ఐడియా అదిరింది అమ్మాయీ.. | 'Arctic Harvester' Is a Floating Hydroponic Farm and Village | Sakshi
Sakshi News home page

ఐడియా అదిరింది అమ్మాయీ..

Published Sat, Mar 8 2014 5:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

ఐడియా అదిరింది అమ్మాయీ..

ఐడియా అదిరింది అమ్మాయీ..

ఇదో తేలియాడే నగరం డిజైన్. అదిరింది కదూ.. దీని డిజైన్‌లో ప్రముఖ పాత్ర చిత్రంలోని అమ్మాయిదే. పేరు మరియం చబానీ. ఫ్రాన్స్‌కు చెందిన ఆర్కిటెక్ట్. తన సహ ఆర్కిటెక్ట్‌లతో కలసి ఈమె ఈ డిజైన్‌ను రూపొందించారు. ప్రకృతి ప్రసాదించిన వనరైన నీటిని అత్యంత సమర్థంగా వినియోగించుకునే దిశగా ఈ తేలియాడే నగరం ‘అర్కిటిక్ హార్వెస్టర్’ను వీరు డిజైన్ చేశారు.
 
 ఇందులో 800 మంది హాయిగా ఉండొచ్చు. వారికి కావాల్సిన ఆహారం అంటే పళ్లు, పంటలు అన్నీ ఈ తేలియాడే నగరంలోనే పండుతాయి. ఇది ఆర్కిటిక్ మహాసముద్రంలోని మంచు ఫలకాల నుంచి మంచి నీటిని గ్రహించి, దాన్ని పంటల సాగుకు ఉపయోగిస్తుంది. అంతేకాదు.. ఇందులో ఉండే సౌరఫలకాలు విద్యుత్‌ను అందిస్తాయి. నీటి నుంచీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సౌకర్యమూ ఇందులో ఉంది. ఈ డిజైన్ గతేడాది ఇన్నోవేషన్ ఆర్కిటెక్చర్ ఆన్ సీ పురస్కారాన్ని గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement