అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్‌ చల్‌ | Northern Lights After Strongest Solar Storm In 2 Decades, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్‌ చల్‌

Published Sat, May 11 2024 2:10 PM | Last Updated on Sat, May 11 2024 3:42 PM

Northern Lights After Strongest Solar Storm In 2 Decades video goes viral


ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా కనిపించే  అరోరా అద్భుతంగా ఆవిష్కృతమైంది.  ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో గులాబీ,  పర్పుల్‌  రంగుల్లో  అద్భుతమైన ఖగోళ కాంతి ప్రదర్శన, అరోరా బొరియాలిస్ ఆకాశంలో ప్రకాశించింది. దీంతో నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్స్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

 రెండు దశాబ్దాల తరువాత  అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత శుక్రవారం నాడు  నార్తర్న్ లైట్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కనిపించాయి. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుంది. సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి.

 

 చాలామంది యూజర్లు అరోరాను వీక్షించిన తరువాత తన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.  అమెరికా,  కెనడా, ఆస్ట్రేలియాలోని  కొన్ని ప్రాంతాలతోపాటు,   ఇటలీ, ఫ్రాన్స్‌. రష్యా అంతటా, ప్రత్యేకించి మాస్కో ప్రాంతంలో ఇవి దర్శనమిచ్చాయి. అలాగే సరాటోవ్ , వొరోనెజ్‌లో,  దక్షిణ సైబీరియాలో  కూడా  కనిపించాయి. ఉత్తర జార్జియాకు చెందిన యూజర్‌ కూడా  అరోరా బొరియాలిస్  అద్భుత చిత్రాలను పంచుకున్నారు. ఈ అందమైన దృశ్యాన్ని చూసిన వారు "చాలా చాలా అదృష్టవంతులు" అని ఒకరు, నాకు కన్నీళ్లు ఆగడం లేదంటూ  మరొకరు భావోద్వేగానికి లోను కావడం విశేషం.

 

నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, అలాస్కా వంటి భూమి, అయస్కాంత ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నార్తర్న్ లైట్లు సాధారణంగా కనిపిస్తాయి. మరోవైపు భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులతో వచ్చే పరిణామాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , పవర్ గ్రిడ్‌లకు  సూచించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement