తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు మూడుగంటల సమయం పడుతుంది.
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. మూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి నాలుగు గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు మూడుగంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తిరుమలలో రెండు రోజులుగా వర్షాలు పడటం కూడా ఇందుకు ఒక కారణమైంది.
మరోపక్క, తిరుమల రెండో ఘాట్ లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తొమ్మిదో కిలోమీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడటంతో టీటీడీ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని టీటీడీ సూచించింది.