kokapeta
-
కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు..!
ఐటీ రంగంలో దాదాపు 80 శాతం వరకు హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అక్కడకు సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాలంటే.. కోకాపేట ప్రాంతం చూసుకుంటే అక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.12–14 వేల వరకు ఉంటోంది. మిగిలిన ప్రాంతాలన్నీ ఇప్పటికే బాగా రద్దీగా ఉంటున్నాయి. దాంతో ఇప్పుడు చాలామంది బాలానగర్ వైపు చూస్తున్నారు. - సాక్షి, సిటీబ్యూరోఒకప్పుడు బాలానగర్ అంటే పారిశ్రామికవాడ అని, భూగర్భ జలాలు కలుషితం అయ్యాయని, గాలి కూడా కాలుష్యంతో ఉంటుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నవి.. కేవలం నైఫర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే.ఒకప్పుడు ఇక్కడ ఉండే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (ఐడీపీఎల్) వంటి కంపెనీలు కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించినా, అది చాలాకాలం క్రితమే మూతపడింది. పైపెచ్చు, ఈ కంపెనీకి చెందిన 100 ఎకరాల భూముల్లో పచ్చదనం విస్తరించింది. ఇంతకుముందు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరించాయి గానీ, బాలానగర్‌లో ఇంతకుముందు రాలేదు.లగ్జరీ నిర్మాణాలు షురూ.. ఇప్పుడిప్పుడే బాలానగర్ వైపు కూడా లగ్జరీ నిర్మాణాలు మొదలవుతున్నాయి. కోకాపేటతో సహా ఇతర ప్రాంతాల్లో లభించే సదుపాయాలన్నీ ఇక్కడ కూడా లభిస్తున్నాయి. కానీ, కోకాపేటలో చదరపు అడుగు దాదాపు రూ.12–14 వేలు ఉండగా, ఇక్కడ దాదాపు రూ.6 నుంచి రూ.7 వేలకే లభ్యమవుతున్నాయి. అంటే ఇంచుమించు కోకాపేట ధరలో సగానికే లగ్జరీ ఫ్లాట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.హైటెక్ సిటీకి బాలానగర్ ప్రాంతం కూడా దాదాపు 12–13 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అయితే, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు వంటి మౌలిక సదుపాయాలు రావడంతో అర గంటలోపే బాలానగర్ నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. పైగా ఈ ప్రాంతంలో మంచి పెద్ద పెద్ద స్కూళ్లు, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఇక్కడ ఉండటంతో పిల్లల చదువుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. మాల్స్, మల్టీప్లెక్సులు కూడా ఉండటంతో వినోదం, విహారానికి కూడా మంచి అవకాశాలున్నాయి.బాలానగర్ వైపు.. మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ ఫ్లాట్లు కావాలంటే ఎంత లేదన్నా కనీసం రూ.6 నుంచి రూ.7 కోట్లకుపైగా పెట్టాలి. అదే బాలానగర్‌లో లగ్జరీ ఫ్లాటు అంటే దాదాపు 2 వేల చ.అ. విస్తీర్ణం ఉండే ఫ్లాటు అన్ని సౌకర్యాలతో కలిపి కూడా సుమారు రూ.కోటిన్నర– రెండు కోట్లలోపే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైటెక్ సిటీకి సమీపంలో ఇంత తక్కువ ధరలో, అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతంలో దొరకడం దాదాపు ఇంకెక్కడా లేదు. కాబట్టి, ఐటీ జనాలు క్రమంగా ఇప్పుడు బాలానగర్ వైపు చూస్తున్నారు. గతంలో వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసినా, చివరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడాలని అనుకుంటున్నవారు కూడా బాలానగర్ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు. -
HYD: కోకాపేటలో బ్లాస్టింగ్ కలకలం
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శుక్రవారం(డిసెంబర్20) బ్లాస్టింగ్ కలకలం రేపింది. కోకాపేటలోని నియోపోలిస్ వెంచర్ వద్ద నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ నిర్వహించింది. ఈ బ్లాస్టింగ్ తీవ్రతతో బండరాళ్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాయి. రాళ్లను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. రాళ్లు పక్కనే ఉన్న అయ్యప్పస్వాముల శిబిరంపై పడ్డాయి.కాగా, కోకాపేటలోని నియోపోలిస్ వెంచర్ అత్యధిక ధరకు ప్రభుత్వం గతంలో అమ్మిన విషయం తెలిసిందే. ఇక్కడ భూములు కొనుక్కున్న కంపెనీలు నిర్మాణం ప్రారంభించాయి. ఈ నిర్మాణ ప్రక్రియలో భాగంగానే నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ చేపట్టినట్లు సమాచారం. -
Shravanamasam Special.. ప్రతి శుక్రవారం.. మహా నైవేద్యం విందు!
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. ఈ మాసంలో పూజలతో ఇంటిల్లిపాది పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. ఈ నెల మొత్తం మాంసాహారం తినకుండా ఉంటారు. అలాంటి వారికోసం ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది. ప్రతి శుక్రవారం పూర్తి శాఖాహారంతో విందు ఏర్పాటు చేసింది. కోకాపేటలోని యునైటెడ్ తెలుగు కిచెన్ ఈ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చింది. ప్రతి శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ విందును వడ్డించనుంది. రూ.699కు ఈ శ్రావణ మాస మహా నైవేద్య విందును భోజన ప్రియులకు అందిస్తోంది. -
ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి భూకబ్జా?.. కోకాపేట భూమి నా సొంతం
అలంపూర్: హైదరాబాద్‌లోని కోకాపేట భూ వివాదంపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి స్పందించారు. కోకాపేటలో ఉన్న భూమి భూమి తన సొంతం అని తెలిపారు. మంగళవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం స్థానిక టూరిజం హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి భూకబ్జా చేసినట్లు కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయన్నారు. కోకాపేటలోని సర్వే నం.85లో 2.30 ఎకరాల భూమి 2013 సంవత్సరంలో కొనుగోలు చేశామన్నారు. తమ కుటుంబంలోని ముగ్గురు పేరిట ఉన్న ఈ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయన్నారు. తాము కొనుగోలు చేసిన తర్వాతే గోల్డ్ ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేతో భూమి అభివృద్ధి చేయడానికి అగ్రిమెంట్ సంతకం చేసినట్లు వివరించారు. అయితే సదరు సంస్థ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతోపాటు అందుకు సంబంధించి కనీసం జీహెచ్ఎంసీని ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతోనే అగ్రిమెంట్ రద్దు చేయాలని 2020లో కోర్టుకు వెళ్లామన్నారు. తమ స్థలంలో ఉన్న కూలీలను వెళ్లగొట్టినట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని, ఈ స్థలానికి పక్క సైట్లో పనులు జరుగుతుండటంతో కూలీలు అక్కడ ఉన్నారన్నారు. పక్క సైట్లో పనులు జరుగుతుండటంతో హద్దులు చూసుకోవాలని తన తమ్ముడిని పంపించానని చెప్పారు. భూమికి ఫెన్సింగ్ వేస్తుంటే గోల్డ్ ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు. గోల్డ్‌ఫిష్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగేపై గత 15 ఏళ్లలో 12 క్రిమినల్, 9 సివిల్ కేసులు నమోదయ్యాయని, 2021 ఫిబ్రవరి 25న పీడీ యాక్టు సైతం నమోదవగా.. అదే సంవత్సరంలో తెలంగాణ పోలీసులు అతన్ని కేరళలో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఉన్న సర్వే నం.85కు పక్కనే ఈ సంస్థ డెవలప్ చేస్తున్న స్థలంలో రెండు ఇళ్లు కొనుగోలు చేశామన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం డబ్బులు చెల్లించి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆరోపించారు. దీనిపై కూడా కోర్టుకు వెళ్లామని చెప్పారు. హీరో ప్రభాస్ బంధువు సత్యనారాయణరాజు ఒక ఇల్లు, సంజయ్ కమతం అనే వ్యక్తి రెండు ఇళ్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లారన్నారు. 2017లో తన తమ్ముడు వాళ్ల నాన్న కలిసి రెండు విల్లాలకు అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు చెల్లించినా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ తెచ్చుకున్నారన్నారు. ఎంతో మంది దగ్గర భూములు డెవలప్మెంట్ చేస్తామని తీసుకొని తర్వాత చీటింగ్ చేస్తున్నారని ఆరోపించారు. నేను కోర్టుకు వెళ్లడంతో హైదరబాద్‌కు చెందిన ఒక ఎమ్మెల్యేతో కలిసి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వద్దకు మధ్యవర్తిత్వం కోసం వెళ్లారన్నారు. కానీ, హర్షవర్ధన్‌రెడ్డి అదే చంద్రశేఖర్ వేగేకు 2016లో ఇల్లు కొనడానికి డబ్బులు ఇస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఇల్లు, డబ్బులు ఇవ్వలేదని, కాబట్టి మధ్యవర్తిగా రాలేనని ఆయన చెప్పారన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కాబట్టి ఇలాంటి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారని, దీనిపై కొన్ని మీడియా సంస్థలు నిజాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కోకాపేట వద్ద టీడీపీ నేత మాగంటిబాబు ఓవరాక్షన్
-
Kokapet Land Auction: రికార్డుల కోకాపేట.. ఒక్క ఫ్లాట్ రూ.22.50 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా కోకాపేట సరికొత్త రికార్డులను సృష్టించింది. గురువారం హెచ్ఎండీఏ నిర్వహించిన నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2 వేలంలో అత్యధిక బిడ్ వేసి ప్లాట్ నంబరు–11ను ఏపీఆర్ గ్రూప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎకరం రూ.67.25 కోట్ల చొప్పున రూ.506.39 కోట్లతో మొత్తం 7.53 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్రాంతంలో హైదరాబాద్‌కు, ఏపీఆర్ గ్రూప్ తలమానికంగా నిలిచే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేస్తున్నామని డైరెక్టర్ ఆవుల సంజీవ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. నాలుగు టవర్లు, ఒక్కోటి 50 అంతస్తులలో ఉంటుంది. ఫ్లోర్‌కు ఒక ఫ్లాట్ చొప్పున ఒక్క ఫ్లాట్ 15 వేల చ.అ. విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 200 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ధర చ.అ.కు రూ.15 వేలు చొప్పున ఒక్క ఫ్లాట్ ప్రారంభ ధర రూ.22.50 కోట్లుగా ఉంటుంది. ప్రాజెక్ట్ డిజైన్, ఎలివేషన్స్ నుంచి మొదలుపెడితే క్లబ్ హౌస్, వసతులు, మెటీరియల్స్ ప్రతీది హైఎండ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఉంటుంది. ఇప్పటికే సింగపూర్ ఆర్కిటెక్చర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. ప్లాట్ నంబరు–11 ఉన్న ప్రాంతం ఇతర మిగిలిన ప్లాట్ల కంటే ఎత్తులో ఉండటం, గండిపేట వ్యూ స్పష్టంగా కనిపిస్తుండటం దీని ప్రత్యేకతలు. అతి తక్కువ ధర ఈ ప్లాటే.. నియోపొలిస్ కోకాపేట ఫేజ్–2లో అతి తక్కువ ధర పలికింది కూడా ఈ 11 నంబరు ప్లాటే కావటం గమనార్హం. ఎకరం రూ.67.25 కోట్లతో ఏపీఆర్ గ్రూప్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. అయితే గతంలో కోకాపేట ఫేజ్–1 వేలంలో గరిష్ట ధర రూ.60 కోట్లు. గోల్డ్‌మైన్ లేఅవుట్లో రాజపుష్ప ప్రాపరీ్టస్ ఎకరం రూ.60.2 కోట్ల చొప్పున మొత్తం రూ.99.33 కోట్లతో 1.65 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. -
సర్కారీ ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ రెడీ.. రూ.5 వేల కోట్లకు ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారీ ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ మరోసారి సన్నాహాలు చేపట్టింది. సుమారు రూ.5 వేల కోట్లు సమకూర్చుకోవడమే లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లోని స్థలాలు, ఫ్లాట్లను విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఎయిర్‌పోర్టు మార్గంలో ఉన్న బుద్వేల్‌లో భారీ లేఅవుట్ పనులు వేగంగా కొనసాగుతుండగా.. కోకాపేటలో రెండో దశ, ఉప్పల్ భగాయత్‌లో మూడో దశ ఆన్లైన్ బిడ్డింగ్‌కు కార్యాచరణ చేపట్టింది. మరోవైపు పోచారంలో ఏడంతస్తుల చొప్పున ఉన్న రెండు రాజీవ్ స్వగృహ టవర్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రెండు టవర్లలో కలిపి 142 ఫ్లాట్లు ఉన్నాయి. అందరిచూపు బుద్వేల్ వైపే.. ఐటీ సంస్థలు మొదలుకొని మధ్యతరగతి వరకు ఇప్పుడు అందరిచూపు బుద్వేల్ వైపు పడింది. విమానాశ్రయం మార్గంలో ఉండటంతో సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా బుద్వేల్ హెచ్ఎండీఏ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ సుమారు 182 ఎకరాల ప్రభుత్వ భూమిని గ్రీన్‌ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అధికారులు రూ.200 కోట్లతో పనులు ప్రారంభించారు. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 6.13 ఎకరాల నుంచి 14.58 ఎకరాల వరకు ఉంటుందని అంచనా. తొలివిడత ఇక్కడ 50 ఎకరాల్లో విక్రయాలు చేపట్టనున్నారు. బహుళ ప్రయోజనాల జోన్‌గా ఈ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అంటే కార్యాలయ సముదాయాలు, నివాసాలు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, హెల్త్‌కేర్ వంటివి అభివృద్ధి చెందడానికి ఆస్కారముంది. వేలం ద్వారా ప్లాట్లను కొనుగోలు చేసేవారికి మూడు వారాల్లో నిర్మాణ అనుమతులన్నీ మంజూరు చేయనున్నారు. ఈ భూముల విక్రయాల ద్వారా కనీసం రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. కోకాపేటలో 64 ఎకరాలకు.. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్లో రెండో దశ ప్లాట్ల విక్రయానికి అధికారులు సన్నాహాలు చేపట్టారు. 2021 జూలైలో నిర్వహించిన మొదటి దశ వేలంలో సుమారు 49 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 8 ప్లాట్లను విక్రయించారు. ఎకరానికి రూ.25 కోట్ల చొప్పున కనీస ధర నిర్ణయించినా.. అనూహ్యమైన పోటీతో ఎకరానికి కనిష్టంగా రూ.40.05 కోట్ల నుంచి గరిష్టంగా రూ.60 కోట్ల వరకు ధర పలికింది. ఇప్పుడు కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలోనే 64 ఎకరాలను విక్రయించనున్నారు. రూ.2,500 కోట్లకుపైగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఉప్పల్ భగాయత్‌లో మూడో దశ.. ఉప్పల్ భగాయత్‌లో ఇప్పటికే రెండుసార్లు హెచ్ఎండీఏ ప్లాట్లను విక్రయించారు. మెట్రోస్టేషన్‌కు అందుబాటులో ఉన్న ఈ స్థలాలకు బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ మొత్తం 450 ఎకరాల్లో లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. మొదటి, రెండో దశలో ప్లాట్లను కొనుగోలు చేసినవారు పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు చేపట్టారు. 2021 డిసెంబర్లో జరిగిన వేలంలో చదరపు గజానికి కనిష్టంగా రూ.75 వేల నుంచి గరిష్టంగా రూ.లక్ష వరకు పలికింది. ప్రస్తుతం మూడో దశలో 40 ఎకరాలను విక్రయిస్తామని, రూ.650 కోట్లకు పైగా రావచ్చని అధికారులు చెప్తున్నారు. ఇది కూడా చదవండి: వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు -
పెట్టుబడుల వరద, హైదరాబాద్‌లో సెమీకండక్టర్ల తయారీ..ఎక్కడంటే!
సాక్షి, సిటీబ్యూరో: కార్యాలయ స్థలాల లావాదేవీలలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ ఆఫీసు స్పేస్‌ను కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన సెమీకండకర్ల తయారీ కంపెనీ మైక్రోచిప్ టెక్నాలజీ కోకాపేటలోని వన్ గోల్డెన్ మైల్ టవర్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల గ్రేడ్–ఏ ఆఫీసు స్థలాన్ని కొనుగోలు చేసింది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ లావాదేవీలకు కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సలహాదారుగా వ్యవహరించింది. అమెరికాలోని ఆరిజోనా ప్రధాన కేంద్రంగా ఉన్న మైక్రోచిప్‌కు మన దేశంలో హైదరాబాద్‌తో సహా బెంగళూరు, చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. తాజా పెట్టుబడులు వచ్చే 10 ఏళ్లలో కంపెనీ సామర్థ్యాల విస్తరణ, నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతాయని మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ శ్రీకాంత్ శెట్టికెరె అన్నారు. 66 మీటర్ల ఎత్తయిన వాణిజ్య సముదాయంలో సుమారు 5 లక్షల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్థలం ఉంది. ఆరియన్, ఎస్కార్, టెర్మినస్‌లు ఈ ప్రాపర్టీని కో–ప్రమోటర్లుగా ఉన్నాయి. యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్జీబీసీ) నుంచి ఎల్ఈఈడీ గోల్డ్ రేటింగ్ సర్టిఫికెట్‌ను దక్కించుకుందని వన్ గోల్డెన్ మైల్ మేనేజింగ్ పార్టనర్ పుష్కిన్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఆర్ధిక మాంద్యం, లేఆఫ్‌లు వంటి వ్యాపార ఒత్తిడి నేపథ్యంలోనూ హైదరాబాద్‌లో ప్రీమియం ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం సానుకూల దృక్పథమని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరాబాబు తెలిపారు. -
రంగారెడ్డి: కోకాపేటలో పేలిన సిలిండర్
-
నార్సింగిలో విషాదం: ఫంక్షన్‌కు వచ్చి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన బాలుడు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ స్విమ్మింగ్‌పూల్‌లో పడి శ్యామ్ అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వచ్చిన శ్యామ్... స్విమ్మింగ్‌పూల్ వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడకు చెందిన శ్యామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. (చదవండి: మహిళా సర్పంచ్‌కు వరకట్న వేధింపులు) -
కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే..
సాక్షి, మణికొండ: నగర శివారులో ఐటీ జోన్‌కు, ఔటర్‌రింగ్ రోడ్డుకు పక్కనే ఎత్తైన కొండలుగా ఒకదానిపై మరొకటి పేర్చినట్టుగా ఉండి చూపరులను ఇట్టే ఆకట్టుకునేవి కోకాపేట కొండలు. ప్రకృతి, రాతి ప్రేమికులను ఆకట్టుకోవటంతో పాటు వందలాది రాతి పనుల కార్మికులకు ఉపాధిని చూపటం, అనేక పక్షి, వృక్ష జాతికి నెలవుగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కొండల్లో సగభాగం, పక్కనే ఉన్న భూములను వేలం వేయడంతో రికార్డు స్థాయిలో ఎకరం రూ.14.25కోట్లు పలికాయి. దీంతో వాటిల్లో కొంత మేర కొండలు పోయి అద్దాల మేడలు లేచాయి. రూపురేఖలు కోల్పోతున్న కోకాపేట గుట్టలు ఇటీవల కోర్టు కేసు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావటంతో మిగిలిన మరింత భూమిని ఇటీవల వేలం వేయడంతో కొనుగోలుదారులు అత్యధికంగా ఎకరం రూ.56కోట్ల వరకు పోటీ పడికొన్నారు. వాటి పక్కనే కొన్ని కులసంఘాలకు భూములను కేటాయించారు. ఇంకేముంది అన్ని డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన వారికి హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం కొండలను చదును చేయడం, రోడ్లు, తాగునీటి సౌకర్యం, తదితర మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. దీంతో ఇప్పటి వరకు చూడముచ్చటగా ఉన్న రాతి కొండలు వేగంగా కరిగిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా గతంలో కొనుగోలు చేసిన సంస్థలతో పాటు హెచ్ఎండీఏ వారు పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. చదవండి: తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్ -
దక్షిణాదిలోనే ఎత్తయిన నివాస సముదాయం..హైదరాబాద్‌లోనే
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయం హైదరాబాద్‌లో ఏర్పాటుకానుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్ఏఎస్ ఇన్ఫ్రా జీ+57 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా ‘క్రౌన్’ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఇప్పటివరకు దక్షిణ భారతంలో 50 అంతస్తులతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడా స్థానాన్ని భాగ్యనగర ‘క్రౌన్’ సొంతం చేసుకుంది. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్మెంట్.. హైదరాబాద్‌కు చెందిన సాస్ ఇన్ఫ్రా కోకాపేటలో 4.5 ఎకరాల స్థలంలో క్రౌన్ పేరిట జీ+57 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. భవనం ఎత్తు 228 మీటర్లు. ఫ్లోర్‌కు ఒకటే అపార్ట్మెంట్ ఉంటుంది. 6,565 చదరపు అడుగులు, 6,999 చ.అ., 8,811 చ.అ.లలో అపార్ట్మెంట్ విస్తీర్ణాలుంటాయి. ధర చదరపు అడుగుకు రూ.8,950గా నిర్ణయించామని సాస్ ఇన్ఫ్రా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇప్పటికే 60–70 యూనిట్లు విక్రయమయ్యాయని.. 2025 తొలి త్రైమాసికం నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఓఆర్ఆర్ టోల్‌ప్లాజా సమీపంలో జీ+42 అంతస్తులలో మరొక ప్రాజెక్ట్ కూడా రానున్నట్లు చెప్పారు. ♦నానక్‌రాంగూడలో మూడు బేస్మెంట్లు 32 అంతస్తులలో ఆక్రోపోలిస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన సుమధుర నిర్మాణ సంస్థ.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నాలుగు బేస్మెంట్లు, స్టిల్ట్+44 అంతస్తుల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 5.06 ఎకరాల విస్తీర్ణం 20 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఒలంపస్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. ఇందులో 854 యూనిట్లుంటాయి. 