సాక్షి, తిరుపతి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభాపతి అగరాల ఈశ్వరరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. అమరావతి కోసం అంటూ చంద్రబాబు జోలె పట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు, విశాఖపట్నంలో రాజధాని ఉండటం వల్ల అందరికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతి మీద ఇచ్చిన నివేదికలను తగలబెట్టడం దారుణమని టీడీపీ తీరును తప్పుబట్టారు.
చంద్రబాబు రైతులు, ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నారని ఈశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. ఎమ్మెల్యేలను కొనగలడు. ఇంకా ఆయనకు జోలె ఎందుకు’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా అగరాల ఈశ్వర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆరవ శాసనసభ (1978-1983) సభాపతిగా (1982,సెప్టెంబరు 7- 1983 జనవరి 16) పనిచేసిన విషయం తెలిసిందే.
(చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు)
Comments
Please login to add a commentAdd a comment