aurora borealis
-
ఆరోరాల కనువిందు
వాషింగ్టన్: భూ ఉపరితల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అద్భుతమైన చిత్రాలను కెమెరాల్లో బంధించింది. కనువిందు చేసే ఆకుపచ్చ, ఊదా రంగుల కాంతి పుంజాల (ఆరోరా) ఫొటోలు, వీడియోలను భూమికి పంపింది. ఆరోరాల పైనుంచి అంతరిక్ష కేంద్రం పయనిస్తున్న సమయంలో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఉత్తర ధ్రువజ్యోతి అని, కాంతి ప్రవాహం అని పిలిచే అరోరాలు భూమి నుంచి అరుదుగా కనిపిస్తుంటాయి. గాలి రేణువులు, విద్యుత్ శక్తి కలిగిన సూర్యకాంతి రేణువులు భూ అయస్కాంత క్షేత్రంలో ఢీకొన్నప్పుడు అరోరాలు ఏర్పడుతుంటాయి. ఇవి సాధారణంగా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో కనిపిస్తాయి. -
Aurora borealis: వినువీధిలో రంగుల వలయాలు
చుట్టూరా తెల్లగా పరుచుకున్న హిమాలయాలు. పైన లేత ఎరుపు రంగు కాంతులు. ఈ వింత వెలుగులు లద్దాఖ్‌లోని హాన్లే వినువీక్షణ కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆకాశ వీధిలో ఇలా కనువిందు చేశాయి. చూపరులను కన్ను తిప్పుకోనివ్వకుండా కట్టిపడేశాయి. భూ అయస్కాంత క్షేత్రం గుండా ప్రసరించే కాంతి సౌర తుఫాన్ల కారణంగా చెదిరిపోవడం వల్ల ఆకాశంలో ఇలాంటి అందమైన కాంతులు ఏర్పడుతుంటాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ల్లోని ఎత్తైన ప్రాంతాల నుంచి అత్యంత స్పష్టతతో కని్పంచే ఈ అద్భుత కాంతి వలయాలకు అరోరా అని పేరు. ఇవి ఏర్పడే దిక్కును బట్టి అరోరా బొరియాలిస్ (ఉత్తర కాంతులు), అరోరా ఆస్ట్రలిస్ (దక్షిణ కాంతులు) అని పిలుస్తారు. ఇవి చాలా రంగుల్లో అలరిస్తాయి. అయితే లద్దాఖ్‌లో కనువిందు చేసినవి అత్యంత అరుదైన ఎరుపు రంగు కాంతులు. అత్యంత మనోహరంగా ఉండటమే గాక ఎక్కువసేపు స్థిరంగా కని్పంచడం ఈ ఎరుపు కాంతుల ప్రత్యేకత. లద్దాఖ్‌తో పాటు అమెరికా, రష్యా, ఆ్రస్టేలియా, యూరప్‌లో జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, పోలండ్ తదితర దేశాల్లో అరోరాలు కనువిందు చేశాయి.ఐదు తీవ్ర సౌర తుపాన్లు సూర్యుని ఉపరితలంపై ఏఆర్13664గా పిలిచే చోట గత బుధవారం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన ఐదు తుపాన్లు సంభవించాయి. తద్వారా అపార పరిమాణంలో విడుదలైన శక్తి కణాలు ఈ వారాంతం పొడవునా సౌరవ్యవస్థ గుండా ప్రయాణించనున్నాయి. ఆ క్రమంలో భూ అయస్కాంత క్షేత్రంతో ప్రతిచర్య జరిపే క్రమంలో అవి చెదిరిపోతూ ఆకాశంలో ఈ అందాల కాంతి వలయాలను సృష్టించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యంత తీవ్రతతో కూడిన సౌర తుపాన్లు ఇవేనని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని అసాధారణ పరిణామంగా అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్ అభివరి్ణంచింది. 2003లో ఇలాంటి సౌర తుపాన్ల కారణంగా స్వీడన్లో పలు ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి, సరఫరాలకు అంతరాయం కలిగింది. దక్షిణాఫ్రికాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. – వాషింగ్టన్ -
Northern Lights Photos: అరోరా వెలుగులు, నెట్టింట వైరల్ ( ఫోటోలు)
-
అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్ చల్
ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా కనిపించే అరోరా అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో గులాబీ, పర్పుల్ రంగుల్లో అద్భుతమైన ఖగోళ కాంతి ప్రదర్శన, అరోరా బొరియాలిస్ ఆకాశంలో ప్రకాశించింది. దీంతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.Strongest Aurora in last 20 years was visible last evening. This was how it looked on top of Jungfraujoch, Switzerland Video via webcams on https://t.co/BwS7eM6IEY#solarstorm pic.twitter.com/rqG5S2poKb— Backpacking Daku (@outofofficedaku) May 11, 2024 రెండు దశాబ్దాల తరువాత అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత శుక్రవారం నాడు నార్తర్న్ లైట్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కనిపించాయి. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుంది. సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి. Guys I’m actually in tears I thought I’d never get to see the northern lights 😍😭 pic.twitter.com/kk8unLfhwE— Jimin’s Toof (B-ChimChim) Semi-IA (@ForeverPurple07) May 11, 2024 చాలామంది యూజర్లు అరోరాను వీక్షించిన తరువాత తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలతోపాటు, ఇటలీ, ఫ్రాన్స్. రష్యా అంతటా, ప్రత్యేకించి మాస్కో ప్రాంతంలో ఇవి దర్శనమిచ్చాయి. అలాగే సరాటోవ్ , వొరోనెజ్లో, దక్షిణ సైబీరియాలో కూడా కనిపించాయి. ఉత్తర జార్జియాకు చెందిన యూజర్ కూడా అరోరా బొరియాలిస్ అద్భుత చిత్రాలను పంచుకున్నారు. ఈ అందమైన దృశ్యాన్ని చూసిన వారు "చాలా చాలా అదృష్టవంతులు" అని ఒకరు, నాకు కన్నీళ్లు ఆగడం లేదంటూ మరొకరు భావోద్వేగానికి లోను కావడం విశేషం. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, అలాస్కా వంటి భూమి, అయస్కాంత ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నార్తర్న్ లైట్లు సాధారణంగా కనిపిస్తాయి. మరోవైపు భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులతో వచ్చే పరిణామాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , పవర్ గ్రిడ్లకు సూచించారు. -
నార్వేలో సర్ఫింగ్.. అద్భుతం