Antarctic
-
Aurora borealis: వినువీధిలో రంగుల వలయాలు
చుట్టూరా తెల్లగా పరుచుకున్న హిమాలయాలు. పైన లేత ఎరుపు రంగు కాంతులు. ఈ వింత వెలుగులు లద్దాఖ్‌లోని హాన్లే వినువీక్షణ కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆకాశ వీధిలో ఇలా కనువిందు చేశాయి. చూపరులను కన్ను తిప్పుకోనివ్వకుండా కట్టిపడేశాయి. భూ అయస్కాంత క్షేత్రం గుండా ప్రసరించే కాంతి సౌర తుఫాన్ల కారణంగా చెదిరిపోవడం వల్ల ఆకాశంలో ఇలాంటి అందమైన కాంతులు ఏర్పడుతుంటాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ల్లోని ఎత్తైన ప్రాంతాల నుంచి అత్యంత స్పష్టతతో కని్పంచే ఈ అద్భుత కాంతి వలయాలకు అరోరా అని పేరు. ఇవి ఏర్పడే దిక్కును బట్టి అరోరా బొరియాలిస్ (ఉత్తర కాంతులు), అరోరా ఆస్ట్రలిస్ (దక్షిణ కాంతులు) అని పిలుస్తారు. ఇవి చాలా రంగుల్లో అలరిస్తాయి. అయితే లద్దాఖ్‌లో కనువిందు చేసినవి అత్యంత అరుదైన ఎరుపు రంగు కాంతులు. అత్యంత మనోహరంగా ఉండటమే గాక ఎక్కువసేపు స్థిరంగా కని్పంచడం ఈ ఎరుపు కాంతుల ప్రత్యేకత. లద్దాఖ్‌తో పాటు అమెరికా, రష్యా, ఆ్రస్టేలియా, యూరప్‌లో జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, పోలండ్ తదితర దేశాల్లో అరోరాలు కనువిందు చేశాయి.ఐదు తీవ్ర సౌర తుపాన్లు సూర్యుని ఉపరితలంపై ఏఆర్13664గా పిలిచే చోట గత బుధవారం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన ఐదు తుపాన్లు సంభవించాయి. తద్వారా అపార పరిమాణంలో విడుదలైన శక్తి కణాలు ఈ వారాంతం పొడవునా సౌరవ్యవస్థ గుండా ప్రయాణించనున్నాయి. ఆ క్రమంలో భూ అయస్కాంత క్షేత్రంతో ప్రతిచర్య జరిపే క్రమంలో అవి చెదిరిపోతూ ఆకాశంలో ఈ అందాల కాంతి వలయాలను సృష్టించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యంత తీవ్రతతో కూడిన సౌర తుపాన్లు ఇవేనని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని అసాధారణ పరిణామంగా అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్ అభివరి్ణంచింది. 2003లో ఇలాంటి సౌర తుపాన్ల కారణంగా స్వీడన్లో పలు ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి, సరఫరాలకు అంతరాయం కలిగింది. దక్షిణాఫ్రికాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. – వాషింగ్టన్ -
India Environment Report – 2024: హిమగిరులకు పెనుముప్పు!
భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే కచి్చతంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక–2024 తేలి్చచెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీనదాలు(గ్లేసియర్స్) వేగంగా కరిగిపోతున్నాయి. ఎగువ హిమాలయాల్లో ఇప్పటికే మంచు చాలావరకు మాయమైంది. 2013 నుంచి 2022 వరకు ఇండియాలో 44 శాతం ప్రకృతి విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగడమే కారణమని ఇండియా పర్యావరణ నివేదిక–2024 వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో వరదలు, పెను తుఫాన్లు, కొండ చరియలు విరిగిపడడం వంటి విపత్తులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మనమంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు కరిగిపోతుండడంతో విలువైన వృక్ష సంపద అంతరించిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర వృక్షాలు కనుమరుగు అవుతున్నట్లు వెల్లడయ్యింది. నిత్యం మంచుతో గడ్డకట్టుకొని ఉండే ప్రాంతాలు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా పశి్చమ భాగంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2020 వరకు 8,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగింది. అదంతా మైదాన ప్రాంతంగా మారిపోయింది. హిమాలయాల్లో 40 శాతం మంచు ఇప్పటికే కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75 శాతం మంచు కనిపించకుండా పోతుందని ఇండియా పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ఈ మహావిపత్తును నివారించాలంటే వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇజబెల్లా కొజీల్ సూచించారు. అత్యవసర, నిర్ణయాత్మక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హిమాలయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థపై కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. మన ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలని, హిమాలయాలను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు. ప్రమాదంలో డూమ్స్ డే గ్లేసియర్ అంటార్కిటికా ఖండం పశి్చమ భాగంలోని డూమ్స్ డే హిమానీనదం(థ్వాయిట్స్ గ్లేసియర్) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది. గత 80 ఏళ్లలో ఏకంగా 50 బిలియన్ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా వచి్చచేరే మంచు కంటే కరిగిపోతున్నదే ఎక్కువ. మరికొన్నేళ్లలో పూర్తిగా అంతమైనా అశ్చర్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలే ఈ హిమానీనదంపై అధ్యయనం చేశారు. నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఎల్–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడంతో డూమ్స్‌డే గ్లేసియర్ కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం 80 సంత్సరాల క్రితం.. 1940వ దశకంలోనే మొదలైందని, 1970వ దశకంలో వేగం పుంజుకుందని తేల్చారు. అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో హమానీనదం కరిగిపోయే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు. పశి్చమ అంటార్కిటికాలో మంచు ఫలకాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. డూమ్స్ డే గ్లేసియర్ కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇది పూర్తిగా కరిగిపోతే పశి్చమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. జల విధ్వంసం తప్పదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం.. వైరల్ వీడియో
-
హిమ ఫలకం కింద నగరమంత సరస్సు
ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్ షీట్ అని రికార్డు ఉండగానే మరో రికార్డును తూర్పు అంటార్కిటికా హిమ ఫలకం సొంతం చేసుకుంది. దీని కింద ఓ నగరమంత వైశాల్యంలో ఓ పెద్ద సరస్సు ఉందని తేలింది. హిమ ఫలకం మీద దాదాపు మూడేళ్లు ఏరియల్ సర్వే చేసిన చైనా శాస్త్రవేత్తలు.. దీనికి దాదాపు 3.2 కిలోమీటర్ల కింద సరస్సు ఉన్నట్టు గుర్తించారు. ఈ సరస్సుకు ‘స్నో ఈగల్’అని పేరు పెట్టారు. దీని వైశాల్యం 370 చదరపు కిలోమీటర్లు, పొడవు 48 కిలోమీటర్లు, వెడల్పు 14.5 కిలోమీటర్లు, లోతు 198 మీటర్లు. ఈ సరస్సులో 3.4 కోట్ల ఏళ్ల నాటి నది అవక్షేపాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే గనక తెలిస్తే అంటార్కిటికా మంచుమయం కాకముందు ఎలా ఉండేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు వీలుకానుంది. చదవండి👉చేపా చేపా.. వాకింగ్‌కు వస్తావా? -
1765కు ముందు గాలి నాణ్యత ఎలా ఉండేదో తెలుసా?
పరిశ్రమలతో ప్రస్తుతం వాతావరణం ఎంతగా కలుషితం అవుతోందో మనకు తెలుసు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం రాక ముందు గాలి నాణ్యత ఎలా ఉండేది? అప్పటి పరిస్థితులను తెలుసుకోవడం ఎలా? ఈ ఆలోచనతో కళాకారుడు, రాయల్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ పీహెచ్డీ అభ్యర్థి వేన్ బినిటీ గాజుతో కూడిన ఓ శిల్పాన్ని రూపొందించారు. దానిలో 1765కు ముందు గాలిని నింపి త్వరలో స్లాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగబోయే కాప్–26 సదస్సులో భాగంగా నిర్వహించే ‘పోలార్ జీరో ఎగ్జిబిషన్’లో ప్రదర్శనకు ఉంచనున్నారు. అంటార్కిటికా ఐస్ నుంచి.. శిల్పంలో నింపిన గాలిని అంటార్కిటికా మంచు పొరల నుంచి సేకరించారు. గాలిని సేకరించడానికి బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే (బీఏఎస్) సైంటిస్టులతో కలసి బినిటీ ఐదేళ్ల పాటు ఆ మంచు ఖండంలో డ్రిల్లింగ్ చేశారు. 170 మీటర్ల లోతు వరకూ తవ్వకాలు జరిపి మంచును సేకరించారు. దానిని విశ్లేషించి డబ్బాల్లో నింపి పెట్టారు. పర్యావరణ మార్పులను మంచు పొరల్లో గుర్తిస్తూ 1765కు నాటి పరిస్థితులను అంచనా వేశారు. ఆ పొరల్లోని చిన్ని చిన్ని బుడగల నుంచి గాలిని సేకరించారు. ‘‘నా కళ హిమ ఖండాల భూత, వర్తమాన, భవిష్యత్ పరిస్థితులను తెలుపుతుంది. చదవండి: అమెరికా అణు జలాంతర్గామికి ప్రమాదం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా ధ్రువ ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తుంది’’ అని బినిటీ అభిప్రాయపడ్డారు. లిక్విడ్ సిలికాన్‌తో నింపిన గాజు సిలిండర్‌లో 1765 నాటి గాలిని నింపి ఆ కళాఖండాన్ని రూపొందించారు. లిక్విడ్ సిలికాన్ మనకు కనిపిస్తుంది. దానిపైన అత్యంత జాగ్రత్తగా సేకరించిన ఆనాటి గాలి నిండి ఉంటుంది. సాంకేతికంగా సవాలుగా నిలిచే ఈ శిల్పాన్ని ఆధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలతో బీఏఎస్ ల్యాబ్‌లో రూపొందిస్తున్నారు. దీన్ని మొత్తాన్ని వీడియో తీసి ఆన్లైన్లో ఉంచనున్నారు. చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ బాంబు పేలుడు.. 100 మందికి పైగా మృతి 1765 కీలకమైన సంవత్సరం బీఏఎస్ శాస్త్రవేత్త ముల్వానే మాట్లాడుతూ.. ‘‘మంచు నీటి మాలిక్యూల్స్‌లోని ఐసోటోపిక్ కంపోజిషన్ ద్వారా ఆ మార్పులను గుర్తించవచ్చు. 10 వేల సంవత్సరాల క్రితం నుంచి సుమారు 1765 వరకూ గాలిలో బొగ్గుపులుసు వాయువు స్థాయి దాదాపు ఒకేలా ఉంది. ఆ ఏడాది వరకూ 280 పీపీఎమ్ ఉండేది. ఆ దశకంలో జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం రూపొందించాక పారిశ్రామిక విప్లవం మొదలైంది. అప్పటి నుంచే కార్బన్ డైయాక్సైడ్ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది మే నెలలో వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు స్థాయి 419 పీపీఎంకు చేరింది. ఇప్పుడు ఈ శిల్పం ప్రజల ఊహకు ఓ ప్రేరణగా నిలుస్తుంది. వాతావరణంలో మార్పులను మంచు పొరలను పరిశీలించడం ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు. -
ఓజోన్ గాయం మానుతోంది
కోల్‌కతా: ఓజోన్‌పొర గాయం మానుతోంది. ఓవైపు వాతావరణ మార్పులతో కలుగుతున్న దుష్ప్రవాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. తాజా పరిశోధనలో సంతోషం కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. దక్షిణ ధ్రువంలో ఓజోన్‌కు పడిన రంధ్రం నెమ్మదిగా పూడుతున్నట్లు శుక్రవారం భారత పరిశోధకులు ప్రకటించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన సెంటర్ ఆఫ్ ఓషియన్, రివర్స్, అట్మాస్పియర్ అండ్ లా సైన్స్ (కొరల్) పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. తొలుత వారు 1979 నుంచి 2017 మధ్య దక్షిణ ధ్రువంలోని ఓజోన్‌కు సంబంధించిన డేటాను తీసుకుని అధ్యయనం చేశారు. ఓజోన్ రంధ్రం 2001 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా రిడెక్షన్ ఆఫ్ ఓజోన్ లాస్ సాచురేషన్ 20 నుంచి 60కి చేరినట్లు వివరించారు. ‘4 దశాబ్దాలుగా ఓజోన్‌లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశాం. ఇందుకు అంటార్కిటికాలోని భారత్‌కు చెందిన మైత్రి స్టేషన్‌తో పాటు, వివిధ దేశాలకు చెందిన స్టేషన్ల నుంచి డేటా సేకరించి విశ్లేషించగా..1998, 2002ల్లో మినహాయించి, ప్రతి ఏడాది శీతలకాలంలో ఓజోన్‌కు అధికంగా తూట్లు పడుతున్నట్లు తేలింది. కాగా, 2001–17 మధ్య ఓజోన్ రంధ్రం కొంతమేరకు పూడుతూ వస్తున్నట్లు స్పష్టంగా తెలిసింది’అని శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయనారాయణ కుట్టిప్పురత్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు ఓజోన్‌కు రంధ్రాన్ని చేసే ఉత్పత్తులను నిషేధించే మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ప్రభావం చూపుతాయా? అని పరిశోధకుడు ప్రొఫెసర్ పీసీ పాండేను ప్రశ్నించగా.. ఓజోన్ మునుపటిలా సహజస్థితికి రావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. కాబట్టి ఓజోన్ ఒప్పందాలు రద్దు చేయడం క్షేమం కాదని హెచ్చరించారు. -
అరుదైన జీవిని కనుగొన్న శాస్త్రవేత్తలు
-
వైరల్ : అంటార్కిటికాలో అరుదైన జీవి
కాన్బెర్రా : దక్షిణాది మహాసముద్ర జలాల్లో మొట్టమొదటిసారిగా సముద్రపు అరుదైన జీవి ఎనీప్నియాస్టీస్ ఎగ్జీమియాను కనుగొన్నామని ఆస్ట్రేలియా అంటార్కిటిక్ డివిజన్ తెలిపింది. అండర్‌వాటర్ కెమెరా టెక్నాలజీ ద్వారా తూర్పు అంటార్కిటికాలో ఈ అరుదైన జీవి ఉనికిని కనుగొన్నామని పేర్కొంది. హెడ్‌లెస్ చికెన్ మాన్స్టర్, స్పానిష్ డాన్సర్, హెడ్‌లెస్ చికెన్ ఫిష్‌గా పిలుచుకునే ఈ జీవిని మొదట మెక్సికో సింధుశాఖలో కనుగొన్నారు. కాగా హెడ్‌లెస్ చికెన్ మాన్‌స్టర్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. సముద్రపు అంతరాల్లో నిక్షిప్తమైన ఇటువంటి అరుదైన సంపదను చూసే వీలు కల్పించినందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలకు నెటిజన్లు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ‘మనకు తెలియని విషయమేదీ లేదంటూ మనలో కొంతమంది అనుకుంటారు. కానీ ప్రకృతి చాలా విచిత్రమైందని ఇటువంటి సంఘటనల ద్వారా నిరూపితమవుతుంది కదా’ అంటూ ప్రకృతి ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు. -
అంటార్కిటిక్: వృద్ధి చెందుతున్న కొత్త జాతులు
సాక్షి, న్యూయార్క్ : పర్యావరణ ప్రేమికులకు, అంటార్కిటికా వాతావరణాన్ని ఇష్టపడేవారికి ఇదొక శుభవార్త. అంటార్కిటికాలోని రాస్‌ఐలాండ్ పర్వత ప్రాంతాల్లో కొత్త రకం జీవజాతులు వృద్ధి చెందుతున్నాయని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) పరిశోధకులు ప్రకటించారు. కొంతకాలంగా పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల మంచు కరిగిపోవడంతో పాటు జీవజాలం తగ్గుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎన్‌యూ పరిశోధకులు చెప్పిన ఈ మాట పర్యావరన వేత్తలకు ఆనందాన్ని కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటార్కిటికాలోని మంచుకొండల దిగువన ఉండే గుహల్లో మనకు తెలియని మొక్కలు, జీవులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోస్లాండ్ గుహల్లోని మట్టిని సేకరించిన శాస్త్రవేత్తలు.. దానిపై పరిశోధన చేశారు. గుహలో కనీసం 25 డిగ్రీల వేడి ఉంటుందని చెబుతున్న సైంటిస్టులు అందులోనే నాచు, ఆల్గే, మనకు తెలియని జీవులు మనుగడ సాగిస్తుండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయాల్సి ఉందని ఎన్యూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అంటార్కిటిక్: వృద్ధి చెందుతున్న కొత్త జాతులు
-
2050 నాటికి కరగడం రెండింతలు!
వాషింగ్టన్: అంటార్కిటిక్‌లో 2050 సంవత్సరం నాటికి మంచు కరగడం రెండింతలయ్యే అవకాశం ఉందట. గ్రీన్హౌస్ వాయువుల విడుదల ప్రస్తుత నిష్పత్తిలోనే కొనసాగితే అంటార్కిటిక్‌లో మంచుపలకలు కుప్పకూలుతాయట. ఈ విషయాలు అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యాయి. అయితే మంచు కరగడం వల్ల, పలకలు విడిపోవడం వల్ల నేరుగా సముద్రాల నీటిమట్టం పెరగదని, విడిపోయిన పలకలు సముద్రంలోకి చేరిన తర్వాత కరగడం మొదలవుతుందని, ఆ తర్వాతే సముద్ర నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు. వాతావరణ కాలుష్యం వల్ల అంటార్కిటిక్‌లో మంచు ఎంత వేగంగా కరుగుతుందనే అంశంపై తాము అధ్యయనం చేశామని అమెరికాలోని వుడ్స్ హోల్ ఓషనోగ్రఫీ ఇనిస్టిట్యూషన్ పోస్ట్ డాక్టరేట్ స్కాలర్ లూక్ ట్రసెల్ తెలిపారు. -
త్వరలో బయటపడనున్న అంటార్కిటికా చిక్కుముడులు