frozen
-
నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!
ఏమాత్రం కదల్చడానికి వీలులేనంత తీవ్రంగా భుజం నొప్పి రావడం ఇంటి పనులు, కంప్యూటర్ల ముందు çకూర్చుని పనిచేసేవారికి తెలిసిందే. కారణాలు ఎన్ని ఉన్నా భుజాల నొప్పులు ఇటీవల చాలా సాధారణమయ్యాయి. ఇది దాదాపు అన్ని వయసుల వారికీ ఉండచ్చు. నొప్పిని భరిస్తూ అలాగే ఉండిపోతే భుజాల కదలికలు తగ్గుతాయి. సమయానికి చికిత్స చేయక΄ోతే సమస్య దీర్ఘకాలికంగా మారుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి రోజూ పది నిమిషాలు చేయదగిన వ్యాయామాలను నటి భాగ్యశ్రీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.వ్యాయామ బ్యాండ్రెండు చేతులతో వ్యాయామ బ్యాండ్ రెండు చివర్లను పట్టుకోవాలి.బ్యాండ్ సాయంతో వ్యాయామం చేయడానికి చేతులను ముందుకు చాచాలి. తిరిగి యధాస్థానానికి తీసుకురావాలి. ఇలాంటప్పుడు మోచేతులు తుంటిపక్కన నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాయామాన్ని 8 సార్లు చేయాలి.ఫ్రెంచ్ ప్రెస్చేతులను ఎంత వీలైతే అంత వెనకకు కదల్చాలితర్వాత ఒక చేతిని ముందు వైపుకు తీసుకోవాలి. తిరిగి ప్రారంభ స్థానానికి 3 దశలుగా రావాలి.ఈ వ్యాయామం 10–15 సార్లు చేయాలి. తర్వాత కొన్ని నిమిషాలు విరామం తీసుకోవాలి.ఓవర్ హెడ్నిటారుగా నిలబడి,. చేతులను తుంటి భాగానికి 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ∙వీలైనంత వరకు చేతులను తలమీదుగా పైకి ఎత్తాలి. వెన్నెముక వంపు రాకుండా నిటారుగా ఉంచాలి. తిరిగి మెల్లగా యధాస్థానంలోకి రావాలి. ఈ విధంగా 10–12 సార్లు చేయాలి. ఈ వ్యాయామాల గురించి డాక్టర్ కపూర్ మాట్లాడుతూ ‘ఫ్రోజెన్ షోల్డర్ కోసం చేసే వ్యాయామాల కదిలికల పరిధిని పెంచడానికి వీటిని రూపొందించారు. ఫ్రెంచ్ ప్రెస్, బ్యాండ్ ఫుల్ రెండూ వేరు వేరు పద్ధతుల్లో ఉండటం వల్ల భుజాలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది’ అని తెలియజేశారు. దీంతోపాటు మరో రెండు వ్యాయామాల గురించి వివరించారు.లోలకం మాదిరి.. గడియారంలోని లోలకం కదలికలు ఉన్నట్టు ఈ వ్యాయామం ఉంటుంది. ఫ్రోజెన్ షోల్డర్ చేయి కిందికి వేలాడదీయడానికి వీలుగా కొద్దిగా వంగాలి. ఒక అడుగు వ్యాసంతో చేతిని చిన్న వృత్తంలా తిప్పాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే చాలు.టవల్‌తో సాగదీయడం..రెండు చేతులతో వీపు వెనక నుంచి ఒక టవల్‌ను సమాంతరంగా పట్టుకోవాలి. నొప్పి ఉన్న భుజం వైపుకు టవల్‌ను లాగడానికి మరో చేతిని ఉపయోగించాలి.లోపలి వైపుకు... మూసి ఉన్న తలుపు పక్కన నిలబడి, డోర్ నాబ్ చుట్టూ వ్యాయామ బ్యాండ్ ఒక చివర కట్టాలి. మోచేతిని 90 డిగ్రీల కోణంలో ఉంచి, నొప్పి ఉన్న చేతితో వ్యాయామ బ్యాండ్ మరొక చివరన పట్టుకోవాలి. బ్యాండ్‌ని మీ శరీరం వైపు రెండు లేదా మూడు అంగుళాలు లాగి కొన్ని సెకన్లపాటు పట్టుకోవాలి.ఇలా 10 నుంచి 15 సార్లు పునరావృతం చేయాలి. (చదవండి: నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!) -
తాజా వర్సెస్ ఫ్రోజెన్ కూరగాయాలు ఏది ఆరోగ్యానికి మంచిది..?
ఘనీభవించి కూరగాయలు కంటే ఫ్రెష్‌గా ఉన్న కూరగాయలే బెటర్ అనేది చాలామంది భావన. అప్పటికప్పుడు దొరికిన వాటిల్లోనే మంచి పోషకాలు ఉన్నాయనుకుంటాం. కానీ ఇది కరెక్ట్ కాదని చెబుతున్నారు నిపుణులు. ఘనీభవించిన ఫ్రోజెన్ కూరగాయల్లోనే ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటీ తాజా కూరగాయాల కంటే ఫ్రోజెన్ కూరగాయలే మంచివా? అదెలా అనుకుంటున్నారా..?. కానీ నిపుణులు మాత్రం శీతలీకరణం చేసిన కూరగాయల్లో పోషకాల నష్టం జరిగేందుకు ఆస్కారం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకు గల కారణాలను కూడా సవివరంగా వెల్లడించారు.నిపుణులు అభిప్రాయం ప్రకారం..స్టోర్‌లో శీతలీకరణం చేసిన బఠానీలు, బ్రోకలీ, బీన్స్, క్యారెట్లు,మొక్కజొన్నలు కూరగాయలు మనం తాజాగా అమ్మకందారుడి నుంచి కొన్నంత ఆరోగ్యకరమైనవని, వాటిలో విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. పరిశోధన ప్రకారం దాదాపు పదిమందిలో ఒక్కశాతం మంది మాత్రమే తగినంత పండ్లు కూరగాయలను తింటున్నారట. కాబట్టి చాలామంది పోషకాహార నిపుణులు ఏ రూపంలోనైనా ఎక్కువ ఉత్పత్తులను తినాలని సిఫార్సు చేస్తున్నారు. ముందుగా కత్తిరించిన కూరగాయల్లో ఎక్కువ షెల్ఫ్ జీవితాన్ని కలిగి ఉంటాయి. తాజా వాటికంటే తక్కువ ధరను కలిగి ఉంటాయి. తాజా కూరగాయాలు చాలా దూరం ప్రయాణించి ఆయ ప్రాంతాలకు రవాణ అవ్వుతాయి. అందువల్ల తేలికగా వాడిపోవటం, ముఖ్యమైన పోషకాలు కోల్పోవటం జరుగుతుంది. అదే ఘనీభవించిన కూరగాయాలు అయితే పండించిన గంటల్లోనే ఫ్రీజర్లకు పంపబడతాయి. ఫ్రోజెన్ కూరగాయలు ఎలా ఆరోగ్యకరం అంటే.వీటిలో ఫైబర్, పొటాషియం,విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరాన్ని గుండె జబ్బులు, కేన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి.బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అలాగే వీటిని తాజాదనం కోల్పోకమునుపే తీసుకోవడం మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులుఘనీభవంచిన కూరగాయలు గరిష్ట పరిపక్వత వద్ద పండించడం, శుభ్రం చేయడం పోషక నాణ్యత కోల్పోకుండా చేస్తారు. ఈ క్రమంలో కూరగాయలపై ఉండే బ్యాక్టీరియా నాశనం అవువుతుంది. ముఖ్యంగా ఈప్రాసెస్‌లో పోషకాలను రాజీ చెయ్యదు. ఘనీభవించిన కూరగాయల్లో విటమిన్ సీ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి ప్రాసెస్ చేసిన ఆహారాల్లో రంగులు, స్వీటెనర్లు కారణంగా ఆరోగ్యానకి మంచిదికాదు. అయితే అది కూరగాయాల విషయంలో కాదని చెబుతున్నారు. అలాగే ఈ క్రమంలో ఫైబర్ కోల్పోతున్నాయా..? కాయగూరలు అనే విషయం గమనించి మరీ ఘనీభవించేలా స్టోర్ చెయ్యాలి. అంతేగాదు రిఫ్రిజిరేటర్లో కూరగాయాలను ఎలా నిల్వ చేస్తున్నారు అనేది కూడా ముఖ్యం.సరైన ఉష్ణోగ్రతల వద్ద కూలింగ్‌లో కూరగాయలు నిల్వ ఉంటున్నాయో లేదో కూడా గమనించాలి. ముఖ్యంగా ఘనీభవించిన కూరగాయలని స్థిరమైన సున్నా డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద నిల్వ చేయాలనుకుంటే సుమారు 18 నుంచి 12 నెలల పాటు చెడిపోకుండా ఫ్రిజర్‌లో ఉత్తమంగా ఉండేలా చూడండి.(చదవండి: మన దేశంలో ఈ నగరాల్లో ఎట్టిపరిస్థితుల్లో మాంసాహారం దొరకదట..!) -
గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని తెలుగు విద్యార్థి దుర్మరణం
కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల వైద్య విద్యార్థి దాసరి చందు కన్నుమూశారు. ఈ విషాద ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన కిర్గిస్థాన్‌లో కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీలో పరీక్షలు ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి ఆదివారం జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాడు. అయితే గడ్డకట్టిన నీడిలో చిక్కుకుని మృతి చెందాడు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి చేరేలా సాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించినట్లు చందు తల్లిదండ్రులు తెలిపారు. కేంద్ర మంత్రి కిర్గిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, మృత దేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి తెలిపారు. కాగా చందు తండ్రి అనకాపల్లిలో హల్వా అమ్మే భీమరాజు. భీమరాజు రెండో కుమారుడు చందు. -
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్‌లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్‌లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్‌లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్‌కు వేదికైంది. బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్‌ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్‌ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్‌ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్‌ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్‌తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్‌ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్‌లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్‌ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
వాహ్! ఐస్ టీ వాహ్!
బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది. కాని మంచు సెలయేటిలో కూచుని మంచుని కరిగించి టీ కాచుకుంటే? అదీ బాగుంటుందని 78 మిలియన్ల వ్యూస్ చెబుతున్నాయి. కశ్మీర్‌కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు. వైరల్ అయ్యారు. చల్లటి ప్రాంతంలో అందరూ తాగే ద్రవం టీ. చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు గక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు. రాహుల్ యాదవ్ అనే ట్రావెలర్ ఇన్‌స్టాలో ‘ట్రాహులర్’ అనే అకౌంట్లో తన ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. జనవరి 29న అతను తన ఇద్దరు మిత్రులతో ఒక వీడియో పెట్టాడు. అది విపరీతంగా జనానికి నచ్చేసింది. కారణం... కశ్మీర్లో నిర్మానుష్యమైన లోయలో, గడ్డ కట్టిన సెలయేటి మధ్యలో కూచుని ఆ మిత్రులు ‘టీ తయారు చేశారు’. మామూలుగా కాదు. టీ గిన్నెలో అక్కడున్న మంచును వేసి మరీ! క్యాంప్ స్టవ్ మీద ఆ మంచు నిండిన టీ గిన్నె కాసేపటికి వేడి నీరుగా మారింది. అందులో కొంత టెట్రా మిల్క్ వేశారు. ఆ పై టీయాకును, చక్కరను వేస్తే చిక్కటి రంగులో ఘుమఘుమలాడే టీ తయారైంది. ఇటీవల విడుదలైన ‘డంకీ’లోని పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉండగా ఆ ముగ్గురూ మనకు ఈర్ష్య కలిగేలా టీ తాగారు. ఈ వీడియో రెండు వారాల్లో 7 కోట్ల 8 లక్షల మంది చూశారు. ‘మేం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా తాగకపోతామా?’ అని కొందరంటే ‘సేఫేనా?’ అని కొందరన్నారు. బ్యాక్టీరియా ఉంటుందేమో అని మరికొందరు సందేహం వెలిబుచ్చారు. బాగా వేడి చేశారు కనుక బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. అయినా స్వచ్ఛమైన మంచు టీ తయారు చేసుకుని తాగే ముందు ఈ సందేహాల గోల ఏల? -
వేల ఏళ్ల పురాతనమైన వినాశకర వైరస్ల విజృంభణ!
వాషింగ్టన్: రాజులు, సంపన్నులు దాచిన గుప్తనిధులు, లంకెబిందెలు వందల ఏళ్లకు ఇంకెవరికో దొరికితే సంబరమే. కానీ అందుకు భిన్నంగా జరిగితే?. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు మంచుమయ ఆర్కిటిక్ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్లు పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్‌లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సాంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్ సరస్సులో తవి్వతీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాలకు జాంబీ(దెయ్యం)వైరస్‌లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకో జీవికి సంక్రమించే సత్తా ఇంకా వీటికి ఉందో లేదో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ చెప్పారు. ‘‘ఆర్కిటిక్ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్‌రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే అలా పాడవ్వకుండా అలాగే ఉంటుంది. ఒక 50వేల సంవత్సరాల తర్వాత సైతం తినేయొచ్చు’ అని క్లావెరీ అన్నారు. నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్ ఎరాస్మస్ మెడికల్ సెంటర్లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్‌మెన్స్ మరికొన్ని వివరాలు చెప్పారు. ‘‘ ఈ మంచు ఫలకాల కింది వైరస్లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేం. అయితే 2014లో సైబీరియాలో మేం ఇదే తరహా వైరస్‌లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలింది. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశాం. ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్లు సోకాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండొచ్చు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాం’’ అని వేరియాన్ కూప్‌మెన్స్ విశ్లేíÙంచారు. -
46 వేల ఏళ్ల నాటి పురుగుని బతికించారు! పిల్లల్నికంటోంది కూడా..!
ఎప్పుడూ మంచుతో దట్టంగా కప్పబడి ఉండే సైబిరియాలో ఓ పురుగుని గుర్తించారు శాస్త్రవేత్తలు. దాన్ని తీసుకోస్తే ఎన్నో అద్భుతాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలే విస్తుపోయాలే బతకడమే గాక పిల్లల్ని కంటోంది. నిజానికి కీస్తూ పూర్వం నాటి వాటిని గుర్తిస్తే అబ్బురపడతాం. అలాంటిది.. ఇది ఏకంగా వేల ఏళ్ల నాటిది. పైగా అంతటి మంచులో ఘనీభవించి ఉండి కూడా బతకడం నిజంగా ఆశ్చర్యమే కదా!. వివరాల్లోకెళ్తే..సైబీరియన్ పెర్మాఫ్రాస్ట్ మంచు ప్రాంతంలో భూమి ఉపరితలానికి 40 మీటర్లు కింద మంచులో ఘనీభవించి ఉన్న ఓ పురుగుని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీన్ని ల్యాబ్‌కి తీసుకొచ్చి పరిశోధనలు చేశారు డ్రెస్డన్లోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ సెల్ బయాలజీ అండ్ జెనిటిక్స్కి చెందిన ప్రోఫెసర్ ఎమెరిటస్. 