
సాక్షి, తిరుపతి: హథీరాంజీ మఠంలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సెక్యూరిటీ గార్డును ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తిరుమల జపాలీ హనుమాన్ ఆలయంలో బంగారం మాయం విషయంలో సెక్యూరిటీ గార్డ్‌ను విచారణకు మఠం అధికారులు పిలిచారు. విచారణకు వస్తానని చెప్పి సెక్యూరిటీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్ధిక ఇబ్బందులే కారణమని ఆయన స్నేహితులు చెబుతున్నారు.