లండన్ : అంగారకుడుపై నాసా ప్రయోగాలు మొదలు పెట్టిన క్షణం నుంచి ఆ గ్రహం గురించిన ఆసక్తిర విశేషాలు వరుసగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అంతరిక్షాన్ని, గ్రహాలను వణికించే సౌరతుపానులు అంగారకుడిని తాకలేవని తాజా పరిశోధన ఒకటి స్పష్టం చేసింది. అత్యంత శక్తివంతమైన సౌర తుఫానులనుంచి అంగారకుడిని అక్కడి వాతావరణం కాపాడుతోందని పరిశోధన తెలిపింది.
సూర్యుడి నుంచి వచ్చే సౌర తుపానుల నుంచి అక్కడి వాతావరణం రక్షణంగా ఉందని.. అందువల్లో అరుణగ్రహం మనుడగ సాగిస్తోందని పరిశోధన తేల్చింది. ప్రధానంగా అరుణ గ్రహం కూడా రెండు ధృవాలను కలిగి ఉందని.. ఇది భూమిని పోలి ఉంటాయని పరిశోధన తేల్చింది. భూమిమీద వాతావరణ పీఢనం కన్నా.. కొంచెం తక్కువగా అంగారకుడిపై వాతావరణ పీడన ప్రభావం ఉంటుందట. అందువల్లే అక్కడ అతి చల్లగా, పొడిగా వాతావరణం ఉంటుందట.
అరుణగ్రహం మీద భౌతిక పరిస్థితులు, వాతావరణం బట్టి.. అక్కడ నాలుగు బిలియన్ల సంవత్సరాల కింద జలం సమృద్ధిగా ఉండేదని నివేదిక తెలిపింది. ఇప్పటికీ అంగారకుడిపై నీటి సంబంధిత అనవాళ్లు ఉన్నాయని.. స్వీడన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ చెబుతోంది. అయితే భీకరమైన ఉష్ణ గాలులు, గ్రీన్ హౌజ్ వాతావరణ ప్రభావం ఇతర కారణాల వల్ల అంగారకుడిపై నీరు ఆవిరగా మారిపోయిందని తెలుస్తోంది. ఈ విషయంలో భూమికి అంగారకుడికి పోలిక లేదని కూడా నివేదిక చెబుతోంది. స్వీడిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఫిజిక్స్ సైంటిస్ట్ రాబిన్ రామ్‌స్టాడ్ మాట్లాడుతూ.. అంగారకుడిపై అయస్కాంతవాతావరణం తక్కువగా ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment