తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు పదిగంటలు పడుతోంది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు పదిగంటలు పడుతోంది. కాలినడక దర్శనానికి 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉండగా.. వీరు తిరుమలేశుడిని దర్శించుకునేందుకు ఏడుగంటల సమయం పడుతుంది. వరుస సెలవులు కావడంతో తిరుమలకు భక్తుల రద్దీ పోటెత్తుతుంది. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో తిరుమలలో భద్రత పెంచారు.