Hathiramji Mutt
-
హతి రాంజీ మఠం అర్జున్ దాస్ ను పీఠాధిపతిగా తొలగింపు
-
విచారణకు వస్తానని చెప్పి..
సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సెక్యూరిటీ గార్డును ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తిరుమల జపాలీ హనుమాన్ ఆలయంలో బంగారం మాయం విషయంలో సెక్యూరిటీ గార్డ్‌ను విచారణకు మఠం అధికారులు పిలిచారు. విచారణకు వస్తానని చెప్పి సెక్యూరిటీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్ధిక ఇబ్బందులే కారణమని ఆయన స్నేహితులు చెబుతున్నారు. -
ఎందుకు దాస్తున్నారు?
హథీరాంజీ మఠం వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. విలువైన భూములు,ఆభరణాలను నిర్వాహకులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలు మాయమవుతున్నాయని ఆరోపణలు వస్తున్నా నిర్వాహకులు నోరు మెదపకపోవడంఅనుమానాలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి : హథీరాంజీ మఠం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. తిరుమల జపాలి ఆంజనేయస్వామికి రామ్మూర్తి అనే భక్తుడు సమర్పించిన 108.76 గ్రాముల బంగారు ఆభరణం కనిపించకుండా పోయిందని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొందరు కిరీటం అంటుంటే, ఇంకొందరు ఆభరణమని, మరికొందరు బంగారుపళ్లెం అని అంటున్నారు. కానుకలు, ఆస్తులు భద్రంగా ఉన్నాయా? కలియుగ వైకుంఠనాథుడు వేంకటేశ్వర స్వామికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు హథీరాంజీ మఠం ద్వారా భూములు, వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో కిరీటాలు, కంఠాభరణాలు, దేవుని ప్రతిమలు, వజ్రాలు ఇచ్చినట్లు సమాచారం. పూజా పాత్రలు, బంగారు ప్లేట్లు, నెక్లెస్‌లు ఉన్నాయి. ఇందులో అత్యంత విలువైన పచ్చ, బంగారు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో స్వామివారికి పాలతో నైవేద్యం ఇచ్చేవారట. పాలలో ఎవరైనా విషం కలిపితే పాలు రంగుమారినట్లుగా కనిపించేదట. అందుకే ఆ పాత్రకు అత్యంతప్రాధాన్యత ఉండేది. తిరుమల జపాలిలో వెలసిన ఆంజనేయస్వామికి భక్తులు విలువైన కానుకలు సమర్పించినట్లు మఠం అధికారులు చెబుతున్నారు. కానుకలు, ఆస్తుల వివరాలన్నీ రికార్డుల్లో నమోదు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆ వివరాలు బయటకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. చుట్టుముడుతున్న వివాదాలు 1968లో మఠం నిర్వాహకులపై ఆరోపణలు వచ్చాయి. మఠానికి చెందిన బంగారు నగలను స్వాహా చేసినట్లు ఫిర్యాదులు రావడంతో కొందరిపై కేసులు నమోదైనట్లు తెలిసింది. దాంతో 1968, 1969 ప్రాంతంలో స్వామి వారికి వచ్చిన ఆభరణాలను తిరుపతి, చంద్రగిరిలోని ఎస్బీఐలో భద్రపరిచారు. ఆ నగలను మఠం నిర్వాహకులు చూడాలంటే చిత్తూరులోని ప్రధాన కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నగలు, ఆస్తులకు సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్టర్లను దేవదాయధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంతో పాటు హథీరాంజీ మఠంలో ఉంచినట్లు తెలిసింది. 1975లో హథీరాంజీ మఠానికి మహంతుగా దేవేంద్రదాస్ నియమితులయ్యారు. బ్యాంక్ లాకర్లలో ఉన్న బంగారు నగలను కోర్టు అనుమతితో దేవేంద్రదాస్ పట్టాభిషేకానికి వినియోగించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. నాటి నుంచి నేటి వరకు బంగారు నగలను ఎవరికీ చూపకపోవడంతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ఎందుకు దాస్తున్నారు? ప్రస్తుత మహంతు అర్జున్‌దాస్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసిన విషయం తెలి సిందే. ఒక రోజు ముందే విషయం తెలుసుకున్న ఆయన కనిపించకుండాపోయారు. ఆయన ఉంటున్న గది తాళాలు కూడా కనిపించలేదు. ఆ తర్వాత మఠం ప్రత్యేక అధికారిగా నియమితులైన శ్రీకాళహస్తి ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో తాళాలు పగులగొట్టి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో ఉన్న ఆభరణాల లెక్క లు తీసేలోపే అర్జున్‌దాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తిరిగి విధుల్లో చేరారు. అర్జున్‌దాస్ తిరిగి బాధ్యతలు చేపట్టడంతో మఠంలో దాగిన గుట్టు బయటకు రాకుండాపోయింది. తాజాగా మరో బంగారు ఆభరణం కనిపించికుండాపోయింది. ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసు కుని భక్తులు స్వామి వారికి సమర్పించిన విలువైన భూ ములు, వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలను కాపాడాలని కోరుతున్నారు. -
హథీరాంజీ మఠంలో బంగారం మాయం!?
సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠంలో బంగారం, వెండి మాయమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాను అధికారులు గుర్తించారు. హథీరాంజీ మఠం అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మఠంలోని కొన్ని బీరువా తాళం చెవులు కనిపించకపోవడంతో సిబ్బంది గుర్రప్ప కుటుంబ సభ్యులను ఆరాతీశారు. వారు ఇంట్లో వెతికి మఠానికి చెందిన కొన్నితాళం చెవులు తీసుకొచ్చారు. అందరి సమక్షంలో అధికారులు బీరువా తెరిచి నగలను పరిశీలించగా.. 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఈక్రమంలో నగల మాయంపై మఠం సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు సమాచారం. అప్రైజర్‌తో లెక్కకట్టి ఎన్ని నగలు పోయాయో తెలుపుతామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కొందరు పూజారులపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (మహంతు గారి'గది') -
మహంతు గారి'గది'
శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి హథీరాంజీ మఠం ద్వారా ఇచ్చిన ఆభరణాలు మాయయ్యాయి. కానుకల రూపంలో ఇచ్చిన వందలాది ఎకరాల భూములకు సంబంధించిన పక్కా సమాచారం లేదు. భూములు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులు మహంతు అర్జున్దాస్ఉంటున్న గదిలో దాచిపెట్టారని భావిస్తున్నారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అర్జున్‌దాస్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఒకరోజు ముందే విషయం తెలుసుకున్న అర్జున్‌దాస్ కనిపించకుండా పోయారు. ఆయన ఉంటున్న గది తాళాలు కూడా కనిపించలేదు. వారం రోజులు వేచి ఉన్న అధికారులు సోమవారం రెవెన్యూ అధికారులు, మఠం ప్రత్యేక అధికారి శ్రీకాళహస్తి ఈఓ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో తాళాలు పగులగొట్టి పత్రాలను స్వాధీనంచేసుకున్నారు. సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠం మహంతు గది తాళాలు పగులగొట్టి రెవెన్యూ, ప్రత్యేక అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అవినీతి గుట్టు రట్టవుతుందని భక్తులు భావిస్తున్నారు. కలియుగ వైకుంఠనాథుడు శ్రీవేంకటేశ్వరునికి ఎంతో మంది రాజులు, చక్రవర్తులు హథీరాంజీ మఠం ద్వారా భూములతోపాటు వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడు పర్యాయాలు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో కిరీటాలు, కంఠాభరణాలు, దేవుని ప్రతిమలతో పాటు అత్యంత విలువైన వజ్రాలు ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు పూజా పాత్రలు, బంగారు ప్లేట్లు ఉన్నాయి. వీటిలో అత్యంత విలువైన పచ్చతోపాటు ప్రత్యేకమైన బంగారు పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో స్వామివారికి నైవేద్యంగా పాలు ఇచ్చేవారట. ఎన్నో ఆరోపణలు స్వామివారికి మఠం ద్వారా అందిన బంగారు కానుకల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కొంత మంది మహంతులు వాటిని కరిగించినట్లు చెబుతున్నారు. 1968 ప్రాంతంలో మఠం నిర్వాహకులపై ఆరోపణలు వచ్చాయి. మఠానికి చెందిన బంగారు నగలను స్వాహా చేసినట్లు అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. కొంతమందిపై కేసులు కూడా నమోదైనట్లు సమాచారం. అప్పట్లో జోక్యం చేసుకున్న దేవదాయ ధర్మాదాయ శాఖ హథీరాంజీ మఠానికి చెందిన బంగారు నగలను బ్యాంకుల్లో భద్రపర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే 1968–1969 ప్రాంతంలో మఠం నగలను చంద్రగిరితో పాటు తిరుపతిలోని బ్యాంకుల్లో భద్రపరిచారని, దాదాపు ఆరు చెక్కపెట్టెల్లో ఆ నగలను ఉంచినట్లు సమాచారం. ఎప్పుడైనా ఆ నగలను మఠం నిర్వాహకులు చూడాలంటే చిత్తూరులోని ప్రధాన కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ లాకర్లలో ఉంటున్న బంగారు నగల వివరాలను ఒక రిజిస్టర్లో నమోదుచేశారు. స్థిర చరాస్తులకు సంబంధించిన ఆ రిజిస్టర్లో మఠానికి చెందిన ఏయే నగలు ఉన్నాయి, వాటి బరువెంత.. తదితర వివరాలను పొందుపరిచారని తెలిసింది. మహంతులు వచ్చాకే.. 1975లో హథీరాంజీ మఠానికి దేవేంద్రదాస్ మహంతుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహంతుకు పట్టాభిషేకం నిర్వహించారు. దీంతో బ్యాంక్ లాకర్లలోఉన్న బంగారు నగలను కోర్టు అనుమతితో దేవేంద్రదాస్ పట్టాభిషేకానికి వినియోగించారని తెలి సింది. ఆరునెలలకొకసారి లాకర్లలోని నగలను పరిశీలించాల్సి ఉంది. చెక్క పెట్టెలు తుప్పుబట్టాయా? బంగారు నగలు రంగు మారాయా? వంటి వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. కానీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆ నగల పరిస్థితి ఏంటో తెలియదు. కొంతమంది మహంతులు కోర్టు అనుమతితో బ్యాంకు లాకర్లు తెరిచినట్లు సమాచారం. ఆ సందర్భంలోనే బంగారు నగల వ్యవహారంలో గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. అసలు నగల స్థానంలో గిల్టువి పెట్టినట్టు ప్రచారం ఉంది. రికార్డులను తనిఖీ చేస్తున్న అధికారులు 2006 తర్వాత గోల్మాల్ జరిగిందా? ప్రస్తుతం హథీరాంజీ మఠం మహంతుగా ఉంటున్న అర్జున్ దాస్ 2006లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్య కాలంలోనే నగలు గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018 మార్చిలో లోకాయుక్త కోర్టు హథీరాంజీ మఠం నగల వివరాలను ఆరా తీసింది. 16 ప్రశ్నలను సంధించింది. మఠానికి సంబంధించి ఎలాంటి నగలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడైనా వాటిని పరిశీలించారా? అంటూ మఠంతో పాటు దేవదాయ ధర్మాదాయ శాఖను ప్రశ్నించింది. దేవదాయ శాఖ, ఇటు మఠం నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పుణేలో భూముల కొనుగోలు? శ్రీవారికి కానుకల రూపంలో హథీరాంజీ మఠం ద్వారా మొత్తం 250 రకాల బంగారు ఆభరణాలు, నాణేలు, కిరీటాలు సమర్పించినట్లు సమాచారం. వీటన్నింటినీ చంద్రగిరిలోని ఓ బ్యాంక్ లాకర్లో ఉంచారు. మహంతులు వచ్చాక ఆ ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్‌కు గురైన అర్జున్‌దాస్ వద్దే బ్యాంక్ లాకర్ తాళాలు ఉంచుకున్నారు. ఆయన కొద్ది రోజులుగా కనిపించకుండాపోయారు. కానుకల రూపంలో కోట్లు విలువచేసే ఆభరణాలు ఎక్కడ ఉంచారనే లెక్కలు అర్జున్ దాస్‌కు తప్ప మఠం నిర్వాహకుల వద్ద లేవు. లాకర్లో దాచి ఉంచిన వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు అమ్మి పుణేలో అర్జున్‌దాస్ బంధువుల పేరున 200 ఎకరాలను కొనుగోలు చేసినట్లు మఠంలో పనిచేసే వారు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలపై ఇన్చార్జి దృష్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాళహస్తి ఆలయ ఈఓ చంద్రశేఖరరెడ్డి నాలుగు రోజులుగా మఠంలో అధికారులతో సమావేశమవుతున్నారు. మఠం బ్యాంకు ఖాతా లపై ఆయన దృష్టి సారించారు. ఖాతాల్లోని మఠం సొమ్ము బయటకు వెళ్లకుండా చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ ఉన్న మహంత్ అర్జున్‌దాస్‌ను తప్పించినట్లు మఠానికి సంబంధించి ఖాతాలు ఉన్న ఏడు బ్యాంకులకు లేఖ రాశారు. ఇక నుంచి అన్ని కార్యకలాపాలు తామే చూసుకుంటామని స్పష్టం చేశారు. మహంతు గది తాళాలు పగులగొడుతున్న అధికారులు ఆ గది తాళాలు పగులగొట్టిన అధికారులు మహంత్ అర్జున్‌దాస్ ఉంటున్న గదిని తెరిస్తే తప్ప నిజానిజాలు వెలుగుచూసే అవకాశం లేదని మఠం సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో ఆ గది తాళాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో సోమవారం పగులగొట్టారు. గదిలో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎన్ని పత్రాలు ఉన్నాయనే వివరాలను లెక్కించే పనిలో పడ్డారు. రికార్డులను పరిశీలించడానికి మరి కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేశాక పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
హథీరాంజీ మఠం భూములపై కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మఠం కస్టోడియన్ అర్జున్ దాస్ మహంతుపై సస్పెన్షన్ వేటు వేసింది. మఠం ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నట్లు మహంతుపై అభియోగాలు రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి ఈవోకు మఠం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా తిరుపతి సమీపంలోని హథీరాంజీ మఠం భూములు గత కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైన సంగతి తెలిసిందే. వందల కోట్ల విలువైన హథీరాంజీ మఠం భూముల్లో భూ మాఫియా తిష్ట వేసింది. దొంగ పత్రాలు సృష్టించి, కాసులతో రిజిస్ట్రేషన్ అధికారుల కళ్లకు గంతలు కట్టి దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి మఠం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గత ప్రభుత్వంలో ఈ పచ్చ భూమాఫియా స్వాహా చేసిన మఠం భూముల విలువ రూ.100 కోట్లకు పైమాటే. -
హథీరాంజీ మఠంలో మాఫియా
సాక్షి, తిరుపతి: వందల కోట్ల విలువైన హథీరాంజీమఠం భూముల్లో భూమాఫియా తిష్టవేసింది. దొంగ పత్రాలు సృష్టించింది. కాసులతో రిజిస్ట్రేషన్ అధికారుల కళ్లకు గంతలు కట్టి దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసుకుంది. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి మఠం భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. గత ప్రభుత్వంలో ఈ పచ్చ భూమాఫియా స్వాహా చేసిన మఠం భూముల విలువ రూ.100 కోట్లకు పైమాటే. కలెక్టర్ కన్నెర్ర..తహసీల్దార్ చిత్తశుద్ధి మఠం భూముల్లో భూమాఫియా ప్రవేశంతో అవిలా ల, ఉప్పరపల్లి, మల్లంగుంట ప్రాంతాల్లో రోజు ఘర్షణలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. గతంలో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఇటీవల ఈ ఘర్షణలు పెరిగిపోవడంతో ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు సైతం నమోదయ్యాయి. మఠం భూముల్లో జరుగుతున్న భూమాఫి యాపై కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త దృష్టి సారించారు. రి కార్డులు, కోర్టు కేసులను పరిశీలించారు. దాదాపు రూ.100 కోట్ల విలువైన భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించా రు. మఠం భూముల్లో ఆక్రమణలను తొలగించాలని తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, రూరల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో అవిలాల లెక్కదాఖల సర్వే నెంబర్ 13లోని 107 ఎకరాల మఠం భూముల ప్రక్షాళనకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. తహసీల్దార్ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు రెండు రోజులుగా ఆక్రమణలను తొలగిస్తున్నారు. 254 ప్లాట్లలో ఆక్రమణల తొలగింపు తహసీల్దార్ కిరణ్‌కుమార్, వెస్ట్ డీఎస్పీ నరసప్ప ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు 10 జేసీబీలతో సర్వే నెంబర్ 13లో ఆక్రమణలను ఆదివారం ఉదయం నుంచే తొలగించటం ప్రారంభించారు. వందల అంకణాలను ఆక్రమించి, చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి అందులో చిన్న షెడ్డు వేయడం, దానికి కరెంటు కనెక్షన్ తీసుకోవడం, ఎన్నో ఏళ్లుగా ఇళ్లు ఉన్నట్లు మస్కా కొట్టి కబ్జారాయుళ్లు మఠం భూములను మింగేస్తూ వచ్చారు. వారి ఆటలు ప్రస్తుత రెవెన్యూ, పోలీస్ అధికారుల ముందు పారలేదు. జేసీబీలతో సాయంత్రం వరకు 254 ప్లాట్లలోని ఆక్రమణలను తొలగించారు. అధికారుల ముక్కుసూటితనంలో కబ్జారాయుళ్లు, వారికి సహకరించిన రిజిస్ట్రేషన్, పంచాయతీ, విద్యుత్ శాఖాధికారులు వణికిపోతున్నారు. మఠం భూముల్లో భూ క్రయవిక్రయాలు చేసిన వారిపై పీడీ యాక్టుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. నీటి కనెక్షన్లు ఇచ్చి, ఇంటి పన్నులు వేసిన పంచాయతీ అధికారులు, కరెంటు కనెక్షన్లు ఇచ్చిన విద్యుత్ అధికారులు, నిబంధనలు పాటించకుండా అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ల మెడకు ఉచ్చు బిగుస్తోంది. మఠం పేదలకు తప్పక న్యాయం చేస్తాం: చెవిరెడ్డి మఠం భూముల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులు చేపట్టిన ఆక్రమణల తొలగింపులో పేదలకు అన్యా యం జరిగి ఉంటే తప్పక న్యాయం చేస్తామని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. భూ ఆక్రమణదారుల నుంచి తెలియక మఠం స్థలాలను కొని, నష్టపోయిన పేదల కోసం 3వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ అధికారులతో కలిసి తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము కొన్న స్థలాలకు సంబంధించిన ఏదైనా అగ్రిమెంట్/రిజిస్ట్రేషన్/పత్రాలు ఉంటే తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. స్థలాలు కొల్పోయిన నిరుపేదలను గుర్తించి వారందరికి ఇంటి స్థలాలు ఇవ్వటంతో పాటు ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. పేదలను మోసగించి మఠం భూములను అంటకట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని, కాపురం ఉంటున్న పేదల ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావని, వాటి రక్షణ తన బాధ్యత అని భరోసా కల్పించారు. ఇళ్లు కూలుస్తారని పేదలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. -
హాథీరామ్‌జీ మఠం భూముల్లో ఆక్రమణల తొలగింపు
సాక్షి, తిరుపతి : హాథిరామ్ బావాజీ మఠం భూముల్లోని ఆక్రమణల మీద అధికారులు కొరడా ఝులిపించారు. తిరుపతి రూరల్ మండలం ఉప్పరిపల్లి వద్ద మఠానికి చెందిన వందల ఎకరాల భూమి ఉంది. తిరుపతికి అతి సమీపంలో ఉండడంతో ఈ భూమికి భారీ డిమాండ్ ఉంది. చంద్రబాబు పాలనలో పచ్చ తమ్ముళ్లు వాటిని ఆక్రమించి ఏకంగా భవంతులు నిర్మించారు. ప్రభుత్వం మారి ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపుతుండడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. అధికారులు జేసీబీల సహాయంతో భవంతులను కూల్చి వేస్తుండడంతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రగిరి టీడీపీ ఇంచార్జ్ పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకొని హంగామా చేయడంతో ఓ మహిళకు గాయాలయ్యాయి. -
మఠం భూముల వేలం: ముందుకురాని రైతులు
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లోని హథీరాంజీ మఠానికి చెందిన భూముల వేలానికి రైతుల నుంచి స్పందన కరువైంది. 172 ఎకరాల భూమికి సంబంధించి గురువారం ఉదయం తిరుపతిలోని హథీరాంజీ మఠం కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటకు రైతులు హాజరయ్యారు. కానీ ఎవరూ వేలం పాటలో పాల్గొనలేదు. దాంతో అధికారులు వేలంపాటను శుక్రవారానికి వాయిదా వేశారు. -
హథీరాంజీ మఠంలో పెళ్లిళ్లపై విచారణ: టీటీడీ ఈవో
తిరుమల: తిరుమలలోని హథీరాంజీ మఠంలో ఇటీవల ‘మరుమాంగళ్యం’ పేరుతో నిర్వహించిన పెళ్లిళ్లపై విచారణ చేయిస్తామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. వివాహాలు అయిన జంటలకే తిరిగి పెళ్లిళ్లు చేసినట్టు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈవో పైవిధంగా బదులిచ్చారు. మరుమాంగళ్యం పేరుతో వివాహాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందులో వాస్తవ పరిస్థితులు ఏమిటి? భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారా? లేదా? అన్న విషయాలపై ఆరా తీస్తామన్నారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. -
700 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం!
తిరుపతి: కృష్ణాష్టమి వేడుకల్లో టీటీడీకి, హథిరాంజీ మఠానికి మధ్య మళ్లీ గొడవ మొదలైంది. 700 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయానికి టీటీడీ ఎగనామం పెట్టిందని మఠం వారు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాష్టమి రోజు ఊరేగింపుగా వచ్చే ఉత్సవమూర్తులను మఠానికి తీసుకురావడం ఆనవాయితీ అని తెలిపారు. అయితే ఈ కృష్ణాష్టమి రోజున ఉత్సవమూర్తులను మఠానికి తీసుకెళ్లకుండానే టీటీడీ అధికారులు వెళ్లారని వారు తెలిపారు. ఈ సంఘటనపై కోర్టుకు వెళతామని మఠం వారు చెప్పారు.