thirupathi
-
అశ్వ వాహనంపై విహరించిన శ్రీమలయప్పస్వామి(ఫొటోలు)
-
Tirumala Srivari Brahmotsavam 2023: స్వర్ణరథంపై శ్రీమలయప్ప స్వామి (ఫొటోలు)
-
తిరుపతి గంగమ్మను దర్శించుకున్న మంత్రి అంబటి రాంబాబు
-
తాత్యాగుంట గంగమ్మ జాతర వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర
-
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు శుభవార్త
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించిన ఎమ్మెల్యే భూమన
-
గంగమ్మ తల్లికి సారె సమర్పించనున్న ఎమ్మెల్యే భూమన
-
తిరుపతి గంగమ్మ ఆలయంలో మహా కుంబాభిషేకం
-
టీటీడీ ఆదాయం అదుర్స్
-
తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు
-
తిరుమలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం
-
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్బంగా సర్వం సిద్ధం
-
దేశంలోనే ఏపీ ప్రభుత్వం అగ్రగామిగా ఉంది : సజ్జల
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
-
బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం
-
తిరుమలలో జోరుగా ఉద్యానవనాల పెంపకం
-
కుటుంబాన్ని చిదిమేసిన లారీ
గొల్లపల్లి (వెల్గటూర్): స్కూటీపై భార్య, ముగ్గురు పిల్లలతో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారి వాహనాన్ని లారీ డీకొట్టింది. ఈ ఘటనలో ఇంటి యజమాని, ఇద్దరు పిల్లలు మరణించగా, భార్య కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి (38) ఇళ్లకు మార్బుల్స్ వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య మనోజా, కొడుకులు ఆదిత్య(9), కన్నయ్య(1), కూతురు చిట్టి (1) ఉన్నారు. మనోజా తల్లి మూడు నెలల క్రితం చనిపోయింది. మూడు నెలల కార్యక్రమం కోసం కుటుంబాన్ని తీసుకుని స్కూటీపై అత్తగారి ఊరైన ధర్మపురి మండలం దమ్మన్నపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక సాయంత్రం ఐదుగురూ ఇంటికి బయల్దేరారు. ఊరు చేరేందుకు మరో ఐదు కిలోమీటర్ల దూరంలో వెల్గటూరు మండలం పాశిగామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హరితహోటల్ వద్దకు రాగానే వెనకాలే వస్తున్న లారీ స్కూటీని ఓవర్టేక్ చేస్తూ ఢీకొట్టింది. అందరూ రోడ్డుపై పడిపోయారు. లారీ వీరిపైనుంచి పోవడంతో చిట్టి, కన్నయ్య అక్కడికక్కడే చనిపోయారు. తిరుపతి నడుం పైనుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయ్యింది. మనోజా రెండు కాళ్లు విరిగాయి. ఆదిత్య రోడ్డుకు కొద్ది దూరంలో పడడం తో స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ధర్మపురి సీఐ కోటేశ్వర్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న తిరుపతి, మనోజాను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యను సీఐ తన వాహనంలో ఆస్పత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతూ తిరుపతి మృతిచెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనం దొరకలేదని, సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. కాగా, గుంతలను తప్పించబోయే క్రమంలోనే వేగంగా వస్తున్న లారీ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. -
తిరుపతిలో లెనోవో ట్యాబ్లెట్స్ తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు టెక్నాలజీ కంపెనీ లెనోవో తెలిపింది. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో పర్సనల్ కంప్యూటర్లు, నోట్‌బుక్స్, స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి సామర్థ్యం అధికం చేసినట్టు లెనోవో ఇండియా ఎండీ శైలేంద్ర కత్యాల్ వివరించారు. ‘వింగ్‌టెక్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ట్యాబ్లెట్ పీసీల తయారీని ప్రారంభించాం. సాధారణ కస్టమర్లు, విద్యార్థులతోపాటు రిటైల్, తయారీ, ఆరోగ్య సేవల రంగానికి అవసరమైన ట్యాబ్లెట్లను ఇక్కడ రూపొందిస్తున్నాం. పుదుచ్చేరిలోని పీసీల తయారీ ప్లాంటులో మూడవ లైన్ ఏర్పాటు చేశాం. డిక్సన్ టెక్నాలజీస్ సహకారంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో మోటరోలా బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నాం. భారత్‌తోసహా పలు దేశాల్లోని 30కిపైగా ప్లాంట్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 180 మార్కెట్లలో విక్రయిస్తోంది’ అని తెలిపారు. -
అగ్గిపెట్టె మచ్చా పేరిట అరుదైన ఘనత!
‘నమస్తే అన్నా..’ అంటూ ఆప్యాయంగా సంభాషణ మొదలుపెట్టే అగ్గిపెట్టె మచ్చా, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపై తనదైన స్టైల్లో వాళ్లపై తిట్ల పురాణం అందుకోవడం ద్వారా ఫేమస్ అయ్యాడని తెలిసిందే. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ప్లేస్టోర్‌లో అతని పేరిట రిలీజ్ అయిన ఓ గేమ్.. లక్షకు పైగా డౌన్లోడ్లు సాధించడం విశేషం. ఒక మీమ్ క్యారెక్టర్.. అందునా తెలుగు మీమ్ క్యారెక్టర్ మీద వీడియో గేమ్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ప్లే స్టోర్‌లో Game on Aggipettimacha అనే ఈ గేమ్.. ‘గేమ్ ఆన్ మీమ్’ తరపున డెవలప్ అయ్యింది. లక్షకు పైగా డౌన్ లోడ్స్, 4.4 రేటింగ్(మచ్చా ఫ్యాన్సే అయి ఉండొచ్చు) దక్కించుకోగా, 20 ఎంబీ సైజ్ ఉన్న ఈ గేమ్‌ను ఆదరిస్తుండడం విశేషం. ఇందులో కోపధారి మనిషి, జాంబీరెడ్డి, తమిళ మీమ్ క్యారెక్టర్ ఎంజీఆర్ నగర్ బిజిలీ కూడా ఉండగా.. తెలుగు నుంచి మచ్చానే టాప్ డౌన్లోడ్లతో నిలిచాడు. సాధారణంగా సెలబ్రిటీలు, సినిమాల విషయంలో ఇలాంటి గేమ్స్ ఆదరణ దక్కించుకుంటున్నప్పటికీ.. ఒక తెలుగు ఇంటర్నెట్ సెలబ్రిటీ, అది కూడా మచ్చా ఖాతాలో ఈ ఘనత చేరడం విశేషం. చిరు సాయం కాగా, మానసిక స్థితి సరిగా లేని కిరణ్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. తన చేష్టలతో అవతలివాళ్లకు హాస్యాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. అయితే అతన్ని క్యాష్ చేసుకోవాలని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని టీవీ ఛానెల్స్ కూడా అతన్ని జనాల ముందుకు తీసుకొచ్చాయి. అయినప్పటికీ ఎంతో కొంత ఆర్థిక సాయం ద్వారా అతను ఊరట చెందుతుండగా.. మరోవైపు తనదైన చేష్టలతో, ఇంటర్వ్యూలతో పాపులారిటీ పెంచుకుంటున్నాడు. ఇక ఈ గేమ్ నిర్వాహకులు కూడా మచ్చాకు ఎంతో కొంత సాయం చేయడం మంచిదేమోనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని మార్చండి మచ్చాకి ఉన్న ఫేమ్‌తో ఈ గేమ్ బాగుందని కొందరు అంటున్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రెండ్లీ ఫీచర్లను ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని రివ్యూలు ఇస్తున్నారు. ఇక ఈ గేమ్‌లో నమస్తే అన్నా.. అంటూ మొదలుపెట్టే మచ్చా, తన స్టైల్ పాట పాడడం, ‘ఎగిరి తంతా’.., ‘పోతే పోయిందని గానీ యెధవ ప్రాణం’ లాంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. లెవెల్స్‌ను పెంచడంతో పాటు ఖతర్ పాప లాంటి కొన్ని మీమ్ క్యారెక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేసి అప్డేట్ చేయాలని పలువురు రివ్యూల ద్వారా రిక్వెస్ట్ చేస్తుండడం విశేషం. చదవండి: సుఖం కోసం కష్టమెందుకు! -
గర్భంలోని శిశువు మాయం.. మహిళ ఆందోళన
సాక్షి, తిరుపతి : గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడంతో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ అనే మహిళ ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆమె... వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేశారు. కాన్పు కోసం వచ్చిన తనకు గర్భం రాలేదని అంటున్నారంటూ ఆస్పత్రి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ మానసిక స్థితిపై వివరాలను సేకరిస్తున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న విష్ణు, మంచు లక్ష్మి
సాక్షి, చిత్తూరు : ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు, మంచు లక్ష్మి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వరుని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ... తిరుపతిలో మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ ప్రారంభం అయిందని, మోసగాళ్ళు సినిమా త్వరలోనే విడుదల కానుందని అన్నారు. మోసగాళ్ళు సినిమా విడుదల సందర్బంగా స్వామి వారి ఆశీస్సులు పొందమని చెప్పారు. త్వరలోనే శ్రీను వైట్ల దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభం చేయనున్నట్లు మంచు విష్ణు తెలిపారు. చదవండి: అంతకు మించి దారి లేదంటున్న హీరో సూర్య -
తుడా: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను తుడా(టీయూడీఏ)లో విలీనం చేస్తూ పురపాలక శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వరదయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయించి, తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దీంతో తుడా పరిధి 4472 చదరపు కిలోమీటర్లకు చేరింది.(చదవండి: మహిళలూ..! మహరాణులూ..!!) -
ఎస్వీ వెటర్నరీ వర్సిటీకి కీలక ప్రాజెక్టులు
సాక్షి, చిత్తూరు : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ రెండు కీలక ప్రాజెక్టులను దక్కించుకుంది. వాటిలో ఒకటి పాడి పరిశ్రమ, రెండోది కోళ్లు, పక్షల ద్వారా సంభవించే వ్యాధుల మీద పరిశోధనలు. దేశంలో మొదటి సారిగా ఈ రెండు పరిశోధనలు జరుగుతున్నాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సీటీ వీసీ పద్మనాభ రెడ్డి వెల్లడించారు. పాడి పరిశ్రమ పరిశోధనలో లండన్‌కు చెందిన రాయల్ వెటర్నరీ కళాశాల భాగస్వామ్యం ఉందన్నారు. పాల సేకరణ నుంచి పాల ఉత్పత్తుల వరకు సంక్రమించే వ్యాధుల మీద పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మూడేళ్ల పాటు ఈ పరిశోధనలు జరుగుతాయని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తే దాదాపు మూడు కోట్ల రూపాయలు ఎస్వీ వెటర్నరీ వర్సీటీకి దక్కుతాయని పద్మనాభ రెడ్డి తెలిపారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత దాడి
-
ఎస్వీయూ: డబ్బు కావాలంటూ..
సాక్షి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ(ఎస్వీయూ)లో నకిలీ ఇ-మెయిల్స్ ఘటన కలకలం రేపింది. డబ్బు కావాలంటూ వివిధ విభాగాల ప్రిన్సిపల్స్ పేరిట అధ్యాపకులకు మెయిల్స్ రావడం గందరగోళానికి దారి తీసింది. అనుమానం వచ్చిన అధ్యాపకులు ప్రిన్సిపల్స్‌కు కాల్ చేసి విషయం గురించి ఆరా తీశారు. డబ్బు కోసం తామెవరికీ మెయిల్స్ పంపలేదని వారు స్పష్టం చేయడంతో.. ఇవన్నీ నకిలీ మెయిల్స్ అని తేలింది. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (పేరుకు పెద్ద సాయం.. కానీ, అంతా మోసం) -
వీవీని కాపాడండి: హృదయం చెమ్మగిల్లుతోంది
సాక్షి, తిరుపతి : ముంబైలోని తలోజా జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి, విరసం నేత వరవరరావు (వీవీ)ను విడుదల చేయాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడుకు శనివారం బహిరంగ లేఖ రాశారు. అనారోగ్య సమస్యతో పాటు, ప్రాణాంతక కరోనా వైరస్ బారిపడిన వరవరరావు విడుదలకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. శరీరం మంచాన కట్టుబడి 81 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. (ఆయన ప్రాణాలు కాపాడాలి) ‘వృద్య శల్యం శరీరంలో ఉన్న వరరరావు ప్రాణాలు కాపాడాలని ఉపరాష్ట్రపతిని కోరుతున్నా. వరవరరావు నిర్బంధం, అనారోగ్యము గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనలు అంకుర్బావ దశలో నాకు లభించిన గురువుల్లో వరవరరావు ముఖ్యులు. 46 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు (వెంకయ్య నాయుడు), నేను (భూమన కరుణాకర్‌రెడ్డి) 21 నెలల పాటు ముషీరాబాద్ జైల్లో వున్నప్పుడు వరవరరావు మన సహచరుడు. సహచర్యం, భావాజాలం కాదు, కానీ జైల్లో కలసి ఉన్నాం. రాజకీయ సిద్ధాంతాల్లోను జనక్షేమంకై నడిచే మార్గాల్లో ఎవరి భావాలు వారివి. కానీ మనం మనుషులం. మానవతా దృక్పధంతో స్పందించి వరవరరావు విడుదలకు చొరవ చూపుతారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. (వరవరరావుకు కరోనా పాజిటివ్) కాగా ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. మరోవైపు వరవరరావు కరోనా సోకడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
టీటీడీ ఆస్తుల విక్రయం నిషిద్ధం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకల రూపంలో భక్తులిచ్చిన ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని టీటీడీ పాలక మండలి తీర్మానించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాటిని ఎలా ఉపయోగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి బోర్డు సభ్యులు, స్వామీజీలు, భక్తులు, మేధావులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా టీటీడీ తదుపరి చర్యలు తీసుకోనుంది. అలాగే, టీటీడీ ఆస్తుల అమ్మకంపై ధర్మకర్తల మండలి, ప్రభుత్వం మీద కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు చేసిన దుష్ప్రచారం వెనుక దాగి ఉన్న కుట్ర గురించి విజిలెన్స్ లేదా ఇతర ఏ సంస్థలతో అయినా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని కూడా ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది. శ్రీవారి ఆస్తుల వివరాలను వెబ్సైట్లో ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆయన ఏం చెప్పారంటే.. ► టీటీడీ ఆస్తుల అమ్మకంపై దుష్ప్రచారాన్ని బోర్డు ఖండించింది. ► ఈ ఆస్తుల అమ్మకానికి సంబంధించి గత ప్రభుత్వం నియమించిన ధర్మకర్తల మండలి తీర్మానం చేయగా.. ప్రస్తుత బోర్డు ఈ నిర్ణయాన్ని కేవలం సమీక్షించాలని నిర్ణయించింది. అయితే, కొందరు దుష్ప్రచారం చేశారు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించి ఆస్తులు అమ్మకూడదని జీఓ జారీచేశారు. ► తిరుమలలో విశ్రాంతి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించబోతున్నామని కూడా కొన్ని పత్రికల్లో కథనాలు రాశారు. గత ప్రభుత్వాల హయాంలో విశ్రాంతి గృహాల నిర్మాణానికి స్థలాలు నామినేషన్ మీద ఇస్తూ వచ్చారు. ► కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో పారదర్శకంగా అందరికీ అవకాశం వచ్చేలా మార్గదర్శకాలు తయారుచేయాలని బోర్డును ఆదేశించారు. ► గతంలో దాతలు నిర్మించిన విశ్రాంతి గృహాల్లో కొన్ని పాడుబడ్డాయి. వీటిని మళ్లీ నిర్మించి ఇవ్వాలని వారికి టీటీడీ లేఖలు రాసింది. చాలామంది తిరిగి నిర్మించలేమని లేఖలు రాశారు. ► వీటిని నామినేషన్ కింద కాకుండా డొనేషన్ పథకంలో చేర్చి, కొన్ని మార్గదర్శకాలు రూపొందించి ఇందులో అర్హులైన వారికే విశ్రాంతి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తాం. ► తిరుమల అతిథి గృహాల కోసం నిర్వహించిన టెండర్లను రద్దుచేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. ► టీటీడీ విద్యా సంస్థల్లో ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లు ప్రారంభించాలని బోర్డు తీర్మానించింది. ఈ సమావేశంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. పుత్తా ప్రతాపరెడ్డి మినహా మిగిలిన వారంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు నాగబాబు అభినందనలు
సాక్షి, అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దీనిపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల అమ్మకాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీటర్లో ఓ పోస్ట్ చేశారు. ‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు’ అని ట్వీట్ చేశారు. (2016 టీటీడీ బోర్డు నిర్ణయం నిలుపుదల) -
టీటీడీపై పథకం ప్రకారమే తప్పుడు ప్రచారం
సాక్షి, తాడేపల్లి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిరర్థక ఆస్తుల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డ్ (టీడీపీ హయాంలో) తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని స్పష్టం చేశారు. ఆస్తుల అమ్మకం గురించి బోర్డు తరఫున ఇప్పటి వరకు ఎలాంటి తేదీని ప్రకటించలేదని, నిర్ణయం తీసుకోక ముందే రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు. టీటీడీ ఆస్తులపై మరోకసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బోర్డు నిర్ణయం మేరకు ఆస్తులను అమ్మాల్సి వస్తే పీఠాధిపతిలు, స్వామీజీల సలహాలు సూచనలు తీసుకొనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. టీటీడీని అడ్డుకుపెట్టుకుని కుట్రపూరితంగా తమపై వ్యతిరేకతతో కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తుల అమ్మకం కొత్తమే కాదు.. టీటీడీ ఆస్తుల విక్రయాల అంశంపై సోమవారం తాడేపల్లిలో వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీకి సంబంధించిన తీసుకున్న పలు నిర్ణయాలను ఆయన గుర్తుచేశారు. ‘టీటీడీ ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయంపై సమీక్ష మాత్రమే జరిపాము. అమ్మాలి అనుకుంటే ఎక్కోడా మారుమూలన ఉండే ఆస్తులు అమ్ముతామా..? మేము దేవుడు సేవలో ఉన్నాము. దేవుడు సొమ్ము ఆశించించే ప్రసక్తే లేదు. గతంలో నేను క్రిస్టియన్ అని అసత్య ప్రచారం చేశారు. దేవుడు భూముల కాజేయలని చూసింది చంద్రబాబు నాయుడే. సదవర్తి, దుర్గమ్మ భూములు కాజేయాలని చూసింది చంద్రబాబు. దేవుడుకి వచ్చిన ప్రతి పైసా మేము కాపాడుతున్నాము. నిరుపయోగంగా ఉన్న టీటీడీ భూములు అమ్మడం కొత్తేమి కాదు. టీటీడీలో 1974 నుంచి భూములు అమ్ముతున్నారు. చంద్రబాబు హయాంలో కూడా భూములు అమ్మకానికి పెట్టారు. టీడీపీ హయాంలోనే నిర్ణయం.. టీడీపీ హయాంలో చదలవాడ కృష్ణమూర్తి టీడీపీ చైర్మన్ ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్న నిరర్ధక టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్తుల అమ్మిన వాటిని టీటీడీ కార్పస్ ఫండ్‌లో వేయాలని నిర్ణయించారు. బీజేపీ నేతలు కూడా వాస్తలు తెలుసుకోవాలి. టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీలో బీజేపీ సభ్యలు కూడా ఉన్నారు. ఆస్తుల అమ్మకం గురించి మాట్లాడుతున్న భాను ప్రకాష్ రెడ్డి ఆస్తులు అమ్మాలని నిర్ణయం తీసుకున్న సబ్ కమిటీలో సభ్యుడే. టీడీపీ ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయంపై ఎల్లో మీడియా నోరు ఎందుకు మెదపలేదు. ప్రభుత్వానికి అప్రదిష్ట కలిగేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తున్నాయి. ఒక పథకం ప్రకారం ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. వివరణ ఇచ్చిన పదే పదే తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇది సరైనది కాదు’ అని అన్నారు. -
చంద్రబాబుపై మాజీ స్పీకర్ ఘాటు విమర్శలు
సాక్షి, తిరుపతి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి అగరాల ఈశ్వరరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అమరావతి కోసం అంటూ చంద్రబాబు జోలె పట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో రాజధాని ఉండటం వల్ల అందరికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతి మీద ఇచ్చిన నివేదికలను తగలబెట్టడం దారుణమని టీడీపీ తీరును తప్పుబట్టారు. చంద్రబాబు రైతులు, ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని ఈశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలను కొనగలడు. ఇంకా ఆయనకు జోలె ఎందుకు’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా అగరాల ఈశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆరవ శాసనసభ (1978-1983) సభాపతిగా (1982,సెప్టెంబరు 7- 1983 జనవరి 16) పనిచేసిన విషయం తెలిసిందే. (చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు) -
వాళ్లే వ్యతిరేకిస్తున్నారు: పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి : ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో ఎనభై శాతం పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాట తప్పకుండా హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. ఉగాది రోజు 25 లక్షల ఇళ్ళ పట్టాలను అందిస్తామని వెల్లడించారు. బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... మూడు రాజధానుల ఆలోచన మంచిదని.. అమరావతిలో రియల్ ఎస్టేటు వ్యాపారం చేసేవాళ్లే దీనిని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంపై కమిటీలు అందించిన నివేదిక గురించి అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాదునే అభివృద్ధి చేశారు.. ‘రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాదునే అభివృద్ధి చేశారు. నిజానికి రాజధానితో పదిశాతం ప్రజలకు మాత్రమే పని ఉంటుంది. కోర్టులతో కూడా పదిశాతం ప్రజలకు మాత్రమే పని. మూడు రాజధానుల ఆలోచన ఎంతో మంచిది. రాయలసీమ వాసులంతా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలపాలి. రాజధాని అంశంలో ఇకనైనా కార్మికుల పోరాటాలు, ధర్నాలు పక్కన పెట్టాలి’అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
‘తిరుపతి పార్ట్నర్కు థ్యాంక్స్’
మజిలీ, ఓ బేబీ, సూపర్ డీలక్స్ ఇలా వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు అక్కినేని కోడలు సమంత. పెళ్లి తర్వాత విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా మరింత మెరగవుతున్నారు. అంతేకాదు సినిమా షూటింగ్‌ల నుంచి విరామం దొరికినపుడల్లా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహరిస్తుంటారు. ఈ క్రమంలో తన స్నేహితురాలు రమ్యా సుబ్రమణియన్‌తో కలిసి సమంత గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలి నడన ఏడుకొండలు ఎక్కి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత స్నేహితురాలు రమ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ ప్రశాంతంగా నడిచిన తర్వాత ఈ చిరునవ్వులు. తిరుపతి దర్శనం ఎంతో అద్భుతం. 2019కి మంచి వీడ్కోలు.. అదే విధంగా 2020కి శుభారంభం. ఇందుకు వెంకటేశ్వరుడికి.. అదే విధంగా నా తిరుపతి పార్ట్నర్ సమంతకు ధన్యవాదాలు’ అని ఆమె క్యాప్షన్ జత చేశారు. కాగా యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన రమ్య ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ అయ్యారు. కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్.. దళపతి 64 సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇక చెన్నైకి చెందిన సమంత.. రమ్య మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. View this post on Instagram Smiling away after our peaceful walk , super talk and fantastic darshan at Tirupati ❤️😘. . That was a great finisher to 2019 and a super start to year 2020 ❤️🙏🏻😇🙌🏻! . Thank you Lord Venkatesa and My Tirupati partner @samantharuthprabhuoffl for always making me a part of your blessings 😘❤️. . #FriendsForLife #HappyMood #ThankfulGratefulBlessed A post shared by Ramya Subramanian (@ramyasub) on Dec 18, 2019 at 8:17pm PST -
పవన్‌కల్యాణ్ ఓ అమీబా
తిరుపతి రూరల్ : పవన్‌కల్యాణ్ ఓ అమీబా అని, ఒకసారి కనిపిస్తే మళ్లీ నాలుగు నెలల వరకు కనిపించరని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గండిక్షేత్రం నుంచి తిరుమలకు ఆయన చేస్తున్న పాదయాత్ర మంగళవారం ఐదో రోజుకు చేరింది. మంగళవారం చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట నుంచి శ్రీవారి మెట్టు వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. అనంతరం శ్రీనివాసమంగాపురం వద్ద ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ అజ్ఞానంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అమీబా ఒక్కసారి తింటే నాలుగు నెలల వరకు నిద్రపోతుందని, ఆయన కూడా ఒకసారి జనంలోకి వచ్చి మళ్లీ నాలుగు నెలల వరకు కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. చిత్తుగా ఓడిన చంద్రబాబును ఆదుకునేందుకు పవన్ పడుతున్న ఆరాటం చూస్తుంటే జాలిగా ఉందన్నారు. చంద్రబాబు, తాను ఒకటేనని దమ్ముంటే పవన్ కల్యాణ్ బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలని ప్రయత్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఆరు నెలల్లో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టారని, వాటి పేర్లు చంద్రబాబు గాని, పవన్కల్యాణ్గాని కరెక్ట్‌గా చెబితే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతి ఒక్కటి అమలుచేసుకుంటూ పోతున్నారని, ఆయన్ని ధైర్యంగా ఎదుర్కోలేకే దేవుడిని రాజకీయాల్లోకి లాగాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలను మానుకోకపోతే జనం తరిమికొడతారని హెచ్చరించారు. ఎమ్మెల్యేల సంఘీభావం శ్రీకాంత్‌రెడ్డి పాదయాత్ర మంగళవారం భాకరాపేట నుంచి ప్రారంభమై రాత్రికి శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారి మెట్టుకు చేరుకుంది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి, తంబళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఆదిమూలం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వెంకన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. -
చంద్రబాబును ఓడించేందుకు డిప్యూటీ సీఎం : పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అవసరానికి మించి రెట్టింపు స్థాయిలో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు, డీజీపీ స్థాయి అధికారితో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకున్నామని వివరించారు. రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొట్టి ఇసుకను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, లోకేశ్, ఆ పార్టీ శాసనసభ్యులదని విమర్శించారు. చంద్రబాబు ఉపయోగిస్తున్న భాష సంస్కారహీనంగా, అభ్యంతరంగా ఉందని ఆక్షేపించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని కుప్పంలో ఓడించేందుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇంచార్జ్‌గా నియమించబోతున్నామని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా సొంత జిల్లా కుప్పంలో మెజార్టీ సాధించలేని చంద్రబాబు రాష్ట్రంలో పార్టీని ఏమేరకు నడిపిస్తారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. -
‘చంద్రబాబును ఎవరూ కోరుకోవడం లేదు’
సాక్షి, తిరుపతి : అవినీతి పాలన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబ మళ్లీ రావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ సంకల్ప యాత్ర కార్యక్రమం శనివారం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్థాపించింది నిజమైన తెలుగుదేశం పార్టీ. ఇప్పటి తెలుగుదేశం అక్రమాలకు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిందని విమర్శించారు. చంద్రబాబు యూటర్న్ బాబుగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరారు. -
మధులతను పరామర్శించిన డీజీపీ
సాక్షి, అమరావతి : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంలో కూతురు, భర్తను కోల్పోయిన మధులత(తిరుపతి)ను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూతురిని తలచుకుంటూ గుండె పగిలేలా రోదిస్తున్న మధులతను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో లైఫ్ జాకెట్లు వేసుకోలేదన్నారు. వినోద కార్యక్రమం జరుగుతున్నందున అందరూ లైఫ్ జాకెట్లు తీసేసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు. బోటుకు అనుమతి లేదన్న విషయం తమకు తెలియదన్నారు. బోటులో అందరూ విద్యావంతులే ఉన్నారని, బోటుకు పర్మిషన్ లేదన్న విషయం తెలిస్తే ఒక్కరు కూడా బోటు ఎక్కేవాళ్లు కాదన్నారు. బోటు బోల్తా పడిన వెంటనే భర్త సుబ్రహ్మణ్యం తనను నీళ్లలో నుంచి పైకి నెట్టి కాపాడరని చెప్పారు. ఆదే సమయంలో తన కాళ్లు పట్టుకున్న కుమార్తె హాసినిని పైకి నెట్టి రక్షించేందుకు ప్రయత్నించి ఆయన నీటిలో ముగినిపోయారని తెలిపారు. బిడ్డ తన కాళ్లను పట్టుకున్నా కాపాడుకోలేకపోయానంటూ మధులత ఆవేదన చెందారు. (చదవండి : ‘నేను రాను డాడీ.. జూ పార్క్‌కు వెళ్తా’) కాగా,తిరుపతికి చెందిన సుబ్రహ్మణ్యం తన తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి పాపికొండలు విహారయాత్ర వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా... మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు. ( చదవండి : మీరొచ్చి నాలో ధైర్యం నింపారు: మధులత) కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 26 మృతదేహాలను సిబ్బంది వెలికితీసింది. మంగళవారం ఉదయం 14 మృతదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. లభించిన 26 మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాటిలో 23 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఏడు మృత దేహాలను బంధువులకు అప్పగించారు. మిగిలిన మూడు మృతదేహాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. వీలైనంత త్వరగా లాంచీని వెలికి తీస్తాం : డీజీపీ ప్రమాదానికి గురైన లాంచీని వీలైనంత త్వరగా వెలికి తీస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇందుకోసం దేశంలో ఏ అత్యాధునిక టెక్నాలజీ అయినా వినియోగిస్తామని చెప్పారు. లాంచీ బయటకు వస్తే మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని డీపీపీ సవాంగ్ చెప్పారు. -
నా బంగారు తల్లీ.. నేనూ మీతో వస్తా..
‘నాన్నంటే ఇష్టం కదా తల్లి. అందుకే ఆయనతో వెళ్లిపోయావా అమ్మా. మరి నాన్నను తీసుకురాలేదే. నేను మీతో పాటే వస్తా నా బంగారు తల్లి’ అంటూ మధులత గుండె పగిలేలా రోదిస్తున్న తీరు ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. తన కూతురి శవపేటికపై పడి.. ‘అమ్మ లేకుండానే నిద్రపోయావా బంగారం. భయం వేయడం లేదామ్మా’ అని ఆ తల్లి విలపిస్తున్న దృశ్యాలు మనసును ద్రవింపజేస్తున్నాయి. పాపికొండల విహారానికి బయల్దేరిన ఎన్నో కుటుంబాలకు పడవ ప్రమాదం విషాదం మిగిల్చిన విషయం విదితమే. వీరిలో తిరుపతికి చెందిన మధులత కుటుంబం కూడా ఒకటి. తండ్రి అస్థికలు గోదావరిలో కలిపేందుకు బయల్దేరిన భర్త సుబ్రహ్మణ్యం.. తనతో పాటు భార్య మధులత, కుమార్తె హాసినిని కూడా వెంట తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో సుబ్రహ్మణ్యం, హాసిని గల్లంతుకాగా... మధులత ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. కాగా హాసిని(12) మృతదేహాన్ని సోమవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. సుబ్రహ్మణ్యం జాడ ఇంతవరకు తెలియరాలేదు. (చదవండి :‘పాపికొండలు రాను డాడీ.. పార్క్‌కు వెళ్తా’ ) ఇక గోదావరి పడవ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. పట్టిసీమలో ఒకటి, ధవళేశ్వరం వద్ద రెండు, అనుగులూరు కాఫర్ డ్యాం వద్ద రెండు, పోలవరం వద్ద ఒకటి, ఆత్రేయపురం దిగువ ప్రాంతంలో రెండు, తాళ్లపూడి వద్ద ఒక మృతదేహాన్ని మంగళవారం రక్షణా బృందాలు వెలికితీశాయి. కాగా రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక పడవ ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి : సీఎం జగన్ ఎదుట కన్నీరుమున్నీరైన మధులత) -
ముచ్చటైన కుటుంబం..తీరని విషాదం
సాక్షి, తిరుపతి : కచ్చలూరు పడవ ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతదేహాలు లభ్యంకాగా.. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ ప్రమాదంలో భర్త, కుమార్తెను కోల్పోయి... తాను మాత్రం ప్రాణాలతో బయటపడ్డ మధులత ఆస్పత్రిలో రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం భార్యాబిడ్డతో కలిసి ఆనందంగా జీవించేవారు. పెట్రోలు బంకు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యం.. తన తండ్రి అస్తికలను గోదావరిలో కలపడానికి కుటుంబంతో వెళ్లి ఊహించని ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయన ముద్దుల కూతురు చిన్నారి హాసిని కూడా పడవ ప్రమాదంలో మృతి చెందగా...భార్య మధులత సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం స్కూల్ తరఫున ఫీల్డ్ ట్రిప్‌కు వెళ్లాల్సిన హాసిని ఇలా అర్ధాంతరంగా తమను వీడి పోయిందంటూ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడసారి చూపు కోసం తమ స్నేహితురాలు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా ‘పడవ ప్రమాదంలో నా భర్త సుబ్రహ్మణ్యం, పాప హాసిని కనిపించకుండా పోయారు. ఇక నేను ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎలా బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే ఎంత బావుండు..’’అంటూ మధులత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబం గతంలో ముచ్చటగా గడిపిన తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని చూసిన నెటిజన్లు.. ‘అయ్యోం పాపం. మరణంలోనూ వీడని బంధం’ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
నా పెళ్లి తిరుపతిలోనే...
పెళ్లికి చాలా టైమ్ ఉంది కానీ పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్ రెడీ అంటున్నారు జాన్వీ కపూర్. శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నారు జాన్వీ. తొలి చిత్రం ‘ధడక్’లో నటిగా మంచి మార్కులు వేయించుకుని, ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’లో పవర్ఫుల్ పైలట్‌గా టైటిల్ రోల్ చేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అందుకే ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. పైగా జాన్వీ వయసు 22. పెళ్లికి చాలా టైమ్ ఉంది. మరి.. ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అనే ప్రశ్నను జాన్వీ ముందుంచితే – ‘‘నా పెళ్లి సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. తిరుపతిలో చేసుకుంటా. హంగూ, ఆర్భాటాల్లాంటివి ఏవీ ఉండవు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా ఆహ్లాదకరంగా పెళ్లి వేడుక జరగాలని ఉంది. పెళ్లికి కంచి పట్టు చీర కట్టుకుంటా. అలాగే విందులో దక్షిణాది వంటకాటు ఉంటాయి. నాకు ఇడ్లీ–సాంబార్, పెరుగన్నం, పాయసం.. వంటివన్నీ ఇష్టం. అవన్నీ విందులో ఉంటాయి’’ అన్నారు. జీవిత భాగస్వామిగా ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? అని అడిగితే – ‘‘ఊహల్లో తిరిగే వ్యక్తి అక్కర్లేదు. చాలా ప్రతిభావంతుడు అయ్యుండాలి. అలాగే తన జాబ్‌ని ఎంతో ఇష్టంగా చేయాలి. అతన్నుంచి నేను ఎంతో కొంత నేర్చుకునేంత ప్రతిభావంతుడు అయ్యుండాలి. చమత్కారంగా ఉండాలి’’ అన్నారు జాన్వీ కపూర్. -
హాథీరామ్‌జీ మఠం భూముల్లో ఆక్రమణల తొలగింపు
సాక్షి, తిరుపతి : హాథిరామ్ బావాజీ మఠం భూముల్లోని ఆక్రమణల మీద అధికారులు కొరడా ఝులిపించారు. తిరుపతి రూరల్ మండలం ఉప్పరిపల్లి వద్ద మఠానికి చెందిన వందల ఎకరాల భూమి ఉంది. తిరుపతికి అతి సమీపంలో ఉండడంతో ఈ భూమికి భారీ డిమాండ్ ఉంది. చంద్రబాబు పాలనలో పచ్చ తమ్ముళ్లు వాటిని ఆక్రమించి ఏకంగా భవంతులు నిర్మించారు. ప్రభుత్వం మారి ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపుతుండడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. అధికారులు జేసీబీల సహాయంతో భవంతులను కూల్చి వేస్తుండడంతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకొని హంగామా చేయడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. -
గత ప్రభుత్వ హయంలోనే ప్రకటనలు: ఆర్టీసీ ఈడీ
సాక్షి, విజయవాడ : తిరుపతి ఆర్టీసీ బస్ టిక్కెట్ల వెనుక అన్యమతాలకు చెందిన ప్రకటనలు ఉండడం పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఈడీ కోటేశ్వర్ రావు శుక్రవారం వివరణనిచ్చారు. ఆ ప్రకటనలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చినవని ఆయన వెల్లడించారు. గత మార్చిలో మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 18 ప్రకటనలను రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో టిక్కెట్ల వెనుక ముద్రించారని, అందులో కొన్ని రోల్స్ తిరుపతి డిపోకు వచ్చాయని తెలిపారు. గత మూడేళ్లుగా ఆర్టీసీలో ప్రకటనల బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకిచ్చారని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం కనుక మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
రెండు సమస్యలకు పరిష్కారంగా వాలంటీర్ల వ్యవస్థ: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి: అటు నిరుద్యోగులకు ఉపాధి, ఇటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిందే వాలంటీర్ల వ్యవస్థ అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన గ్రామ వాలంటీర్ల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే క్షేత్ర స్థాయిలో పని విభజన జరగాలి. అందుకే 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి రాజధాని నుంచి సూచించే ప్రభుత్వ పథకాలు మరో గంటలోపు అమలు చేయగలిగే వ్యవస్థ రూపుదిద్దుకొనున్నదని వివరించారు. వాలంటీర్లు తమకొచ్చే రూ.5వేల గురించి కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గుర్తించాలన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించారనే భయం, బాధ్యతతో చంద్రగిరిలో నీటి సమస్య తీర్చడం కోసం 250 బోర్లకు ఒకేసారి అనుమతులు మంజూరు చేశానని వెల్లడించారు. నగర కమిసనర్ మాట్లాడుతూ మీ పరిధిలోని 50 గృహాలకు మీరే మండలాధిపతులుగా ఉంటారనీ, నిస్వార్ధంగా సేవలందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాక్షించారు. తుడా సెక్రటరీ రాం సుందర్ రెడ్డి అభిప్రాయంలో సామాన్యులు తమ అవసరాలకు ఎవరిని కలవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారనీ, మీతో ఆ ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాలంటీర్లకు నియామక పత్రాలతో పాటు ఉద్యోగ ప్రదాత సీఎం ఫోటోలను స్వయంగా అందించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పోలీసుల నిఘాలో రైల్వే స్టేషన్
తిరుపతి అర్బన్: తిరుపతి రైల్వే స్టేషన్లో పోలీసుల నిఘా ఇటీవల పెంచారు. ప్రయాణికులకు సరైన భద్రత కల్పించడంతోపాటు ఎర్రచందనం స్మగ్లర్ల జాడను గుర్తించే దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ కేంద్రంలో పలు ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు చేరుకుంటున్నట్లు సమాచారం అందడంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రైళ్లను నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు పలు బృందాలుగా వెళ్లి చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దానికితోడు ప్రయాణికుల తాకిడి బాగా పెరిగింది. గతంలో ప్రయాణికులు 60వేల నుంచి 70వేలమంది వచ్చేవారని రైల్వే అధికారులు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో 70వేల నుంచి 80వేల మంది ప్రయాణికులు వస్తున్నట్లు రైల్వే అధికారుల తాజా లెక్కలు చూపుతున్నాయి. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులతోపాటు డాగ్‌స్క్వాడ్ సిబ్బంది తనిఖీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రధానంగా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని సమీపంలోని అటవీ ప్రాంతాలకు చొరబడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చినట్లు చర్చసాగుతుంది. దాంతో తిరుపతి రైల్వే స్టేషన్లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు రైల్వే అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 24గంటలు రైల్వే పోలీసులు స్టేషన్లో డేగకళ్లతో నిఘా పెట్టారు. -
మణి మంజరి అతిథి గృహంలో భారీ చోరీ
సాక్షి, తిరుపతి : తిరుమల మణి మంజరి అతిథి గృహంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నగదుతో పాటు పెద్ద మొత్తం బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన 13మంది భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శించుకోవటానికి తిరుమల వచ్చారు. మంగళవారం రాత్రి అతిథి గృహంలోని గదిలో అందరూ నిద్రిస్తున్న సమయంలో లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు 80 తులాల డైమండ్ నగలను, రూ. 2 లక్షల నగదును, 1 సెల్‌ఫోన్‌ను చోరీ చేశారు. ఉదయం తమ నగలు, నగదు దొంగతనానికి గురయ్యాయని గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు, పోలీసులు మణి మంజరి అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. డాగ్ స్క్వాడ్ గోకులం సర్కిల్ వరకు వెళ్లి ఆగిపోయింది. దీంతో పోలీసులు పద్మావతి సర్కిల్లో వున్న సీపీ పుటేజీని పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా మణి మంజరి అతిధి గృహంలోని సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
వైవీ సుబ్బారెడ్డికి ఘనస్వాగతం
సాక్షి, తిరుపతి : టీటీడీకి 50వ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆయన నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని... అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన రేపు తిరుమలలో టీటీడీ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల తన పదవికి రాజీనాయా చేసిన విషయం తెలిసిందే. -
రుయా ఆస్పత్రిలో దారుణం
సాక్షి, తిరుపతి : సిబ్బంది నిర్లక్ష్యం, సదుపాయాల లేమి కారణంగా ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో జరిగింది. తిరుపతికి చెందిన బాబు అనే వ్యక్తి తీవ్ర జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని జనరల్ వార్డులో చేర్చారు. అనంతరం అక్కడి సిబ్బంది, డాక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత బాబుకి ఫిట్స్ వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మానవత్వంతో అతన్ని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడి స్టెచర్ లేదంటూ దాదాపు అరగంట పాటు అతన్ని ఆపారు. తర్వాత వైద్యులు వచ్చి బాబుని పరీక్షించి మృతి చెందారని తెలిపారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతపెద్ద ఆస్పత్రిలో కనీసం రోగులను తీసుకెళ్లడానికి స్టెచర్ లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సందర్శించి వెళ్లిన కాసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం. -
వైఎస్సార్ సీపీకి 130 సీట్లు వస్తాయి
సాక్షి, తిరుపతి : ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు.. ఆ డబ్బునంతా తన కొడుకు అకౌంట్లో వేసుకుని నికృష్టంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. చంద్రబాబు మోసగాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ ఇకపై కనుమరుగువుతందని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరపున మోహన్‌బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుచానూరు బహిరంగ సభలో మాట్లాడుతూ.. తాను దాదాపు తొమ్మిది జిల్లాల్లో ప్రచారం చేశానని.. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీకి 130 సీట్లు వస్తాయనే విషయాన్ని గమనించారన్నారు. కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని.. ఆయన అధికారం చేపట్టగానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచివారని.. కాబట్టి ఫ్యాను గుర్తుకు ఓటువేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని మోహన్‌బాబు ప్రజలను కోరారు. అందుకు నేను హామీ ఇస్తున్నా.. ‘ చంద్రబాబు రోజుకో పార్టీతో సంసారం చేస్తారు. వెనువెంటనే విడాకులు ఇస్తారు. చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టి రాత్రి రాత్రే తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారు. ఆయనో అక్కుపక్షి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇందుకు పూర్తి భిన్నం. ఆయన జటాయువు లాంటివారు. తాను ప్రకటించిన మేనిఫెస్టోను వైఎస్ జగన్ తప్పకుండా అమలు చేస్తారు. అందుకు నేను హామీ ఇస్తున్నా’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు. -
ఘరానా మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు
సాక్షి, తిరుపతి క్రైం: నగరంలో కొంతకాలంగా తాళాలు వేసిన మోటార్ సైకిళ్లను దొంగలిస్తున్న∙ఘరానా దొంగను ఈస్టు పోలీసులు అరెస్టు చేశారు. క్రైం ఏఎస్పీ వెంకటేశ్‌నాయక్ కథనం.. శుక్రవా రం మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా టీఎంఆర్ సర్కిల్ వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళుతుండగా రికార్డులు పరిశీలించారు. అయితే ఆ వాహనానికి సంబంధించి సరై న ఆధారాలు లేకపోవడంతో ఈస్టు డీఎ స్పీ నాగేశ్వరరావు, సీఐ చంద్రబాబు నా యుడు, ఎస్ఐ జయచంద్ర అతడిని విచా రణ చేశారు. అతడి పేరు నరసింహులని, పీలేరుకు చెందిన అతడు పెయింటర్‌గా పనిచేస్తూ తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రేణిగుంట రైల్వేస్టేషన్, పీలేరు టౌన్లో మోటార్ సైకిళ్లను దొంగలించినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇతనిపై ఈస్టు పోలీసుస్టేషన్లో 11, రేణిగుంటలో ఒక కేసు, పీలేరులో 13 కేసులు ఉన్నాయి. ఇత ని నుంచి రూ.11లక్షల విలువ చేసే 24 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతడు హీరో హోండా మోటార్ సైకిళ్లనే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడేవాడని వెల్లడైంది. మోటార్ సైక్లిస్టులు ముందు చక్రానికి వీల్లాక్ వేసుకోవాలని డీఎస్పీ సూచించారు. -
చంద్రబాబు దళితుల ద్రోహి
సాక్షి, చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళితుల ద్రోహి అని సమతా సైనిక్‌దళ్ (ఎస్ఎస్డీ) రాష్ట్ర అధ్యక్షుడు పాలిటి మహేశ్వర రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాబు పాలనలో దళితుల మీద విపరీతంగా దాడులు జరిగాయని అన్నారు. ఎస్సీ లు గా పుట్టాలని ఎవరు కోరుకుంటారని స్వయంగా చంద్రబాబే చెప్పాడు అని చెప్పారు. అన్ని జిల్లాల్లో దళితుల మీద టీడీపీ నేతుల దాడులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని సమత సైనిక దళ్ నిర్ణయించిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే దళితుల జీవితాలు బాగుపడతాయన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అండగా ఉంటామని, వైఎస్ జగన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
ఉప ఎన్నికలకు కారణం ఆ హీరోలే
సాక్షి,తిరుపతి: తిరుపతి అసెంబ్లీకి ఇంతవరకూ రెండుసార్లు ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు సందర్భాల్లోను ఇద్దరు ప్రముఖ సినీ నటుల రాజీనామా వల్లే జరిగాయి. టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు తిరుపతి, హిందూపురం నుంచి పోటీ చేశారు. ఆయన రెండు చోట్లా విజయం సాధించారు. అయితే తిరుపతికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఇక 2009లో పీఆర్పీ అధినేత, ప్రముఖ నటుడు చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. ఆయన పాలకొల్లులో ఓడిపోవడంతో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడంతో తిరుపతి స్థానానికి రాజీనామా చేశారు. దీంతో మళ్లీ తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగాయి. -
ఏజెన్సీ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం
సాక్షి, తిరుమల : తిరుపతిలోని అలిపిరి వద్ద 67.9 కోట్ల రూపాయలతో 346 గదుల నిర్మాణం చేపట్టనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. అదేవిధంగా... తిరుమలలో భద్రత పర్యవేక్షణకు రూ. 15 కోట్లతో 1050 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఏటీసీ వద్ద క్యూలైన్ నిర్మాణం కోసం రూ. 17.21 కోట్లు, తిరుమలలో స్మార్ట్ డేటా వినియోగ ఏర్పాటుకై రూ. 2.63, పలమనేరు గోశాల అభివృద్ధికి రూ. 40 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆలయ నిర్మాణాలు శ్రీవారి ఆలయ ఆగమ సలహామండలి సభ్యులుగా అనంతశయ్య దీక్షితులను నియమించినట్లు సుధాకర్ యాదవ్ తెలిపారు. విజయనగరంలోని పార్వతిపురంలో రూ. 2.97 కోట్లతో, శ్రీకాకుళంలోని సీతంపేటలో రూ. 2.83 కోట్లతో, తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో రూ. 2.97 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద రూ. 2.27 కోట్లతో కళ్యాణమండప నిర్మాణం చేపడతామన్నారు. -
కుమారుడి మృతిని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరుపతి : నగరంలో విషాధం చోటుచేసుకుంది. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఓ తల్లి ఆసుపత్రి ఆవరణంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన గంగాధర్ టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న గంగాధర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన గంగాధర్ తల్లి కుమారి రుయా ఆసుపత్రి ఆవరణంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వామపక్షాలు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రుయా ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. -
తిరుపతిలో దారుణం
తిరుపతి: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో టీటీడీ కాంట్రాక్టు కార్మికుడు గంగాధర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన గంగాధర్‌ను దగ్గరలోని రుయా ఆసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ కాసేపటికే మృతిచెందాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక రుయా ఆసుపత్రి ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకుని గంగాధర్ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. తల్లి, కుమారుడు మృతిచెందడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అవినీతి గురించి బాబు మాట్లాడటం హాస్యాస్పదం
-
చిన్న మెదడు చిట్లింది
సాక్షి, తిరుమల: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. బాబుకు చిన్నమెదడు చిట్లిపోయిందని, అందుకే అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోనే ఎవరికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం, వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామా తర్వాత బాబు యూటర్న్ తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టుల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను మోదీ పాదాల దగ్గర చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అక్రమాస్తుల కేసు మాత్రమే వైఎస్ జగన్‌పై ఉందని, అక్రమాస్తులు చంద్రబాబు దగ్గరే ఉన్నాయని అన్నారు. దేశంలోనే అత్యంత ధనవంతులైన ముఖ్యమంత్రిగా ఉన్న మీ ఆస్తులు ఎందుకు మోదీ జప్తు చేయలేదని ప్రశ్నించారు. రూ.250 కోట్లతో హైదరాబాద్‌లో రహస్యంగా ఇల్లు కడితే ఆ ఇంట్లోకి ఒక్క టీడీపీ నాయకుడిని కూడా ఎందుకు ఆహ్వానించలేదో సమాధానం చెప్పాలన్నారు. అవినీతి సొమ్ముతో నిర్మించారు కాబట్టే ఎవరినీ ఆహ్వానించలేదని ఆరోపించారు. అధికారంలో వచ్చావు..రాయలసీమ ప్రజలకు కరువు తెచ్చావని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు నాయుడిని రాజీ చేశాం అని పార్లమెంటులో ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నీ స్వార్థం కోసం ప్రజల భవిష్యత్ తాకట్టు పెట్టి హైదరాబాద్ నుంచి ఆగమేఘాల మీద పారిపోయి వచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బుందేళ్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వకుండా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని సూటిగా అడిగారు. ఏపీ సీఎం చంద్రబాబును వెంటనే ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వేయి కాళ్ల మండపాన్ని టీటీడీ పునఃనిర్మించాలని ఈఓకు వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు. టీటీడీని ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
శేషాచలం అడవుల్లో వందకుపైగా తమిళ స్మగ్లర్లు !
సాక్షి, తిరుపతి : శేషాచలం అడవుల్లో వంద మందికిపైగా తమిళ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి స్మగ్లర్ల కోసం టవేరా వాహనంలో ఆహార పొట్లాలను తీసుకురావటం అధికారులు గుర్తించారు. తిరుపతి ఎస్వీ జూ పార్కు సమీపంలో పొదల చాటున టవేరా బ్రాండ్ న్యూ కారు టాస్క్ ఫోర్స్ సీఐ మధు బృందం కంటపడింది. టవేరా కారు వద్దకు వారు వెళుతుండగా మరో కారు అక్కడకు చేరుకుంది. అధికారులను గమనించిన స్మగ్లర్లు కారును వేగంగా వెనక్కు తిప్పి చంద్రగిరి వైపు మళ్లించారు. దీంతో సీఐ మధు ఆ కారును వెంబడించారు. కారు వడమాలపేట మార్గంలో తప్పించుకుంది. దీంతో వెనక్కు వచ్చిన అధికారులు టవేరా వాహనాన్ని పరిశీలించగా అందులో వందకు పైగా చపాతీ ప్యాకెట్లు వాటికి కర్రీ ప్యాకెట్లు, బస్తా బియ్యం, వంటకు అవసరమైన వస్తువులు, 200 హాన్స్ ప్యాకెట్లు, బీడీ బండలు ఉన్నాయి. అక్కడ కారును రిపేర్లు చేసిన బిల్లు వారికి దొరికింది. ఆ బిల్లులో తమిళనాడు ఆరణిలోని ఓ కారు మెకానిక్ షాపు అడ్రసు ఉంది. తిరువన్నామలై జిల్లాకు చెందిన రెండు అధార్ కార్డులు ఉన్నాయి. సీఐ మధు మాట్లాడుతూ.. అడవులలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపులు చర్యలు తీవ్రం చేయనున్నట్లు తెలిపారు. అధార్ కార్డుల అధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని మిగిలిన వారి అచూకీ కనుగొంటామన్నారు. ఖచ్చితంగా అడవులలో పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు ఉన్నారని దానికి సంబంధించిన ఆధారాలు తమకు లభించినట్లు తెలిపారు. ఐజీ శ్రీకాంతారావు దీనికి సంబంధించిన సూచనలు అందజేశారు. ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎస్ఐ సోమశేఖర్, రైటర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
నా ప్రాణం పోయినా బాగుండేది: మోత్కుపల్లి
సాక్షి, తిరుమల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటలకు తన ప్రాణం పోయినా బాగుండేదని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ఆయన కాలిబాటలో పాదయాత్రగా బయలు దేరారు. కొద్దిసేపటి తర్వాత కాలిబాటలో ఆయన స్వల్ప అస్వస్థకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం కోలుకున్న ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను అవమాన పరిచారని, ప్రజల ముందు అవహేళన చేశారని వాపోయారు. దళితులకు సేవ చేయటానికే తప్ప.. తనకు వేరే ఆలోచన లేదని మోత్కుపల్లి తెలిపారు. కానీ చంద్రబాబు కులాన్ని అడ్డుపెట్టుకుని దూషించారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన దానికి దేవుని వద్ద తన గోడును వినిపించుకుంటానని అన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాలిబాటలో అనారోగ్యానికి గురై బీపీ పెరిగి.. గుండె నొప్పిగా ఉన్న పాదయాత్ర ఆపలేదని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. -
ఏపీకి పట్టిన శని చంద్రబాబు: మోత్కుపల్లి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడి బజార్లో తన గొంతు కోశారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వాపోయారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వల్లనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని పార్టీని కాపాడానని, తనకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నమ్మక ద్రోహి అని, రాష్ట్రంలో పేదలను అనగదొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి పట్టిన శని అని, యువకులు ఏపీకి సీఎం కావాలని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి, మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. ఏపీకి పట్టిన శని చంద్రబాబు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
కాపాడే వారెవరురా...!
తిరుమల బైపాస్ రోడ్డులోని అలిపిరి పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న మొహబూబా లే అవుట్ పార్క్ స్థలంలో 1980 నుంచి రెండేళ్ల క్రితం వరకు ఇది కార్పొరేషన్ స్థలం.. ఎవరు ప్రవేశించినా శిక్షార్హులు అన్న బోర్డు ఉండేది. కానీ ఇప్పుడా ప్రదేశంలో భారీ భవంతి వెలసింది. కోటిన్నర రూపాయల విలువ చేసే 30 అంకణాల∙స్థలాన్ని అధికార పార్టీ నాయకుడు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కబ్జా చేశారు. కార్పొరేషన్ రికార్డుల ప్రకారం ఈ స్థలం ఇప్పటికీ పార్క్ స్థలమే. కొంతమంది అధికారులు కబ్జాదారుడికి సహకరించారు. కోటిన్నర విలువ చేసే స్థలాన్ని కట్టబెట్టేశారు. సాక్షి, తిరుపతి తుడా : తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలకు రక్షణ కరువైంది. కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఒక్కొక్కటిగా తరిగిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ 27.44 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కొన్ని స్థలాలు ఏళ్ల క్రితమే కనుమరుగయ్యాయి. ఆ ఆక్రమణల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అధికారులే ఆక్రమణదారులతో చేతులు కలుపుతున్నారు. స్థలాలకు ఎసరు పెడుతున్నారు. సుమారు 11 ప్రాంతాల్లోని స్థలాలను కబ్జారాయుళ్లు కొట్టేశారని అంచనా. ఇవన్నీపోగా ఇప్పుడు 43 స్థలాలు మాత్రమే మిగిలాయి. గతంలో కొంతమంది కమిషనర్లు స్థలాలను కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ మాత్రమైనా మిగిలాయని బాధ్యత కలిగిన కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు. మిగిలిన ఖరీదైన స్థలాలనైనా పూర్తిస్థాయిలో రక్షించేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. 2008లో కార్పొరేషన్లోకి మూడు పంచాయితీలు విలీనమయ్యాయి. ఈ ప్రాంతంలో 27స్థలాలు కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 23 స్థలాలకు కనీసం ప్రహ రీ గోడలను కూడా ఏర్పాటు చేయలేదు. అప్పటి పంచాయితీలకు చెందిన స్థలాలు, ప్రైవేట్ వెంచర్లలో ప్రజా అవసరాలకు కేటాయించిన పార్కు స్థలాలు ఇప్పుడు కార్పొరేషన్ చేతిలోకి వచ్చాయి. పాత నగర పరిధిలో స్థలాలను కాపాడలేకపోయిన అధికారులు కనీసం విలీన పంచాయితీల స్థలాలనైనా కాపాడుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ వెంచర్లలోని పార్కు స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రహరీగోడ నిర్మించి స్థానిక అవసరాల నిమిత్తం అభివృద్ధి చేపడితేగానీ వీటిని కాపాడగలరు. ప్రహరీగోడలను సైతం నిర్మించకుండా అధికారులు ఈ స్థలాలపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీటిపై స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు కన్నుపడింది. ఆక్రమించి నిర్మాణాలు చేపట్టకముందే అధికారులు రక్షించుకోవాల్సిన బాధ్యత పై స్థాయి అధి కారులపై ఉంది. ప్రైవేట్ వ్యక్తుల గుప్పెట.. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలు ఇప్పటికే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అధికారులు లీజు పేరుతో కార్పొరేషన్ స్థలాలను కొంతమందికి కట్టబెట్టారు. ఇప్పటికీ ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సాహసించడం లేదు. లీజు పేరుతో స్థలాలను ఆధీనంలో పెట్టుకున్న వ్యక్తులు కోర్టుద్వారా స్టేలు తెచ్చుకుంటూ ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. అధికారులు సమర్ధంగా తమ వాదనను కోర్టులో వినిపిస్తే ఎప్పుడో ఈ స్థలాలను కార్పొరేషన్ చేజిక్కించుకునేది. కొంతమంది అధికారులు ఆ వ్యక్తులతో లాలూచీ పడి విలువైన స్థలాలను కార్పొరేషన్‌కు రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తిరుపతి గాంధీరోడ్డు లాంటి ప్రాంతంలోని స్థలాన్ని అతితక్కువ అద్దెతో నెట్టుకొస్తున్నారు. పదేళ్ల నుంచి ఇక్కడ మల్టీ పార్కింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్రతిపాదన ఉంది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మించే సాహసాన్ని అధికారులు చేయడం లేదు. ఈ స్థలా న్ని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా అధికారులు స్పందిం చడం లేదు. శ్రీనివాసం సముదాయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 15 ఏళ్లక్రితం ఓ వ్యక్తి హోటల్ నడిపేందుకు కార్పొరేషన్ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి ఆ స్థలాన్ని తీసుకునేం దుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. రైల్వేస్టేషన్ పార్సిల్ సర్వీస్‌కు ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రైవేట్ పార్కింగ్ స్థలంగా మార్చేశారు. ఇలా అనేక ప్రాంతాల్లో కార్పొరేషన్ స్థలాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. -
ఆడిషన్స్ పేరుతో అసభ్య ఫొటోలు తీసి..
-
ఏపీలో కొత్త అపరిచితుడు
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కొత్త అపరిచితుడు చంద్రబాబు నాయుడు వచ్చాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ..అగ్రిగోల్డ్ బాధితుల ఉసురు బాబుకు కచ్చితంగా తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. సొంత జిల్లాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకోడని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై పోలీసులను అడ్డుపెట్టికుని భౌతిక దాడులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. అందుకు నిదర్శనం అమిత్ షాపై దాడేనని వ్యాఖ్యానించారు. బాబు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతకాలం మనగగలుగుతాడో చూద్దామన్నారు. నాలుగేళ్లు మిత్రపక్షంలో ఉంటూనే లోలోపల ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి కుట్ర పన్నాడని ఆరోపించారు. పోలవరంలో పది శాతం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు పెట్టాల్సి ఉన్నా అది కూడా వద్దు అని కేంద్రమే పూర్తిగా భరిస్తుందని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పటికీ చెబుతున్నాం పోలవరం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. హోదా ఇవ్వడం కుదరదు అని ఎప్పుడో బాబుకు చెప్పామని, మొదటి నుంచి మోదీ ఇస్తాను అన్నది స్పెషల్ ప్యాకేజీ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్యాకేజీ ద్వారా సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తామని తెలిపారు. ప్యాకేజీకు ఒకే చెప్పిన బాబు, వెంకయ్యనాయుడుని పట్టుకుని బీజేపీకి జై అంటూ ఊరూరా ప్రచారం చేశాడని విమర్శించారు. ఎక్స్టెర్నల్ ఏజన్సీ నుంచి ప్యాకేజీ నిధులు తెచ్చుకోలేకపోయింది చంద్రబాబేనని ఆయన అసమర్థతను వెల్లడించారు. బాబు చేతగానితనాన్ని ప్రశ్నించిన వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌లకు భయపడి మోదీపై ఆరోపణలు చేయడం మొదలెట్టాడని బాబు కుటిలయత్నం గురించి వివరించారు. ప్రజల సొమ్ముతో అమరావతి డిజైన్లు పేరుతో ప్రత్యేక విమానం వేసుకుని పదహారు దేశాలు తిరిగాడని, చివరికి చేసింది ఏమీ లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం కోసం నమ్మి భూములు అప్పచెప్పిన స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, రాజధానిలో శంఖుస్థాపన చేసిన వాటిలో 90 శాతం వాటికి ఇంకా పనులు కూడా ప్రారంభం కాలేదని తెలిపారు. ఇవి లేఖ ద్వారా ప్రశ్నించిన భారత ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పించారని తెలిపారు. నోట్ల రద్దు నా ఆలోచన అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీతో తెగదెంపులు చేసుకున్నాక బీజేపీనే చేసింది అనడం అబద్ధం కాదా సూటిగా అడిగారు. మహానాడుగా పిలువబడే మాయనాడులో మూడేళ్లు వైఎస్సార్సీపీపై పడి ఇప్పుడు బీజేపీపై పడి ఏడుస్తున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు. -
సమాజాభివృద్ధే జేసీఐ లక్ష్యం
తిరుపతి (అలిపిరి) : సమాజ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ (జేసీఐ) జాతీయ అధ్యక్షుడు అర్పిత్ హతి పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో మంగళవారం ఆయన అధికారిక పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్పిత్హతి మాట్లాడుతూ దేశంలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఇంపాక్ట్ 2020–30 కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. దేశంలో వెయ్యికి పైగా జేసీఐ శాఖల ద్వారా విద్య, ఉపాధి, ఆరోగ్యం, పారిశుధ్యం, పకృతి పరిరక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు. అనంతరం జేసీఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 32 మందికి స్కాలర్షిప్లను అందజేశారు. కార్యక్రమంలో తిరుపతి శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, మణిసందీప్, మనోహర్, వెంకటరమణ, నాగేశ్వరరావు, అనుపమ తదితరులు పాల్గొన్నారు. -
తిరుపతిలో బిజిలీ బంద్
తిరుపతి కల్చరల్ : ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, జనసేన, ప్రజాసంఘాల నేతలు మంగళవారం రాత్రి తిరుపతిలో బిజిలీ బంద్ చేశారు. పార్టీ జెండాలు చేతపట్టి ర్యాలీగా ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ప్రత్యేక హోదా కోసం తమనేత జగన్మోహన్రెడ్డి పోరాటాలు సాగించారన్నారు. ప్రత్యేక హోదా పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు. దాని అవసరాన్ని అగ్రభాగాన నిలిపారన్నా రు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారమే లక్ష్యంగా ప్రత్యేక హోదాను విస్మరించారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన వారిని జైళ్లకు పంపిన ఘనత చంద్రబాబుదేనన్నారు. హోదా మోసంలో చంద్రబాబు మొదటి ముద్దాయి అయితే, ప్రధాని మోదీ రెండవ ముద్దాయిగా నిలిచారన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రజానీకం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు. పోరాటాలు ఉధృతం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ దగాకోరు మాటలతో మ భ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా తిరుగుబాటుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బిజిలీ బంద్‌లో భాగంగా రాత్రి 7నుంచి 7.30 గంటల వరకు విద్యు త్ బంద్ చేయించి నిరసన వ్యక్తం చేశారు. అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు టి.రాజేంద్ర, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్ కే.బాబు, ముద్రనారాయణ, ఆంజనేయులు, టి.రా జేంద్ర, ప్రసాద్, శివ, ఇమామ్, సాయికుమారి, కుసు మ, వనతి, పునీత, సీపీఐ నాయకులు చిన్నం పెంచలయ్య, విశ్వనాథ్, రాధాకృష్ణ, ఎన్డీ.రవి, జయలక్ష్మి, నదియా, సీపీఎం నాయకులు టి.సుబ్రమణ్యం, గు రుప్రసాద్, జయచంద్ర, నాగరాజ, సాయిలక్ష్మి, లక్ష్మి, హేమలత, మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐ ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, జనసేన నేతలు పాల్గొన్నారు. -
రోగి ‘ఓపి’కకు..పరీక్ష
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో.. వైద్యం దైన్యంగా మారింది. వివిధ ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ..హాస్పిటల్‌కు వచ్చేవారికి చీత్కారాలు.. చీదరింపులుతప్ప.. చికిత్స అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రమాదంలో గాయపడి వచ్చే వారి పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. ఓపీకి వచ్చే వారి పరిస్థితిమొదట ఎదురుచూపులు.. ఆ తర్వాత మాత్రలే దిక్కు అన్న చందంగా తయారైంది. జిల్లాలోనిఆస్పత్రుల్లో.. సోమవారం సాక్షి నిర్వహించిన విజిట్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం,ప్రభుత్వ ఉదాసీనత స్పష్టంగా కనిపించింది. సాక్షి, తిరుపతి (అలిపిరి): రాయలసీమకే పెద్దాస్పత్రిగా గుర్తింపు పొందిన రుయాకు సుస్తీ చేసింది. సోమవారం సాక్షి బృందం రుయా ఆస్పత్రిని విజిట్ చేసింది. పరిశీలనలో.. రుయాలో ఓపీ విభాగం సేవలు అధ్వానంగా ఉన్నాయి. ఓపీ నమోదు కేంద్రంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆదివారం మినహా ఇతర రోజుల్లో ఉదయం 8.30 గంటలకు ఓపీ నమోదు సేవలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటలకు ఓపీ నమోదు చేసుకున్న రోగులు ఆయా విభాగాల వారీగా ఓపీ విభాగాల వద్దకు చేరుకుం టారు. గేట్లు తెరిచిన వెంటనే ఓపీ నమోదు హాలులోకి 500 మంది ఒక్కసారి దూసుకుపోతున్నారు. దీంతో ఓపీ నమోదు హాలు రోగులతో కిక్కిరిసిపోతుంది. రుయా ఆస్పత్రిలో కంప్యూటర్, ఇంటర్నెట్ నిర్వహణ నిమిత్తం ప్రైవేట్ సంస్థకు ఏటా రూ.లక్షలు చెల్లిస్తున్నారు. అయినా ఓపీ కేంద్రాల నిర్వాహణ అధ్వానంగా మారింది. సమయపాలన పాటించని వైద్యులు రుయా ఆస్పత్రిలో ఉన్నతాధికారులు మొదలుకుని సీనియర్ వైద్యుల వరకు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9 గంటలకు ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రాంభమైనా అధికారులు అందుబాటులో ఉండడం లేదు. ఓపీ సేవలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు వున్నా కొందరు వైద్యులు 12 గంటలకే వెళ్లిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, చోటామోటా నాయకుల రెకమెండేషన్ వుంటేనే ఆపరేషన్లు త్వరితగతిన చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు. లేకుంటే పడిగాపులు తప్పవు. పట్టించుకునేవారు లేరు.. నెల రోజుల క్రితం ప్రమాదవశాత్తు కిందపడి ఎడమ కాలికి గాయమైంది. రుయాకు వైద్యం కోసం వచ్చా. ఆర్థో విభాగానికి వెళితే తగిలిన గాయానికి కట్టుకట్టారు. నెల రోజులుగా రుయా ఆవరణలోని విశ్రాంతి సముదాయంలో ఉన్న.. దెబ్బ మానడం లేదు. వైద్యులు బయట మందులు రాస్తున్నారు. దిక్కులేక ఇక్కడే ఉన్నాను – రాము, మైసూరు, కర్ణాటక సహాయకులుంటేనే వైద్యం అంటున్నారు కుడికాలుకు అరికాలులో చెక్కపేడు ఇరుక్కుపోయింది. వారం రోజుల క్రితం రుయా ఆర్థో విభాగానికి వస్తే గాయాన్ని క్లీన్‌చేసి కట్టుకట్టి పంపారు. మళ్లీ వైద్యం కోసం వస్తే ఆపరేషన్ చేసి చెక్కను తీస్తాం.. నీకు సహాయకులుంటే వైద్యం చేస్తాం.. లేకుంటే లేదు. అని చెప్పారు. నాకు ఎవరూ లేరు... వైద్యం కోసం వస్తే ఇలా చెప్పడం బాధేసింది. పెద్ద సార్లు నాకు వైద్యం అందించి కాలులోని చెక్క పేడును తొలగించాలి. – సుబ్బరాజు, నాయుడు పేట, నెల్లూరు జిల్లా -
రాఘవేంద్రుడి డైరెక్షన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు నియమితులయ్యారు. శనివారం సాయంత్రం టీటీడీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు టీటీడీ ట్రస్ట్‌బోర్డులో సభ్యుడిగా కొనసాగిన రాఘవేంద్రరావును ఈసారి ఎస్వీబీసీకి చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ తన ప్రకటనలో పేర్కొంది. ఎస్వీబీసీకి చైర్మన్‌ను నియమించడం ఇదే మొదటిసారి. తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తి తత్వాన్ని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, హిందూ ధార్మికతను పెంచేందుకు 2008లో టీటీడీ ఎస్వీబీసీ చానల్‌ను ప్రారంభించింది. ఏడాదికి రూ.25 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి ఎస్వీబీసీని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ సీఈఓలుగా కేఎస్ శర్మ, జయదేవరెడ్డి, ఎస్.రామానుజం, మధుసూదనరావు, నరసింహారావులు పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిముక్తేశ్వరరావు ఎస్వీబీసీకి ఇన్చార్జి సీఈఓగా కొనసాగుతున్నారు. ఆరోపణలు ఉన్నప్పటికీ ఇటీవల ఎస్వీబీసీ ఉద్యోగులు, సీఈఓ నరసింహా రావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. ఎస్వీబీసీ నిధులను కొల్లగొట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు సీఈఓపై ఈఓకు ఫిర్యాదు చేశారు. సీఈఓ నరసింహారావు నిధుల వాడకంపై విజిలెన్సు విచారణ కూడా జరిగింది. ఇందులో రూ.2 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్ప టి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు ఎస్వీబీసీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం కోసం కోట్లలో నిధులు ఖర్చు పెట్టారని, యాంకర్ పార్టులు మార్చి పాత వాటినే కొత్త ఎపిసోడ్లుగా చూ పారన్న ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. చానల్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలన్న నిర్ణయంలో ఉన్న టీటీడీ తాజాగా ఎస్వీబీసీ చైర్మన్ నియామకాన్ని జరి పింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్రరావుకు చైర్మన్ పదవిని ఎలా ఇస్తారన్నది కొందరు ఉద్యోగుల ప్రశ్న. మొదటి నుంచీ ఎస్వీబీసీ వ్యవహారంలో పోరాటం చేస్తున్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి కూడా చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియామకాన్ని తప్పుబడుతున్నారు. -
మేలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. శనివారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమి షన్ వెంటనే ఎన్నికల నిర్వహణకు తెరతీసింది. నోటిఫికేషన్‌ను ఈనెల 26న విడుదల చేయనుంది. మే 3న నామినేషన్లకు గడువుగా విధించి మే 21న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. 24న ఫలితాలను వెల్లడిస్తుంది. ఇప్పటికే జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు సాధారణ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జిల్లా రాజకీయ వర్గాల్లో ఎన్నికల వేడిని రగిలించడం ఖాయమని చెబుతున్నారు. ఈ నెలాఖరు కల్లా పోటీలో నిలిచే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ప్రకటించే వీలుంది. -
అసిఫా దోషులను శిక్షించాలి
తిరుపతి అర్బన్ /కల్చరల్ : జమ్ము కాశ్మీర్ కథువాలో చిన్నారి అసిఫాపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి, నగర అధ్యక్షురాలు బుర్రా సావిత్రియాదవ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి నగర వీధుల్లో ర్యాలీగా నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద ముగించారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా, నిర్భయ చట్టం అమలులో ఉన్నా ఫలితం లేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు ప్రమీలమ్మ, రిటైర్డ్ ప్రిన్సిపాల్ స్వరాజ్య లక్ష్మి, వివిధ మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. క్రైస్తవుల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం వచ్చాక మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలు, అరాచకాలను అరికట్టాలని అసీఫా దోషులను శిక్షించాలని, పాస్టర్ అరుళ్ అరసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నారి అసీఫా హత్యను ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తిరుపతి క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తిరుపతి నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో పాస్టర్స్ రాజేంద్రన్, భీమిరెడ్డి, విజయకుమార్, డానియేల్, జాన్‌పాల్, దీలీప్, జయపాల్, ప్రమీల, జమిలా, క్రైస్తవులు, చిన్నారులు పాల్గొన్నారు. -
జనసేన పార్టీలో సం‘కుల’ సమరం
జిల్లా జనసేనలో సం‘కుల’ సమరం మొదలైంది. పార్టీ వ్యవహారాల్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ, మిగతా వర్గాల నాయకులను పార్టీ అధిష్టానం విస్మరిస్తోందన్న విమర్శలు తెరమీదకు వచ్చాయి. పార్టీ సంస్థాగత నిర్మాణానికి కీలకంగా వ్యవహరించే తిరుపతి పట్టణంలో నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లా జనసేనలో ఆధిపత్య రగడ మొదలైంది. గుంటూరులో పార్టీ అధినేత ఆత్మగౌరవ సభ పెట్టకు ముందు నుంచే ఈ పోరు కొనసాగుతోంది. రెండు గ్రూపులుగా చీలిపోయిన నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ పిలుపు మేరకు ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను సైతం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఒక గ్రూపునకు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రెండో గ్రూపునకు కిరణ్‌రాయల్ నేతృత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు ఇద్దరూ సన్నిహితులే అయినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో డాక్టర్ హరిప్రసాద్ ఒకడుగు ముందంజలో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఆశీస్సుల కారణంగానే ఇంతకు ముందు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కొనసాగిన డాక్టర్ హరిప్రసాద్ రెండు నెలల నుంచి పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. ఇకపోతే తిరుపతి నగరంలో పార్టీని నడిపించడం, ఇతరత్రా కార్యక్రమాల్లో కిరణ్‌రాయల్ కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకోసం పార్టీ అధిష్టానం జిల్లాకు చెందిన ఏడుగురు నాయకులను ఆదివారం విజయవాడలో జరిగే సమావేశానికి ఆహ్వానించడంతో పాటు మెంబర్షిప్ కార్డుల కోసం ఎంపిక చేసింది. దీంతో ఆహ్వానం లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు రగిలిపోయారు. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఎయిర్‌బైపాస్ రోడ్‌లోని ఓ ప్రయివేటు హోటల్లో సమావేశమైన పార్టీ నాయకులు కో–ఆర్డినేటర్ కిరణ్‌రాయల్, హరిశంకర్‌పై ధ్వజమెత్తారు. ఒకే ఒక సామాజిక వర్గానికి మాత్రమే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం మిగతా వారిని పట్టించుకోకపోవడం ఏమిటని పార్టీ యువనేత బాబ్జీ సమావేశంలో ప్రశ్నించారు. డాక్టర్ హరిప్రసాద్ తనకు అనుకూలమైన వారినే మెంబర్షిప్ కోసం ఎంపిక చేయడం ఎంత వరకూ న్యాయమని నిలదీశారు. ఈనెల 22, 23 తేదీల్లో పవన్‌కల్యాణ్ తిరుపతి వచ్చినపుడు ఈ విషయంపై తేల్చుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తపాలా శాఖలో ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల
తిరుపతి అర్బన్ : ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ పరిధిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తిరుపతి పోస్టల్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసమూర్తి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ కోసం గురువారం తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఆన్లైన్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్‌కు మే 12వ తేదీ వరకు అవకాశముందని వెల్లడించారు. దరఖాస్తు, పరీక్ష రుసుములను ఈ–పేమెంట్ విధానంలో మాత్రమే పోస్టాఫీసులో చెల్లించాలని కోరారు. తిరుపతి డివిజన్ పరిధిలోని అన్ని హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు తపాలా శాఖ వెబ్సైట్లను పరిశీలించాలని కోరారు. -
ఇది వైద్యుడి ఉద్యమం
సాక్షి ప్రతినిధి,తిరుపతి : ఈయన పేరు డాక్టర్ బీవీ రాజారావు. తిరుపతిలో పేరున్న డాక్టర్. ఈయ న్ని కలిసే రోగులూ ఎక్కువే. రోజువారీ సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఏసీ రూములో కూర్చుని రోగుల్ని పరీక్షించి రోజుకు రూ.50 వేల కు తగ్గకుండా సంపాదించుకోవచ్చు. ఒకమాటలో చెప్పాలంటే సుఖవంతమైన జీవితం. అయితే... డాక్టర్ రాజారావు ఈ తరహా జీవితాన్ని కోరుకోవడం లేదు. మనం తెలుగు గడ్డపై పుట్టి, తెలుగువాడిగా పెరిగి రాష్ట్రానికి ఏం చేశామని ప్రశ్నించుకుంటున్నారు. ప్రత్యేక హోదా సాధన తన కర్తవ్యమంటూ పోరాటం మొదలు పెట్టారు. ఎవరు కలిసొచ్చినా, రాకపోయినా తాను మా త్రం పోరాటాన్ని వీడబోనని స్పష్టం చేస్తున్నారు. చెప్పడమే కాదు.. ఆస్పత్రి వదిలి రోడ్డు మీదకొచ్చి తిరుపతి మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఐ దు రోజులుగా ఆత్మగౌరవ ఉద్యమం చేస్తున్నారు. ఇది ప్రజా వేదిక... సమాజంలో ప్రతి ఒక్కరూ దేశం, రాష్ట్రం కోసం బాధ్యతగా ఆలోచించాలన్నదే డాక్టర్ బీవీ రాజారావు అభిప్రాయం. వృత్తి ఏదైనా పౌరుడిగా రాష్ట్రం కోసం పోరాడాలన్నదే ఆయన నినా దం. ఇందుకోసం ఒంటరి పోరు ప్రారంభించా రు. ప్రజలు, రాజకీయ పార్టీలన్నీ ఉమ్మడిగా ఒకే వేదికపై పోరాటం చేసేందుకు అనువుగా ప్రజావేదికను ఏర్పాటు చేశారు. అందులోనే తాను కూ ర్చుని, రండి...ఉద్యమిద్దామని పిలుస్తున్నారు. హోదా విషయంలో చంద్రబాబు ఆడిన డ్రామాలను వివరిస్తున్నారు. ఇది ప్రజా వేదిక.. ఇక్కడ ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చని చెబుతున్నారు. వేసవి గాలులు, ఉక్కపోతను భరిస్తూనే పోరాటం చేస్తున్నారు. రోడ్డున పోయే పరిచయస్తులను పిలిచి, హోదా అవసరాన్ని వివరించి వారినీ ఉద్యమంలో భాగస్వాముల్ని చేస్తున్నారు. ఐదురోజులుగా సు మా రు ఐదువేల మందితో భావాలు పంచుకున్నారు. వేదిక దగ్గరే ఉచిత వైద్యం... హోదా సాధన పోరు చేపట్టిన డాక్టర్ రాజా రావు వేదిక వద్దనే ఉచిత వైద్యాన్ని చేస్తున్నారు. రోజూ వేదిక దగ్గరకొచ్చే యాచకులు, పేదలు, అనాథలు, ఏ ఆదరణ లేని వృద్ధులకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. యాచకులు, పేదలకు అర్థమయ్యేలా తెలుగులోనే ప్రిస్క్రిప్షన్ రాసి, రుయా ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళతా...పల్లెజనాన్ని కదిలిస్తా... ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పల్లెల్లోనూ కొనసాగిస్తానని డాక్టర్ రాజారావు అంటున్నారు. రో జుకు నాలుగైదు గ్రామాలకు వెళ్లి అక్కడి పల్లె జనానికి హోదా అవసరాన్ని తెలియజేస్తానని చె బుతున్నారు. పల్లెల్లో ఉద్యమ పోరును ఉధృతం చేస్తేనే కేంద్రం కదలి వస్తుందని అంటున్నారు. అన్ని పార్టీలూ ఒకే వేదికపై ఆమరణ దీక్ష చేయాలని, నేరుగా సీఎం చంద్రబాబే స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆమరణ దీక్షకు పూనుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని ఆయన అంటున్నారు. -
‘గ్రీన్’ హైవేకు పచ్చజెండా
సాక్షి, చెన్నై: గ్రీన్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10 వేల కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఈ పనులకుగాను స్థల సేకరణకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. చెన్నై నుంచి సేలం వైపు ఎనిమిది మార్గాలతో 274 కిమీ దూరంలో ఈ గ్రీన్ నేషనల్ హైవే రూపుదిద్దుకోనుంది. కన్యాకుమారి నుంచి చెన్నై మీదుగా పలు రాష్ట్రాలను కలుపుతూ జాతీయ రహదారి రూపదిద్దుకుని ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారుల్లో నిత్యం వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఈ జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రాష్ట్ర రహదారులు అనేకం ఉన్నాయి. అయినా, ట్రాఫిక్ తగ్గేది లేదు. ఈ పరిస్థితుల్లో చెన్నై నుంచి పశ్చిమ తమిళనాడు వైపుగా సేలంకు సరికొత్త రోడ్డు మార్గానికి కేంద్రం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ప్రణాళిక సిద్ధమైంది. పచ్చదనంతో నిండిన మార్గంగా ఈ జాతీయ రహదారిని రూపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ పనులకుగాను స్థలసేకరణ నిమిత్తం రాష్ట్ర రహదారుల శాఖ కార్యదర్శి రాజీవ్ రంజన్‌కు కేంద్ర రహదారుల శాఖ నుంచి ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మార్గం సాగే జిల్లాల్లోని కలెక్టర్ల పర్యవేక్షణలో స్థల సేకరణకు ప్రత్యేక అధికారుల్ని రంగంలోకి దించే విధంగా ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అలాగే , ఆ రోడ్‌రూట్ మ్యాప్ అంశాలను అందులో పొందుపరిచారు. రూ.10 వేల కోట్లతో పచ్చదనం: చెన్నై నుంచి సేలం వరకు 274 కి. మీద దూరం రూపుదిద్దుకోనున్న ఈ హైవే 250 కిమీ దూరం అటవీ మార్గంలో సాగనుంది. చెన్నై తాంబరం నుంచి ధర్మపురి జిల్లా అరూర్ వరకు ఎన్‌హెచ్ 179బీగా, అరూర్ నుంచి సేలం వరకు ఎన్‌హెచ్ 179ఏగా ఈ గ్రీన్ హైవేను పిలుస్తారు. రూ.పదివేల కోట్ల వ్యయంతో పచ్చదనంతో ఈ మార్గం రూపుదిద్దుకోనుంది. కాంచీపురం జిల్లాల్లో 53 కిమీ, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు, వందవాసి, పోలూరు, ఆరణి, సెంగం మీదుగా 122 కి.మీ, కృష్ణగిరిలో రెండు కిమీ, ధర్మపురి జిల్లా తీర్థమలై, అరూర్, పాపిరెడ్డి పట్టిలను కలుపుతూ 53 కి.మీ, సేలం జిల్లా వాలప్పాడి తాలుకా నుంచి సేలం నగరంలోకి 38 కిమీ దూరం నిర్మించనున్నారు. స్థలసేకరణ ప్రక్రియను త్వరితగతిన ముగించాలని, ప్రత్యేక అధికారుల ద్వారా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 250 కి.మీ దూరం అటవీ మార్గంలో ఈ గ్రీన్ హైవే పయనించనున్న దృష్ట్యా, అందుకు తగ్గ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ రహదారి పూర్తయతే చెన్నై నుంచి సేలంకు 3 గంటల్లో చేరుకోవచ్చు. దేశంలోనే రెండవ గ్రీన్ హైవే తమిళనాడుకు దక్కడం గమనించదగ్గ విషయం. -
18న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన విళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. అదే రోజు వేకువజామున శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి వేర్వేరుగా తిరుమంజనం నిర్వహించి, విశేషాభరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఉత్సవమూర్తులను ఘంటామండపంలో వేంచేపు చేసి, పడిప్రసాదాలు, అన్నప్రసాదాలతో నివేదిస్తారు. అనంతరం ఆస్థాన వేడుకలు నిర్వహించనున్నారు. శ్రీవారి పాదాల వద్ద ఉన్న పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేయిస్తారు. తిథి, వారనక్షత్ర, నూతన సంవత్సర ఫలితాలు, లాభనష్టాలు, నవగ్రహాల గతులు, సవ్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత అవమానాలు ఈ పంచాంగ శ్రవణంలో శ్రీవారికి వినిపిస్తారు. ఈ ఉగాది ఆస్థానం నేపథ్యంలో 18వ తేదీ నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. 14న అన్నమయ్య 515వ వర్ధంతి ఉత్సవం.. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులవారి 515వ వర్ధంతి మహోత్సవాన్ని ఈనెల 14వ తేదీన తిరుమలలో నిర్వహించనున్నారు. ఇక్కడి నారాయణగిరి ఉద్యానవనంలో ఉత్సవమూర్తులు వేంచేపు చేసి, సాయంత్రం 6.00 గంటల నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోష్టిగానం నిర్వహించనున్నారు. -
కన్న తండ్రిని వదిలించుకున్నారు.!
సాక్షి, తిరుపతి: నడక నేర్పించి, విద్యాబుద్ధులు చెప్పించి, ప్రయోజకులను చేసిన తండ్రి వారికి భారమయ్యాడు. ముదిమి వయసులో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిని దిక్కులేని వాడిగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నెల రోజులుగా నానా అవస్థలు పడుతున్న ఆ వృద్ధున్ని ‘అమ్మ ఒడి’ నిర్వాహకులు అక్కున చేర్చుకున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి తాలూక గాలివీడుకు చెందిన రొడ్డ చెన్నయ్య(70)కి ఐదుగురు పిల్లలు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్య అంజనమ్మ చనిపోవడంతో వారిని పోషించి, పెళ్లిళ్లు చేశాడు. 10 ఎకరాల పొలం ఉన్నా వచ్చే ఆదాయం బిడ్డలే తీసుకుంటూ వచ్చారు. వయస్సు మీదపడి నడవలేని స్థితిలో ఇంటికే పరిమితమైన చెన్నయ్యను కోడళ్లు నిర్లక్ష్యం చేశారు. ఆయన ఉంటే తాము కాపురాలు చేయలేమని తెగేసి చెప్పడంతో భార్యల మాటకు విలువనిచ్చిన కుమారులు నెల రోజుల క్రింద అర్ధరాత్రి వేళ తండ్రిని ఒక వాహనంలో తీసుకొచ్చి స్థానిక మల్లికార్జున సర్కిల్ సమీపంలోని వారపుసంత గోడకింద వదిలేసి వెళ్లిపోయారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడు స్థానికులు పెట్టే మెతుకులతో ప్రాణాలు నిలబెట్టుకుంటూ వచ్చాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అమ్మ ఒడి ఆశ్రమ నిర్వాహకులు ఆయన్ను అక్కున చేర్చుకున్నాడు. -
ప్రేమ.. మోసం.. ఎస్పీ ఆఫీసులో నిద్రమాత్రలు మింగి..
సాక్షి, తిరుపతి : ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువతి తనకు న్యాయం చేయాలంటూ అక్కడే నిద్రమాత్రలు మింగింది. దాంతో కార్యాలయం ఎదుట టెన్షన్ పూరిత వాతావరణం నెలకొంది. తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో బాధితురాలను హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఎమ్ఆర్ గోదావరి డెవలపర్స్‌లో పనిచేస్తున్న విజయ్ కుమార్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను మోసం చేశాడు. అయితే, దీనిపై ఆమె తిరుచానురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం కావాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుంది. -
డీల్ కుదిరింది!
పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్‌రెడ్డి గంటల వ్యవధిలోనే ఎందుకు మనసు మార్చుకున్నారు. వైఎస్సార్సీపీలోకి వస్తున్నానంటూ సంకేతాలు పంపి తర్వాత కాదని ఎందుకు మాట మార్చారు.. ఇంతలా ఆయన్ను ప్రభావం చేసిన అంశాలేంటి అని పరిశీలిస్తే ఈ తతంగం వెనుక పెద్ద హైడ్రామానే నడిచింది. సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి ‘తాయిలాలు’ ప్రకటించారనే అంశం ఇప్పుడు గుప్పుమంటోంది. తిరుపతి: గత ప్రభుత్వ హయాంలో పీలేరు పట్టణ పరిసర ప్రాంతాలలో కోట్లాది రూపాయల విలువ గల ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ.శ్రీనాథరెడ్డిపైన అనేక ఆరోపణలు, విమర్శలువచ్చాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాగానే టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి, టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు. ఇదే అదనుగా భావించి పీలేరు పట్టణ శివారు ప్రాంతం తిరుపతి మార్గంలోని ఎంవీఐ కార్యాలయ సమీపం నుంచి రింగ్‌రోడ్డు నిర్మించి రహదారి కిరువైపులా సుమారు 50 ఎకరాలు వివిధ బినామీ పేర్లపై చేజిక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడుగా కంకర మిషన్ ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేశారు. ఉనికే ప్రశ్నార్థకంగా అంతలోనే రాష్ట్రం విడిపోవడం, ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి దిగిపోవడంతో జరిగిపోయాయి. దీంతో అధికారం దూరం కావడంతో మళ్లీ బాబు పంచన చేరారు. టీడీపీలో చేరినప్పటికీ అప్పటికే పార్టీలో ఉన్న చిన్నాచితక నేతలతోపాటు, నియోజక వర్గ పార్టీ ఇన్చార్జి ఈయనను పట్టించుకోక పోవడంతో ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి టీడీపీలో చేరగానే పీలేరు ఇన్చార్జిగా నియమించారు. ఇక జీవీ రాజకీయ చరిత్ర ముగిసిపోయిందని అందరూ భావించారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. వైఎస్సార్సీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో తన వారిని పురమాయించి వైఎస్సార్సీపీలో చేరడం కోసం రెండు నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేశారు. దీనికి తోడు పీలేరులో 20 రోజుల నుంచి తాను వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ఆయనే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం పీలేరు కోటపల్లెలోని జీ.వీ.శ్రీనాథరెడ్డి ఇంటికి వచ్చారు. సుమారు రెండు గంటల సేపు చర్చలు జరిపారు. పార్టీలో చేరుతానని జీవీ వారి ముందు నమ్మించారు. జీవీ వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని విషయం తెలియడంతో ఆ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో జీవీ ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కేక్ కట్ చేయడం సత్కారాలు చేసుకోవడం జగన్‌కు జైకొట్టడం, బాణా సంచా పేల్చుకుని సంబరాల్లో మునిగిపోయారు. టీడీపీ నేతల బెదిరింపులతో పరుగులు ఇంతలోనే టీడీపీ నేతల నుంచి బెదిరింపుల రావడంతో హుటాహుటిన గోప్యంగా తిరుపతికి పరుగులు తీశారు. పార్టీ మారితే గత ప్రభుత్వంలో ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవడం, కంకర మిషన్ సీజ్ తదితర బెదిరింపుల పరంపర సాగింది. రాజకీయ జీవితంలో లేకపోయినా పర్వాలేదు, అప్పనంగా దోచేసిన కోట్లాది రూపాయల భూములు లాక్కుంటే నష్టపోతామన్న దురాశతో గంట వ్యవధిలోనే ప్లేటు ఫిరాయించారు. టీడీపీ నేతలు ఇచ్చిన స్ట్రిప్ట్తో తిరుపతి తుడా కార్యాలయంలో సినిమా పక్కీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి తాను పార్టీ మారడంలేదని చెప్పారు. అయితే భూముల రెగులరైజేషన్ డీల్ కుదిరినట్లు జీవీని నమ్మించడానికి సోమవారం టీడీపీ నేతలతో కలెక్టర్ ఎదుటే చర్చించినట్లు సమాచారం. కలెక్టర్‌తో భేటీలో మంత్రి అమరనాథరెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని పాల్గొనడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. -
పసందుగా పదేళ్లు!
... కంప్లీట్ అయ్యాయి... హీరోయిన్గా దీపికా పదుకోన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. ఫరా ఖాన్ దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా నటించిన ‘ఓం శాంతి ఓం’ ద్వారా ఈ సొట్టబుగ్గల సుందరి హిందీ తెరపై మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఈ సౌత్ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. 2007 నవంబర్ 9న ఆ చిత్రం విడుదలైంది. హీరోయిన్గా పదేళ్లు కెరీర్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దీపిక తిరుపతి వెళ్లారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులు పొందారు. దీపిక తిరుమల వెళ్లిన ఫొటోను ఇన్సెట్లో చూడొచ్చు. తిరుపతిలోని పద్మావతి టెంపుల్ని కూడా సందర్శించారామె. లేటెస్ట్గా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో రూపొందిన ‘పద్మావతి’ని డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పద్మావతి పేరుతో సినిమా చేశారు కాబట్టి, ప్రత్యేకంగా ఆ అమ్మవారి గుడికి వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే... గడచిన పదేళ్లలో ‘లవ్ ఆజ్ కల్, హౌస్‌ఫుల్, రేస్ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, పీకూ, బాజీరావ్ మస్తానీ’ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. రణబీర్ కపూర్‌తో లవ్, బ్రేకప్ తర్వాత కొంత డిప్రెషన్‌కి గురయ్యారు. ఆ సమయంలో సైకాలజిస్ట్‌ని కలసి, డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. ఏమైతేనేం.. ప్రొఫెషనల్‌గా... పర్సనల్‌గా ఇప్పుడు దీపిక మంచి స్పేస్‌లో ఉన్నారు. -
మంట కలుస్తున్న బాంధవ్యాలు
► మనిషిలో పెరుగుతున్న స్వార్థం ► చిన్న వివాదాలతోనే గొడవలు ► హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వైనం ► కౌన్సెలింగ్ అవసరమంటున్న నిపుణులు రోజులు మారుతున్నాయి.. మనుషులు మారుతున్నారు.. వారి ప్రవర్తనలో మార్పు వస్తోంది.. అనుకున్న వస్తువు, లేదా మరేదైనా దక్కకపోతే దానవులుగా మారిపోతున్నారు. మమతలు, అనురాగాలు, ప్రేమాభిమానాలు మరిచిపోయి కట్టుకున్న పెళ్లాన్ని, కడుపున పుట్టిన బిడ్డను సైతం హత్య చేస్తున్నారు. వ్యక్తిలో పెరుగుతున్న స్వార్థ చింతనే దీనికంతటికీ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఇది సంక్లిష్ట పరిస్థితిగా మారిపోయింది. ఇక రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి క్రైం : కారణాలు ఏవైనా జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు, వ్యాపార లావా దేవీలు, ఆస్తి గొడవలతో మనుషులన్న విచక్షణను కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు. ప్రవర్తనలో మార్పును గమనించిన వెంటనే మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి నైతిక విలువలు, బంధాలు, బంధుత్వాల గురించి తెలియజేయాల్సి ఉంది. అప్పుడే సమసమాజ నిర్మాణం జరిగి ప్రపంచం నందన వనంగా మారుతుంది. ► రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు తమిళనాడు నుంచి వచ్చి గది అద్దె కు తీసుకున్నారు. పూటుగా మద్యం సేవించారు. వారి మధ్య జరిగిందో కాని ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని హతమార్చి పరారయ్యారు. ► తనకు తెలియకుండా వ్యవహారం నడుపుతున్నాడనే నెపంతో యువకుడిని కలికిరి మండలంలో అతిక్రూరంగా హింసించి హత్య చేశారు. ► ఐదు రోజుల క్రితం రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బాబు అనే వ్యక్తిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ► ఈ నెల మొదటి వారంలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బు వివాదం చోటు చేసుకుంది. దీంతో కలిసి చదువుకున్న స్నేహితుడని కూడా చూడకుండా కిరాతకంగా స్నేహితుడే హత్య చేశాడు. ► మదనపల్లిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కొడుతుండగా అడ్డు వచ్చిన అత్తను అల్లుడు దారుణంగా హత్య చేశాడు. కొరవడిన నిఘా వ్యవస్థ జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఒక హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతోనే హత్యలకు పాల్పడుతున్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు. పేరుకు మాత్రమే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని, భార్యాభర్తల మధ్య అనుమానాలు తొలగిస్తున్నామని చెబుతున్నారు. జరిగినా సంఘటన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ప్రకటనలు వదలివేసి జరుగుతున్న హత్యలకు కారణాలు తెలుసుకుని ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని చోట్ల మార్పులు రావాలి వ్యక్తుల్లో నేను, నాది అన్న భావన రానురాను బలంగా వేళ్లూనుకుంటోంది. కూర్చుని చర్చించుకుంటే పరిష్కారమయ్యే చిన్న చిన్న సమస్యలపై హత్యలు చేసే స్థాయికి వస్తుండడం వ్యక్తిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచీ చెడ్డ చెప్పాల్సిన తల్లిదండ్రులే సహనం కోల్పోతున్నారు. మనిషి అన్న ఆలోచనలు మరచిపోతున్నారు. చిన్న పిల్లలకు మనిషి ప్రాణాలు, విలువలు తెలియజేయాల్సిన వయస్సులో వారే దారితప్పుతున్నారు. క్షణికావేశానికి లోనై ఆలోచించకలిగే శక్తి ఉన్నా అనాలోచిత నిర్ణయాలతో ప్రాణాలు తీస్తున్నారు. కౌన్సెలింగ్ అవసరం రక్త సంబంధం ఉన్నవారినే హత్య చేస్తున్న వారి ప్రవర్తనను ఒక కోణంలో విశ్లేషించలేం. అన్ని కోణాల్లోనూ పరిశీలించాలి. పాఠశాల వయస్సు నుంచే యుక్త వయస్సు వచ్చే వరకు పెరిగిన విధానాన్ని తెలుసుకోవాలి. ఏదో చిన్న సమస్యకే హత్యలు చేస్తున్నారంటే బంధాలు, బంధుత్వాల గురించి తెలియదు. చిన్నతనం నుం చి తల్లిదండ్రులకు దూరంగా పెరి గిన వారిలో ఈ తరహా భావా లు ఎక్కువగా ఉంటాయి. క్షణికావే శం పడుతున్న వారికి కౌన్సెలింగ్ అవసరం. అప్పుడే ఉద్వేగాలను ని యంత్రించగలం. – డాక్టర్ ఎన్ఎన్ రాజు, మానసిక నిపుణులు -
క్రీడాభివృద్ధిలో సర్కారు విఫలం: రోజా
► ఒక మైదానమూ లేదు ► క్రీడలకు ప్రోత్సాహంలో చెవిరెడ్డి ఆదర్శం ► ఎమ్మెల్యే రోజా వెల్లడి తిరుపతి సెంట్రల్: తాను, తన ప్రభుత్వం గొప్ప అంటూ ప్రగల్బాలు పలుకుతున్న సీఎం చంద్రబాబు హయాంలో ఒక క్రీడాకారుడినైనా సిద్ధం చేశారా? అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో క్రీడాభివృద్ధికి తూట్లు పడ్డాయన్నారు. తుమ్మలగుంటలో జరుగుతున్న వైఎస్సార్ గ్రామీణ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే రోజా శుక్రవారం సందర్శించారు. పది క్రీడామైదానాల్లోని క్రీడాకారులను కలుస్తూ, వారిని ఉత్సాహపరిచేలా కాసేపు క్రికెట్ ఆడారు. అనంతరం విలేకరుల సమావేశంలో రోజా మాట్లాడుతూ గ్రామంలోని యువత పక్కదారి పట్టకుండా, క్రీడలవైపు వారిని మళ్లించి, ప్రోత్సహిం చాల్సిన ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందన్నారు. గ్రామాల్లో ప్రతిభగల యువతకు కొదవలేకున్నా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించలేక పోవడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నా రు. మూడేళ్లలో ఒక్క క్రీడామైదానాన్ని, ఒక స్పోర్ట్స్ అకాడమీని నిర్మించలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు, ఆయన ప్రభుత్వం ఉందన్నారు. క్రీడాభివృద్ధికి మూడేళ్లలో ఒక్క పైసా నిధులు ఖర్చు పెట్టని పరిస్థితిలో 2019లో రాష్ట్రంలో ప్రతిష్టాత్మంగా ఒలంపిక్స్ క్రీడలను నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు చేయలేని పని, ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసి చూపిస్తున్నారని కొనియాడారు. చెవిరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు విద్యకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించేలా ఎదగాలని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. -
కబ్జాలకు కేరాఫ్
► ఆక్రమణలో 500 ఎకరాల ప్రభుత్వ భూములు ► క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశం ► రాజకీయ ఒత్తిళ్లతో వెనుకడుగు వేస్తున్న స్థానిక అధికారులు ► మదనపల్లె నియోజకవర్గంలో భూ వివాదాలే అధికం మదనపల్లె పట్టణ శివారు ప్రాంతంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద మాజీ సైనికులకు చెందిన కొంత భూమి ఉంది. దీనిపై అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కన్నుపడింది. అధికార అండదండలతో గుట్టుచప్పుడు కాకుండా కబ్జా చేసేశారు. ఆక్రమణలకు వ్యతిరేకంగా మాజీ సైనికుల సంఘం డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆందోళనలు చేపట్టారు. ఫలితం లేకుండా పోయింది. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. పట్టణంలోని రాగిమాను సర్కిల్ వద్ద ఉన్న ఆర్యవైశ్య సంఘం నాయకులకు చెందిన భుమిని మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులు ఆక్రమించేశారు. దీనిపై పట్టణ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. పోలీసులూ పట్టించుకోకపోవడంతో బాధితుడు కోర్టుమెట్లెక్కాల్సి వచ్చింది. స్థానిక బైపాసు రోడ్డులో పాత్రికేయుల కోసం రెవెన్యూ ఆధికారులు కొంత స్థలాన్ని కేటాయించారు. దీన్ని కొల్లగొట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పక్కాగా స్కెచ్చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తమ తాతల ఆస్తి అంటూ బుకాయించారు. దీనిపై పాత్రికేయులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. ఇలా చెప్పుకుంటూపోతే దేశంలోనే పెద్ద రెవెన్యూ డివిజన్ అయిన మదనపల్లెలో భూకబ్జాల భాగోతం అంతాఇంతాకాదు. ఇప్పటికే దాదాపు 500 కోట్ల విలువైన భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లోకి చేరిపోయాయి. వీరిపై చర్యలకు వెనుకడుగు వేస్తుండడంతో మరిన్ని భూములు ఆక్రమించేందుకు చర్యలు వేగవంతమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మదనపల్లె: జిల్లాలో ఎక్కడాలేని విధంగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో దాదాపు రూ.500 కోట్ల భూములు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆక్రమణలపై ఇదివరకున్న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆదేశాలిచ్చారు. ఇంతలో కలెక్టర్ బదిలీ కావడంతో చర్యలు ఆగిపోయాయి. రాజకీయ ఒత్తిళ్లతో ప్రస్తుత అధికారులు ఏమీచేయలేక మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. 300 ఎకరాలు కబ్జా.. మదనపల్లె పట్టణం, పరిసర ప్రాంతాల్లో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, మాజీ సైనికులు, రైతుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. గతంలో చేపట్టిన రెవెన్యూ అధికారుల సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. సబ్ కలెక్టర్ క్రితికాబాత్ర ఈ భుముల ఆక్రమణలపై అప్పటి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికలివ్వాలని ఆదేశించారు. గత తహసీల్దార్ రెడ్డెప్ప ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది ఆక్రమణలను గుర్తించి నివేదికలిచ్చారు. పట్టణ పరిధిలోనే ఎక్కువ.. పట్టణ పరిధిలోని అమ్మచెరువు మిట్ట, అన్నమయ్య సర్కిల్, గజ్జలకుంట, తురకవానికుంట, కోమటివాని చెరువు, బెంగళూరురోడ్డు, బసినికొండ, పొన్నూటిపాళ్యం తదితర ప్రాంతాల్లోని దాదాపు 80 సర్వే నంబర్లలో దాదాపు 300 ఎకరాల డీకేటీ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. వీరి ఆగడాలకు ఎలాంటి ఆటంకాలూ ఎదురుకాకపోవడంతో మరిన్ని భూములు ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం ఆదేశాలు బేఖాతర్.. నివేదికలను కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు సమర్పించగా ఆయన వీటిని నేరుగా సీఎంకు పంపారు. స్పందించిన సీఎం ఆక్రమణదారులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గతంలోనే ఆదేశించారు. ఇంతవరకు ఏ ఒక్క అధికారీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే పాసుపుస్తకాలు.. అధికార పార్టీ అండతో ఈ మూడేళ్లలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొంతమంది ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు. వీటికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కాలేదు. వీటికి దరఖాస్తు చేసుకున్న కబ్జాదారుల నకిలీ డాక్యుమెంట్లను సబ్ కలెక్టర్ గుర్తించారు. పాసుపుస్తకాలు మంజూరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. ప్రస్తుతం పలు పాసుపుస్తకాలు సబ్‌కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్నట్లు సమాచారం. -
ఎస్వీయూ అరుదైన ఘనత
► నాక్‌లో ఏప్లస్ గ్రేడ్ ► తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వర్సిటీ యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూ 2009లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్)లో ఏ గ్రేడ్ సాధించింది. అప్పట్లో అదో రికార్డు. ఆ రికార్డును ప్రస్తుతం తిరగరాసింది. ఏప్లస్ గ్రేడ్ సాధించింది. బెంగళూరులోని నాక్ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన నాక్ గ్రేడింగ్ ఫలితాల్లో ఎస్వీయూ 3.52 గ్రేడ్ పాయింట్లతో ఏ ప్లస్ గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు గ్రేడ్ పాయింట్లకుగాను 3.52 గ్రేడ్ పాయింట్లు సాధించడం విశేషం. దేశంలో ఇప్పటి వరకు 7 యూనివర్సిటీలకే నాక్‌లో ఏప్లస్ గ్రేడ్ ఉంది. తాజాగా ఎస్వీయూ ఏప్లస్ సాధించి 8వ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. దేశంలోని ఏప్లస్ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీల్లో నాలుగు డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ యూనివర్సిటీకి కూడా ఏప్లస్ లేదు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో గీతం యూనివర్సిటీ (విశాఖపట్నం)కి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా (హైదరాబాద్), ఆంధ్రా (విశాఖపట్నం)లకు సాధ్యం కాని ఏప్లస్ గ్రేడ్‌ను ఎస్వీయూ సొంతం చేసుకోవడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లో అలగప్పా యూనివర్సిటీ తర్వాత ఏప్లస్ సాధించిన రెండో యూనివర్సిటీ ఎస్వీ యూ కావడం విశేషం. గత ఏడాది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 601–800 ర్యాంక్ పొందింది. ఈ ఏడాది ప్రకటించిన ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 401–600 ర్యాంక్ పొందింది. బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ పొందింది. నాక్‌లో మంచి గ్రేడ్ రావడం పట్ల క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు.