tablet pcs
-
తిరుపతిలో లెనోవో ట్యాబ్లెట్స్ తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు టెక్నాలజీ కంపెనీ లెనోవో తెలిపింది. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో పర్సనల్ కంప్యూటర్లు, నోట్‌బుక్స్, స్మార్ట్‌ఫోన్స్ ఉత్పత్తి సామర్థ్యం అధికం చేసినట్టు లెనోవో ఇండియా ఎండీ శైలేంద్ర కత్యాల్ వివరించారు. ‘వింగ్‌టెక్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ట్యాబ్లెట్ పీసీల తయారీని ప్రారంభించాం. సాధారణ కస్టమర్లు, విద్యార్థులతోపాటు రిటైల్, తయారీ, ఆరోగ్య సేవల రంగానికి అవసరమైన ట్యాబ్లెట్లను ఇక్కడ రూపొందిస్తున్నాం. పుదుచ్చేరిలోని పీసీల తయారీ ప్లాంటులో మూడవ లైన్ ఏర్పాటు చేశాం. డిక్సన్ టెక్నాలజీస్ సహకారంతో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంటులో మోటరోలా బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నాం. భారత్‌తోసహా పలు దేశాల్లోని 30కిపైగా ప్లాంట్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్‌ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 180 మార్కెట్లలో విక్రయిస్తోంది’ అని తెలిపారు. -
860 టాబ్లెట్ పీసీల కొనుగోలుకు కమిటీ
హైదరాబాద్ సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికా శాఖలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్పీడుగా నమోదు చేసేందుకు వీలుగా 860 టాబ్లెట్ పీసీలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ కొనుగోళ్ల కోసం అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ యాప్‌కు వంద కోట్ల డౌన్లోడ్లు!!
స్మార్ట్‌ఫోన్ గానీ, టాబ్లెట్ పీసీ గానీ ఉన్నాయంటే చాలు.. అందులో తప్పనిసరిగా ఉండి తీరాల్సిన యాప్.. టెంపుల్ రన్. పిల్లలు, పెద్దవాళ్లు, ఆడ, మగ.. ఎలాంటి తేడా లేకుండా విపరీతంగా ఆడుతున్న ఆట ఈ టెంపుల్ రన్. అందుకే, దీని డౌన్లోడ్లు ఏకంగా వందకోట్లు దాటేశాయి. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఏకైక యాప్..టెంపుల్ రన్ మాత్రమే. టెంపుల్ రన్, టెంపుల్ రన్ 2.. ఈ రెండూ కలిసి మొత్తం వంద కోట్ల డౌన్లోడ్లు దాటాయి. ఇందులో ఉన్న మిగిలిన వెర్షన్లను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. 2008 సంవత్సరంలో కీత్ షెఫర్డ్, నటాలియా లకియనోవా అనే భార్యాభర్తలు కలిసి స్థాపించిన ఇమాంజి స్టూడియోస్ అనే సంస్థ 2011 సంవత్సరంలో టెంపుల్ రన్ యాప్‌ను విడుదల చేసింది. తాము ముందు దీన్ని ప్రారంభించినప్పుడు వంద కోట్ల డౌన్లోడ్లు అవుతాయని పొరపాటున కూడా ఊహించలేదని కీత్ షెఫర్డ్ చెప్పారు. టెంపుల్ రన్ ఆడుతున్న ప్రతి ఒక్కళ్లకు, తమ టీమ్ సభ్యులకు అందరికీ చాలా కృతజ్ఞులై ఉంటామని, దీన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు, మరిన్ని సృజనాత్మక గేమ్స్ రూపొందిస్తామని తెలిపారు. ఈ యాప్‌ను అత్యధికంగా చైనాలో 36 శాతం మంది డౌన్లోడ్ చేసుకుంటే, అమెరికాలో 21 శాతం మందే చేసుకున్నారు. ఈ ఆట ఆడేవాళ్లలో 60 శాతం మంది ఆడాళ్లేనని కూడా కంపెనీ తెలిపింది. ఆట ఆడేవాళ్లంతా కలిసి సంయుక్తంగా 2,16,018 సంవత్సరాల సమయం గడిపారని, 3200 కోట్ల ఆటలు ఆడారని, టెంపుల్ రన్ ప్లేయర్లంతా కలిసి ఇప్పటికి 50 ట్రిలియన్ల మీటర్లు పరిగెత్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.