సాక్షి, హైదరాబాద్ : కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని, వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు, సన్నిహితులే తక్కువ ధరకు భూములు కొనుక్కున్నారని ఆరోపించారు. రేపు అన్ని వివరాలు బయటపెడతానని చెప్పారు.
కాగా, కోకాపేటలోని సర్కారు భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కోకాపేటలోని 49.949 ఎకరాల భూములకు ఆన్‌లైన్ ద్వారా వేలం నిర్వహించగా, ఓ ప్లాట్‌లో ఎకరం ఏకంగా రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధర పలికింది. అతి తక్కువ ధర రూ.31.2 కోట్లుగా నమోదైంది. మొత్తం 49.949 ఎకరాలకుగాను, ఒక్కో ఎకరం సగటున రూ.40.05 కోట్ల ధరకు అమ్ముడు బోయింది. ప్రభుత్వం ఎకరానికి రూ.25 కోట్ల కనీస ధర (అప్‌సెట్ ప్రైస్)ను ఖరారు చేయగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కళ్లు చెదిరే భారీ ధరలతో ప్లాట్లు అమ్ముడుబో యాయి. ఈ ప్లాట్లన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలే కొనుగోలు చేయడం గమనార్హం. కాగా కోకాపేట హాట్‌కేక్ అనే విషయం ఈ వేలం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment