► ఉద్యోగుల ఒకరోజు సమ్మె
► ఎస్‌బీఐ ప్రధాన శాఖల ఎదుట నిరసన కార్యక్రమాలు
తిరుపతి (అలిపిరి): బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతవైుంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు మంగళవారం బంద్ పాటించారు. జిల్లాలో 20వేల మంది ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపటా్టరు. 593 జాతీయ బ్యాంకు శాఖల లావాదేవీలు స్తంభిం చాయి. చితూ్తరు, మదనపల్లె, పుతూ్తరులోని ఎస్‌బీఐ ప్రధాన శాఖల ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపటా్టరు. తిరుపతి తిలక్ రోడ్డు బ్రాంచ్ ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డప్పులతో హోరెత్తించారు.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ తిరుపతి కన్వీనర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కార్మిక చట్టా లను యజమాన్యానికి అనుకూలంగా మార్చి చట్ట సవరణలు చేయాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా బ్యాంక్ కాన్ఫెడరేషన్ నాయకులు సూర్యకుమార్, మునస్వామి, ఆది నారాయణ, నరేంద్ర సింహ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కృష్ణ, ప్రసాద్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నాయకులు కె.వి.ఎస్.ఎన్.మూర్తి, గిరిధర్, ప్రసాద్ పాల్గొన్నారు.