'క్రిప్లోబయోసిస్' అనే నిద్రాణ స్థితిలో జీవించిందని తెలిపారు. ఇది అంతటి గడ్డకట్టే చలిలో చెడిపోకుండా అలానే ఉంది. నీరు, ఆక్సిజన్ లేకపోవడం, ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయిన స్థితిని కూడా తట్టుకుని బతికిందన్నారు. ఇది పురాతన రౌండ్‌వార్మ్(వానపాము) జాతికి చెందినదని తెలిపారు. ఇది దారుణమైన వాతావరణ స్థితులను తట్టుకుని బతకగలవని చెప్పారు. ఆయా వాతావరణ స్థితుల్లో.. ఆ పురుగుల్లో జీవక్రియ రేట్లు గుర్తించలేని స్థాయిలో పడిపోతాయి. ఆ పురుగుపై ఉన్న నిక్షేపాల ఆధారంగా 46 వేల ఏళ్ల క్రితం నాటిదని లెక్కించారు శాస్త్రవేత్తలు. దానికి తాము ప్రాణం పోయడంతో జీవించడం ప్రారంభించడమే గాక పిల్లల్ని కంటోందని అన్నారు. ఇలానే ఐదేళ్ల క్రితం, రష్యాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికో కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ సాయిల్ సైన్స్ శాస్త్రవేత్తలు సైబీరియన్‌లో రెండు రౌండ్‌వార్మ్ జాతులను కనుగొన్నారు. తదుపరి విశ్లేషణ కోసం జర్మనీలోని ల్యాబ్‌లకు దాదాపు 100 పురుగులను తీసుకెళ్లారు. ఇన్స్టిట్యూట్లోని రెండు పురుగులను నీటితో రీహైడ్రేట్ చేయడం ద్వారా బతికించారు. వాళ్లు కూడా వాటిని..దాదాపు 45 వేల నుంచి 47 వేల ఏళ్ల నాటి పురుగులని వాటిపై ఉన్న నిక్షేపాల ఆధారంగా చెప్పుకొచ్చారు. పురుగులపై జన్యు విశ్లేషణ చేశారు. దీంతో ఇవి అప్పటి జాతికి చెందినవని తేలింది. దీనిని పరిశోధకులు ‘పానాగ్రోలైమస్ కోలిమెనిస్’ అని పిలుస్తారు. క్రిప్టోబయోసిస్ అనే నిద్రాణ స్థితిలో ఉన్న ఈ పురుగులు మనుగడ సాగించడానికి ట్రెహలోస్ అనే చక్కెరను ఉత్పత్తి చేస్తాయి. అవి గడ్డకట్టినా.. నిర్జలీకరణాన్ని తట్టుకొని కొన్ని ఏళ్లు నిద్రాణ వ్యవస్థలో ఉండగలవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అంశం ఇప్పుడూ సైన్సు పరంగా ఓ అద్భుత సంచలనంగా ఉంది. ఈ జీవులు ఒకరకంగా మారుతున్న జీవైవిధ్యాన్ని రక్షించే ప్రాధాన్యతను నొక్కి చెప్పడమే గాక విపరీతమైన పరిస్థితుల్లో జీవించే సామర్థ్యం గురించి తెలియజేసిందన్నారు. అలాగే నాటి కాలం, అప్పటి పరిస్థితులు, వాటి జీవనశైలిని.. తెలుసుకోవాడానికి ఇదోక గొప్ప వనరుగా ఉంటుదన్నారు పరిశోధకులు. (చదవండి: కార్యాలయాల్లో 'వై' బ్రేక్! ఏంటంటే ఇది!) -
రోడ్డుపై సడన్‌గా విగ్రహంలా మారిన మహిళ.. టైమ్ ట్రావెల్ చేస్తున్నదంటూ..
సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పలు వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా వైరల్‌గా మారిన ఒక వీడియోలో రోడ్డుపై నడుస్తున్న మహిళ ఉన్నట్టుండి విగ్రహంలా మారిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది టైమ్ ట్రావెల్ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో మొదట్లో చూసినప్పుడు ఏమీ తేడా కనిపించదు. ముందుగా ఒక మహళ రోడ్డుమీద వెళుతున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే ఆమె ఉన్నట్టుండి ఆగిపోతుంది. కొద్ది సెకెన్ల తరువాత ఆమె తిరిగి నడుస్తుంది. ఆ కాసేపట్లో జరిగినదానిని చూసి జనం అవాక్కవుతున్నారు. ఈ వీడియోను తొలుత టిక్‌టాక్‌లో షేర్ చేశారు. రోడ్డుపై నడుస్తున్న ఆమె సడన్‌గా ఆగిపోయే సరికి ఆమె ఒక బొమ్మలా కనిపించింది. ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తి ‘ఆమె ఒక్కసారిగా ఎందుకలా ఆగిపోయింది? కొద్దసేపటికి తిరిగి ఎందుకు నడిచింది? అని ప్రశ్నిస్తున్నారు. టిక్‌టాక్‌లో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకూ 4.8 మిలియన్లకుపైగా నెటిజన్లు వీక్షించారు. 4,60 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. వేలసంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్, ఫేస్బుక్ ప్లాట్పారంలలోనూ షేర్ అయ్యింది. ఒక యూజర్ ఈ వీడియోపై కామెంట్ చేస్తూ ‘వైఫై చెడిపోయింది. ఒక సెకెను పాటు డిస్కనెక్ట్ అయ్యింది’అని పేర్కొన్నారు. కాగా గతంలోనూ ఇటువంటి టైమ్ ట్రావెల్ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అయితే అవేవీ నిర్థారణ కాలేదు. ఇది కూడా చదవండి: ‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’..ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్ Internet Attempts To Get To Bottom Of Viral Video In Which Woman Appears Literally Frozen In Time pic.twitter.com/0i8y9oqol6 — Know Your Meme (@knowyourmeme) July 17, 2023 -
పరిస్థితి ఇంత దారుణమా!.. చలికి ఏకంగా బట్టలే గడ్డకట్టిపోయాయి
-
గడ్డకట్టిన జలపాతం.. ఎక్కడో కాదు మన దగ్గరే..!
సిమ్లా: కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తర భారత్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కురవడంతో రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం అత్యల్పంగా 3.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో నీరు గడ్డకట్టుకుపోతోంది. హిమాలయాలకు సమీపంలోని హిమాచల్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతుండటంతో నీళ్లు గడ్డకట్టుకుపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. హిమాచల్ కులూలోని ఓ జలపాతం గడ్డకట్టుకుపోయింది. అతి శీతల వాతావరణంతో గడ్డకట్టి మంచుతో చెక్కిన శిల్పాలుగా ఆకట్టుకుంటోంది. గడ్డకట్టిన జలపాతం అందాలను చూసేందుకు పర్యటకులు తరలివస్తున్నారు. On #Udaipur - #Tindi road... Near Bhim bagh 🥶 7th January 2023#Lahaul , #HimachalPradesh@SkymetWeather @jnmet @Mpalawat @JATINSKYMET pic.twitter.com/IqLve8xh1I — Gaurav kochar (@gaurav_kochar) January 7, 2023 హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో అతి శీతల వాతావరణంతో గడ్డకట్టిన జలపాతం ఇదీ చదవండి: Joshimath: కుంగుతున్నా వదలట్లేదు -
విషాదం.. పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి.. మంచులో గడ్డకట్టి..
వాషింగ్టన్: పుట్టినరోజు నాడే మృత్యు ఒడికి చేరాడు ఓ వ్యక్తి. మంచులో గడకట్టి ప్రాణాలు విడిచాడు. అతను కన్పించట్లేదని పోలీసులను ఆశ్రయించిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత కొన్ని గంటలకే విషాదంలో మునిగిపోయారు. మంచుదిబ్బలో అతని మృతదేహం దొరకడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా న్యూయార్క్ నగరంలోని బఫెలోలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు విలియం క్లే(56). డిసెంబర్ 24న అతని బర్త్‌డే. ఆ మరునాడే క్రిస్మక్ కూడా కావడంతో ఆ ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. అయితే అమెరికాలో అప్పటికే మంచు తుఫాన్ బీభీత్సం సృష్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 24న ఇంటి దగ్గర ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు విలియం. చాలాసేపైనా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే మంచులో ఓ శవం కన్పించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది విలియందేనని పోలీసులు గుర్తించారు. కుటుంబసభ్యులు కూడా దీన్ని ధ్రవీకరించారు. పుట్టినరోజు నాడే తన తండ్రి చనిపోవడంతో విలియం కుమారుడు జూల్స్ క్లే కన్నీటి పర్యంతమయ్యాడు. ఒక్కరోజు ముందే తండ్రితో చాలాసేపు మాట్లాడానని, ప్రేమిస్తున్నాని చెప్పానని బోరున విలపించాడు. మరోవైపు విలియం సోదరి అతడు మరణించిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. అతడి మృతదేహం వీడియోలను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. విలియంకు అంత్యక్రియలు నిర్వహించేందుకు విరాళాలు ఇవ్వాలని కోరింది. దాతలు వెంటనే స్పందించి 5,000 డాలర్లుకుపైగా(దాదాపు రూ.4లక్షలు) సమకూర్చారు. చదవండి: పండుగకు ఫ్యామిలీతో షాపింగ్ చేస్తుండగా కాల్పులు.. టిక్ టాక్ స్టార్ మృతి -
విషాదం: చిన్నా.. నీ సాహసం వృథా అయ్యిందిరా!
ఆ చిన్నారి సాహసం వృథా అయ్యింది. స్నేహితుల్ని రక్షించాలనే తాపత్రయం.. చివరకు అతన్ని కూడా బలిగొంది. సెంట్రల్ ఇంగ్లండ్ బర్మింగ్హమ్ సోలిహల్ సరస్సు విషాదంలో ముగ్గురు పిల్లలు కన్నుమూయగా.. స్థానికంగా విషాదం అలుముకుంది. తన స్నేహితుల్ని కాపాడబోయి ప్రాణాలు అర్పించిన జాక్ జాన్సన్‌ను(10) తల్చుకుని స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఇంగ్లండ్‌లో మైనస్ ఉష్ణోగ్రతల కారణంగా.. విపరీతంగా మంచు కురుస్తోంది. వాతావరణ ప్రభావంతో.. సోలిహల్‌లోని బాబ్స్ మిల్ పార్క్ దగ్గర ఓ సరస్సు గడ్డ కట్టుకుపోయింది. ఆదివారం మధ్యాహ్నాం నలుగురు చిన్నారులు ఆ సరస్సులో ఆడుకోవడానికి వెళ్లారు. హఠాత్తుగా ఓ చోట మంచు ఫలకం విరిగింది. దీంతో పిల్లలు నీళ్లలోకి మునిగిపోయారు. తన స్నేహితులు మునిగిపోతున్న విషయం ఒడ్డు నుంచి గమనించిన జాక్.. పెద్దలను పిలవాలనే సంగతి మరిచాడు. మరో మాట లేకుండా ధైర్యం చేసి నీళ్లలోకి దూకాడు. ఆ సమయంలో సైకిల్‌పై వెళ్తున్న ఓ యువతి.. కేకలు వేయడం ప్రారంభించింది. కానీ, జాక్ ప్రయత్నం ఫలించలేదు. పైగా క్షణాల్లో మంచు గడ్డ కట్టుకుపోవడంతో.. ఆ సరస్సు కిందే అతనూ చిక్కుకున్నాడు. సమాచారం అందుకోగానే.. పరుగున అక్కడికి చేరుకున్న జాక్ జాన్సన్ తాత, అతన్ని మిగతా పిల్లలను రక్షించే యత్నం చేసినా లాభం లేకుండా పోయింది. మంచు పొర మందంగా ఉండడంతో దానిని బద్ధలు కొట్టడం ఆలస్యం అయ్యింది. హుటాహుటినా సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ఓ అధికారి తన చేతులతో ఆ మంచు ఫలకాన్ని బద్ధలు కొట్టే యత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జనం చేరిన ఇరవై నిమిషాలకు.. పిల్లల్ని అచేతనంగా బయటకు తీశారు. నలుగురు పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. అందులో ముగ్గురు(జాక్‌తో సహా) అప్పటికే కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఆరేళ్ల మరో చిన్నారి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకెవరైనా పిల్లలు అందులో ఇరుక్కుపోయారా? అనే కోణంలో అధికారులు గాలింపు చేపట్టారు. చివరకు ఎవరూ లేరని విషయం నిర్ధారించుకుని చర్యలు ఆపేశారు. చిన్నారుల మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోగా.. అంతా నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని రిషి సునాక్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
రూ. 480 కోట్ల సమీకరణలో హెచ్ఎంఏ ఆగ్రో
న్యూఢిల్లీ: ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 480 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ. 330 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ పేర్కొంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రమోటర్లయిన వాజిద్ అహ్మద్ రూ. 120 కోట్లు విలువ చేసే షేర్లు, గుల్జార్ అహ్మద్, మెహ్మూద్ ఖురేషి తదితరులు తలో రూ. 49 కోట్లు విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 135 కోట్లను .. వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ దాదాపు 40 దేశాలకు మాంసం ఎగుమతి చేస్తోంది. ఆదాయంలో 90 శాతం వాటా ఎగుమతులదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,720 కోట్లు కాగా రూ. 73 కోట్ల లాభం నమోదు చేసింది. -
ఆ నది గడ్డకట్టడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!
ఇంగ్లాండ్‌ను చలిపులి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సౌత్ కుంబ్రియాలోని అల్డింగ్హమ్ బీచ్ గడ్డకట్టుకుపోయింది. అలాగే సౌత్ వెస్టు లండన్‌లోని టెడింగ్టన్ వద్ద థేమ్స్ నది ఘనీభవించింది. పెద్ద మంచు ముక్కలా మారిపోయింది. ఇక్కడ సముద్రపు పక్షులు సందడి చేస్తున్నాయి. థేమ్స్ నది గడ్డకట్టడం 60 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. రావెన్స్వర్త్, నార్తు యార్క్‌షైర్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రహదారులు, వీధుల్లో 4 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంలో చలిగాలులు వీస్తున్నాయి. కేంబ్రిడ్జిషైర్‌లోని గ్రేట్ ఔసీ నదిలో పడవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రతికూల వాతావరణం కారణంగా డేవన్, కార్న్‌వాల్, స్కాట్లాండ్లో కార్చిచ్చు రగిలింది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేశారు. -
మంచులో బుల్లి ఎల్సా డ్యాన్స్.. చూశారా..
-
మంచులో బుల్లి ఎల్సా డ్యాన్స్.. చూశారా..
టెక్సాస్: సాధారణంగా చిన్నపిల్లలు అన్నం తినమని మారాం చేస్తే కార్టూన్ వీడియోలు చూపించి తినిపిస్తాము. ఇక వాటిని చూసి ఆకర్షితులైన పిల్లలు.. నచ్చిన కార్టూన్ పాత్రలను అనుకరిస్తూ ఉంటారు. అలాగే ఈ చిన్నారి కూడా. తనకు నచ్చిన ‘ఫ్రాజెన్’ కార్టూన్ సినిమాలోని లీడ్‌రోల్ పాత్ర ‘ఎల్సా’ లాంటి దుస్తులను ధరించి మంచులో పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ.. అచ్చం ‘ఎల్సా’లా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. టెక్సాస్‌కు చెందిన 2 ఏళ్ల చిన్నారి మాడెలిన్ ‘ఫ్రాజెన్’ సినిమాలోని యువరాణి ‘ఎల్సా’ ఫ్రాక్ను ధరించి.. ఆనందంగా మంచులో డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పాపపై ముద్దుల వర్షం కురిపిస్తూ.. వీడియో షేర్ చేసిన చిన్నారి తల్లికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక ఈ వీడియోలో చిన్నారి అచ్చం ‘ఎల్సా’ లాంటి ఫ్రాక్, షూ, తలపై కీరిటం ధరించి డిస్నీలోని ‘లెట్ ఇట్ గో’ పాటను ముద్దు ముద్దుగా పాడుతోంది. ఇక బుల్లి ఎల్సా వీడియోకు ఇప్పటి వరకు 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. పెరుగుతూనే ఉంది. ‘చూడ్డానికి చిన్న నటిలా ఉంది. వావ్! అచ్చం ఎల్సాలానే ఎంత ముద్దుగా ఉందో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ చిన్నారి తల్లి క్రిస్టీ మైకేల్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘మాడెలిన్ రోజూ ‘ఫ్రాజెన్’ చూస్తుంది. తనకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో యువరాణి ఎల్సా అంటే మరీ ఇష్టం. ఈ సినిమా చూస్తున్నంతసేపు సీన్లోని ప్రతి డైలాగ్‌ను ముందే చెప్తుంది’ అంటూ రాసుకొచ్చారు. -
-56 డిగ్రీలు.. గడ్డకట్టి ప్రాణాలు విడిచాయి..
కజకిస్థాన్, మధ్య ఆసియా : మధ్య ఆసియా దేశాలు చలికి గడ్డకట్టుకుపోతున్నాయి. ఆర్కిటిక్ ఖండం స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మధ్య ఆసియా దేశాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కజకిస్థాన్‌లో మంచు తీవ్రతకు జంతువులు గడ్డ కట్టి ప్రాణాలు విడిచాయి. ఈ హృదయవిదారక దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మంచుదిబ్బలో కూరుకుపోయి గడ్డకట్టి మరణించిన కుక్క ఫెన్సింగ్‌ను దాటేందుకు ప్రయత్నించిన కుందేలు అందులో ఇరుక్కుపోయి చలి తీవ్రతకు గడ్డకట్టి మరణించింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయిన కుందేలును స్థానికులు ఫెన్సింగ్ నుంచి బయటకు తీశారు. అదే ప్రాంతంలో మంచు దిబ్బను దాటడానికి ప్రయత్నించిన శునకం కూడా దానిలో ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచింది. ప్రపంచంలోని అత్యంత శీతల ప్రదేశం ‘ఓమియాకాన్’ సైబీరియాలోనే ఉంది. ఇక్కడ శీతాకాలపు ఉష్ణోగ్రత -67 డిగ్రీలకు పడిపోతుంది. -
మంచు తుపాను : గడ్డకట్టుకుపోయి ప్రాణాలు వదిలారు
లెబనాన్ : దేశంలో రావణకాష్టంలా రగులుతున్న అంతర్యుద్ధం కోరల నుంచి దూరంగా వెళ్లి బ్రతకాలనుకున్న సిరియా శరణార్ధులపై ప్రకృతి కన్నెర్రజేసింది. సిరియాను వదిలి లెబనాన్‌లో ప్రవేశించాలంటే సరిహద్దులోని పర్వతాలను దాటాల్సివుంటుంది. సరిహద్దును జాగ్రత్తగా దాటేందుకు శరణార్థుల గ్రూపు ఇద్దరు స్మగ్లర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సిరియా నుంచి బయల్దేరిన శరణార్థులు గ్రూపు లెబనాన్ సరిహద్దులోని మన్సా వద్దకు వెళ్లేసరికి పెను మంచు తుపాను ప్రారంభమైంది. దీంతో గ్రూపులోని వారందరూ చెల్లాచెదురయ్యారు. కొందరు మంచు తుపాను ధాటికి గడ్డకట్టుకుపోయి సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో పసిపిల్లలు కూడా ఉండటం మరింత బాధాకరం. ఘటనపై సమాచారం అందుకున్న లెబనీస్ పౌర రక్షణ అధికారులు శనివారం మంచులో కూరుకుపోయిన 15 మంది శరణార్థుల మృతదేహాలను వెలికి తీశారు. శరణార్థులను ప్రమాదంలో వదిలేసిన ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకూ 10 లక్షల మంది సిరియన్లు లెబనాన్‌కు వలస వెళ్లారు. 2015లో దేశంలో ప్రవేశించే శరణార్థులపై లెబనాన్ ఆంక్షలు విధించింది. -
స్తంభించిన బ్యాంక్ లావాదేవీలు
► ఉద్యోగుల ఒకరోజు సమ్మె ► ఎస్బీఐ ప్రధాన శాఖల ఎదుట నిరసన కార్యక్రమాలు తిరుపతి (అలిపిరి): బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతవైుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు మంగళవారం బంద్ పాటించారు. జిల్లాలో 20వేల మంది ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపటా్టరు. 593 జాతీయ బ్యాంకు శాఖల లావాదేవీలు స్తంభిం చాయి. చితూ్తరు, మదనపల్లె, పుతూ్తరులోని ఎస్బీఐ ప్రధాన శాఖల ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపటా్టరు. తిరుపతి తిలక్ రోడ్డు బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డప్పులతో హోరెత్తించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ తిరుపతి కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కార్మిక చట్టా లను యజమాన్యానికి అనుకూలంగా మార్చి చట్ట సవరణలు చేయాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ కాన్ఫెడరేషన్ నాయకులు సూర్యకుమార్, మునస్వామి, ఆది నారాయణ, నరేంద్ర సింహ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కృష్ణ, ప్రసాద్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు కె.వి.ఎస్.ఎన్.మూర్తి, గిరిధర్, ప్రసాద్ పాల్గొన్నారు. -
పన్నెండేళ్ల పిండం.. ఆరోగ్యకరమైన బిడ్డ
చైనాలో అత్యంత అరుదైన శిశువు జన్మించి ప్రపంచ ఖ్యాతి గాంచింది. 12 ఏళ్ల పాటు ఆస్పత్రిలో భద్రపరచిన పిండం.. దేశంలో లాంగెస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీగానే కాక అత్యంత ఆరోగ్యకరమైన బిడ్డగా పేరు తెచ్చుకుంది. చైనా వాయవ్య షాంగ్జీ రాష్ట్రంలోని 40 ఏళ్ల మహిళ లీ గేవ్ తన రెండో కొడుకుగా 3.440 కిలోగ్రాముల బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. గ్జియాన్ నగరంలోని తంగ్డు ఆస్పత్రిలో బుధవారం లీ తన బిడ్డకు జన్మనిచ్చింది. మహిళల్లో సంతానోత్పత్తి, గర్భధారణపై ప్రభావం చూపే ఫెలోపియన్ నాళాలు మూసుకుపోవడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్న లీ గేవ్.. 2003 లో ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పట్లో డాక్టర్లు ఆమె నుంచి సేకరించిన 12 అండాలను.. ఆమె భర్త వీర్యకణాలతో కలపి పిండాలుగా రూపొందించారు. వాటిలోని రెండు పిండాలను లీ గర్భంలో ప్రవేశపెట్టారు. మిగిలిన వాటిలో ఆరోగ్యంగా ఉన్న ఏడింటిని అలాగే ఆస్పత్రిలోని రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్లో భద్రపరిచారు. అనంతరం 2004 లో లీ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్నుంచీ అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఆ పిండాలను భద్రపరిచడానికి ఆస్పత్రికి రోజుకు 50 సెంట్లు అంటే సుమారు 45 రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తోంది. గతేడాది చైనా ఒకే బిడ్డ విధానాన్ని ఎత్తివేయడంతో లీ.. రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. దీంతో భద్రపరిచిన పిండాల నుంచి రెండు ఆరోగ్యమైన పిండాలను డాక్టర్లు ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి విజయవంతమైంది. సాధారణంగా తమ ఆస్పత్రిలో ఈ పద్ధతిని అవలంబించే సమయంలో గర్భంలోకి రెండు మూడు పిండాలను ప్రవేశపెడతారని, ఎందుకంటే వాటిలో 40 శాతమే సురక్షితంగా ఉండే అవకాశం ఉందని తంగ్డు ఆస్పత్రి రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ వాంగ్ గ్జియో హాంగ్ తెలిపారు. పిండాలను భద్రపరచడంతో అదృష్టం కొద్దీ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కలిగిందని లీ గేవ్ భర్త ఆనందంగా చెబుతున్నాడు. మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ 1978 లో బ్రిటన్‌లో జన్మించాడు. ఆ తర్వాత సుమారు 50 లక్షల మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జన్మించారు. చైనా ప్రధాన భూభాగంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జెంగ్ మెంగ్జు 1988 లో జన్మించాడు. చైనాలో సుమారు 40 శాతం మంది వంధ్యత్వంతో బాధపడుతున్నారని, ప్రభావవంతమైన పునరుత్పత్తి సహాయ పద్ధతుల్లో ఐవీఎఫ్ ఒకటి అని వాంగ్ తెలిపారు. 2003 నుంచీ తంగ్డూ ఆస్పత్రి పిండాలను భద్రపరచడం ప్రారంభించిందని ఇప్పటివరకూ సుమారు లక్షకు పైగా పిండాలను భద్రపరచగా, వాటిలో 27000 వరకూ పునరుత్పత్తికి వినియోగించామని... ఈ పద్ధతి ద్వారా 4,293 ఆరోగ్యకరమైన టెస్ట్ ట్యూబ్ బేబీలు జన్మించినట్లు వాంగ్ తెలిపారు. -
బార్డర్లో భారీ ఎత్తున మొసళ్ల పట్టివేత
భారీ ఎత్తున మొసళ్లను చంపి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని చైనా పోలీసులు పట్టుకున్నారు. చైనా, వియత్నం బార్డర్లో సాధారాణ తనిఖీల్లో భాగంగా యాంక్సీ పోలీసులు దక్షణ చైనాలోని ఫాంగ్ చెంగాగ్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన వెలుగు చూసింది. తనిఖీల్లో భాగంగా ఓ ట్రక్‌లో లోడ్ అయిన సంఖ్యకు, డ్రైవర్ చూపించిన పేపర్లోని సంఖ్యకు పొంతన లేక పోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మొత్తం 16 బాక్స్‌లలో ఐస్ బాక్స్‌లు పెట్టి మొసళ్లను ఈ ట్రక్‌లో తరలిస్తున్నారు. 70 మొసళ్లతోపాటూ మరో 88 మొసళ్ల తొకలను కత్తిరించి ఇందులో తీసుకు వెళుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మొసళ్ల చర్మానికి మంచి గిరాకీ ఉండటంతో స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా వన్యప్రాణులను హతమార్చి రవాణా చేస్తున్నారు. -
30 ఏళ్ళ తర్వాత చలనం తెప్పించారు!
శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సైన్స్ కు అందని విషయమే ఉండదేమో అన్నంతటి విజ్ఞానాన్ని మన ముందుంచుతోంది. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. మంచులో గడ్డ కట్టిపోయిన ఓ జీవిలో ముఫ్ఫై ఏళ్ళ తర్వాత చలనం తెప్పించిన తీరు... సృష్టికే ప్రతిసృష్టిగా నిలిచింది. అంటార్కిటికానుంచి సేకరించి తెచ్చిన ఓ నీటి ఎలుగు (టార్డిగ్రేడ్) ను ఘనీభవింపజేసి... ముఫ్ఫై ఏళ్ళ తర్వాత విజయవంతంగా దానిలో చలనం తెప్పించగలిగామని.. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఒక మిల్లీ మీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉండి, మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు, నీరు ఉండే ప్రాంతాల్లో ఈ జాతి జీవులు నివసిస్తుంటాయి. అవసరాన్ని బట్టి వాటి జీవక్రియ కార్యకలాపాలను అవే సమర్థించుకోగలిగే శక్తిని ఇవి కలిగి ఉంటాయి. అయితే ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన ఈ టార్డిగ్రేడ్ ను అంటార్కిటికాలోని నాచు మొక్కల్లో గుర్తించి 1983 లో పరిశోధనలకోసం తెచ్చారు జపాన్ శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల్లో భాగంగా దాన్ని 20 మైనస్ డిగ్రీల్లో భద్రపరిచి ఘనీభవింపజేశారు. తిరిగి 2014 లో దాన్నియధాస్థితికి తెచ్చి పరిశోధకులు సఫలమయ్యారని క్రైయో బయాలజీ పత్రిక వెల్లడించింది. అంతేకాదు సజీవంగా మారిన టార్డిగ్రేడ్ ఓ గుడ్డును కూడ పెట్లి, అది క్రమంగా కదలడం ప్రారంభించి, పదిహేను రోజులకల్లా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టిందని, ఆ గుడ్డు క్రమంగా 19 గుడ్లును పెట్టిందని, వాటిలో 14 గుడ్లు పిల్లలుగా మారగా, వాటన్నింటిలో ఎటువంటి లోపాలు లేవని పరిశోధకులు చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది. గతంలో జరిపిన పరిశోధనల్లో ఈ టార్డిగ్రేడ్ ను తొమ్మిది సంవత్సరాల తర్వాత చలనంలోకి తెచ్చారు. కానీ 30 ఏళ్ళ తర్వాత విజయవంతంగా పునర్జీవనం కల్పించడం ఇదే మొదటిసారి అని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రకృతి పరిమాణాత్మక విశ్లేషణలను ఉపయోగించి నిర్విహించిన ఈ ప్రస్తుత పరిశోధనలు టార్డిగ్రేడ్ దీర్ఘకాల మనుగడను కొంతవరకూ గుర్తించ గలిగిందని, మరిన్ని అధ్యయనాలు జరిపి నియంత్రిత పరిస్థితుల్లో వీటి మనుగడపై విశ్లేషణాత్మక వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని ఈ పరిశోధనా పత్రికలో రచయితలు వెల్లడించారు.