సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠంలో బంగారం, వెండి మాయమైన ఘటన తాజాగా వెలుగుచూసింది. అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాను అధికారులు గుర్తించారు. హథీరాంజీ మఠం అకౌంటెంట్ గుర్రప్ప ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మఠంలోని కొన్ని బీరువా తాళం చెవులు కనిపించకపోవడంతో సిబ్బంది గుర్రప్ప కుటుంబ సభ్యులను ఆరాతీశారు. వారు ఇంట్లో వెతికి మఠానికి చెందిన కొన్నితాళం చెవులు తీసుకొచ్చారు.
అందరి సమక్షంలో అధికారులు బీరువా తెరిచి నగలను పరిశీలించగా.. 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. ఈక్రమంలో నగల మాయంపై మఠం సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు సమాచారం. అప్రైజర్‌తో లెక్కకట్టి ఎన్ని నగలు పోయాయో తెలుపుతామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కొందరు పూజారులపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
(మహంతు గారి'గది')
Comments
Please login to add a commentAdd a comment