
సాక్షి, తిరుపతి : టీటీడీకి 50వ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆయన నేరుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని... అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన రేపు తిరుమలలో టీటీడీ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఇటీవల తన పదవికి రాజీనాయా చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment