అక్కడ ఐస్ ఏజ్ 4 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడింది!
వాషింగ్టన్: అరుణ గ్రహం(మార్స్)కు సంబంధించిన ఓ ముఖ్యమైన సమాచారాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. అరుణగ్రహంపై చివరి ఐస్ ఏజ్ 4 లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిందని.. అరుణ గ్రహంపై ప్రయోగాలకు నాసా ప్రవేశపెట్టిన మార్స్ రికొనాయ్సెన్స్ ఆర్బిటర్(ఎమ్ఆర్ఓ) సమాచారాన్ని విశ్లేషించి శాస్త్రవేత్తలు నిర్థారించారు.
అరుణ గ్రహం ఉత్తర దృవం వద్ద శాస్త్రవేత్తలు ఒక నిర్దేశిత ప్రదేశాన్ని(పోలార్ ఐస్ క్యాప్) గుర్తించారు. దీనికి పై భాగంలోని మంచు పొరలు వేగంగా పోగుచేయబడినవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఫలితాలు అరుణగ్రహంపై సంభవించే వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి దోహదం చేస్తాయని శాస్త్రవేత్త ఇసాక్ స్మిత్ తెలిపారు. గతంలోనూ అరుణ గ్రహంపై పలు ప్రయోగాల్లో వచ్చిన సమాచారాన్ని తాజా పరిశోధన ఫలితం బలపరుస్తోంది.