lands auction
-
HMDA భూముల వేలం ఆపేసిన సర్కార్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ‘కల్పతరువు’గా భావిస్తూ వస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) భూముల వేలంను ఆపేయాలని నిర్ణయించుకుంది. వేలంపాటలో అక్రమాలు.. అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. హెచ్ఎండీఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. వేలానికి ముందే పలువురు రియల్టర్లకు హెచ్ఎండీఏలోని అధికారులు సమాచారం చేరవేశారట. తద్వారా ఆ ఫలానా రియాల్టర్లకే భూములు దక్కేలా అధికారుల చర్యలు తీసుకున్నట్లు తేలింది. ఈ మేరకు.. వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. దీంతో వేలంపాటను ఆపేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే వేలం వేసిన భూములపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే.. వేలంపాట సమయంలోనే కాకుండా.. ఆ తర్వాత కూడా హెచ్ఎండీఏలో తన పరిచయాల ద్వారా శివ బాలకృష్ణ ఈ తతంగాన్ని నడిపించినట్లు గుర్తించారు . భూములు వేలం తో పాటు ప్రాజెక్టుల వివరాలను రియల్టర్లకు చేర్చారు హెచ్ఎండీలో పని చేసిన అధికారులు. అంతేకాదు ధరలను నిర్ణయించడంలోనూ వీళ్లే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అధికారుల పాత్రపైనా ఏసీబీ లోతైన దర్యాప్తు చేపట్టింది. ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాన్వేషణలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల్ని వేలం వేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికారం అండతో.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు శివబాలకృష్ణ. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఏసీబీకి అతను ఆస్తులు కూడబెట్టిన తీరు ఏసీబీని సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇంట్లోవాళ్లు, బంధువులు, ఆఖరికి పనివాళ్ల పేరిట మీద కూడా బినామీ ఆస్తుల్ని కూడబెట్టాడతను. దీంతో బినామీలను అరెస్ట్ చేసి ఈ పాటికే విచారణ చేపట్టిన ఏసీబీ.. ఇవాళో, రేపో కీలక అరెస్టులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
Kokapet lands: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌దే సేల్‌డీడ్ బాధ్యత
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని కోకాపేట నియోపోలిస్ భూములను హెచ్ఎండీఏ ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరించి వేలం వేసినట్లు సర్కార్ స్పష్టం చేసింది. ఈ–వేలంతో సమకూరిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీకి జమయ్యాయని వివరించింది. నియోపోలిస్ స్థలాల వేలం బాధ్యతలను హెచ్ఎండీఏ నిర్వహించిందని, స్థలాలను దక్కించుకున్న సంస్థలకు సేల్‌డీడ్ చేయించే బాధ్యత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌దే అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోకాపేటలోని 239, 240 సర్వే నంబర్లలోని భూములు ప్రభుత్వానివేనని పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌లోని కోకాపేటలో భూముల అమ్మకానికి జూలైలో ఆన్లైన్ వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్లో ఈ మేరకు ఈ–వేలంలో ప్లాట్లు భారీ రేట్లకు అమ్ముడుపోయా యి. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో 8 ప్లాట్లను విక్రయానికి ఉంచగా, వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించారు. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంతో రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూమిగా కోకాపేటకు గుర్తింపు వచ్చింది. -
భూముల వేలంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. భూముల వేలంపై ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించింది. బిడ్డింగ్‌లో కొన్ని సంస్థలకు మేలు చేశామన్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూను తగ్గించలేదు.. కల్పిత ఆరోపణలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. వేలం పారదర్శకంగా జరిగిందని పునరుద్ఘాటించింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదని పేర్కొంది. భూముల వేలానికి కొందరు ప్రతిపాదిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానం సరికాదని స్పష్టం చేసింది. ఆ పద్ధతి పోటీ కొందరికే అవకాశం లభిస్తుందని వివరించింది. భూముల వేలంపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ భూముల వేలంతో దాదాపు 3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అయితే ఈ భూముల వేలంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. భూముల వేలంతో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది. వేలంపై మరికొందరు కూడా విమర్శలు చేయడంతో ప్రభుత్వం స్పందించి పై ప్రకటనను విడుదల చేసింది. -
‘కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల స్కాం జరిగింది’
సాక్షి, హైదరాబాద్ : కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని, వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు, సన్నిహితులే తక్కువ ధరకు భూములు కొనుక్కున్నారని ఆరోపించారు. రేపు అన్ని వివరాలు బయటపెడతానని చెప్పారు. కాగా, కోకాపేటలోని సర్కారు భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కోకాపేటలోని 49.949 ఎకరాల భూములకు ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించగా, ఓ ప్లాట్‌లో ఎకరం ఏకంగా రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధర పలికింది. అతి తక్కువ ధర రూ.31.2 కోట్లుగా నమోదైంది. మొత్తం 49.949 ఎకరాలకుగాను, ఒక్కో ఎకరం సగటున రూ.40.05 కోట్ల ధరకు అమ్ముడు బోయింది. ప్రభుత్వం ఎకరానికి రూ.25 కోట్ల కనీస ధర (అప్సెట్ ప్రైస్)ను ఖరారు చేయగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కళ్లు చెదిరే భారీ ధరలతో ప్లాట్లు అమ్ముడుబో యాయి. ఈ ప్లాట్లన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలే కొనుగోలు చేయడం గమనార్హం. కాగా కోకాపేట హాట్‌కేక్ అనే విషయం ఈ వేలం స్పష్టం చేసింది. -
కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరణ
-
కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రేపు(గురువారం) కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల వేలానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ భూముల వేలంపై విజయశాంతి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భూముల విక్రయానికి సంబంధించిన జీవో 13ను కొట్టేయాలని విజయశాంతి హైకోర్టును కోరారు. ఈ విచారణలో భాగంగా భూముల వేలం ఆపేందుకు నిరాకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. నిధుల సమీకరణతోపాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉన్నందున ఈ భూములను వేలం వేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక, అమ్ముకోవడమేంటని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూబ్యాంక్ ఏర్పాటుపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. -
మఠం భూముల వేలం: ముందుకురాని రైతులు
తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్, చంద్రగిరి మండలాల్లోని హథీరాంజీ మఠానికి చెందిన భూముల వేలానికి రైతుల నుంచి స్పందన కరువైంది. 172 ఎకరాల భూమికి సంబంధించి గురువారం ఉదయం తిరుపతిలోని హథీరాంజీ మఠం కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటకు రైతులు హాజరయ్యారు. కానీ ఎవరూ వేలం పాటలో పాల్గొనలేదు. దాంతో అధికారులు వేలంపాటను శుక్రవారానికి వాయిదా వేశారు.