
సాక్షి, తిరుపతి : హాథిరామ్ బావాజీ మఠం భూముల్లోని ఆక్రమణల మీద అధికారులు కొరడా ఝులిపించారు. తిరుపతి రూరల్ మండలం ఉప్పరిపల్లి వద్ద మఠానికి చెందిన వందల ఎకరాల భూమి ఉంది. తిరుపతికి అతి సమీపంలో ఉండడంతో ఈ భూమికి భారీ డిమాండ్ ఉంది. చంద్రబాబు పాలనలో పచ్చ తమ్ముళ్లు వాటిని ఆక్రమించి ఏకంగా భవంతులు నిర్మించారు. ప్రభుత్వం మారి ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపుతుండడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. అధికారులు జేసీబీల సహాయంతో భవంతులను కూల్చి వేస్తుండడంతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకొని హంగామా చేయడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment