
సమావేశంలో ప్రసంగిస్తున్న అర్పిత్ హతి
తిరుపతి (అలిపిరి) : సమాజ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ (జేసీఐ) జాతీయ అధ్యక్షుడు అర్పిత్ హతి పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో మంగళవారం ఆయన అధికారిక పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్పిత్‌హతి మాట్లాడుతూ దేశంలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఇంపాక్ట్ 2020–30 కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.
దేశంలో వెయ్యికి పైగా జేసీఐ శాఖల ద్వారా విద్య, ఉపాధి, ఆరోగ్యం, పారిశుధ్యం, పకృతి పరిరక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు. అనంతరం జేసీఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 32 మందికి స్కాలర్‌షిప్‌లను అందజేశారు. కార్యక్రమంలో తిరుపతి శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, మణిసందీప్, మనోహర్, వెంకటరమణ, నాగేశ్వరరావు, అనుపమ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment