సాక్షి, అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దీనిపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల అమ్మకాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు’ అని ట్వీట్ చేశారు. (2016 టీటీడీ బోర్డు నిర్ణయం నిలుపుదల)
Comments
Please login to add a commentAdd a comment