Arctic
-
Arctic Open 2024: సింధు పునరాగమనం
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం మరిచి తదుపరి టోరీ్నలో టైటిల్స్ లక్ష్యంగా భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ తమ రాకెట్లకు పదును పెడుతున్నారు. ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పారిస్ మెగా ఈవెంట్ తర్వాత వీళ్లిద్దరు బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ ఇదే కాగా... మహిళల సింగిల్స్‌లో సింధుకు ఆరో సీడింగ్ కేటాయించగా, పురుషుల ఈవెంట్లో లక్ష్య సేన్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు కెనడాకు చెంది మిచెల్లి లీతో తలపడుతుంది. ఇందులో శుభారంభం చేస్తే తదుపరి రౌండ్లో భారత టాప్ స్టార్‌కు 2022 జూనియర్ ప్రపంచ చాంపియన్, జపాన్ టీనేజ్ సంచలనం తొమకొ మియజాకి ఎదురవనుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్... డెన్మార్క్‌కు చెందిన రస్ముస్ గెమ్కేతో తలపడతాడు. గతేడాది ఇండియా ఓపెన్‌లో రస్మస్తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లక్ష్య సేన్‌కు ఆరంభరౌండ్లోనే లభించింది. ఈ అడ్డంకిని అధిగమిస్తే భారత ఆటగాడు చైనీస్ తైపీకి చెందిన ఏడో సీడ్ చౌ తియెన్ చెన్‌తో పోటీపడే అవకాశముంటుంది. -
Aurora borealis: వినువీధిలో రంగుల వలయాలు
చుట్టూరా తెల్లగా పరుచుకున్న హిమాలయాలు. పైన లేత ఎరుపు రంగు కాంతులు. ఈ వింత వెలుగులు లద్దాఖ్‌లోని హాన్లే వినువీక్షణ కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆకాశ వీధిలో ఇలా కనువిందు చేశాయి. చూపరులను కన్ను తిప్పుకోనివ్వకుండా కట్టిపడేశాయి. భూ అయస్కాంత క్షేత్రం గుండా ప్రసరించే కాంతి సౌర తుఫాన్ల కారణంగా చెదిరిపోవడం వల్ల ఆకాశంలో ఇలాంటి అందమైన కాంతులు ఏర్పడుతుంటాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ల్లోని ఎత్తైన ప్రాంతాల నుంచి అత్యంత స్పష్టతతో కని్పంచే ఈ అద్భుత కాంతి వలయాలకు అరోరా అని పేరు. ఇవి ఏర్పడే దిక్కును బట్టి అరోరా బొరియాలిస్ (ఉత్తర కాంతులు), అరోరా ఆస్ట్రలిస్ (దక్షిణ కాంతులు) అని పిలుస్తారు. ఇవి చాలా రంగుల్లో అలరిస్తాయి. అయితే లద్దాఖ్‌లో కనువిందు చేసినవి అత్యంత అరుదైన ఎరుపు రంగు కాంతులు. అత్యంత మనోహరంగా ఉండటమే గాక ఎక్కువసేపు స్థిరంగా కని్పంచడం ఈ ఎరుపు కాంతుల ప్రత్యేకత. లద్దాఖ్‌తో పాటు అమెరికా, రష్యా, ఆ్రస్టేలియా, యూరప్‌లో జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, పోలండ్ తదితర దేశాల్లో అరోరాలు కనువిందు చేశాయి.ఐదు తీవ్ర సౌర తుపాన్లు సూర్యుని ఉపరితలంపై ఏఆర్13664గా పిలిచే చోట గత బుధవారం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన ఐదు తుపాన్లు సంభవించాయి. తద్వారా అపార పరిమాణంలో విడుదలైన శక్తి కణాలు ఈ వారాంతం పొడవునా సౌరవ్యవస్థ గుండా ప్రయాణించనున్నాయి. ఆ క్రమంలో భూ అయస్కాంత క్షేత్రంతో ప్రతిచర్య జరిపే క్రమంలో అవి చెదిరిపోతూ ఆకాశంలో ఈ అందాల కాంతి వలయాలను సృష్టించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యంత తీవ్రతతో కూడిన సౌర తుపాన్లు ఇవేనని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని అసాధారణ పరిణామంగా అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్ అభివరి్ణంచింది. 2003లో ఇలాంటి సౌర తుపాన్ల కారణంగా స్వీడన్లో పలు ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి, సరఫరాలకు అంతరాయం కలిగింది. దక్షిణాఫ్రికాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. – వాషింగ్టన్ -
వేల ఏళ్ల పురాతనమైన వినాశకర వైరస్ల విజృంభణ!
వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్‌లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్‌లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్‌రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు. నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్‌మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్‌లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్లు సోకాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్‌మెన్స్ విశ్లేíÙంచారు. -
ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద
దొడ్డ శ్రీనివాసరెడ్డి ఆర్కిటిక్ ఖండంలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల నైసర్గిక స్వరూపాన్నే మార్చేస్తోంది. 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పటికే 50 శాతం మంచు కరిగిపోయింది. 2040 సంవత్సరం నాటికి మరో 25 శాతం మంచు మాయమౌతుందని అంచనా. ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిణామం కొన్ని దేశాలకు కొత్త అవకాశాలను తెచ్చి పెట్టనుంది. ఆర్కిటిక్‌లో దాగున్న అపార సంపదపై ఇప్పుడు అనేక దేశాల చూపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలోనే వెల్లడైంది. ప్రపంచ చమురు నిల్వల్లో 25 శాతం.. అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు అక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ గతంలో అంచనావేసింది. ప్రపంచ సహజవాయు నిల్వల్లో 30 శాతానికిపైగా దాగున్నట్టు ఓ అంచనా. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారళ్ల సహజ వాయువు అక్కడ ఉందట. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ ఆలవాలం. దాంతో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం దేశాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఆధిపత్యమెవరిదో! నిజానికి ఆర్కిటిక్ ఎవరి సొంతమూ కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న ఎనిమిది దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా పేర్కొంటున్నాయి. వాటిని అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యా. అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్.. ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే. ఇవి తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐరాస 234 ఆర్టికల్‌ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ల వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద. నిప్పు రాజుకుంటోంది ఐరాస సూత్రీకరణలు ఎలా ఉన్నా ఆర్కిటిక్‌పై ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలకు సరిహద్దు దేశాలు పదును పెడుతున్నాయి. ఆర్కిటిక్‌తో అక్షరాలా 24,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉన్న రష్యా ఈ విషయంలో అందరికంటే ముందుంది. రెండేళ్లుగా ఆర్కిటిక్ వైపు బలగాల మోహరింపును ముమ్మరం చేస్తోంది. కొత్తగా ఆర్కిటిక్ బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది. మూతబడ్డ నౌకా స్థావరాలన్నింటినీ పునరుద్ధరిస్తోంది. వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ జలాల్లో ముందస్తు అనుమతి లేకుండా నౌకాయానానికి వీల్లేదని, అనుమతి పొందిన నౌకలు టోల్ ట్యాక్స్ కట్టాలని వాదిస్తోంది. అవసరమైతే 1859 సంవత్సరంలో అమెరికాకు ఇచ్చేసిన అలాస్కాను వెనక్కు తీసుకుంటామని రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ చైర్మన్ ఇటీవలే ప్రకటన చేశారు. రాజుకుంటున్న నిప్పుకు ఇది సూచన మాత్రమేనని విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అమెరికా చకచకా పావులు కదుపుతోంది. అలాస్కా నుంచి నౌకా మార్గానికి అనువుగా ఆర్కిటిక్‌లో కొంత భాగాన్ని తమదిగా చెబుతూ కొత్త మ్యాప్‌లు తయారు చేస్తోంది. కెనడా అయితే తమ దేశం నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న ప్రాంతమంతా తమదేనని తెగేసి చెబుతోంది! సరికొత్త మార్గాలు ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతున్న కొద్దీ సరికొత్త నౌకా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానానికి కొంతమేరకే అనువుగా ఉంది. దీని మార్గం ద్వారా ఏడాదికి వంద నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ మార్గం వేలాది నౌకల రాకపోకలతో రద్దీగా మారనుంది. ప్రస్తుతం పనామా కాల్వ మార్గంలో ఏడాదికి 14 వేలు, సూయజ్ కాల్వ మార్గంలో 20 వేల నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40 శాతం పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు ఆ మేరకు తగ్గుతాయి. భారత్ వైఖరేమిటి? ఆర్కిటిక్ వాతావరణం భారత్‌లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్‌లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి యోచిస్తోంది. -
ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ..
పై రెండు ఫొటోల్లో తేడా గమనించారా? ఏం లేదే మామూలుగానే ఉందని అనుకుంటున్నారా? మళ్లీ ఓ పాలి.. ఓ లుక్కెయ్యండి.. అర్థమైందా.. అవును! పై ఫొటోలో దట్టంగా ఉన్న మంచు కాస్తా.. కింది ఫొటోలో అట్టడుగుకు చేరిపోయింది. ఐతే ఏంటట.. అంటారా? దీనికి ఈ భూమిపై తలెత్తనున్న పెను ప్రమాదాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది మరీ! అందుకే ఈ వివరణంతా... ప్రస్తుతం నెట్టింట ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది. 100 సంవత్సరాల తేడాతో వేసవికాలంలో తీసిన ఫొటోలివి. పై ఫొటో దాదాపు 105 సంవత్సరాలనాటిది. కింది ఫొటో తాజాగా తీసింది. కేవలం వందయేళ్ల కాలంలో ఆర్కిటిక్ ప్రాంతంలో మంచంతా ఇలా నీరుగారిపోయింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా నెమ్మదిగా దెబ్బతింటున్న ఆర్కిటిక్కి సంబంధించిన ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యమిది. వాతావరణ మార్పులు తీవ్ర వానలు, వరదల వెనుక దిగ్భ్రాంతికి గురిచేసే వాస్తవం ఇది. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. ‘గ్లేసియర్ కంపారిజన్ - స్వాల్బార్డ్’ క్యాప్షన్‌తో క్రిస్టియన్ అస్లాండ్ అనే ట్రావెల్ ఫొటోగ్రాఫర్ ఆర్కిటిక్‌లోని వాతావరణ మార్పుల గురించి డాక్యుమెంటరీ తయారు చేశాడు. ఈ స్వీడిష్ ఫోటో జర్నలిస్ట్ 2017లో నేషనల్ జియోగ్రాఫిక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా తన అనుభవాలను పంచుకున్నాడు- ‘నేను ఈ ఫొటోను 2003లో తీశాను. వాతావరణ మార్పు పట్ల నా వైఖరి భిన్నంగా ఉంది. చాలా యేళ్ల తర్వాత సరిగ్గా అదే లొకేషన్ నుండి ఫొటో షూట్ చేయడం ఆనందాన్నిచ్చింది. వాతావరణ మార్పు సమస్య గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలనే ఈ ఫొటో షూట్ చేశాన’ని చెప్పుకొచ్చాడు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? This is Arctic 105 years apart. Both picture taken in summer. Do you notice anything special. Courtesy Christian Åslund. pic.twitter.com/9AHtLDGKRb — Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2021 -
గ్లోబల్ ‘వార్నింగ్’.. మాయమైపోయిన మంచు!
ఈ చిత్రాలు చూడండి. పై చిత్రంలో కొండలు కనబడట్లేదు కానీ కింది చిత్రంలో మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చుట్టూ ఆహ్లాదంగా, చూడముచ్చటగా ఉందనిపిస్తోంది కదా. చూడముచ్చట పక్కనబెడితే మున్ముందు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి ఇవి. పై చిత్రాన్ని దాదాపు 100 ఏళ్ల కిందట ఆర్కిటిక్‌లో తీశారు. అప్పుడు కొండలు కనబడనంతగా మంచు పేరుకుపోయి ఉంది. కానీ ఇప్పుడు ఆ మంచు ఆనవాళ్లు కూడా లేవు. కొన్నేళ్లుగా పెరుగుతున్న భూతాపం వల్లే ఈ మంచంతా మాయమైపోయింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో మంచు వేగంగా కరుగుతోందని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. (చదవండి: స్పెషల్ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్..) -
కెమెరామెన్‌ను రక్షించి ప్రాణాలు కోల్పోయిన రష్యా మంత్రి
మాస్కో: రష్యాకు చెందిన మంత్రి ఒకరి ప్రాణాలు కాపాడబోయి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఓ డ్రిల్ శిక్షణలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. రష్యా అత్యవసర శాఖ మంత్రి యెవ్గెని జినిచేవ్ (55). ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా ధ్రువీకరించింది. ఈ ఘటన నార్లిస్క్లోని ఆర్కిటిక్ పట్టణంలో బుధవారం జరిగింది. ప్రమాదవశాత్తు జినిచేవ్ ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటన వెలువడింది. చదవండి: బ్రహ్మపుత్రలో పడవలు మునక.. 100 మంది గల్లంతు డ్రిల్‌లో భాగంగా శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కెమెరామ్యాన్‌ను రక్షించే క్రమంలో ప్రమాదవశాత్తు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇంటర్ ఏజెన్సీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిన్న కొండను జినిచేవ్ ఎగిరి దాటవేశారు. అయితే అలాగే కెమెరామ్యాన్ ప్రయత్నించగా ఆయన త్రుటిలో పడిపోతున్నారు. వెంటనే గ్రహించి జినిచేవ్ అతడిని పట్టుకున్నారు. అయితే అంచున కాలు పెట్టడంతో ఆయన త్రుటిలో కాలుజారి కిందపడి మృతి చెందారు. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు -
గరిష్ట వార్షిక పరిమాణానికి చేరుకున్న ఓజోన్ రంధ్రం
అంటార్కిటిక్ ఓజోన్ రంధ్రం దాని ‘గరిష్ట వార్షిక పరిమాణానికి’ చేరుకుందని ఓజోన్ పొరను పర్యవేక్షించే శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇటీవల సంవత్సరాలలో ఇది అతిపెద్ద, లోతైన వాటిలో ఒకటి అని వారు తెలిపారు. ఓజోన్ పొర భూ ఆవరణలలో ఒకటైన స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తుంది. ఆ కిరణాల నుంచి మానవాళిని ఇతర ప్రాణులను కాపాడుతుంది. ఇండిపెండెంట్.కో. యూకే నివేదిక ప్రకారం, కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ (కామ్స్) శాస్త్రవేత్తలు ఓజోన్ సాంద్రతలు అంటార్కిటికాపై 20 - 25 కిలోమీటర్ల ఎత్తులో సున్న విలువకు పడిపోయాయని కనుగొన్నారు. ఈ జోన్‌ను ట్రైఆక్సిజన్ అని కూడా పిలుస్తారు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల కారణంగా, ఓజోన్ పొరలో చిన్న రంధ్రం ఏర్పడిందని, అది తరువాత పెరుగుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. రసాయనాలైన క్లోరో ఫ్లోరో కార్భన్ల( సీఎఫ్‌సీ)పై నిషేధాన్ని అమలు చేయాలని సైంటిస్ట్‌లు 2019లో చాలా బలంగా చెప్పారు. సీఎఫ్‌సీ ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతాయి. గత వారం నుంచి దక్షిణ ధ్రువంలో సూర్యరశ్మి బాగా పెరగడంతో ఈ ప్రాంతంలో ఓజోన్ క్షీణత ఎక్కువ అయ్యిందని సైంటిస్ట్‌లు తెలిపారు. 2019లో స్వల్ప ఓజోన్ పొర క్షీణతను గుర్తించిన తాము ఈ ఏడాది కొంచెం పెద్ద రంధ్రాన్నే కనుగొన్నామని వారు చెప్పారు. దీనిని ఆపాలంటే మాంట్రియల్ ప్రోటోకాల్‌ను అన్ని దేశాలు తప్పకుండా పాటించాలని సైంటిస్ట్‌లు విజ్ఞప్తి చేశారు. చదవండి: షాకింగ్: ఓజోన్ పొరకు అతిపెద్ద చిల్లు.. -
ఆర్కిటిక్‌లో సాధారణ స్థాయికి ఓజోన్ పొర
జెనీవా: హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి భూగోళాన్ని రక్షిస్తున్న ఓజోన్ పొరకు నానాటికీ పెరుగుతున్న కాలుష్యం పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ పొర మార్చిలో దారుణంగా దెబ్బతిన్నదని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. 2011 తర్వాత ఈ స్థాయిలో ధ్వంసం కావడం ఇదే తొలిసారి. అయితే, ఏప్రిల్ నెలలో మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంది. క్లోరోఫ్లోరో కార్బన్ల(సీఎఫ్‌సీ) ఉద్గారాలు తగ్గడంతో ఆర్కిటిక్ పొర ఊపిరి పోసుకుందని తెలిపింది. -
రైల్వే బ్రిడ్జిని ఎత్తుకెళ్లిన దొంగలు
మాస్కో : రష్యాలో ఇనుము దొంగలు బరితెగించారు. చిన్న చిన్న దొంగతనాలు ఏన్నాళ్లు చేయాలనుకున్నారో ఏమో కానీ ఏకంగా రైల్వే బ్రిడ్జిని మాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని ఆర్కిటిక్ రీజియన్‌లోని ఉంబా నదిపై రైల్వే బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి పాత పడటంతో కొంతకాలంగా దానిని వినియోగించడం లేదు. అయితే ఇటీవల ఉన్నట్టుండి బ్రిడ్జి మధ్య భాగం అదృశ్యం అయింది. 75 అడుగుల పొడవు, 56టన్నుల బరువున్న వంతెన మధ్య భాగం అదృశ్యం కావడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రిడ్జి అదృశ్యానికి సంబంధించి తొలుత మే నెలలో రష్యాకు చెందిన వీకే సోషల్ మీడియా సైట్ వార్తలు ప్రచురించింది. అయితే స్థానికులు మాత్రం బ్రిడ్జిపై ఉన్న ఇనుము కోసమే దొంగలు దానిని కూలగొట్టారని ఆరోపించారు. మొదట వెలుబడిన ఫొటోలను చూస్తే బ్రిడ్జి నదిలో కూలిపోయినట్టుగా కనిపించింది. కానీ ఆ తర్వాత పదిరోజులకు విడుదలైన ఏరియల్ వ్యూ ఫొటోలను పరిశీలిస్తే నదిలో బ్రిడ్జి శకలాలు కనిపించలేదు. దీంతో బ్రిడ్జి సహజంగా కూలిపోలేదని తొలుత ఈ వార్తను ప్రచురించిన వీకే సైట్ తెలిపింది. అయితే ఇది దొంగల పనే అని భావిస్తున్న స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
ఎముకలు కొరికే చలిలో.. రెండేళ్లు!
కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి చల్లని ప్రదేశాలకు వెళ్తే కొద్ది సేపటికే గజగజా వణికిపోతాం. అలాంటిది ఆర్కిటిక్ లాంటి ధ్రువ ప్రాంతంలోకి సాహసయాత్రకు వెళ్తే..? ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి ఒంటరిగా జీవించాల్సి వస్తే..? వెంట తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోవస్తే..? రెండేళ్ల పాటు ఎముకలు కొరికే చలిలో ధ్రువపు ఎలుగుబంట్ల కంటపడకుండా బతకాల్సి వస్తే..? తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ..? ‘అడా బ్లాక్‌జాక్’ మాత్రం స్వయంగా ఇవన్నీ అనుభవించింది. అంతేనా.. ప్రాణాలతో బయటపడి, విధితో పోరులో విజేతగా నిలిచింది. కానీ, ప్రపంచమే ఆమె పోరాటాన్ని గుర్తించలేదు..! 1921 నాటి సంగతి.. ప్రఖ్యాత కెనడియన్ శాస్త్రవేత్త, ఆర్కిటిక్ అన్వేషకుడు ‘విల్జామర్ స్టెపాన్సన్’ ఓ బ్రహ్మాండమైన సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. అలాస్కా నుంచి చుక్చీ సముద్రం మీదుగా రష్యాలోని రాంగెల్ దీవికి చేరుకోవాలనేదే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం. ఆర్కిటిక్‌లోని మంచు సముద్రాల మీదుగా వందల మైళ్ల దూరం కాలినడకన చేయాల్సిన ఈ ప్రయాణాన్ని సాహస యాత్ర అనడం కంటే.. అన్వేషణ యాత్ర అనడమే సబబు. స్టెపాన్సన్ ఈ యాత్ర కోసం కెనడాకే చెందిన అల్లాన్ క్రాఫార్డ్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. మరో ముగ్గురు అమెరికన్లు లార్నే నైట్, మిల్టన్ గాల్లే, ఫ్రెడ్ మారెర్లను బృంద సభ్యులుగా ఎంపిక చేశారు. వీరందరికీ గతంలో ఇటువంటి సాహస యాత్రలు చేసిన అనుభవం ఉంది. వీరికి తోడుగా అలాస్కాకు చెందిన ఇన్యూట్ తెగ మహిళను వంటమనిషిగా ఎంపిక చేశారు. కుట్టుపని కూడా బాగా తెలిసిన ఆ మహిళే.. 23 ఏళ్ల అడా బ్లాక్‌జాక్. వీరంతా కలిసి జీతం ప్రాతిపదికన ఈ అన్వేషణ యాత్రకు సిద్ధమయ్యారు. రాంగెల్ దీవిని కెనడా భూభాగంగా చాటుకోవడమే ప్రధానంగా సాగిన ఈ ప్రయాణానికి స్టెపాన్సన్ ఆర్థిక అండదండలు అందించాడు. అయితే, ఆయన మాత్రం యాత్రకు దూరంగా ఉన్నారు. 1921, సెప్టెంబర్ 16న వీరి యాత్ర ప్రారంభమైంది. కొన్ని రోజులు ప్రయాణం బాగానే సాగింది. కానీ, మంచుతో గడ్డకట్టిన చుక్చీ సముద్రంపై నడుస్తున్న కొద్దీ వీరి శరీరాల్లో విపరీతమైన మార్పులు రాసాగాయి. అక్కడక్కడా ఆగుతూ, ఎలాగో ముందుకు సాగిపోయారు. అలా కనీవినీ ఎరుగని రీతితో దాదాపు ఏడాదిన్నర పాటు వీరి ప్రయాణం సాగుతూనే ఉంది. కొద్ది వారాలకు పరిస్థితులు ప్రతికూలంగా మారడం మొదలుపెట్టాయి. వెంట తెచ్చుకున్న సరకులు అయిపోయాయి. చేరాల్సిన గమ్యం అప్పటికి ఇంకా చాలా దూరాన ఉండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి చేరుకున్నారు బృంద సభ్యులు. కొద్ది వారాల పాటు సీల్ చేపలను వేటాడటం లాంటి పనులు చేసి ఎలాగో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఇక, ప్రయాణం ఎక్కువ కాలం సాగదని తెలిసి సహాయం, ఆహారం కోసం సైబీరియా ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు మిల్టన్ గాల్లె, మారెర్, క్రాఫార్డ్లు. అప్పటికే జబ్బు బారిన పడిన లార్నే నైట్‌కు తోడుగా బ్లాక్‌జాక్‌ను అక్కడే విడిచిపెట్టి 1923 జనవరి 28న ప్రయాణం సాగించారు. అలా 700 మైళ్ల దూరం ప్రయాణించి సైబీరియా ప్రాంతానికి చేరుకున్నారు. మరోవైపు మంచు కొండల్లో అష్టకష్టాలు పడ్డారు నైట్, బ్లాక్‌జాక్‌లు. నైట్ ఆరోగ్యం దెబ్బతినడంతో ఆయనకు సపర్యలు చేస్తూ, సీల్‌లను వేటాడుతూ ఆహారం సంపాదించసాగింది బ్లాక్‌జాక్. రోజురోజుకీ క్షీణిస్తూ వస్తోన్న నైట్‌ను ఓవైపు కాపాడుతూనే, ప్రమాదకరమైన ధ్రువపు ఎలుగుబంట్ల కంట పడకుండా తనను తాను రక్షించుకునేది. అయితే, ఎంత శ్రమించినా చివరకు ఏప్రిల్ నెలలో నైట్‌ను కోల్పోక తప్పలేదు ఆమెకి. అతడు విగతజీవిగా పడి ఉండటం గమనించి, అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయాణం మొదలుపెట్టింది. ఒంటరిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, అప్పటికే మంచు ప్రాంతంలో ఎలా జీవించాలో ఒంటబట్టించుకోవడంతో ప్రాణాలు నిలబెట్టుకోగలిగింది. చివరకు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య బ్లాక్‌జాక్‌ను ఆగస్టు 19న కనుగొన్నారు కొందరు నావికులు. అలా తిరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అత్యంత వీరోచితంగా బతుకుపోరాటం చేసిన ఆమెకు ఈరోజుల్లో అయితే ఘన స్వాగతం లభించి ఉండేది. కానీ, అప్పట్లో అలా జరగలేదు. మీడియా బ్లాక్‌జాక్‌ను రాక్షసిలా చూసింది. తోటి అన్వేషకుడి మరణానికి ఆమే కారణం అని ఆరోపించింది. మరణించిన నైట్ కుటుంబ సభ్యులు కూడా ఆమె తీరును తప్పుపట్టారు. ఆమె నైట్‌ను విడిచిపెట్టేసి వచ్చిందని ప్రజల్లో బలమైన నమ్మకాలు పాతుకుపోయాయి. అయితే, అదంతా అసత్యమని తర్వాత ఆమెను కలిసిన ముగ్గురు సహ అన్వేషకులు ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది. ఆమె సమాజం దృష్టిలో విలన్‌గానే నిలిచిపోయింది. ఆమె జీవిత కథ ఆధారంగా తర్వాత ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. సినిమాలు సైతం రూపొందాయి. కానీ, ఏవీ ఆమెకు మేలు చేయలేకపోయాయి. జీవితాంతం ఆమె పేదరికంలోనే మగ్గిపోయింది. చివరకు ఆర్కిటిక్ ప్రాంతంలోని ఓ శరణాలయంలోనే 85 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచింది. -
మంచు ఖండంలో మొక్కలు
వాషింగ్టన్: వాతావరణ మార్పుల వల్ల మంచు ఖండమైన ఆర్కిటిక్‌లో మొక్కలు పెరుగుతున్నట్లు నాసా పరిశోధనలో తేలింది. ల్యాండ్‌శాట్ ఉపగ్రహాల నుంచి సేకరించిన 87 వేల ఫోటోలను పరిశీలించి ఆర్కిటిక్‌లో మూడో వంతు పచ్చదనంతో నిండి ఉందని పరిశోధకులు తెలిపారు. ఆర్కిటిక్‌లోని పశ్చిమ అలాస్కా, క్యూబెక్ల్లో 1984-2012 మధ్య ఎక్కువ మొక్కలు పెరిగాయన్నారు. ఆర్కిటిక్ వద్ద ఉష్ణోగ్రతలు ప్రపంచంలోని ఏ ఇతర ప్రదేశంతో పోల్చినా వేగంగా పెరుగుతున్నాయి. ఇందువల్లే అక్కడ మొక్కలు పెరుగుతున్నాయి. ఇక్కడ మొక్కలు పెరిగితే ఆ ప్రభావం సముద్ర నీటి మట్టం, కర్బన చక్రాలపై పడుతుంది. -
లక్ష ఏళ్ల తర్వాత.. తొలిసారి!
ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉండే ఆర్కిటిక్ సముద్రంపై ఈ ఏడాది మంచు కనుమరుగు కానుందా..? దాదాపు ఒక లక్ష సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన మళ్లీ పునరావృతం కానుందా? అంటే నిపుణులు ఔననే అంటున్నారు. యూఎస్ నేషనల్ ఐస్ అండ్ స్నో డేటా సెంటర్ జూన్ 1న నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలు ఈ నిజాన్ని వెల్లడించాయి. గత 30 ఏళ్లుగా కోటీ ఇరవై ఏడు లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణంలో ఉన్న మంచు ఈ ఏడాది కోటీ పదకొండు లక్షలకు పడిపోయిందని తెలిపారు. ఈ కరిగిపోయే మంచు భాగం 15 లక్షల చదరపు కిలోమీటర్లుకు పైగా ఉంటుందనీ.. ఇది ఆరు యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ల విస్తీర్ణానికి సమానమని చెప్పారు. తాను నాలుగేళ్ల క్రితం తెలిపిన ప్రతిపాదనల మేరకు 10 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే మంచు కరిగిపోతుందని పోలార్ ఓషన్ ఫిజిక్స్ గ్రూప్ హెడ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ పీటర్ వాధమ్స్ తెలిపారు. ఈ సంవత్సరం ఇంతమొత్తంలో కరిగిపోకపోయినా వచ్చే ఏడాది కచ్చితంగా కరుగుతుందని వివరించారు. ఆర్కిటిక్ మధ్య భాగం, ఉత్తరాన మంచు ఎక్కువగా కరిగే అవకాశం ఉందని చెప్పారు. దాదాపు లక్ష నుంచి లక్షా ఇరవై వేల ఏళ్లకు పూర్వం ఇలానే మంచు కరిగిందని తెలిపారు. పెను తుపానులు, యూకేలో వరదలు, అమెరికాలో టోర్నడోలు, ఉత్తర రష్యా తీరంలో మంచు కరిగిపోవడం తదితర పెనుమార్పులే ఆర్కిటిక్ లో ఉష్ణోగ్రతలను తీవ్రంగా పెంచనున్నట్లు వివరించారు. సముద్రం మీద గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం గురించి పరిశీలించగా.. మిథేన్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రజ్ఞలు తెలిపారు. -
ఐడియా అదిరింది అమ్మాయీ..
ఇదో తేలియాడే నగరం డిజైన్. అదిరింది కదూ.. దీని డిజైన్‌లో ప్రముఖ పాత్ర చిత్రంలోని అమ్మాయిదే. పేరు మరియం చబానీ. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్కిటెక్ట్. తన సహ ఆర్కిటెక్ట్‌లతో కలసి ఈమె ఈ డిజైన్‌ను రూపొందించారు. ప్రకృతి ప్రసాదించిన వనరైన నీటిని అత్యంత సమర్థంగా వినియోగించుకునే దిశగా ఈ తేలియాడే నగరం ‘అర్కిటిక్ హార్వెస్టర్’ను వీరు డిజైన్ చేశారు. ఇందులో 800 మంది హాయిగా ఉండొచ్చు. వారికి కావాల్సిన ఆహారం అంటే పళ్లు, పంటలు అన్నీ ఈ తేలియాడే నగరంలోనే పండుతాయి. ఇది ఆర్కిటిక్ మహాసముద్రంలోని మంచు ఫలకాల నుంచి మంచి నీటిని గ్రహించి, దాన్ని పంటల సాగుకు ఉపయోగిస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉండే సౌరఫలకాలు విద్యుత్‌ను అందిస్తాయి. నీటి నుంచీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సౌకర్యమూ ఇందులో ఉంది. ఈ డిజైన్ గతేడాది ఇన్నోవేషన్ ఆర్కిటెక్చర్ ఆన్ సీ పురస్కారాన్ని గెలుపొందింది.