సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. శనివారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణంతో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమి షన్ వెంటనే ఎన్నికల నిర్వహణకు తెరతీసింది. నోటిఫికేషన్‌ను ఈనెల 26న విడుదల చేయనుంది. మే 3న నామినేషన్లకు గడువుగా విధించి మే 21న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.
24న ఫలితాలను వెల్లడిస్తుంది. ఇప్పటికే జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు సాధారణ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. మరో ఆరు నెలల్లో ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జిల్లా రాజకీయ వర్గాల్లో ఎన్నికల వేడిని రగిలించడం ఖాయమని చెబుతున్నారు. ఈ నెలాఖరు కల్లా పోటీలో నిలిచే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ప్రకటించే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment