గర్భంలోని శిశువు మాయం.. మహిళ ఆందోళన | Pregnant Women Protest At Tirupati Maternity Hospital | Sakshi
Sakshi News home page

గర్భంలోని శిశువును మాయం.. మహిళ ఆందోళన

Jan 17 2021 2:14 PM | Updated on Jan 17 2021 6:34 PM

Pregnant Women Protest At Tirupati Maternity Hospital - Sakshi

సాక్షి, తిరుపతి : గర్భంలోని శిశువును మాయం చేశారంటూ ఓ మహిళ ఆరోపించడంతో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కు చెందిన శశికళ అనే మహిళ ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చారు. పలుమార్లు చికిత్స కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మరోసారి ఆస్పత్రికి వచ్చిన ఆమె... వింత వాదనతో ఆస్పత్రి సిబ్బందిపై ఆరోపణలు చేశారు. కాన్పు కోసం వచ్చిన తనకు గర్భం రాలేదని అంటున్నారంటూ ఆస్పత్రి నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.

గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. మహిళ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రసూతి ఆసుపత్రి వైద్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ మానసిక స్థితిపై వివరాలను సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement