
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడి బజార్‌లో తన గొంతు కోశారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వాపోయారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వల్లనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని పార్టీని కాపాడానని, తనకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నమ్మక ద్రోహి అని, రాష్ట్రంలో పేదలను అనగదొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి పట్టిన శని అని, యువకులు ఏపీకి సీఎం కావాలని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి, మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. ఏపీకి పట్టిన శని చంద్రబాబు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment