Aimee
-
సమాజాభివృద్ధే జేసీఐ లక్ష్యం
తిరుపతి (అలిపిరి) : సమాజ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ (జేసీఐ) జాతీయ అధ్యక్షుడు అర్పిత్ హతి పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో మంగళవారం ఆయన అధికారిక పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్పిత్హతి మాట్లాడుతూ దేశంలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం ఇంపాక్ట్ 2020–30 కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. దేశంలో వెయ్యికి పైగా జేసీఐ శాఖల ద్వారా విద్య, ఉపాధి, ఆరోగ్యం, పారిశుధ్యం, పకృతి పరిరక్షణ వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు శిక్షణా కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు. అనంతరం జేసీఐ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 32 మందికి స్కాలర్షిప్లను అందజేశారు. కార్యక్రమంలో తిరుపతి శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, మణిసందీప్, మనోహర్, వెంకటరమణ, నాగేశ్వరరావు, అనుపమ తదితరులు పాల్గొన్నారు. -
చెంప చెళ్లుమనిపించిన చేప
సౌత్ వేల్స్: సౌత్ వేల్స్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అక్కడి సముద్రం ఒడ్డుకు వెళ్లి తుఫాను అనంతరం వాతావరణ పరిస్థితులపై కెమెరా ముందు నిల్చుని వ్యాఖ్యానిస్తున్న యూట్యూబ్ మహిళా ఉద్యోగిని చెంపను పెద్ద చేప వచ్చి వాయించింది. ఆ చేప దెబ్బకు ఆ మహిళ డామ్మని పడిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నిమిషాల్లోనే 40 వేల మంది చూశారు. క్రెయిగ్, ఎయిమీ అనే ఇద్దరు యూట్యూబ్ కోసం పనిచేస్తుంటారు. ఎప్పుడూ కొన్ని వీడియోలు చిత్రించి యూట్యూబ్లో పెడుతుంటారు. అందులో భాగంగా వారు తుఫాను వచ్చిన తర్వాత సౌత్ వేల్స్లోని బ్యారీ ఐలాండ్ బీచ్ వద్దకు కెమెరా తీసుకొని వెళ్లారు. క్రెయిగ్ కెమెరా ఆన్ చేసి చూస్తుండగా.. ఎయిమీ దాని ఎదురుగా వ్యాఖ్యానిస్తోంది. అదే సమయంలో ఓ భారీ అలా ఎగిసి ఆమెపై భారీ వర్షపు జల్లుగా పడింది. అప్పుడే ఆ అలలో ఓ పెద్ద చేప ఎగిరి వచ్చి ఆమె చెంపను బలంగా తాకింది. దీంతో ఎయిమి కిందపడింది.