సాక్షి, చిత్తూరు: వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర తొమ్మిదవ రోజు మంగళవారం సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో సాగుతుం దని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి వెల్లడించారు.
మంగళవారం ఉదయం బుచ్చినాయుడు కండ్రిగ మండలం నీర్పాకోట నుంచి యాత్ర ప్రారంభం అవుతుంది.
నీర్పాకోటలో మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
బుచ్చినాయుడుకండ్రిగ, మయూర షుగర్ ఫ్యాక్టరీ, కాటూరు, పార్లపల్లె, ముత్యాలమ్మగుడి, తంగేళ్లపాళెం, బసవయ్యపాళెంలో రోడ్ షో.
వీఎంపల్లిలో పసల చిన్నపాపయ్య కుటుంబానికి ఓదార్పు.
కేఎం వాడ, కొత్తకండ్రిగ, ఏపీసీడ్స్, శ్రీకాళహస్తి, శ్రీరాంనగర్ కాలనీ, బీపీ అగ్రహారం, సూపర్ బజార్‌లో రోడ్‌షో.
మండపం సెంటర్లో బహిరంగ సభ.
పాత బస్టాండ్, కొత్తపేట, సీతాలమ్మగుడి, బహుదూర్‌పేట, తెట్టుల్లో రోడ్‌షో.
నేడు జగన్ పర్యటన ఇలా..
Published Tue, Jan 28 2014 4:35 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement