిస్తే చాలు అన్న ట్లుగా వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నాం. ప్రకృతి మాత మూలుగను పీల్చేస్తున్నాం. వెరసి... జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాడుకోవాల్సిన పర్యా వరణ వనరుల బడ్జెట్‌ను పరిమితికి మించి ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలో తెగ వాడేసుకుంటున్నాం.అవసరాలు తీర్చుకోవటానికి కాకుండా అత్యా శకు పోయి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ను ఆగస్టు 1 నాటికే పూర్తిగా కాజేసి... ఆ తర్వాత ప్రతి క్షణం ప్రకృతి మాత మూలుగను అదే పనిగా పీల్చేస్తున్నాం. దాంతో, తిరిగి తిప్పుకోలేని స్థితికి చేరిన భూగోళం గతి తప్పి సమతుల్యతను కోల్పోయింది. మొన్నటి వరకు గతమెన్నడూ ఎరుగనంతగా అత్యధిక ఉష్ణోగ్రతలు, ఇప్పుడేమో అతి భారీ కుండపోత వర్షాలు, భీకర వరదలు; ములుగు జిల్లాలో అభయారణ్యం నేలమట్టం కావటం... ఐక్య రాజ్యసమితి ప్రకటించి నట్లు ఇవన్నీ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’కి ప్రత్యక్ష నిదర్శనాలు. భూగోళం గతమెన్నడూ లేనంత ఎక్కువగా వేడెక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశా ల్లోనూ గత 13 నెలలు అత్యంత అధిక ఉష్ణో గ్రతలు నమోదయ్యాయి. భూతాపాన్ని పెంచ టంలో, భూగోళం ఆరోగ్యాన్ని క్షీణింప జేయటంలో వ్యవసాయం, ఆహార సరఫరా రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని గణాంకాలు చెబు తున్నాయి. మనుషులు, పశువుల ఆరోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తోంది. మనం పండిస్తున్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, సూక్ష్మ పోషకాలు, ఫైటో న్యూట్రియంట్స్ భారీగా తగ్గి పోయాయి. భూగోళం ఆరోగ్యాన్ని అనేక విధాలుగా క్షీణింపజేయటంలో పారిశ్రామిక వ్యవసాయ–ఆహార వ్యవస్థల పాత్ర చాలా ఉంది.2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం...క్లైమేట్ ఛేంజ్‌పై పరిశోధనలు చేస్తున్న మూడు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన స్టాక్‌హోం రెజిలి యన్స్ సెంటర్ (ఎస్ఆర్సీ) సమాచారం ప్రకారం... ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగ తీరును బట్టి, భూతాపోన్నతిని బట్టి... భూగోళం ఆరోగ్యాన్ని 9 అంశాల ప్రాతిపదికగా అంచనా వేస్తారు. ఈ 9 అంశాల్లో ఆరింటిలో 2022 నాటికే లక్ష్మణరేఖ దాటేశాం. ము ఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ ఆరింటిలో ఐదింటికి కారణం వ్యవసాయం, ఆహార వ్యవస్థలేనని ఎస్ఆర్సీ తేల్చి చెప్పింది.నీటి వినియోగం, జీవావరణ సమగ్రత, భూమి వినియోగ మార్పిడి, నావెల్ ఎన్టిటీస్, నత్రజని/ఫాస్ఫరస్ వంటి రసాయనాల వాడకం... ఈ ఐదు అంశాల్లో పరిస్థితి విషమించటడానికి ఒకానొక మూల కారణం ముఖ్యంగా రసా యనిక/పారిశ్రామిక వ్యవసాయం, ఆహార వ్యవస్థ లేనని ఎస్ఆర్సీ నిర్ధారణకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సాగు భూమిలో 40 శాతం ఇప్పటికే సాగు యోగ్యం కాకుండాపోయి బంజరుగా మిగిలిపోయింది.ఈ ఖాళీ భూముల నుంచి, పంట లేని పొలాల నుంచి రీ రేడియేషన్ ప్రక్రియ ద్వారా సూర్యరశ్మి వాతావరణంలోకి పరావర్తనం చెందటం భూతాపోన్నతికి దోహదం చేస్తోంది. పారిశ్రామిక వ్యవసాయ క్షేత్రాల నుంచి వస్తు సరఫరా వ్యవస్థ చివరి గొలుసు వరకు (అగ్రీఫుడ్ సిస్టమ్స్) వెలువడే కర్బన ఉద్గారాలు క్లైమేట్ ఛేంజ్‌కు 34 శాతం మేరకు కారణభూతాలని గుర్తించాలి. తిరిగి ప్రాణశక్తిని పుంజుకొని సమతుల్యతను సంతరించుకోవడంలో భూగో ళానికి తోడుగా ఉండటానికి మార్గాలేవీ లేవా? తప్పకుండా ఉన్నాయన్నది నిపు ణులు చెబుతున్న గుడ్ న్యూస్. వాటిల్లో ఒకటేమిటంటే... పునరుజ్జీవన (ప్రకృతి/సేంద్రియ) వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అమల్లోకి తేవటం! తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే క్లైమేట్ సంక్షోభం నుంచి చాలా వరకు బయట పడొచ్చని సుసంపన్న అనుభవాలే తెలియజెబు తున్నాయి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్, 86397 38658ఇవి చదవండి: నిదానమే.. ప్రధానం! -
ఈ బీచ్‌బబుల్ టెంట్లకి.. ప్రత్యేకత ఏంటో తెలుసా!?
సముద్రం ఒడ్డున పడుకుని, రాత్రివేళ చుక్కలను చూస్తూ నిద్రలోకి జారుకుంటే భలే బాగుంటుంది కదూ! సముద్రం ఒడ్డున పడుకుని, రాత్రివేళ ఆకాశంలోని చుక్కలను చూడటం వరకు సరే, నిద్రలోకి జారుకోవడం అంత తేలిక కాదు. ఆరుబయట పడుకుంటే, చీకటి పడిన తర్వాత దోమల దాడి నిద్రను దూరం చేస్తుంది. దోమల బెడదకు భయపడే ఆరుబయట నిద్రపోవడానికి చాలామంది వెనుకంజ వేస్తారు.అయితే, దోమల బెడద లేకుండా, ప్రశాంతంగా ఆరుబయట ఎదురుగా సముద్రాన్ని, ఆకాశంలోని చుక్కలను చూస్తూ గడిపే అద్భుతమైన అవకాశం మాల్దీవ్స్ పర్యాటకులకు ఇప్పుడు అందుబాటులో ఉంది. మాల్దీవ్స్‌లోని సీసైడ్ ఫినోలు రిసార్ట్స్ సంస్థ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా బీచ్‌బబుల్ టెంట్లను అందుబాటులోకి తెచ్చింది. పారదర్శకంగా గోళాకారంలో ఉండే ఈ టెంట్లలో పడుకుంటే, రాత్రివేళ ఆకాశం సుస్పష్టంగా కనిపిస్తుంది.అల్ట్రావయొలెట్ కిరణాలు, నీరు చొరబడకుండా తయారు చేసిన ఈ టెంట్లలోకి దోమలు కూడా చొరబడలేవు. వాతావరణంలోని హెచ్చుతగ్గులను తట్టుకునేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ టెంట్లలో బస పర్యాటకులకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ టెంట్లలో బసచేసిన వారు మెలకువగా ఉన్నా, నిద్రపోయినా అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకుంటారని ‘ఫినోలు’ సంస్థ నమ్మకంగా చెబుతోంది.మాల్దీవ్స్‌లోని బా అటాల్ బీచ్‌లో ‘ఫినోలు’ సంస్థ ఈ బీచ్‌బబుల్ టెంట్లతో ఇటీవల రిసార్ట్ ప్రారంభించింది. ఈ రిసార్ట్స్‌లో బబుల్ టెంట్లలో బసతో పాటు పర్యాటకులకు స్పా, హైడ్రోథెరపీ, జిమ్, బ్యూటీ పార్లర్, టెన్నిస్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటం విశేషం. ఈ బీచ్ బబుల్స్‌లో ఒక రాత్రి బస చేయాలంటే, 476 డాలర్లు (రూ. 39,783) చెల్లించాల్సి ఉంటుంది.ఇవి చదవండి: క్షణికం! ట్రైన్లో అడుగు పెట్టి.. బెర్త్ కింద సూట్‌కేసు తోసి.. -
పార్టీనా?.. కోడలు పిల్లనా?.. సంకటంలో శిబు సోరెన్?
జార్ఖండ్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం కీలకంగా మారింది. జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ పురిటి గెడ్డ దుమ్కాకు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వృద్ధుడైన శిబు సోరెన్ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ దుమ్కా గతంలో కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.తాజాగా దుమ్కా నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. ఇది మొదలు ఆమె జేఎంఎంపై మాటల యుద్ధం చేస్తున్నారు. దీనికి ప్రతిగా శిబు సోరెన్ చిన్న కోడలు కల్పనా సోరెన్ తన భర్త, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపినందుకు బీజేపీని కార్నర్ చేస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో శిబు సోరెన్ రాజకీయ ప్రతిష్ట దిగజారుతున్నదనే వాదన వినిపిస్తోంది. ఓ వైపు పార్టీ, మరోవైపు ఇంటి పెద్ద కోడలు.. మధ్యలో శిబు సోరెన్ నలిగిపోతున్నారని వినికిడి. ఇది సోరెన్ కుటుంబానికి మాత్రమే కాకుండా బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. 2019లో బీజేపీకి చెందిన సునీల్ సోరెన్ దుమ్కా నుంచి గెలిచి, శిబు సోరెన్ కోటను కూల్చివేశారు. ఈసారి సీతను అభ్యర్థిగా నిలబెట్టి, జేఎంఎం (కూటమి)ని గందరగోళపరిచేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.అయితే జేఎంఎం.. బీజేపీ అభ్యర్థి సీతకు వ్యతిరేకంగా కుటుంబం నుండి ఎవరినీ అభ్యర్థిగా నిలబెట్టలేదు. అయితే చిన్న కోడలు కల్పనా సోరెన్‌కు పార్టీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించింది. పార్టీ ఈ స్థానం టిక్కెట్‌ను నలిన్ సోరెన్‌కు కేటాయించింది. 1952లో మొదటిసారిగా దుమ్కా స్థానానికి ఎన్నికలు జరిగాయి. నాడు కాంగ్రెస్‌కు చెందిన పాల్ జుజార్ సోరెన్ విజయం సాధించారు. అప్పటి నుండి ఈ లోక్‌సభ స్థానం 19 ఎన్నికల్లో 11 సార్లు సోరెన్ వర్గం చేతికే దక్కింది. శిబు అనారోగ్యంతో బాధపడుతూ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. అయితే ఆయన పార్టీ ఆప్తమిత్రుడు నళిన్ సోరెన్ జెఎంఎం సత్తా చాటేందుకు రంగంలోకి దిగారు.2019 ఎన్నికల డేటా ప్రకారం జార్ఖండ్‌లోని దుమ్కా లోక్‌సభ స్థానంలో మొత్తం ఓటర్ల సంఖ్య 10 లక్షల 25 వేల 968. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 20 లక్షల 59 వేల 611. ఇక్కడి జనాభాలో 92 శాతం మంది గ్రామాల్లో, మిగిలిన వారు నగరాల్లో నివసిస్తున్నారు. కుల సమీకరణలను పరిశీలిస్తే ఎస్సీ కేటగిరీ జనాభా 7.84 శాతం, ఎస్టీ కేటగిరీ జనాభా 37.39 శాతంగా ఉంది. -
రాహుల్ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీలో ఏం జరుగుతోంది?
దేశంలో ఎక్కడకు వెళ్లినా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. వీటిలో యూపీలోని రాయ్‌బరేలీ స్థానం పలువురి నోళ్లలో నానుతోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని సోనియా గాంధీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం భవితవ్యంపై చర్చలు మొదలయ్యాయి.కాంగ్రెస్ అధిష్ఠానం పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన దరిమిలా పార్టీ రాహుల్ గాంధీని రాయ్ బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాయ్‌బరేలీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ వ్యూహకర్తల బృందం కాంగ్రెస్‌కు అనుకూలంగా అక్కడి వాతావరణాన్ని సృష్టించే పనిలో బిజీగా ఉంది.గత ఎన్నికల్లో అమేథీ విజయం తర్వాత రాయ్‌బరేలీపై కన్నేసిన బీజేపీ ఈ స్థానంలోనూ విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే గాంధీ కుటుంబ వారసత్వానికి కంచుకోటగా నిలిచిన ఈ సీటును దక్కించుకోవడం బీజేపీకి సవాల్‌గా మారింది.గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీని కోల్పోయి, రాయబరేలీకి మాత్రమే పరిమితమైన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఈ స్థానాన్ని కాపాడుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే రాయ్ బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీని పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ పోటీ చేస్తున్న రాష్ట్రంలోని ఇతర 16 స్థానాలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావించి ఉంటారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ గాంధీ పోటీకి దిగారు.2009 నుంచి సమాజ్‌వాదీ పార్టీ రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంది. పలువురు ఎస్పీ నేతలు తమ పార్టీ జెండాలు చేతపట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహకారం అందించారు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 20న ఐదవ దశలో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగున్నాయి. -
అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్ చల్
ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా కనిపించే అరోరా అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో గులాబీ, పర్పుల్ రంగుల్లో అద్భుతమైన ఖగోళ కాంతి ప్రదర్శన, అరోరా బొరియాలిస్ ఆకాశంలో ప్రకాశించింది. దీంతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.Strongest Aurora in last 20 years was visible last evening. This was how it looked on top of Jungfraujoch, Switzerland Video via webcams on https://t.co/BwS7eM6IEY#solarstorm pic.twitter.com/rqG5S2poKb— Backpacking Daku (@outofofficedaku) May 11, 2024 రెండు దశాబ్దాల తరువాత అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత శుక్రవారం నాడు నార్తర్న్ లైట్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కనిపించాయి. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుంది. సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి. Guys I’m actually in tears I thought I’d never get to see the northern lights 😍😭 pic.twitter.com/kk8unLfhwE— Jimin’s Toof (B-ChimChim) Semi-IA (@ForeverPurple07) May 11, 2024 చాలామంది యూజర్లు అరోరాను వీక్షించిన తరువాత తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలతోపాటు, ఇటలీ, ఫ్రాన్స్. రష్యా అంతటా, ప్రత్యేకించి మాస్కో ప్రాంతంలో ఇవి దర్శనమిచ్చాయి. అలాగే సరాటోవ్ , వొరోనెజ్లో, దక్షిణ సైబీరియాలో కూడా కనిపించాయి. ఉత్తర జార్జియాకు చెందిన యూజర్ కూడా అరోరా బొరియాలిస్ అద్భుత చిత్రాలను పంచుకున్నారు. ఈ అందమైన దృశ్యాన్ని చూసిన వారు "చాలా చాలా అదృష్టవంతులు" అని ఒకరు, నాకు కన్నీళ్లు ఆగడం లేదంటూ మరొకరు భావోద్వేగానికి లోను కావడం విశేషం. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, అలాస్కా వంటి భూమి, అయస్కాంత ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నార్తర్న్ లైట్లు సాధారణంగా కనిపిస్తాయి. మరోవైపు భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులతో వచ్చే పరిణామాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , పవర్ గ్రిడ్లకు సూచించారు. -
చదువులతల్లి పట్ల దారుణం: చైల్డ్ లైన్ ఫిర్యాదుతో వెలుగులోకి!
అత్యాచార బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారానికి గురైన బాలికను 12వ తరగతి పరీక్ష రాయకుండా అడ్డుకున్నారు. రాజస్థాన్‌లో అజ్మీర్‌లో ఒకప్రైవేట్ పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు చైల్డ్ హెల్ప్లైన్నంబర్కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 12 బోర్డు పరీక్షలకు తనను హాజరుకానివ్వలేదంటూ అజ్మీర్‌లోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని ఆరోపించింది. గత ఏడాది సామూహిక అత్యాచారానికి గురయ్యావు కాబట్టి, పరీక్షకు హాజరైతే వాతావరణం చెడిపోతుందని పాఠశాల అధికారులు చెప్పారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. అడ్మిట్ కార్డ్ ఇవ్వ లేదని బాధితురాలు తెలిపింది. అడ్మిట్ కార్డు తీసుకోవడానికి వెళ్లినప్పుడు, అధికారులు ఇకపై పాఠశాల విద్యార్థిని కాదని తెలిపారు. అయితే దీనిపై మరో టీచర్‌ను సంప్రదించగా, ఆమె చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయమని సూచించింది. అయితే బాధిత విద్యార్థిని గత నాలుగు నెలలుగా పాఠశాలకు రాకపోవడంతో ఆమెను పరీక్షకు అనుమతించడం లేదని పాఠశాల అధికారులు వాదించారు. అయితే ఆమె స్కూలుకు హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తనను లోపలికి రానీయకుండా నిషేధించారని ఇంటి నుండే చదువుకోవాలని సూచించిందని అందుకే ఇంట్లో ఉండే పరీక్షలకు ప్రిపేర్ అయినట్టు అంజలీ శర్మతో వాపోయింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు అజ్మీర్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ (సిడబ్ల్యుసి) కేసు నమోదు చేసింది, విచారణ తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజలి శర్మ వెల్లడించారు. శిశు సంక్షేమ శాఖ కూడా కేసు నమోదు చేసింది. 10వ తరగతి పరీక్షలలో 97 శాతం స్కోర్ సాధించిన బాధితురాలు ఇపుడు కూడామంచి మార్కులు తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. కానీ పాఠశాల నిర్లక్ష్యం వల్ల ఏడాది సమయం వృథా అవుతుందేమోనని భయపడుతోంది. కాగా గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.దీనిపై విచారణ నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలికా విద్య, మహిళల భద్రత గురించి ఎంత మాట్లాడు తున్నా, ఎంత ప్రచారం కల్పిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదనీ, మరీ ముఖ్యంగా విద్య నేర్పే పాఠశాల్లో ఇలాంటి దారుణం ఏమిటి అనే విమర్శలకు తావిస్తోంది. -
ఆ బ్యాటరీలు మన నెత్తిన పడతాయా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) నుంచి మూడు టన్నుల బరువైన తొమ్మిది బ్యాటరీలు నేడు (శనివారం) భూమిపైకి దూసుకురానున్నాయి. 2021లో ఐఎస్ఎస్ నుంచి వేరుపడిన ఈ బ్యాటరీలు ఇప్పుడు భూమిపై పడనున్నాయి. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత బరువైన ఎక్స్పోజ్డ్ ప్యాలెట్ 9 (ఈపీ9)ను 2021, మార్చి లో అంతరిక్ష కేంద్రం నుంచి తొలగించారు. దీనిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి పైకి విసిరిన అత్యంత భారీ వస్తువుగా గుర్తించారు. ఉపయోగించిన లేదా అనవసరమైన పరికరాలను ఈ విధంగా పారవేయడం అంతరిక్ష కేంద్రంలో సాధారణంగా జరుగుతుంటుంది. ఇవి భూ వాతావరణంలో ఎటువంటి హాని లేకుండా కాలిపోతాయి. ఈపీ9 దూసుకువచ్చే ముందు జర్మనీలోని నేషనల్ వార్నింగ్ సెంటర్ పౌర రక్షణ, విపత్తు ఉపశమనం కోసం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ‘మార్చి 8 మధ్యాహ్నం నుంచి, మార్చి 9 మధ్యాహ్నం మధ్య భారీ అంతరిక్ష శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది’ అని తెలిపింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లోని వివరాల ప్రకారం ఈ ఖగోళ వ్యర్థాలు మార్చి 9న ఉదయం 7:30 నుంచి మార్చి 9 ఉదయం 3:30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ బ్యాటరీలు భూమికి ఎటువంటి హాని కలిగించవు. ఎందుకంటే అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే, కాలిపోయి బూడిదగా మారతాయి. అయితే వాటిలోని కొన్ని శకలాలు భూమికి చేరవచ్చు. అయితే వీటి వలన భూమికి ఎలాంటి హాని జరగదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం నుంచి దూసుకు వస్తున్న ఈ బ్యాటరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయనే దానిపై పలు అంచనాలు వేస్తోంది. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఏజెన్సీకి ఇంకా అందుబాటులో రాలేదు. వాతావరణం తీరుతెన్నుల కారణంగా ఈ బ్యాటరీలు భూమిపై పడే ప్రాంతాన్ని ఖచ్చితంగా చెప్పడం శాస్త్రవేత్తలకు అసాధ్యంగా మారింది. అంతరిక్షం నుంచి భూమిపైకి శకలాలు దూసుకు రావడం కొత్తేమీ కాదు. ప్రతిరోజూ ఉపగ్రహాల నుండి వ్యర్థాలు భూమిపై పడుతుంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది. అయితే భారీ బ్యాటరీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి దూసుకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలలోనూ ఆందోళన నెలకొనడం సహజం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది అంతరిక్ష శాస్త్రవేత్తల పరిశోధనా కేంద్రం. ఇది అమెరికా, రష్యాతో సహా అనేక దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్. శాస్త్రవేత్తల బృందం అంతరిక్ష సంబంధిత ప్రయోగాలను ఇక్కడ నిర్వహిస్తుంటుంది. అంతరిక్షంలో మరో అంతరిక్ష కేంద్రం కూడా ఉంది. దానిని చైనా నిర్మించింది. -
ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసుకున్న కాలనీవాసులు
-
నక్షత్రాలు పేలితే భూమికి ముప్పు!
భూగోళంపై కోట్లాది జీవులు ఉన్నాయి. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో జీవజాలం పుట్టుకొచ్చింది. ఇందుకు ఎన్నో సంఘటనలు దోహదం చేశాయి. భూమిపై జీవుల ఆవిర్భావం, మనుగడకు ఇక్కడి అనుకూల వాతావరణమే కారణం. ధరణిపై వాతావరణం విషతుల్యంగా మారితే జీవులకు ముప్పు తప్పదు. పూర్తిగా అంతరించిపోయినా ఆశ్చర్యం లేదు. అలాంటి ప్రమాదమే తలెత్తే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుదూరంలోని అంతరిక్షంలో ఉన్న సూపర్నోవాల పేలుడు నుంచి గ్రహాలకు కొత్త ముప్పు పొంచి ఉందని, ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం మన చేతుల్లో లేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏమిటీ ముప్పు? అంతరిక్షంలో అనంతమైన నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని సూపర్నోవాగా మారి పేలిపోతుంటాయి. బ్లాస్ట్ వేవ్ సంభవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదకరమైన ఎక్స్–కిరణాలు అధిక మోతాదులో వెలువడుతాయి. ఇవి సమీపంలోని గ్రహాలను చేరుతాయి. ఇందుకు నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు కూడా పట్టొచ్చు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి దాని పరిధిలోని భూగ్రహాన్ని రక్షించడానికి ఓజోన్ పొర ఆవరించి ఉంది. సూపర్నోవా పేలుడుతో ఉద్గారమయ్యే ఎక్స్–కిరణాలు భూమిని చుట్టూ ఉన్న ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తాయి. ఓజోన్ పొర చాలావరకు తుడిచిపెట్టుకుపోతోంది. దాంతో యూవీ రేడియేషన్ నేరుగా భూగ్రహం ఉపరితలాన్ని ఢీకొడుతుంది. ఫలితంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనే విషవాయువు భూమిపై ఉత్పత్తి అవుతుంది. అది విషపూరితమైన గోధుమ రంగు పొరను భూమి చుట్టూ ఏర్పరుస్తుంది. అప్పుడు వాతావరణం లుప్తమైపోతుంది. జీవులు అంతరించిపోతాయి. ఎలా గుర్తించారు? యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్తలు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతోపాటు ఇతర అత్యాధునిక టెలిస్కోప్‌లతో సూపర్‌నోవాలపై అధ్యయనం చేశారు. పేలిపోయే తారల నుంచి ఎక్స్–కిరణాలు వెలువడి, భూమి, ఇతర గ్రహాలను ప్రభావితం చేసే దశ రాబోతుందని, ఈ పరిణామం 100 కాంతి సంవత్సల దూరంలో చోటుచేసుకుంటుందని కనిపెట్టారు. పేలిపోయే నక్షత్రాల నుంచి వాటిల్లే ముప్పు గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగినట్లు గుర్తించారు. 160 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూపర్నోవాలు పేలిపోతే భూమిలాంటి గ్రహాలకు రేడియేషన్ ముప్పు ఉంటుందని తేల్చారు. 1979సీ, ఎస్ఎన్ 1987ఏ, ఎస్ఎన్ 2010జేఎల్, ఎస్ఎన్ 1994ఐ అనే సూపర్నోవాలను నిశితంగా పరిశీలించారు. అవి ఇప్పట్లో పేలే అవకాశం ఉందా? దానిపై ఓ అంచనాకొచ్చారు. ఇప్పటికిప్పుడు ప్రమాదం లేనట్లే భూమికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదని శాస్త్రవేత్త కానర్ ఓమహోనీ వెల్లడించారు. ఎక్స్–రే డేంజర్ జోన్లో బలమైన సూపర్నోవా ఏదీ లేదని తెలిపారు. భూమికి సమీపంలో గతంలో తారలు పేలిపోయిన దాఖలాలు ఉన్నాయని వెల్లడించారు. 20 లక్షల నుంచి 80 లక్షల సంవత్సరాల క్రితం భూమి నుంచి 65 నుంచి 500 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్నోవా ఒకటి పేలిపోయింది. దానికి సంబంధించిన రేడియేషన్ ఇప్పటికీ భూమి వైపునకు దూసుకొస్తోందని పరిశోధకులు గుర్తించారు. సూపర్నోవా నుంచి వెలువడే ఎక్స్–కిరణాలపై మరిన్ని పరిశోధనలు చేయడం నక్షత్రాల జీవితకాలం గురించి అర్థం చేసుకోవడానికే కాదు, ఆస్ట్రోబయాలజీ, పాలియోంటాలజీ, ప్లానెటరీ సైన్సెస్ తదితర రంగాల్లో చిక్కుముడులు విప్ప డానికి ఉపయోగపడ తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయి శాస్త్రవేత్త బ్రియాన్ ఫీల్డ్స్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాసా..! తొలిసారిగా సూర్యుడి వాతావరణంలోకి..!అదెలా సాధ్యమైందంటే..?
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ నాసా సంచలన విజయం సాధించింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ తొలిసారిగా సూర్యుడి వాతావరణాన్ని ముద్దాడింది. సోలార్ మిషన్‌లో భాగంగా తొలి ఘట్టాన్ని నాసా ద్విగ్విజయంగా పూర్తి చేసింది. నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఒక ప్రధాన మైలురాయి దాటిందని డిసెంబర్ 14న న్యూ ఓర్లీన్స్లో జరిగిన 2021 అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ఫాల్ మీటింగ్‌లో విలేకరుల సమావేశంలో తెలిపింది. పార్కర్ సోలార్ ప్రోబ్ అందించిన ఫలితాలను ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో నాసా ప్రచురించింది. చదవండి: రష్యా మిస్సైల్ పరీక్షలతో ప్రపంచానికి పెనుముప్పు తొలి అడుగు విజయవంతం..! సోలార్ ప్లేర్, మాగ్నెటిక్ ఫీల్డ్ చేంజెస్ లాంటి దృగ్విషయాలను, సూర్యుడి వాతావరణాలను శోధించడానికి నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ ను 2018లో ప్రయోగించింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఈ ప్రోబ్ సూర్యుని వెలుపలి వాతావరణం కరోనాలో ప్రవేశించింది. ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి నాసాకు పంపింది. సూర్యుని వాతావరణంలోని ధూళి కణాలను సేకరించడంలో పార్కర్ ప్రోబ్ ప్రధాన పాత్ర పోషించింది.ఈ మిషన్‌లో భాగంగా వాహక నౌక ఈ ఏడాది సూర్యుడికి అత్యంత దగ్గరగా సుమారు 8.13 మిలియన్ మైళ్ల దూరానికి నౌక చేరుకుంది. డిసెంబర్ 2021 నాటికి 4.89 మిలియన్ మైళ్ల సూర్యుడి వాతావరణంలోకి పార్కర్ సోలార్ ప్రోబ్ చేరగా...2025 నాటికి సూర్యుడి నుంచి 3.83 మిలియన్ మైళ్ల దూరంకు చేరి చివరి ఘట్టాన్ని పూర్తి చేయనుంది. భగభగ మండే వాతావరణంలోకి ఎలా చేరిందంటే..! సూర్యుడి వాతావరణాన్ని తట్టుకునేలా పార్కర్ సోలార్ ప్రోబ్ నౌకను నాసా తయారుచేసింది. ప్రోబ్‌లో హీట్ షీల్డ్ నాసా శాస్త్రవేత్తలు అమర్చారు. 4.5-అంగుళాల మందంతో ఉండే కార్బన్-మిశ్రిత ఉష్ణ కవచం 1,377 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోనే కెపాసిటీ పార్కర్‌కు ఉంది. సూర్యుడి నుంచి దాదాపు 3.83 మిలియన్ మైళ్ల దూరం వరకు వెళ్లే విధంగా పార్కర్ ప్రోబ్‌ను నాసా డిజైన్ చేసింది. పార్కర్ సోలార్ ప్రోబ్ గుర్తించిన విషయాలు..! సూర్యుడి వాతావరణానికి సంబంధించిన అనేక విషయాలను పార్కర్ సోలార్ ప్రోబ్ వెల్లడించింది. ఈ ప్రోబ్ ముఖ్యంగా సోలార్ స్విచ్బ్యాక్లను గమనించింది. అదేవిధంగా భూమిపై పవర్ గ్రిడ్స్, రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సోలార్ ఫ్లేర్స్ అధ్యయనం చేయడం కోసం శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడింది. చదవండి: కోట్లు మింగేసిన టెలిస్కోప్! విశ్వం పుట్టుక.. గుట్టు వీడేనా? -
అక్కడ జీవం ఉండేందుకు అవకాశం
లండన్: అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు ఉన్నాయా.. సూదూరాన ఇంకా ఎక్కడైనా జీవులు మనగల అవకాశం ఉందా అనే విషయం గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎడతెరపి లేని ప్రయోగాలు చేస్తుంటారు. అరుణ గ్రహం, చంద్రుడి మీద జీవం మనగడకు గల అవకాశాలను తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కొన్ని కథనాలు శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుపుతున్నాయి. శుక్రుడిపై ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్పైన్ అణువులు ఉన్నట్టు బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం వెల్లడించారు. సాధారణంగా ఆక్సిజన్ లేని ప్రాంతంలో నివసించే సూక్ష్మజీవులు ఫాస్పైన్‌ను విడుదల చేస్తాయి. శుక్రుడిపై ఫాస్పైన్ ఉందంటే.. సూక్ష్మజీవులు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. నిపుణుల బృందం చిలీలోని అటాకామా ఎడారిలోని టెలిస్కోప్‌లను ఉపయోగించి శుక్రగ్రహం ఉపరితం నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని క్లౌడ్ డెక్‌ను పరిశీలించారు. ఈ క్రమంలో వీరు ఫాస్ఫైన్ ఉనికిని గుర్తించారు. భూమి మీద ఇది సేంద్రీయ పదార్థాల విచ్ఛిన్నం నుంచి లభిస్తుంది. పాస్ఫైన్‌కు మండే స్వభావం ఉంటుంది. (చదవండి: వందేళ్లలో ఈ ‘అగ్ని వలయం’ లోతైనది!) అయితే మరొ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం పాస్ఫిన్ ఉన్నంత మాత్రాన జీవం ఉండగలని చెప్పలేమంటున్నారు. ఈ సందర్భంగా కార్డిఫ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీకి చెందిన లీడ్ రచయిత జేన్ గ్రీవ్స్ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ‘ఫాస్ఫైన్ ఉన్నంత మాత్రాన ఆ గ్రహం మీద జీవం ఉందని చెప్పలేం. ఒక గ్రహం మీద భాస్వరం సమృద్ధిగా ఉన్నప్పటికి.. జీవం మనుగడకు సంబంధించిన ముఖ్యమైనది అక్కడ లేకపోవచ్చు. ఇతర మూలకాలు ఉండటం వల్ల అక్కడ పరిస్థితులు చాలా వేడిగా.. పొడిగా ఉండవచ్చు’ అని తెలిపారు. అయితే భూమి కాకుండా వేరే రాతి గ్రహం మీద ఫాస్ఫైన్ కనుగొనడం ఇదే మొదటిసారి అన్నారు గ్రీవ్స్. శుక్ర గ్రహం మీదే ఇంత ఆసక్తి ఎందుకంటే.. ఇది మనకు సమీపంగా ఉండటమే కాక.. పరిమాణంలో భూమికి సమానంగా ఉంటుంది. అంతేకాక గత అధ్యయనాలు ఇక్కడ చురుకైన అగ్ని పర్వతాలు ఉన్నాయని లావా ప్రవాహాల సంకేతాలతో సహా గుర్తించాయి. -
సూర్యుడు కూడా ‘లాక్డౌన్’!
సాక్షి, న్యూఢిల్లీ : 930 లక్షల మైళ్ల దూరంలోని సూర్యుడి అంతర్భాగాన నిరంతరం సుడులు తిరిగే మంటలు, ఉపరితలానికి ఎగిసి పడుతుండే అగ్ని జ్వాలలు, సూర్య గోళం చుట్టూ ఆవిష్కృతమయ్యే అయస్కాంత క్షేత్రాలు హఠాత్తుగా తగ్గిపోయాయి. పర్యవసానంగా భూమిపైకి ప్రసరించే పలు రకాల కిరణాల వాడి కూడా తగ్గింది. ప్రాణాంతక కరోనా వైరస్‌కు భయపడి ప్రపంచ మానవాళి ‘లాక్డౌన్’లోకి వెళ్లినట్లుగా సూర్యుడు కూడా లాక్డౌన్లో విశ్రాంతి తీసుకుంటున్నాడేమోనని ‘రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ’ అధికారులు వ్యాఖ్యానించారు. (లాక్డౌన్: మరో రెండు వారాలు పొడిగించండి) 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన సూర్యగోళం కాస్త నెమ్మదించడం కొత్తేమి కాదని, దీన్ని ‘సోలార్ మినిమమ్’గా వ్యవహరిస్తారని రాయల్ సొసైటీ అధికారులు వివరించారు. సూర్యుడు తన నిర్దేశిత మార్గంలో సంచరిస్తున్నప్పుడు 11 ఏళ్లకోసారి నెమ్మదించడం కనిపిస్తుందని, అప్పుడు భూమి మీద ప్రసరించే కిరణాల వేడి కూడా తక్కువగా ఉంటుందని వారు చెప్పారు. ఈసారి కరోనా విజంభించడానికి, సూర్యుడిలో ఈ మార్పు రావడానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. (వైరస్‌లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి) సూర్యుడు 11 ఏళ్లకోసారి నెమ్మదించడాన్ని 17వ శతాబ్దం నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేస్తున్నారని వారు చెప్పారు. సూర్యుడిలో మంటలు తగ్గిన చోటు నల్లటి మచ్చగా కనిపిస్తుందని, అలా సూర్యుడిలో పలు మచ్చలు ఏర్పడడం, మళ్లీ అవి కనిపించక పోవడం కూడా సహజమేనని తెలిపారు. సూర్యుడు బాగా నెమ్మదించినప్పుడు భూగోళంపై భారీగా మంచు కురిసిందని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పారు. బాగా మంచు కురియడాన్ని ‘మంచు యుగం’గా పేర్కొన్నారు. అలా మూడు మంచు యుగాలు ఏర్పడినట్లు కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. మంచు యుగాల సమయంలోనే సముద్రాలు గడ్డ గట్టిపోయి ఖండాలు కలసి పోవడంతో ప్రజలు ఖండాంతర వలసలు పోయారని మానవ నాగరికత చరిత్ర తెలియజేస్తోంది. (‘తెల్లగా, సూట్‌కేస్ సైజ్‌లో ఉంది’) -
మన ‘గ్రహ’బలం ఎంత?
మీరీ విషయం విన్నారా.. మన భూమిలాగే ఉన్న మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారట. అక్కడ జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఉందంటున్నారు.. అవునూ.. ఇక్కడ భూమ్మీద కాబట్టి మనం హాయిగా జీవించగలుగుతున్నాం. అదే సౌర కుటుంబంలోని మిగతా గ్రహాలకుగానీ మనం వెళితే.. స్పేస్ సూట్ లేకుండా అక్కడ మనం బతకగలమా? బతికితే ఎన్నాళ్లూ లేదా ఎన్ని క్షణాలు? ఈ డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? మాకు వచ్చింది.. మరి సమాధానం కనుగొందామా? చలో మరి సౌర కుటుంబంలోని మన బంధువుల ఇంటికి.. సూర్యుడు.. సూర్యుడి దగ్గరికి వెళ్లగానే వెంటనే మాడిపోయి.. ఆవిరైపోతాం. కాబట్టి ఇక్కడ అస్సలు చాన్సే లేదు. బతికే సమయం: సెకను కన్నా తక్కువ బుధుడు సూర్యుడి వైపు ఉన్న ప్రాంతం చాలా వేడిగా ఉంటుంది. అక్కడ 427 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి వైపు కాకుండా ఉన్న ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మైనస్ 179 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలు కలిసే చోట నిలబడితే మనం ఊపిరి బిగబట్టే సమయం బతకొచ్చు. బతికే సమయం: రెండు నిమిషాలకు పైగా.. శుక్రుడు దీనిపై దాదాపు 482 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి భూమిపై మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఆవిరి అయ్యేంత సమయం బతుకుతాం. సమయం: సెకను కన్నా తక్కువ భూమి ఆక్సిజన్, నీరు, ఆహారం ఇవన్నీ మానవ జీవనానికి అనుకూలంగాదీన్ని మార్చేశాయి. సమయం: 80 సంవత్సరాలకు పైగా.. అంగారకుడు ఈ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. గాలి చాలా పలుచగా ఉండటంతో ఈ చల్లదనం మన భూమిపై మాదిరిగా బాధించదు. సమయం: రెండు నిమిషాలకు పైగా.. గురుడు పూర్తిగా వాయు గ్రహం కాబట్టి.. ఇక్కడ బతకడం చాలా కష్టం. నిలబడాలని ప్రయత్నిస్తే ఆ గాలి లోపలికి వెళ్లిపోతాం. అక్కడి పీడనానికి వెంటనే ఆ గాలిలోనే కలసి పోతాం. సమయం: సెకను కన్నా తక్కువ.. శని శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాల కారణంగా ఈ గ్రహంపై నడవలేం.. కనీసం నిల్చోలేం. సమయం: సెకను కన్నా తక్కువ. యురేనస్, నెప్ట్యూన్ గురుడు మాదిరిగానే ఈ రెండు గ్రహాలు కూడా వాయు గ్రహాలే. ఇక్కడ కూడా ఆ వాయువుల్లోకి వెళ్లిపోతాం. వాయువుల పీడనానికి గాల్లోనే కలసిపోతాం. బతికే సమయం: రెండు గ్రహాల్లో సెకను కన్నా తక్కువ.. -
వాతావరణంలో అధికంగా సీఓ2
పారిస్: మానవ తప్పిదాల కారణంగా భూ వాతావరణంలో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల స్థాయి ప్రమాదకర స్థాయిని దాటుతోంది. భూమిని వేడెక్కించే కార్బన్డయాక్సైడ్(సీఓ2) స్థాయిలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. హవాయ్‌లోని మౌనా లోవా అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు శనివారం ఉదయం వాతావరణంలో 415.26 పీపీఎం(పార్ట్స్ పర్ మిలియన్) సీఓ2 ఉన్నట్లు గుర్తించారు. 1950ల నుంచి వాతావరణంలోని సీఓ2 స్థాయిలను ప్రతి రోజూ రికార్డు చేస్తున్న ఈ అబ్జర్వేటరీ ఇంతటి గరిష్ట స్థాయిలను గుర్తించడం ఇదే ప్రథమం. ఈ స్థాయిలో భూ వాతావరణంలో సీఓ2 ఎప్పుడో 30 లక్షల ఏళ్ల క్రితం ఉన్నట్లు భావిస్తున్నామని వారు తెలిపారు. భూ ఉష్ణోగ్రత సరాసరిన ఏడాదికి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ చొప్పున పెరుగుతోందన్నారు. -
అల్పపీడనం ప్రభావంతో మారిన వాతావరణం
భీమవరం: బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలో అనేక ప్రాంతాల్లో మంగళవారం వర్షం జల్లులు పడడంతో రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగి మాసూళు ధరను పెంచి వసూలు చేస్తున్నారు. ప్రధానంగా డెల్టా ప్రాంతంలోని అనేక గ్రామాల్లో వరిపంట పొలాల్లోనే ఉండగా మాసూళ్లు పూర్తిచేసిన ప్రాంతాల్లో ధాన్యం అమ్మకాలు పూర్తికాక వర్షానికి ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5.60 లక్షల ఎకరాల్లో సార్వా వరిసాగు చేయగా మెట్టప్రాంతాల్లో దాదాపు మాసూళ్లు పూర్తయ్యాయి. డెల్టాలోని సుమారు 2 లక్షల ఎకరాల్లో సాగుచేయగా దాదాపు 75 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తి చేయాల్సి ఉందని అంచనా. సార్వా సీజన్ ప్రారంభం నుంచి సాగునీరు సక్రమంగా అందకపోవడం, నారుమడుల సమయంలో భారీ వర్షాల కారణంగా నారు దెబ్బతిని రెండు, మూడు పర్యాయాలు నారువేయాల్సి రావడం వంటి ఇబ్బందులతో రైతులు సతమతమయ్యారు. ఎన్నో వ్యయప్రయాసలతో పైరును పెంచి పోషించి పంట చేతికి వస్తున్న సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా రైతులకు అధిక పెట్టుబడి తప్పడం లేదని వాపోతున్నారు. నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనంతో పాటు కర్ణాటక పరిసరాల్లో ఉపరితల అవర్తనం కారణంగా మోస్తరు వర్షాలు పడ్డాయని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతోపాటు బుధవారం ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలపడంతో రైతుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. వాతావరణ శాఖ ప్రకటించినట్టుగానే మంగళవారం ఉదయమే వాతావరణం మేఘావృతమై చిరుజల్లులు కురవడంతో రైతులు తమ ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోడానికి హైరానా పడ్డారు. పంట పొలాల్లో పనలపైనే.. ప్రస్తుత సార్వా సీజన్లో ఎక్కువమంది పంట మాసూళ్లుకు వరి కోత యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే కొంతమంది రైతులు పశుగ్రాసం కోసం వరిగడ్డిని నిల్వ చేసుకోడానికి కూలీలతో కోతకోయించి పనలపై ఆరబెట్టిన తరువాత కుప్పనూర్పిళ్లు చేయిస్తున్నారు. ఆ విధంగా డెల్టా ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల్లో పంట పనలపైనే ఉంది. చిరుజల్లులకు పంట తడిసిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు కూలీలను ఉపయోగించి నూర్పిళ్లు చేయించడానికి పరుగులు పెడుతున్నారు. కనీనం వరి పనలను గట్టుచేర్చి కుప్పగా వేసి వాతావరణం అనుకూలించిన తరువాత నూర్పిడి చేయించవచ్చుననే సంకల్పంతో కుప్పలు, నెట్టుకట్టడం వంటి పనుల్లో మునిగిపోయారు. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్ ప్రస్తుత సార్వా సీజన్లో ఎక్కువశాతం మంది రైతులు వరికోత యంత్రాలతో మాసూళ్లు చేయిస్తుండడంతో ఇతర జిల్లాల నుంచి యంత్రాలను తీసుకువచ్చి ఎకరాకు రూ.1,800 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. యంత్రాలు కూడా ఇబ్బడిముబ్బడిగా ఉండడంతో రైతులకు అనుకూలమైన ధరల్లోనే మాసూళ్లు పూర్తవుతున్నాయి. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా రైతులంతా ఒకేసారి కోతలు పూర్తిచేయించడానికి కంగారు పడడంతో యంత్రాల యజమానులు ధరలను పెంచినట్టు చెబుతున్నారు. మంగళవారం ఎకరాకు రూ.2,000 వసూళు చేస్తున్నారని బుధవారం «ఇంకా పెరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. కళ్లాల్లోనే ధాన్యం సార్వా మాసూళ్లు వరికోత యంత్రాలతో సాగుతుండడంతో «ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం తగ్గడానికి నాలుగైదు రోజుల పాటు ఎండబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాసూళ్లు పూర్తి చేసిన రైతులు సైతం ధాన్యం ఎండబెట్టడానికి కళ్లాల్లోనే ఉంచడడంతో తడిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రంతో మాసూళ్లు చేసిన ధాన్యం వెంటనే ఎండబెట్టకపోతే రంగుమారి ముక్కపాయ వచ్చే ప్రమాదముందని రంగుమారిన ధాన్యం ధర తక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. -
విసిరేసిన రాళ్లు
చేపలు పట్టే ఒక వ్యక్తి తెల్లవారుజామునే ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. దారిలో అతని కాలికి ఏదో సంచీలాంటిది తగిలితే దాన్ని తీసుకుని తడిమి చూస్తే అందులో ఏవో కొన్ని రాళ్లలాంటివి తగిలాయి. వెలుగు వచ్చాక చేపలు పట్టుకోవచ్చనుకుని వలను పక్కనపెట్టి నది ఒడ్డునే కూర్చుని బద్ధకంగా ఆ సంచీలోంచి ఒక రాయిని తీసి నదిలోకి విసిరాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నదిలోకి విసిరిన రాయి నీట మునిగే శబ్దం అతనికి తమాషాగా అనిపించింది. వెలుగు వచ్చేదాకా ఏ పనీలేదు కాబట్టి అలా రాళ్లు విసురుతూ కాలక్షేపం చేస్తూనే ఉన్నాడతను. మెల్లిగా సూర్యోదయమైంది. కాంతికిరణాలు పరుచుకున్నాయి. అప్పటికే ఆ సంచీలోని రాళ్లన్నిటినీ అతను విసిరేసి ఉన్నాడు. ఇక విసిరేందుకు చేతిలో చిట్టచివరి రాయి ఒక్కటే మిగిలి ఉంది. వెలుతురులో దాన్ని గమనించిన అతని గుండె ఆగినంతపనైంది. అది ఒక వజ్రం. అనుకోకుండా అతనికి అంతులేని సంపద లభించినా, చీకటిలో తెలియక దాన్ని చేజార్చుకున్నాడు. ఒక విధంగా అతను అదృష్టవంతుడు. వెలుగు రావడం కొంచెం ఆలస్యమైతే అతను ఆ రాయిని కూడా నీటిలోకి విసిరేవాడే. చాలామంది ఆపాటి అదృష్టానికి కూడా నోచుకోరు. జీవితంలో లభించిన వజ్రాలను గులకరాళ్లుగా భావించి, వాటిని విసిరిపారేస్తారు. కొద్దిమంది మాత్రం కనీసం ఆఖరునిమిషంలో అయినా మేలుకొంటారు. నిజానికి జీవితమే విలువైన వజ్రం లాంటిది. చివరి వరకూ దాన్ని వ్యర్థంగా గడిపి, చరమాంకంలో దాని విలువ తెలుసుకుని, మంచి పనులు చేయడం మొదలు పెడతారు చాలామంది. -
‘చెట్టు’పక్కల వెతికినా..
అది న్యూజిలాండ్ దేశంలోని క్యాంప్‌బెల్ అనే ద్వీపం.. ఆ ద్వీపంలో ఒక చెట్టుంది. ఒక చెట్టుందనే ఎందుకు అంటున్నామంటే అక్కడ ఒక్కటే చెట్టుంది కాబట్టి. అదేంటి ఒక్కటే చెట్టుండటం ఏంటి అని ఆశ్చర్చపోతున్నారా..? అవును ఆ చెట్టుకు చుట్టుపక్కల దాదాపు 200 కిలోమీటర్ల మేర మరో చెట్టు ఉండదట! ఈ ద్వీపం ప్రపంచంలోనే కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. చాలా వేగమైన గాలులు వీయడమే కాకుండా ఏడాది పొడవునా కేవలం 600 గంటల కన్నా తక్కువ సేపు సూర్యరశ్మి ఉంటుందట. అంతేకాదు వర్షం లేకుండా 40 రోజులు మాత్రమే ఉంటుందట. దీంతో ఇక్కడ జనజీవనం దాదాపు అసాధ్యం. కాకపోతే చాలా చిన్న చిన్న పొదలు, గడ్డి మాత్రమే పెరుగుతుందట. అయితే ఇక్కడ పెరిగిన చెట్టు పేరు సిట్కా స్ప్రూస్. దీన్ని 1901–1907 మధ్య కాలంలో న్యూజిలాండ్ మాజీ గవర్నర్ లార్డ్ రాన్ఫర్లీ నాటినట్లు భావిస్తుంటారు. అక్కడ పెద్ద అడవిని సృష్టించాలనే ఉద్దేశంతో దీన్ని నాటినా ఫలితం లేకుండాపోయింది. ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుని ఈ ఒక్క చెట్టు మాత్రమే బతికి బట్టకట్టగలిగింది. అంతేకాదు వంద ఏళ్లుగా అది వర్ధిల్లుతోంది. దీంతో ప్రపంచంలోనే ఒంటరి మొక్కగా మిగిలిపోయింది. -
అంగారకుడిని సౌర తుఫానులు తాకలేవు
లండన్ : అంగారకుడుపై నాసా ప్రయోగాలు మొదలు పెట్టిన క్షణం నుంచి ఆ గ్రహం గురించిన ఆసక్తిర విశేషాలు వరుసగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అంతరిక్షాన్ని, గ్రహాలను వణికించే సౌరతుపానులు అంగారకుడిని తాకలేవని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. అత్యంత శక్తివంతమైన సౌర తుఫానులనుంచి అంగారకుడిని అక్కడి వాతావరణం కాపాడుతోందని పరిశోధన తెలిపింది. సూర్యుడి నుంచి వచ్చే సౌర తుపానుల నుంచి అక్కడి వాతావరణం రక్షణంగా ఉందని.. అందువల్లో అరుణగ్రహం మనుడగ సాగిస్తోందని పరిశోధన తేల్చింది. ప్రధానంగా అరుణ గ్రహం కూడా రెండు ధృవాలను కలిగి ఉందని.. ఇది భూమిని పోలి ఉంటాయని పరిశోధన తేల్చింది. భూమిమీద వాతావరణ పీఢనం కన్నా.. కొంచెం తక్కువగా అంగారకుడిపై వాతావరణ పీడన ప్రభావం ఉంటుందట. అందువల్లే అక్కడ అతి చల్లగా, పొడిగా వాతావరణం ఉంటుందట. అరుణగ్రహం మీద భౌతిక పరిస్థితులు, వాతావరణం బట్టి.. అక్కడ నాలుగు బిలియన్ల సంవత్సరాల కింద జలం సమృద్ధిగా ఉండేదని నివేదిక తెలిపింది. ఇప్పటికీ అంగారకుడిపై నీటి సంబంధిత అనవాళ్లు ఉన్నాయని.. స్వీడన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ చెబుతోంది. అయితే భీకరమైన ఉష్ణ గాలులు, గ్రీన్ హౌజ్ వాతావరణ ప్రభావం ఇతర కారణాల వల్ల అంగారకుడిపై నీరు ఆవిరగా మారిపోయిందని తెలుస్తోంది. ఈ విషయంలో భూమికి అంగారకుడికి పోలిక లేదని కూడా నివేదిక చెబుతోంది. స్వీడిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్ సైంటిస్ట్ రాబిన్ రామ్స్టాడ్ మాట్లాడుతూ.. అంగారకుడిపై అయస్కాంతవాతావరణం తక్కువగా ఉంటుందని చెప్పారు. -
ప్రమాద ఘంటికలు
''భయమేస్తుందని హారర్ సినిమాలు చూడ్డం మానేస్తామా'' అని ఈ మధ్య వచ్చిన ఓ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ వీడియో చూస్తే ఆ డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం. భూగోళంపైని అన్ని భాగాలు రంగు రంగుల్లో కనిపిస్తున్నాయి.. బాగానే ఉంది కదా అనుకుంటున్నారా? చూసేందుకు బాగానే ఉంటుంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తీసిన ఈ త్రీడీ వీడియో.. అందులో విషయం తెలిస్తే మాత్రం కొంచెం డీలా పడటం ఖాయం. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను మండించడం, అడవులను విచ్చల విడిగా నరికేయడం వంటి అనేకానేక చర్యల వల్ల భూమి వేడెక్కుతోందని, దానివల్ల అనేక ప్రమాదాలు ముంచుకొస్తాయని మీరూ వినే ఉంటారు. ఈ విపత్తుకు కారణమైన విషవాయువు అదేనండి.. కార్బన్‌డైయాక్సైడ్ భూ వాతావరణంలో ఎలా విస్తరిస్తుందో చూపుతుంది ఈ వీడియో. ధ్రువ ప్రాంతాల్లోని నీలాల రంగు వాతావరణంలో తక్కువ మోతాదులో కార్బన్ డై యాక్సైడ్ ఉన్న విషయాన్ని సూచిస్తూంటే.. జనావాసాలు ఉన్న చోట కనిపించే పసుపు, నారింజ, ఎరుపు రంగులు ఈ వాయువు మనకు ముప్పు తెచ్చే స్థాయిలో ఉన్న విషయాన్ని చెబుతోంది. ఆర్బిటింగ్ కార్బన్ అబ్జర్వేటరీ -2 శాటిలైట్ ద్వారా 2014 నుంచి సేకరించిన సమాచారాన్ని ఉపయోగించి సిద్ధమైంది ఈ వీడియో. ఇటీవలే విడుదలైన ఈ వీడియో ఇప్పటికే నెట్లో వైరల్ స్థాయికి చేరుకుంది. మహా సముద్రాలు, చెట్టూ చేమ వీలైనంత పీల్చేసుకున్న తరువాత కూడా వాతావరణంలో ఈ స్థాయిలో కార్బన్ డైయాక్సైడ్ వాయువులు ఉండటం శాస్త్రవేత్తల్లోనే కాదు... మనకూ ప్రమాద ఘంటికలే! -
ప్రమాద ఘంటికలు
-
144 సెక్షన్
తెరుచుకోని దుకాణాలు మూతబడిన విద్యాసంస్థలు నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా నాగిరెడ్డిపేట మండల విలీనంపై ఏర్పడిన చిచ్చుతో పోలీసులు మంగళవారం 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం నుంచే పోలీసులు రోడ్లపై వచ్చి గుంపులుగా ఉండకూడదని ప్రజలకు సూచించారు. మెదక్ జిల్లాకు మద్దతుగా ఏర్పాటు చేసిన రీలే నిరాహార దీక్షలకు సంబంధించిన టెంట్‌ను తీసేయించారు. అలాగే, ప్రజా ఐక్య వేదిక కార్యాలయం వద్ద ఉన్న వారందరినీ అక్కడి నుండి పంపించారు. మండల కేంద్రంలో ఎలాంటి బంద్‌లు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. జిల్లాకేంద్రం నుండి వచ్చిన క్యూఆర్టీ (క్విక్ రియాక్షన్ టీం) పోలీసులతో ఎస్సై సీతారాములు మండల కేంద్రంలో పలుమార్లు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్ పకడ్బందీగా అమలయ్యేలా ఎల్లారెడ్డి, లింగంపేట మండలాలకు చెందిన ఎస్సైలు పూర్ణేశ్వర్, రాజశేఖర్ వారి బలగాలతో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా కూడా నలుగురు నిలబడవద్దని పోలీసులు ఇచ్చిన సూచనలతో వ్యాపారులు సైతం వారి దుకాణాలను మూసివేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించి బందోబస్తు చేపట్టాయి. దీంతో మండల కేంద్రంలో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడ్డారు. -
అంతం
పట్టుకోండి చూద్దాం ఆగస్ట్ నెల. వర్షం వచ్చినట్లు ఉంది. రానట్టూ ఉంది. ఎండ కొట్టినట్లు ఉంది. కొట్టనట్టూ ఉంది. ఆరోజు వాతావరణం కాస్త చిత్రంగా ఉంది. ఈ చిత్రానికి ఆరోజు నగరంలో మరో సంచలనం తోడైంది. చౌరస్తాలో పట్టపగలు నారాయణ హత్యకు గురయ్యాడు. రోడ్డుకు ఒకవైపుకు ఉన్న వేపచెట్టు దగ్గర నారాయణ కిళ్లీ కొట్టు ఉంటుంది. ఈ కిళ్లీ కొట్టు నారాయణ... చుట్టుపక్కల వారికి ఏ సమస్య వచ్చినా తీరుస్తాడనే మంచి పేరుంది. అయితే అతని మీద ఆరోపణలు కూడా లేకపోలేదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు అంటారు కొందరు. కిళ్లీ కొట్టు అనేది అతని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రం అంటారు కొందరు. కిళ్లీ కొట్టు దగ్గర ఉన్న స్థలాన్ని కాజేయడానికి... కిళ్లీ కొట్టు పేరుతో నాటకం ఆడుతున్నాడని, అసలు అతడికి ఉన్న ఆస్తికి కిళ్లీ కొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదనేది కూడా కొందరి వాదన. జనాలు మొదట నారాయణ మంచి చెడుల గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత మాత్రం... ‘హత్య ఎవరు చేసి ఉంటారు?’ ‘ఎలా జరిగింది?’ ‘ఎవరి ప్రమేయం ఉంది?’ అనే కోణంలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు గాలి వార్తలు గాలి కంటే వేగంగా దూసుకెళుతున్నాయి. నిజానిజాలేమిటో ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన జరిగి వారం గడిచినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. కేసు ఇన్స్పెక్టర్ నరసింహకు అప్పచెప్పారు. కిళ్లీ కొట్టు దగ్గరికి వెళ్లి చుట్టూ ఒకసారి పరిశీలనగా చూశాడు. ‘స్థలాన్ని కబ్జా చేయడానికే కిళ్లీ కొట్టును మొదలు పెట్టాడు’ అనే ఆరోపణలో నిజం ఉన్నట్లు అనిపించింది. చుట్టుపక్కల వాళ్లను రకరకాల ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు నరసింహ. ‘‘ఈ కిళ్లీ కొట్టును నారాయణ ఒక్కడే చూస్తుంటాడా?’’ ‘‘లేదు... అతని దగ్గర రాజు, శ్రీను అని ఇద్దరు సహాయకులు ఉంటారు. ఆ రోజు రాజు కనిపించలేదు. శ్రీను మాత్రం కనిపించాడు’’ ‘‘శ్రీను క్యారెక్టర్ ఏమిటి?’’ ‘‘నారాయణకు నమ్మిన బంటులాంటి వాడు. ఒక విధంగా చెప్పాలంటే... నారాయణకు అనధికార బాడీగార్డ్లాంటి వాడు’’ ‘‘శ్రీనుని అర్జంటుగా పిలిపించండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. శ్రీను ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. ‘‘ఆరోజు ఏం జరిగింది?’’ శ్రీనుని అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘మధ్యాహ్న సమయంలో అన్నకు రోజూ మందు తాగడం అలవాటు. ఆ రోజు కూడా ఒక క్వార్టర్ తెమ్మని పంపించాడు. అదిగో ఆ ఎదురుగా కనిపిస్తున్న దుర్గా వైన్స్‌కు వెళ్లి మందు తీసుకువచ్చాను. ఈలోపే అన్నను ఎవరో క్రూరంగా హత్య చేశారు’’ అంటూ ఏడ్వడం ప్రారంభించాడు శ్రీను. కేసు గురించి ఇన్స్పెక్టర్ నరసింహ పోలీస్‌స్టేషన్‌లో తన సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ‘‘నారాయణకు చాలా మంది శత్రువులు ఉన్నారు సార్. ఎవర్ని అనుమానిస్తాం?’’ అన్నారు ఒకరు. ‘‘ఆ రోజు శ్రీనుగాడు నారాయణ పక్కన ఉండి ఉంటే హత్య జరిగి ఉండేది కాదు’’ అన్నారు ఇంకొకరు. ఆ సమయంలోనే టేబుల్‌పై ఉన్న పాత పేపర్ క్లిప్‌పై పడింది ఇన్స్పెక్టర్ దృష్టి. అది నారాయణ హత్య గురించిన వార్త. పేపర్ క్లిప్ చూసీ చూడగానే.... ‘‘ఈ హత్యలో శ్రీను భాగస్వామ్యం ఉంది. వెంటనే వాడిని అరెస్ట్ చేసి తీసుకురండి’’ అని సిబ్బందిని ఆదేశించాడు ఇన్స్పెక్టర్. పోలీసులు శ్రీను చేత నిజాలు కక్కించారు. హత్యలో తన ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకున్నాడు శ్రీను. ఇప్పుడు చెప్పండి... శ్రీను అనేవాడు నారాయణకు నమ్మిన బంటు, అనధికార బాడీగార్డ్. ఎవరు కూడా అతడిని అనుమానించే పరిస్థితి లేదు. మరి పేపర్ క్లిప్ చూసిన వెంటనే... శ్రీనుని ఇన్స్పెక్టర్ ఎందుకు అనుమానించినట్లు? ఇన్స్పెక్టర్ నరసింహ పేపర్ కటింగ్ చూస్తున్నప్పుడు దాని మీద ఉన్న డేట్ అతనికి కొట్టొచ్చినట్లు కనిపించింది. ‘ఆగస్ట్ 15’ ఆ రోజు బార్లన్నీ మూసి ఉంటాయి. కాబట్టి శ్రీను అబద్దం ఆడిన విషయం తెలిసిపోయింది. ‘ఇప్పుడే వస్తాను’ అని నారాయణతో చెప్పి చుట్టు పక్కల ఎక్కడో ఉన్నాడు. హత్య జరిగిన తరువాత అక్కడికి చేరుకొని లబోదిబోమన్నాడు. -
ఖరీదైన పరిహారం!
అభివృద్ధి పేరిట దేన్నీ లెక్కచేయకుండా తీసే పరుగులు అపురూపమైన మన భూగోళానికి ముప్పు తెస్తున్నాయని పర్యావరణవాదులు ఎంతకాలంనుంచో ఆందోళనపడుతున్నారు. అయినా లాభార్జన తప్ప మరేమీ పట్టని సంపన్న దేశాలూ, బహుళజాతి సంస్థలూ తమ దోవన తాము పోతున్నాయి. ప్రమాదాలు ముంచుకొచ్చినా, పర్యావరణం విధ్వంసమవుతున్నా బడుగు దేశాలు నిస్సహాయ స్థితిలో పడుతున్నాయి. కానీ, అలాంటి ప్రమాదమే సంపన్న దేశం ముంగిట జరిగితే ఏమవుతుందో తాజాగా బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) సంస్థ అమెరికా ప్రభుత్వం తోనూ, ఆ దేశానికి చెందిన అయిదు రాష్ట్రాలతోనూ కుదుర్చుకున్న ఒప్పందం వెల్లడిస్తున్నది. బీపీ సంస్థ బ్రిటన్‌కు చెందిన ఓ పెద్ద బహుళజాతి సంస్థ. ముడి చమురు వెలికితీత దాని ప్రధాన వ్యాపకం. మెక్సికో జలసంధిలో బీపీ ఆధ్వర్యంలోని చమురు క్షేత్రంలో 2010లో భారీ పేలుడు సంభవించి 11 మంది మరణించారు. లక్షలాది టన్నుల చమురు సముద్ర జలాల్లో కలిసింది. దాదాపు రెండునెలలపాటు సముద్ర గర్భంనుంచి భారీయెత్తున ముడి చమురు ఎగజిమ్మింది. చమురు తెట్టుపై నుంచి వీచే గాలులవల్ల వేలాది మంది అస్వస్థులయ్యారు. మెక్సికో జలసంధి పొడవునా ఉన్న అలబామా, ఫ్లారిడా, లూసియానా, మిసిసిపి, టెక్సాస్ రాష్ట్రాలు దెబ్బ తిన్నాయి. సాగరజలాల్లోని చేపలు, తిమింగలాలు, తాబేళ్లు, పక్షులు, వన్యమృగాలు మృత్యువాత పడ్డాయి. ఈ రాష్ట్రాలన్నీ ప్రధానంగా మత్స్యసంపద, టూరిజంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ రెండింటిపైనా జీవనం సాగించే వేలాది కుటుంబాలు ఇబ్బందులకు లోనయ్యాయి. తినే తిండిలో సైతం దీని దుష్ఫలితాలు ప్రవేశించాయి. బీపీ సంస్థ తన బాధ్యతనుంచి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. చమురు తెట్టువల్ల జీవనోపాధి కోల్పోయామని, అస్వస్థులమయ్యామని ఫిర్యాదు చేస్తే... ఈ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని తమను దోచుకోవడానికి వచ్చారన్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు వ్యవహరించారు. నష్టాన్ని తగ్గించి చూపడానికీ, వీలైతే తప్పించుకోవడానికీ ప్రయత్నించారు. పర్యావరణవాదులు, స్థానికుల ఒత్తిడి తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒబామా చివరకు బీపీ సంస్థపై న్యాయపరంగా గట్టి పోరాటమే జరపాలని నిర్ణయానికొచ్చాక పరిస్థితి కొంత మారింది. న్యాయస్థానంలో హోరాహోరీ పోరాటమే సాగింది. చివరకు కోర్టు వెలుపల ఒప్పందానికి సంస్థ ముందుకొచ్చింది. సముద్రంలో ఒలికిన చమురులో దాదాపు 75 శాతం పూర్తిగా మాయమైంది కదా... ఇక దానివల్ల కలిగే ముప్పేమిటని ఆ సంస్థకు వత్తాసుగా కొందరు ప్రశ్నించారు. కానీ, అదంతా వివిధ రూపాల్లో మనిషి శరీరంలోకి వచ్చి చేరిందని పర్యావరణవేత్తలు దీటుగా జవాబిచ్చారు. తినే తిండీ, పీల్చే గాలీ అన్నీ కలుషితమైన తీరును వివరించారు. ఖర్చును సాధ్యమైనంత తగ్గించుకుని, అధిక లాభాలు సంపాదించడానికి సంస్థలు చేసే ప్రయత్నాల వల్ల... ఆ క్రమంలో అవసరమైన టెక్నాలజీని వినియోగించకపోవడంవల్ల ఎప్పుడో ఒకప్పుడు ప్రమా దాలు చోటుచేసుకుంటాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం చూసినా గత నాలుగు దశాబ్దాల్లో పర్యావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటు న్నాయి. ఈ మార్పులవల్ల జలచరాలు, ఉభయచరాలు, క్షీరదాలు, సరీసృపాలు మూడోవంతుకు పడిపోయాయని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. ఇదిలాగే కొనసాగితే మనిషి మనుగడకు సైతం ముప్పువాటిల్లుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి దానికదే విధ్వంసకారి కాదు. లాభార్జన యావ దానికి తోడైనప్పుడే అది వికృతరూపం దాల్చుతుంది. ప్రస్తుతం కుదిరిన ఒప్పందాన్ని న్యాయస్థానం లాంఛనంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఒప్పందం కింద అమెరికా ప్రభుత్వానికీ, అయిదు రాష్ట్ర ప్రభుత్వాలకూ, 400పైగా స్థానిక సంస్థలకూ బీపీ సంస్థ 1870 కోట్ల డాలర్లు(సుమారుగా రూ. 1,20,000 కోట్లు) చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని 18 సంవత్సరాలపాటు చెల్లించేలా అంగీకారానికి కుదరడం బీపీ సంస్థకు వచ్చిన వెసులుబాటు. అంటే ఏడాదికి వంద కోట్ల డాలర్లు అది చెల్లించవలసి ఉంటుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ సంస్థ గడించిన లాభాలు 260 కోట్ల డాలర్లని (సుమారు రూ.16,640 కోట్లు) గుర్తుపెట్టుకుంటే ఏడాదికి వంద కోట్ల డాలర్లు చెల్లించ డం దానికి పెద్ద లెక్క కాదు. వాస్తవానికి ఒలికిన ప్రతి బ్యారెల్ చమురుకూ 4,300 డాలర్లు (సుమారుగా రూ.2,75,000) చెల్లించాలని వాదనల సందర్భంగా అమెరికా ప్రభుత్వం కోరింది. అమెరికా చరిత్రలో ఇంత భారీయెత్తున పరిహారం చెల్లించడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారంటే అది ప్రపంచంలోనూ మొదటి సారే అయి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. వేరే దేశాల్లో బహుళజాతి సంస్థలు ఏనాడూ ఇంత భారీ స్థాయిలో పరిహారాన్ని చెల్లించిన దాఖలాలు లేవు. మన భోపాల్ విషవాయు దుర్ఘటననే తీసుకుంటే బాధితులకు ఈనాటికీ పరిహారం రాలేదు. 1984లో డిసెంబర్ 2-3 తేదీలమధ్య అర్థరాత్రి మిథైల్ ఐసోసైనేట్ విషవాయువు టన్నులకొద్దీ లీకై వెనువెంటనే దాదాపు 3,000 మంది మరణించారు. అనంతర కాలంలో ఆస్పత్రుల్లో 25,000 మంది మరణించారు. అర్ధరాత్రివేళ జరిగిందేమిటో అర్థంకాక వేలాదిమంది హాహాకారాలు చేస్తూ వీధుల్లో పరుగులు తీశారు. తల్లులు కావలసిన ఎందరో గర్భస్రావాలతో ఆస్పత్రులపాలయ్యారు. లక్షల మంది వికలాంగులయ్యారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో జన్యుపరమైన లోపాలతో శిశువులు జన్మిస్తున్నారు. ఈ దుర్ఘటనలో తమ బాధ్యతేమీ లేదని అమెరికాలోని మాతృ సంస్థ వాదించింది. ఆ సంస్థకు అప్పట్లో చైర్మన్‌గా ఉన్న వారెన్ ఆండర్సన్‌ను అరెస్టు చేసినట్టే చేసి కొన్ని గంటల్లోనే విమానం ఎక్కించి దేశం నుంచి పంపేశారు. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయాడు. అతన్ని అరెస్టుచేసి అప్పగించాలని అమెరికా ప్రభుత్వానికి మన దేశం పంపిన అభ్యర్థనలు బుట్టదాఖలయ్యాయి. సీబీఐ చేతులెత్తేసింది. చివరకు నిరుడు నవంబర్‌లో అతను అజ్ఞాతంలోనే మరణించాడు. మూడు దశాబ్దాలు గడుస్తున్నా బాధితులకు దక్కిన పరిహారం శూన్యం. భోపాల్ విషవాయు దుర్ఘటననూ, మెక్సికో జలసంధి చమురుతెట్టు ప్రమాదాన్ని పోల్చిచూస్తే వర్థమాన దేశాల దైన్యం కళ్లకు కడుతుంది. బహుళజాతి సంస్థల దృష్టిలో ఇక్కడి పౌరుల ప్రాణాలు ఎంత విలువలేనివో అర్థమవుతుంది. బీపీ సంస్థ ఇప్పుడు అమెరికాకు చెల్లించే పరిహారాన్ని గమనించాకైనా మన పాలకుల్లో కదలిక రావాలి. భోపాల్ బాధితులకు న్యాయం జరగడానికి ఏం చేయదల్చుకున్నారో చెప్పాలి. -
దూసుకువస్తున్న రష్యా స్పేస్ క్రాప్ట్
-
అదిగదిగో ప్రమాద ఘంటికలు!
జీవప్రపంచం వాతావరణంలో జరిగే మార్పులు ఆల్పైన్ జాతి మేకల బరువుపై ప్రభావం చూపుతున్నట్లు తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. ఆల్పైన్ మేకలు 1980తో పోలిస్తే 25 శాతం మేర బరువు తగ్గినట్లు ఉత్తర ఇంగ్లాండ్‌లోని డర్హమ్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఆల్పైన్ మేకలు రొమేనియా పర్వత ప్రాంతాలు, పోలండ్‌లోని టార్టా పర్వత ప్రాంతాలు, టర్కీలోని కొన్ని ప్రాంతాలు, న్యూజిలాండ్‌లోని దక్షిణ దీవిలో ఎక్కువగా కనిపిస్తాయి. ‘‘శరీర పరిణామం, బరువు తగ్గిపోవడం అనేది ఆల్పైన్ మేకలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాకపోవచ్చు. జంతు ప్రపంచంలో చాలా జాతులపై వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్నాయి అనడానికి ఇది తిరుగులేని సాక్ష్యం’’ అంటున్నారు పరిశోధనకు నేతృత్వం వహించిన డా. టామ్ మాన్సన్. బరువు, పరిమాణం తగ్గడం అనేది వాటి శక్తిసామర్థ్యాలపై కూడా ప్రభావం చూపుతుంది. మునపటిలా చలికాలాన్ని తట్టుకునే సామర్థ్యం వాటిలో ఉండడం లేదు. గతంతో పోల్చితే ఆహారాన్వేషణలో చూపే ఉత్సాహం మేకలలో తగ్గిపోయింది. ఆహార అన్వేషణ కంటే విశ్రాంతికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు పరిశోధన బృందంలో ఒకరైన డా.స్టీఫెన్ విల్స్. ప్రమాదం నుంచి తప్పించుకోవడంలో ఆల్పైన్ మేకలకు గొప్ప పేరు ఉంది. ఎంత ప్రమాదం చుట్టుముట్టినా...అప్పటికప్పుడు వచ్చిన మెరుపు ఆలోచనతో అవి ప్రమాదం నుంచి బయటపడతాయి. రకరకాల ఈలలు, కూతలతో తోటి మేకలకు కూడా ప్రమాద హెచ్చరికను చేరవేస్తాయి. అసాధారణ నైపుణ్యాలతో ప్రమాదాల నుంచి బయటపడే ఆల్పైన్ మేకలకు తాజా ప్రమాదం గురించి తెలియకపోవచ్చు. తెలిసినా చేయగలిగేది ఏమీ లేక పోవచ్చు. పాపం!