హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు టెక్నాలజీ కంపెనీ లెనోవో తెలిపింది. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో పర్సనల్ కంప్యూటర్లు, నోట్‌బుక్స్, స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి సామర్థ్యం అధికం చేసినట్టు లెనోవో ఇండియా ఎండీ శైలేంద్ర కత్యాల్ వివరించారు.
‘వింగ్‌టెక్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ట్యాబ్లెట్ పీసీల తయారీని ప్రారంభించాం. సాధారణ కస్టమర్లు, విద్యార్థులతోపాటు రిటైల్, తయారీ, ఆరోగ్య సేవల రంగానికి అవసరమైన ట్యాబ్లెట్లను ఇక్కడ రూపొందిస్తున్నాం. పుదుచ్చేరిలోని పీసీల తయారీ ప్లాంటులో మూడవ లైన్ ఏర్పాటు చేశాం. డిక్సన్ టెక్నాలజీస్ సహకారంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో మోటరోలా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాం. భారత్‌తోసహా పలు దేశాల్లోని 30కిపైగా ప్లాంట్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 180 మార్కెట్లలో విక్రయిస్తోంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment