అబ్బురపరిచిన అరోరా వెలుగులు
ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసిన వైనం
చుట్టూరా తెల్లగా పరుచుకున్న హిమాలయాలు. పైన లేత ఎరుపు రంగు కాంతులు. ఈ వింత వెలుగులు లద్దాఖ్‌లోని హాన్లే వినువీక్షణ కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆకాశ వీధిలో ఇలా కనువిందు చేశాయి. చూపరులను కన్ను తిప్పుకోనివ్వకుండా కట్టిపడేశాయి. భూ అయస్కాంత క్షేత్రం గుండా ప్రసరించే కాంతి సౌర తుఫాన్ల కారణంగా చెదిరిపోవడం వల్ల ఆకాశంలో ఇలాంటి అందమైన కాంతులు ఏర్పడుతుంటాయి.
ఆర్కిటిక్, అంటార్కిటిక్‌ల్లోని ఎత్తైన ప్రాంతాల నుంచి అత్యంత స్పష్టతతో కని్పంచే ఈ అద్భుత కాంతి వలయాలకు అరోరా అని పేరు. ఇవి ఏర్పడే దిక్కును బట్టి అరోరా బొరియాలిస్ (ఉత్తర కాంతులు), అరోరా ఆస్ట్రలిస్ (దక్షిణ కాంతులు) అని పిలుస్తారు. ఇవి చాలా రంగుల్లో అలరిస్తాయి. అయితే లద్దాఖ్‌లో కనువిందు చేసినవి అత్యంత అరుదైన ఎరుపు రంగు కాంతులు. అత్యంత మనోహరంగా ఉండటమే గాక ఎక్కువసేపు స్థిరంగా కని్పంచడం ఈ ఎరుపు
కాంతుల ప్రత్యేకత. లద్దాఖ్‌తో పాటు అమెరికా, రష్యా, ఆ్రస్టేలియా, యూరప్‌లో జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, పోలండ్ తదితర దేశాల్లో అరోరాలు కనువిందు చేశాయి.
ఐదు తీవ్ర సౌర తుపాన్లు
సూర్యుని ఉపరితలంపై ఏఆర్13664గా పిలిచే చోట గత బుధవారం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన ఐదు తుపాన్లు సంభవించాయి. తద్వారా అపార పరిమాణంలో విడుదలైన శక్తి కణాలు ఈ వారాంతం పొడవునా సౌరవ్యవస్థ గుండా ప్రయాణించనున్నాయి. ఆ క్రమంలో భూ అయస్కాంత క్షేత్రంతో ప్రతిచర్య జరిపే క్రమంలో అవి చెదిరిపోతూ ఆకాశంలో ఈ అందాల కాంతి వలయాలను సృష్టించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యంత తీవ్రతతో కూడిన సౌర తుపాన్లు ఇవేనని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని అసాధారణ పరిణామంగా అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్ అభివరి్ణంచింది. 2003లో ఇలాంటి సౌర తుపాన్ల కారణంగా స్వీడన్లో పలు ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి, సరఫరాలకు అంతరాయం కలిగింది. దక్షిణాఫ్రికాలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోయాయి.
– వాషింగ్టన్
Comments
Please login to add a commentAdd a comment