తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది.
తిరుపతి/శ్రీశైలం: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతానికి రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది.
ఆదివారం స్వామివారిని మొత్తం 62,537మంది భక్తులు సందర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మరోపక్క, కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనానికి ఐదుగంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటలు సమయం పడుతుంది.