ice age
-
వేల ఏళ్ల పురాతనమైన వినాశకర వైరస్ల విజృంభణ!
వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్‌లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్‌లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్‌రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు. నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్‌మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్‌లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్లు సోకాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్‌మెన్స్ విశ్లేíÙంచారు. -
9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి మాయమైందట!
దాదాపు 9 లక్షల ఏళ్ల క్రితం 99 శాతం మానవాళి ఉన్నపళాన తుడిచిపెట్టుకుపోయిందట. చివరి మంచు యుగం తుదినాళ్లలో చోటు చేసుకున్న విపరీతమైన వాతావరణ మార్పులే ఇందుకు కారణంగా నిలిచాయని అంతర్జాతీయ అధ్యయనం ఒకటే తాజాగా తేలి్చంది. అయితే నేటి ఆధునిక మానవుని పూరీ్వకులు హోమోసెపియన్ల ఆవిర్భావానికి కూడా ఈ మహా ఉత్పాతం పరోక్షంగా కారణమైందని చెబుతోంది. చాన్నాళ్ల క్రితం. అంటే దాదాపు 9.3 లక్షల నుంచి 8.13 లక్షల ఏళ్ల క్రితం. పర్యావరణ పరంగా భూమ్మీద కనీ వినీ ఎరుగని ఉత్పాతం సంభవించింది. ఈ మహోత్పాతం వల్ల అప్పటి జనాభాలో ఏకంగా 98.9 శాతం తుడిచిపెట్టుకుపోయిందట. దాని బారినుంచి కేవలం 1,300 మంది మాత్రమే బతికి బట్టకట్టారట. మన పూరీ్వకులైన హోమోసెపియన్లు వీరినుంచే పుట్టుకొచ్చారట. చివరి మంచు యుగపు తుది నాళ్లలో ఈ పెను ఉత్పాతం జరిగింది. అధ్యయనం ఇలా... ► రోమ్‌లోని సపియెంజా వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లారెన్స్ నిపుణులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ► ఆ యుగంలో జరిగిన తీవ్ర వాతావరణ మార్పులు మానవ జాతి వినాశనానికి కారణంగా మారినట్టు వారు తేల్చారు. ► అధ్యయనం కోసం 50కు పైగా విభిన్న దేశాలకు చెందిన 3,154 మంది సంపూర్ణ జన్యుక్రమాలను లోతుగా విశ్లేíÙంచారు. ► ఇందుకోసం ఫిట్ కోల్ అనే సరికొత్త బయో ఇన్ఫర్మాటిక్స్ పద్ధతిని అనుసరించారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంత ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► ఈ డేటాను నాటి వాతావరణ, శిలాజ సమాచారంతో పోల్చి చూశారు. ► హోమోసెపియన్ల ఆవిర్భావానికి కాస్త ముందు.. పూర్వ చారిత్రక యుగపు మిస్టరీల్లోకి తొంగిచూసేందుకు ఈ కొత్త వివరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సైంటిస్టులు చెప్పారు. ► జెనెటిక్ బాటిల్ నెక్‌గా పిలుస్తున్న ఈ మహోత్పాతానికి నాటి మంచు యుగ సంధి సందర్భంగా చోటు చేసుకున్న తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తేలింది. ► ఆ దెబ్బకు నేటి ఆఫ్రికా ఖండమంతా ఎండిపోయి మరు భూమిగా మారిందట. ► మానవులతో పాటు ఏనుగుల వంటి భారీ క్షీరదాలన్నీ దాదాపుగా అంతరించాయట. ► ఆ దెబ్బకు దాదాపు 3 లక్షల ఏళ్ల పాటు మానవ ఉనికి ఉందా లేదా అన్నంత తక్కువ స్థాయికి పడిపోయిందట. ► ఆ సమయం నాటి శిలాజాల్లో మానవ అవశేషాలు అసలే దొరక్కపోవడం కూడా దీన్ని ధ్రువీకరిస్తోంది. ► ఈ అధ్యయన వివరాలు జర్నల్ సైన్స్‌లో పబ్లిష్ అయ్యాయి. ‘నాటి మంచు యుగపు మహోత్పాతం మానవ వికాసంలో ఒక రకంగా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. తదనంతరం పుట్టుకొచ్చిన ఆదిమ మానవ సంతతే ఆఫ్రికా నుంచి యురేషియాకేసి విస్తరించింది. ఈ విస్తరణ ఆఫ్రికాలో హోమోసెపియన్లు, యూరప్‌లో నియాండర్తల్, ఆసియాలో దేనిసోవన్ల ఆవిర్భావానికి కారణమైంది‘ – ఫాబియో డీ విన్సెంజో – నేషనల్ డెస్క్, సాక్షి -
మంచు తుపానులో కాలిఫోర్నియా విలవిల
లాస్ఏంజెలిస్/డాలస్: అమెరికాలోని కాలిఫోర్నియాను వారం రోజులుగా భారీ మంచు తుపాను వణికిస్తోంది. కాలిఫోర్నియా, ఓరెగాన్లలో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఏడడుగుల మేర మంచుకురిసింది. కొన్ని రిసార్టు ప్రాంతాల్లో 10 అడుగుల మేర మంచు పేరుకుపోయిందన్నారు. అనూహ్య మంచు తుపానుతో కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కొండ ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరాలు, ఆహారం, మందులు, పాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ మంచుమయం కావడంతో బయటకు వచ్చే వీలులేకపోయింది. కొండప్రాంతాల నివాసితులు రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. ఇళ్లు, వాహనాలు మంచు గుట్టల మధ్య కూరుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రెండిళ్లలో పేలుళ్లు సంభవించినట్లు, మంచు భారంతో ఇళ్లపైకప్పులు కూలినట్లు, కొన్ని ఇళ్లలో గ్యాస్ లీకేజీ జరిగినట్లు సమాచారం ఉందని సిబ్బంది తెలిపారు. అత్యవసర వైద్య సాయం అవసరమైన వారిని రెడ్‌క్రాస్ షెల్టర్‌కు తరలించారు. కరెంటు తీగలు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నెవాడా సరిహద్దుల్లో ఉన్న సాక్రమెంటో, లేక్ టహో ప్రాంతాల్లో మంచుతుపాను శనివారం మరింత తీవ్ర మవుతుందని నిపుణులు హెచ్చరించారు. కాలిఫోర్నియాలోని 13 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అయితే, మంచు తుపాను కారణంగా కాలిఫోర్నియా ప్రాంతంలో దుర్భిక్ష పరిస్థితులు తొలిగినట్లేనని అధికారులు చెప్పారు. పెనుగాలుల విధ్వంసం టోర్నడో తుపాను దెబ్బకు టెక్సాస్, లూసియానాల్లో అంధకారం అలుముకుంది. టెక్సాస్‌లోని డాలస్, ఫోర్ట్ వర్త్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. డాలస్‌లో భారీగా చెట్లు నేలకూలాయి. వాహనాలు పల్టీలు కొట్టాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయని పోలీసులు తెలిపారు. డాలస్–ఫోర్ట్‌వర్త్, డాలస్ లవ్ ఫీల్డ్ విమానాశ్రయాల్లో 400 విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టెక్సాస్‌లోని సుమారు 3.40 లక్షల వినియోగదారులు గురువారం రాత్రి చీకట్లోనే గడిపారు. వాతావరణ విభాగం హెచ్చరికలతో డాలస్, ఫోర్ట్‌వర్త్ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. -
9000 ఏళ్ల కిందటి మానవ అవశేషాలు..
మెక్సికో : అత్యంత పురాతన గుహలో లభించిన 9000 ఏళ్ల నాటి మానవ అవశేషాలు, మంచుయుగంలో సంచరించిన జంతువుల ఎముకలను ఆర్కియాలజిస్టులు పరిశీలిస్తున్నారు. తూర్పు మెక్సికోలో ఇటీవల కొందరు డైవర్స్ నీట మునిగిన ఓ భారీ గుహను గుర్తించడంతో పురాతన మాయా నాగరికత గురించి ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయని భావిస్తున్నారు. మానవ అవశేషాలతో పాటు పురాతన ఏనుగులు, ఎలుగుబంట్ల ఎముకలు బయటపడ్డాయని మెక్సికో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గుహల వెలికితీత అక్కడి పురావస్తు శాఖలో సంచలనం సృష్టించింది. ‘ఇది నిజంగా అద్భుతం..ప్రపంచంలోనే ఇది అత్యంత కీలకమైన నీటిలోపలి పురావస్తు ప్రదేశ’మని మెక్సికో నేషనల్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ ఇనిస్టిట్యూట్ (ఐఎన్ఏహెచ్) రీసెర్చర్ గిల్రెమో డి అండా అన్నారు. ఐఎన్ఏహెచ్ విశ్లేషణల ప్రకారం మంచుయుగం చివరినాళ్లలో నీటి ప్రవాహం 100 మీటర్ల మేర ఎగసి గుహను ముంచెత్తిందని దీంతో అక్కడి జీవావరణం నాటి అవశేషాలు కొంతమేర పదిలపరచబడ్డాయని వెల్లడైంది. చివరి మంచుయుగం 26 లక్షల సంవత్సరాల కిందట ఆరంభమై 11,700 ఏళ్ల కిందట ముగిసిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ముంచుకొస్తున్న మంచుయుగం!
లేహ్‌లో మైనస్ 17 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత.. సహారా ఎడారిలో కురుస్తున్న మంచు.. 40 ఏళ్లలో ఇది మూడోసారి.. అమెరికాలో మంచు తుపానులు.. ఇవన్నీ దేనికి సంకేతం.. కొంపదీసి భూమి మొత్తం మంచు ముద్దలా మారిపోనుందా..! అవును నిజమే..! అదెంటీ ఒకపక్క ఏటికేటికీ వేసవి తాపం పెరిగిపోతుంటే.. మంచు ముద్ద ఎలా అవుతుందని ఆశ్చర్యపోతున్నారా..? కొందరు శాస్త్రవేత్తలు దీనికీ ఓ లెక్కుందని ఆధారాలతో సహా చెబుతున్నారు.. భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే శక్తి మానవులకు లేదని, సూర్యుడి వంటి భారీ నక్షత్రం వల్లే ఇది సాధ్యమన్నది వారి వాదన. సూర్యుడిపై ఎప్పుడూ మార్పులు జరుగుతుంటాయి. అది కూడా ఓ క్రమ పద్ధతిలో.. వీటి ప్రభావం మన వాతావరణంపై కూడా పడుతుంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వచ్చారు. ఇంకొన్నేళ్లలో భూమి మంచుముద్దగా మారుతుందని ప్రొఫెసర్ వాలెంటీనా ఝర్‌కోవా వంటి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్పాతం తప్పదా..? సూర్యుడిపై జరుగుతున్న కార్యకలాపాలను శాస్త్రవేత్తలు కొన్ని వందల సంవత్సరాలుగా పరిశీలిస్తున్నారు. అక్కడి మార్పులకు, అదే సమయంలో భూమ్మీద మార్పులకు మధ్య సంబంధాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఓ ఎత్తు.. ఝర్‌కోవా వేస్తున్న లెక్కలు ఇంకో ఎత్తు. ఎందుకంటే అత్యాధునిక పద్ధతుల్లో ఝర్‌కోవా వేసిన లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు దగ్గరి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యుడిపై జరుగుతున్న కార్యకలాపాలు క్రమేపీ బలహీన పడుతున్నాయని ఝర్‌కోవా చెబుతున్నారు. 1645లో ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు లండన్‌లోని థేమ్స్ నది గడ్డకట్టుకుపోయిందని పేర్కొంటున్నారు. 2030 నాటికి సూర్యుడిపై కార్యకలాపాలు దాదాపు 60 శాతం వరకు తగ్గుతాయని, ఆ తర్వాత భూ ఉష్ణోగ్రతలు కూడా కనిష్టస్థాయికి చేరుకుంటాయని వివరిస్తున్నారు. హెచ్చరించిన హైదరాబాద్ శాస్త్రవేత్త.. భూమి మంచుముద్దగా మారబోతోందని ఎన్జీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త జనార్దన్ నేగీ ఎనిమిదేళ్ల కిందే హెచ్చరించారు. ‘1420 వరకూ గ్రీన్‌ల్యాండ్ పచ్చదనంతో ఉండేది. ఆ తర్వాత 1,600 నాటికి మంచుముద్దగా మారిపోయింది. మినీ మంచుయుగం వచ్చింది అప్పుడే. ఈ కాలంలోనే బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ వంటి యూరోపియన్ దేశాలు ఇతర దేశాలపై దండయాత్రలు చేశాయి. వలస రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నాయి’అని అప్పట్లోనే ‘సాక్షి’తో చెప్పారు. లక్ష సంవత్సరాలకు ఓసారి, పది వేల ఏళ్ల విరామంతో భూమి మంచులో కూరుకుపోతుందని, మధ్యలో అప్పుడప్పుడూ కొంతకాలం పాటు మినీ మంచుయుగపు పరిస్థితులు ఏర్పడతాయన్నది నేగీ విశ్లేషణ. విపత్తుల కాలం.. సూర్యుడిపై కార్యకలాపాలు మందగించినప్పుడల్లా భూమ్మీద భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు వంటి విపత్తులు చోటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. 1650–2009 మధ్య కాలం లో జరిగిన అగ్నిపర్వతపు పేలుళ్ల అవశేషాలను విశ్లేషించడం ద్వారా ఫ్లోరిడాలోని ది స్పేస్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఈ అంచనాకొచ్చింది. 1700–2009 మధ్యకాలంలో సన్‌స్పాట్స్ అతితక్కువగా ఉన్న సమయంలోనే భారీ భూకంపాలు వచ్చినట్లు వీరి అధ్యయనం చెబుతోంది. జపాన్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ కాస్మిక్ రే రీసెర్చ్ శాస్త్రవేత్త టోషికాజూ ఇబిసుజాకీ కూడా అగ్నిపర్వత పేలుళ్లకు, సన్‌స్పాట్స్‌కు మధ్య సంబంధం ఉందని చెబుతున్నారు. శక్తిమంతమైన భూకంపాలు.. సన్‌స్పాట్స్ తక్కువగా ఉన్న సమయంలో భూమి ఉపరితలంపై సూర్యుడికి ఉండే అయస్కాంత ఆకర్షణ శక్తి కొంచెం తగ్గుతుందని, ఫలితంగా భూగర్భంలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు దాదాపు నిలిచిపోతాయని వెదర్ యాక్షన్ సంస్థకు చెందిన పైర్స్ కార్బిన్ పేర్కొన్నారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఆగిపోవడం వల్ల వాటి మధ్య ఒత్తిడి పెరిగిపోతుందని.. తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ శక్తి మొత్తం భూకంపాల రూపంలో విడుదల అవుతుందన్నారు. సన్‌స్పాట్స్ తక్కువ ఉన్న సమయంలో భూకంపాలు తక్కువగా వచ్చినా.. ఎప్పుడో ఒకప్పుడు వచ్చే భూకంపాలు మాత్రం శక్తిమంతంగా ఉంటాయని కార్బిన్ హెచ్చరిస్తున్నారు. విస్తృత పరిశోధనలు.. సూర్యుడిపై సన్‌స్పాట్స్‌కు, భూ వాతావరణానికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. సన్స్పాట్స్ను, ఇతర కార్యకలాపాలను నిత్యం గుర్తించేందుకు నాసా రెండు ఉపగ్రహాలను ప్రయోగించింది. సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సంస్థ నిత్యం సూర్యుడిపై ఓ కన్నేసి ఉంచుతుంది. అతిపెద్ద స్థాయిలో పేలుళ్లు జరిగే అవకాశమున్నప్పుడు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. సన్‌స్పాట్ శాస్త్రం.. సూర్యుడిలో జరిగే కార్యకలాపాలు 11 ఏళ్లకోసారి మారుతుంటాయి. సూర్యుడిపై కూడా కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. అయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని అంచనా. సాపేక్షంగా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతం నలుపు రంగులో కనిపిస్తుంటుంది. దీన్నే సన్‌స్పాట్ అంటారు. ఈ మచ్చల సంఖ్య ఆధారంగా ఏడాదిలో సూర్యుడు ఎంత చురుగ్గా ఉన్నాడన్నది నిర్ణయిస్తారు. సూర్యుడిపై కొన్ని పదార్థాలు పేలడం వల్ల ఎగసిపడే మంటలూ సన్స్పాట్స్ను ప్రభావితం చేస్తాయి. 1775 నుంచి జరుగుతున్న పరిశీలనల ఆధారంగా దాదాపు 11 ఏళ్లకోసారి ఈ సన్‌స్పాట్స్ పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయని తెలిసింది. దీన్నే సోలార్సైకిల్ అంటారు. ప్రస్తుతం 25వ సోలార్ సైకిల్ నడుస్తోంది. 2020 నాటికి సన్‌స్పాట్స్ అతితక్కువ స్థాయికి చేరడంతో ఈ సోలార్ సైకిల్ ముగుస్తుంది. 2016లో జరిపిన పరిశీలనల్లో దాదాపు 21 రోజులపాటు సూర్యుడిపై ఎలాంటి సన్‌స్పాట్స్ ఏర్పడలేదని గుర్తించారు. మాండర్ మినిమమ్.. సూర్యుడిపై సన్‌స్పాట్స్ అతి తక్కువగా కనిపించే కాలాన్ని మాండర్ మినిమమ్ అని పిలుస్తారు. 1645 నుంచి 1715 మధ్యకాలంలో సన్‌స్పాట్స్ కనిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు భూగోళం మొత్తమ్మీద మంచుయుగపు పరిస్థితులు ఏర్పడ్డాయి. లండన్‌లోని థేమ్స్ నది పూర్తిగా గడ్డకట్టుకుపోయిందని రికార్డులు చెబుతున్నాయి. నాసా అంచనా ప్రకారం.. 1645 కంటే ముందు కూడా చాలాసార్లు భూమి మంచు కప్పి ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చాపకింద నీరు
విశ్లేషణ జీవన కాలమ్ మానవాళి ప్రకృతిపై చేస్తున్న జులుంకి ప్రకృతి చాలా క్రూరంగా సమాధానం చెప్పబోతోంది. దానికి సూచనే ఈ మంచు శకలం విడివడటం. ఇది మానవుడు తెలిసి తెలిసి– తనకు తానే తవ్వుకుంటున్న భయంకరమైన గొయ్యి. మన చాపకిందకి నీరు వస్తేగాని మనం చెమ్మని గుర్తుపట్టం. ఈ దేశం మీద పరాయిదేశం దండయాత్ర చేసినా దక్షిణాదివారికి అది కేవలం వార్తే. కశ్మీర్ పొలిమేరల్లో పాకిస్తాన్ కాల్పులు జరుపుతూంటే– తమ జీవితాల్ని ప్రశాంతంగా గడిపే ఎన్నో సరిహద్దు కుటుంబాలను సైనిక దళాలు అప్పటికప్పుడు కదుపుతూంటాయి. పాక్ కాల్పులు మనకి వార్త. వారికి ప్రాణ సంకటం. అలాగే డోక్లాంలో చైనా దళాల మోహరింపు మనకు కేవలం వార్త. సరిహద్దు పల్లెలకు జీవన్మరణ సమస్య. యుద్ధం పంజాబ్‌లో ఎన్నో కుటుంబాలను పునాదులతో కదుపుతుంది. యుద్ధం కారణంగా సరిహద్దులో పుట్టిన తెలివైన కుర్రాడు చదువుకోలేక కేవలం కారు మెకానిక్ కావచ్చు. కాని అమలాపురంలో, త్రివేండ్రంలో యుద్ధం కేవలం పేపరు చెప్పిన సంఘటన. నా చిన్నతనంలో ఇప్పటి విశాఖపట్నం పోర్టు ఉన్న చోట రెండు ఫర్లాంగుల దూరంలో సముద్రపు నీరు ఉండేది. ఇప్పుడు రోడ్డుదాకా వచ్చేసింది. ఇటీవల రామకృష్ణా బీచ్ దగ్గర సముద్రం దాదాపు రోడ్డుని కొట్టేసింది. ఎందుకని? ఏమో. అది మన చాపకాదు. మరో ముపై్ఫ ఏళ్లకు ఇప్పటి జలాంతర్గామి మునిగిపోవచ్చు. కొత్తగా పెడుతున్న విమానం నీటిలోకి పోవచ్చు. ఈ విషయం ఏ కలెక్టరూ చెప్పలేడు. కొన్ని లక్షల సంవత్సరాల కింద దక్షిణ ధ్రువం నుంచి విడిపోయిన గోండ్వానా భూమి ఖండాలయింది. దేశ పటాలను చూస్తే పశ్చిమ భారతం సరిగ్గా తూర్పు ఆఫ్రికా తీరానికి అతుక్కుపోతుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో రెండు వేర్వేరు సంస్కృతులు ఆయా దేశాలలో నిలదొక్కుకున్నాయి. ఇప్పటికీ తూర్పు ఆఫ్రికా దేశాలలో గోపాలురు ఉన్నారు. వారి అష్ట భార్యలున్నారు. నేను చూశాను. అందరూ కలసి ఒకచోటే జీవిస్తారు. వారు నల్లనివారు. పద్మనయనమ్ములవారు. సింహబలురు. ఆఫ్రికాలో సింహాలు ఒక్క ఈ గోపాలురను చూస్తేనే పారిపోతాయి! ఏమయినా ఇది ఆంత్రోపాలజిస్టులు తేల్చవలసిన కథ. ఇప్పుడీ కథకు పెట్టుబడి– ఇటీవల అంటార్కిటిక్ ధ్రువంలో మంచు గడ్డ నుంచి 12 ట్రిలియన్ టన్నుల ముక్క విడిపోయి భూమి వేపు ప్రయాణం చేస్తోంది అని చదివాం. ఇది బొత్తిగా పొరుగువాడి చాప. ట్రిలియన్ అంటే? ఒకటి తరువాత 12 సున్నాలు. ఇలా చెప్పినా మన మనస్సుల్లో ఒక దృశ్యం రాదు. దాదాపు మన హర్యానా రాష్ట్రం కన్నా పెద్దది– కది లింది. ఇప్పుడేమవుతుంది? ఈ గ్రహం మీద మూడు వంతులు నీరు. ఒక వంతే నేల. నీరు కొన్ని కోట్ల మైళ్ల మేరకు అంటార్కిటిక్ ప్రాంతంలో ఘనీభవించి ఉండ డం వల్ల– మన దేశాలను అంటిపెట్టుకుని ఉన్న సముద్ర మట్టాలు ఇలా స్థిరంగా ఉన్నాయి. మరి రామకృష్ణా బీచ్ దగ్గర సముద్రం వెర్రితలలు వేయడానికీ, ఈ హరియాణా పరిమాణంలో మంచు తెగిపడడానికీ సంబంధం ఉందా? ఉంది బాబూ ఉంది. భూమి ఉపరితలం నానాటికీ వేడెక్కి– మంచు కరిగి– ఈ గ్రహం మీద మిగిలిన ఆ కాస్త భూమినీ ఆక్రమించుకుం టోంది. నేను ఆ మధ్య నార్వేలో ‘‘అరోరా బోరియాలిస్’ అనే ప్రకృతి వైభవాన్ని చూడడానికి వెళ్లాను. ట్రోమ్సో అనే ఊరు భూమికి కొన. అక్కడికి 2,500 మైళ్ల వరకూ సముద్రమూ, మంచూ ఉంది. అంటే ‘‘కరగని’ మంచు ఈ భూమిని ఎంత కాపాడుతోందో ఊహించవచ్చు. మరి ఈ నీరు తిరగబడితే? కరిగితే? అదిన్నీ– ఓ హరియాణా అంత మంచు ముక్క విరిగి భూమిని ఆక్రమించుకుంటే? ఇంత పెద్ద విషయాన్ని పామర జనానికి–అంటే మీకూ నాకూ అర్థమయ్యేటట్టు చెప్పడానికి తంటాలు పడుతున్నాను. మొన్న పారిస్ పర్యావరణ సమావేశంనుంచి ట్రంపు దొరగారు– ఈ పర్యావరణ కాలుష్యానికి మా ప్రమేయం లేదు అని సెలవు తీసుకున్నారు కానీ– రేపు తడిసే చాపల్లో వారి చాప పెద్దది. వాతావరణ నిపుణుల మాటల్ని వీలయినంత చిన్న పదాలలో చెప్పడానికి ప్రయత్నిస్తాను: మానవాళి ప్రకృతిపై చేస్తున్న జులుంకి ప్రకృతి చాలా క్రూరంగా సమాధానం చెప్పబోతోంది. దానికి సూచనే ఈ మంచు శకలం విడివడటం. మానవుడు చేస్తున్న అనర్థాన్ని సామూహిక చర్య ద్వారా సవరించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. పర్యావరణం వేడెక్కడం ఒక నమూనా అనర్థం. ఈ అనర్థానికి పెద్ద వాటా అమెరికాది. కళ్లుమూసుకుని ‘‘నన్ను ముట్టుకోకు’’ అని పెదవి విరిస్తే మన చేతల్తో మనమే మన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు. ఇందులో తిలాపాపం తలా ఒక్కరిదీ ఉంది. రాబోయే దశాబ్దాలలో ఉత్తర హిందూదేశం, దక్షిణ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని 1.5 బిలియన్ల ప్రజలు భరించలేని వడగాడ్పులకు లోనవుతారని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. అప్పుడు జనాభా 70 శాతం పెరుగుతుంది. కనీసం రెండు శాతం ఈ వేడికి ఆహుతయిపోతారు. అయితే మన అదృష్టం – మనం అప్పటికి ఉండం. కాకపోతే– మనం మన పిల్లల సంక్షేమాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నిష్క్రమిస్తాం. అంటార్కిటిక్ ప్రాంతంలో ఈ మంచు శకలం విరిగిపడడం– మానవుడు తెలిసి తెలిసి– తనకు తానే తవ్వుకుంటున్న భయంకరమైన గొయ్యి. సర్వనాశనానికి సూచన. ‘‘ప్రళయం’’ వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయంటారు. గొల్లపూడి మారుతీరావు -
అక్కడ ఐస్ ఏజ్ 4 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడింది!
వాషింగ్టన్: అరుణ గ్రహం(మార్స్)కు సంబంధించిన ఓ ముఖ్యమైన సమాచారాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. అరుణగ్రహంపై చివరి ఐస్ ఏజ్ 4 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిందని.. అరుణ గ్రహంపై ప్రయోగాలకు నాసా ప్రవేశపెట్టిన మార్స్ రికొనాయ్సెన్స్ ఆర్బిటర్(ఎమ్ఆర్ఓ) సమాచారాన్ని విశ్లేషించి శాస్త్రవేత్తలు నిర్థారించారు. అరుణ గ్రహం ఉత్తర దృవం వద్ద శాస్త్రవేత్తలు ఒక నిర్దేశిత ప్రదేశాన్ని(పోలార్ ఐస్ క్యాప్) గుర్తించారు. దీనికి పై భాగంలోని మంచు పొరలు వేగంగా పోగుచేయబడినవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఫలితాలు అరుణగ్రహంపై సంభవించే వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి దోహదం చేస్తాయని శాస్త్రవేత్త ఇసాక్ స్మిత్ తెలిపారు. గతంలోనూ అరుణ గ్రహంపై పలు ప్రయోగాల్లో వచ్చిన సమాచారాన్ని తాజా పరిశోధన ఫలితం బలపరుస్తోంది.