చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లోని హథీరాంజీ మఠానికి చెందిన భూముల వేలానికి రైతుల నుంచి స్పందన కరువైంది.
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లోని హథీరాంజీ మఠానికి చెందిన భూముల వేలానికి రైతుల నుంచి స్పందన కరువైంది. 172 ఎకరాల భూమికి సంబంధించి గురువారం ఉదయం తిరుపతిలోని హథీరాంజీ మఠం కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటకు రైతులు హాజరయ్యారు. కానీ ఎవరూ వేలం పాటలో పాల్గొనలేదు. దాంతో అధికారులు వేలంపాటను శుక్రవారానికి వాయిదా వేశారు.