వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్‌లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్‌లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్‌లుగా వర్గీకరించారు.
నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్‌రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు.
నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్ ఎరాస్‌మస్ మెడికల్ సెంటర్‌లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్‌మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్‌లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్‌లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్‌లు సోకాయి.
ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్‌లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్‌మెన్స్ విశ్లేíÙంచారు.
Comments
Please login to add a commentAdd a comment