1,670–3,000 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర రూ.7,499లుగా నిర్ణయించామని సుమధుర వైస్ చైర్మన్ కేవీ రామారావు తెలిపారు. చదవండి : Lijjat Papad: రూ.80 పెట్టుబడి కట్ చేస్తే రూ.1600 కోట్ల టర్నోవర్ ఎక్కడ వస్తున్నాయంటే? ♦నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఖాజాగూడ, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో ఎక్కువగా హైరైజ్ నిర్మాణాలు వస్తున్నాయి. ♦ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటమే డెవలపర్లు హైరైజ్ బిల్డింగ్స్ నిర్మించడానికి ప్రధాన కారణమని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు గృహాలను అందించాలంటే ఈ తరహా నిర్మాణాలే సరైనవి. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో నిర్మాణాలు కేవలం 20 శాతం లోపు ఉండటం మంచి పరిణామం. ఫలితంగా మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించవచ్చు. హైరైజ్ ఉన్న చోట అభివృద్ధి.. హైరైజ్ బిల్డింగ్స్ ఉండే ఏరియాలు త్వరగా డెవలప్ అవుతాయి. ల్యాండ్‌మార్క్ టవర్లే ఏరియా పేరుగా మారిపోతాయి. ఎక్కువ జనాభా నివాసముంటుంది కాబట్టి రిటైల్, షాపింగ్ కాంప్లెక్స్‌లతో వాణిజ్య భవనాలు వస్తాయి. బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్ ఓనర్లు, ఐటీలోని వర్కింగ్ కపుల్స్ ఎక్కువగా హైరైజ్ బిల్డింగ్స్ కొనుగోలు చేస్తుంటారని సుమధుర సీఎండీ మధుసూదన్ తెలిపారు. నిర్మాణం ఎత్తు పెరిగే కొద్దీ వ్యయం కూడా పెరుగుతుంటుంది. సాధారణంగా చ.అ.కు నిర్మాణ వ్యయం రూ.2 వేలు అయితే.. హైరైజ్‌లో రూ.3 వేల వరకు అవుతుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే? ♦సాధారణ భవన నిర్మాణలతో పోలిస్తే హైరైజ్ భవనాల అనుమతుల జారీలో ప్రత్యేక శ్రద్ధ, నిరంతర తనిఖీ, పర్యవేక్షణ అవసరం. పర్మిషన్ ఫీజులు వస్తున్నాయి కదా అని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భవిష్యత్తులో జరిగే ప్రమాద నష్టాలను ఊహించలేం. ♦హైరైజ్ బిల్డింగ్స్‌లో ఉండే ఎక్కువ జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆయా ప్రాంతాల్లో రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ♦ప్రతి అంతస్తుని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి ఇతరత్రా అంశాలను తనిఖీ చేయాలి. ♦ఆయా భవనాలు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణంలో నాణ్యతను పరిశీలించాలి. ట్రాఫిక్ అసెస్మెంట్ను పూర్తి స్థాయి స్టడీ చేసిన తర్వాతే అనుమతులను జారీ చేయాలి. లాభాలు ఏంటంటే? ♦ఎత్తైన నిర్మాణాల్లో నివాసముంటే మన ఆలోచన శక్తి, విధానపరమైన నిర్ణయాలు కూడా ఎత్తులో ఉంటాయి. పొద్దున్న లేవగానే బాల్కనీ నుంచి సిటీ వ్యూ చూస్తూ ప్రశాంతమైన ♦వాతావరణాన్ని ఆస్వాదిస్తూ దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ♦ఇంట్లోకి గాలి, వెలుతురు, సూర్యరశ్మి ధారాళంగా వస్తాయి. చుట్టూ పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు. ♦ధ్వని, వాయు కాలుష్య సమస్య ఉండదు. పై అంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలూ అంతగా ఉండవు. ♦ప్రాజెక్ట్‌లోని నివాసితులందరూ ఒకే స్థాయి వాళ్లు ఉంటారు కాబట్టి పెద్దగా సోషల్ గ్యాప్ ఉండదు. -
‘కోకాపేట భూముల వేలంలో వెయ్యి కోట్ల స్కాం జరిగింది’
సాక్షి, హైదరాబాద్ : కోకాపేట భూముల వేలంలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎకరం రూ.60 కోట్లకు అమ్ముడయ్యే భూమిని రూ.40 కోట్లకే అమ్మారని, వేలంలో బయటవారు పాల్గొనకుండా అడ్డుకున్నారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు, సన్నిహితులే తక్కువ ధరకు భూములు కొనుక్కున్నారని ఆరోపించారు. రేపు అన్ని వివరాలు బయటపెడతానని చెప్పారు. కాగా, కోకాపేటలోని సర్కారు భూముల వేలం సరికొత్త రికార్డులు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) కోకాపేటలోని 49.949 ఎకరాల భూములకు ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహించగా, ఓ ప్లాట్‌లో ఎకరం ఏకంగా రూ.60.2 కోట్ల గరిష్ట బిడ్డింగ్ ధర పలికింది. అతి తక్కువ ధర రూ.31.2 కోట్లుగా నమోదైంది. మొత్తం 49.949 ఎకరాలకుగాను, ఒక్కో ఎకరం సగటున రూ.40.05 కోట్ల ధరకు అమ్ముడు బోయింది. ప్రభుత్వం ఎకరానికి రూ.25 కోట్ల కనీస ధర (అప్సెట్ ప్రైస్)ను ఖరారు చేయగా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కళ్లు చెదిరే భారీ ధరలతో ప్లాట్లు అమ్ముడుబో యాయి. ఈ ప్లాట్లన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలే కొనుగోలు చేయడం గమనార్హం. కాగా కోకాపేట హాట్‌కేక్ అనే విషయం ఈ వేలం స్పష్టం చేసింది. -
ఔటర్ రోడ్డుపై ప్రమాదం
సాక్షి, గండిపేట : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిలిచివున్న కారును ఓ లారి బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం తలెత్తింది. భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైనట్టు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోకాపేటలో గొల్ల, కురుమ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..గొల్ల, కురుమ జాతి అత్యధికంగా ఉన్న తెలంగాణ భారతదేశానికి దిక్సూచి కావాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 35 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వీటితో వేల కోట్ల సంపదను యాదవలు సృష్టించబోతున్నారన్నారు. పశువుల కోసం మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచి తెలంగాణ నుంచే గొర్రెలు ఎగుమతి అయ్యే పరిస్థితి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తామని సీఎం తెలిపారు. అదే పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి కేవలం 7 గంటలే విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
బీసీలకు అన్నిరంగాల్లో అవకాశాలు: కేసీఆర్
-
అలా సెట్ అయింది
మర్యాదరామన్న సినిమా గుర్తుందా.. ? ప్రాణరక్షణ కోసం అందులో హీరో గడప దాటని ఇల్లు గుర్తొచ్చిందా..! రాయలసీమ ఠీవి అణువణువూ కనిపించే ఆ ఇల్లు ఒక్క మర్యాదరామన్న సినిమాలోనే కాదు.. ఆపై ఎన్నో సినిమాల్లో మరెన్నో యాంగిల్స్‌లో కనిపించింది. మర్యాదరామన్న స్టోరీలైన్లా.. ఆ ఇంటి సెట్ వేసి ఏళ్లవుతున్నా.. సినీజనాలు నిత్యం ఆ గడప తొక్కుతూనే ఉన్నారు. మర్యాదగా షూటింగ్ చేసుకుంటున్నారు. పావు ఎకరం లోగిలిలో నిండుగా కనిపిస్తూ పల్లె వాతావరణాన్ని గుర్తుతెచ్చే విధంగా నిర్మించిన ఆ సెట్‌కు పేటెంట్ సంపాదించి అందరి మన్ననలు పొందారు ఆర్ట్ డెరైక్టర్ ఎస్.రవీంద్రారెడ్డి. సెట్ ఏమిటి..? పేటెంట్ ఏమిటి..? అని ఆశ్చర్యపోతున్నారా..! కొత్తరకం కెమికల్స్ వాడి చెక్కు చెదరని ఇంటి సెట్ వేసిన మొదటి కళాదర్శకుడిగా గుర్తింపు పొందిన రవీంద్రారెడ్డి చేసిన మ్యాజిక్ గురించి వివరంగా.. - భువనేశ్వరి నగర శివార్లలో ఉన్న కోకాపేటకు వెళ్లి.. ఇక్కడ మర్యాదరామన్న ఇల్లు ఎక్కడని ఎవర్ని అడిగినా.. ఆ సెట్‌కు రూట్ చెబుతారు. ఆ రూట్లో వెళ్లి చూస్తే.. ఆ మండువా లోగిలి మీకు కనిపిస్తుంది. మర్యాదరామన్న కథ ప్రకారం.. అందమైన ఇల్లొకటి కావాలి. ఆ ఇల్లు, ఇంటి పరిసరాలు అన్నీ అనంతపురంలోని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించాలి. తలుపులు, దూలాలు, వాసాలు, మెట్లు అన్నీ ఒరిజినల్‌గా కనిపించాలి. దానికోసం రవీంద్రారెడ్డి పెద్ద కసరత్తే చేశారు. రెండువందల పేజీల పేపర్ వర్క్, 300 మంది పనివాళ్లతో రెండు నెలలు శ్రమిస్తే ఆ సెట్ కుదిరింది. అందుకే మర్యాదరామన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ ఇల్లు కూడా అంత పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత కూడా ఈ సెట్‌కు పాపులారిటీ తగ్గలేదు. ఈ ఇంటిలో ఇప్పటి వరకూ దాదాపు 600 సినిమాలకు పైగా షూటింగ్ చేసుకున్నాయి. పేటెంట్ ఏమిటి? ఒక సీన్ కోసం.. ఒక పాట కోసం.. వేసే భారీ సెట్టింగులు సైతం.. పని అయిపోయాక పీకేస్తారు. మరీ భారీ సెట్టింగ్‌లు అయితే రెండు మూడు సినిమాలకు వాడుకుంటారు. మర్యాదరామన్న సెట్ ఇందుకు భిన్నమైంది. మామూలు సెట్‌లా కాకుండా దీన్ని వేసేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు రవీంద్రారెడ్డి. రెండు టన్నుల బరువుండే అకెలా క్రేన్స్ కూడా ఈ ఇంటి రెండో అంతస్తులోకి తీసుకెళ్లి షూటింగ్ చేయొచ్చు. అంత ధృడంగా దీన్ని వేశారు. ‘ఇలాంటి సెట్ వేయడం మన దగ్గర మొదటి ప్రయోగం. మామూలుగా సెట్ల నిర్మాణానికి వాడే ఫ్లైవుడ్నే నేనూ వాడాను. కాకపోతే వాటిని అతికించడానికి కొత్తరకం మెటీరియల్ వాడాను. దాన్ని తయారు చేసిందీ నేనే. లేటెక్స్, ఇసుక, ఫెవికాల్‌కు తోడు కొన్ని రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన ఆ మెటీరియల్ నేను ఊహించిన దానికంటే మంచి ఫలితాన్ని ఇచ్చింది. మిగతా వస్తువుల తయారీలో కూడా నా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోగలిగాను. ఇంటి సెట్ క్వాలిటీని చూసిన చాలా మంది పేటెంట్ కోసం అప్లయ్ చేయమని చెప్పారు. దాంతో అన్ని వివరాలతో చెన్నైకి చెందిన పేటెంట్ కంపెనీకి అప్లికేషన్ పంపాను. వాళ్లు ఆరునెలలు ఈ ఇంటికి సంబంధించిన పరిశోధన జరిపారు. మన దేశంలోనే కాదు.. ఇంకెక్కడా కూడా ఇంత నాణ్యమైన ఇంటిసెట్ లేదని, నేను వాడిన మెటీరియల్ యూనిక్ అని గుర్తించి నాకు పేటెంట్ హక్కుల్ని కల్పించారు’ అని చెప్పారు రవీంద్రారెడ్డి. మెటీరియల్ చుట్టూ పొలాలు.. ‘మర్యాదరామన్న చిత్రంలో పొలాల్లో కనిపించే సీన్ల కోసం ఆ ఇంటిపక్కనే రెండు ఎకరాల్లో జొన్నపంట పండించి మరీ షూటింగ్ చేశారు రాజమౌళి. ఆ సీన్లలో ఈ ఇంటి నీడైనా కనిపించకపోవడం జక్కన్న పనితనానికి మచ్చుతునక. కథ చెప్పి పక్కకు తప్పుకుంటారు. ఆర్ట్ విషయంలో అసలు కల్పించుకునేవారు కాదు. నిర్మాత సహకారం కూడా మరువలేనిది. ఇంటి సెట్ ఒకెత్తయితే.. ఆ ఇంట్లో కనిపించే వస్తువులు మరోఎత్తు. ఊయల నుంచి వంటింటి సామాన్ల వరకూ అన్నిట్లో ఆ తరం నేటివిటీ కనిపించేలా డిజైన్ చేశాను. ఇవన్నీ ప్లైవుడ్, థర్మాకోల్, ఫైబర్ వాడి తయారు చేశాను. చివరికి పశువుల కొట్టంలో కనిపించే నీళ్ల తొట్టెలతో సహా. కథకు జీవం పోసిన ఆ సెట్‌ని ఆ తర్వాత కొన్ని వందల సినిమాలకు వాడడం, ఇప్పటికీ మర్యాదరామన్న ఇంటి సెట్ అనే పదం వాడడం.. వింటుంటే గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చిరునవ్వుతో చెప్పారు రవీంద్రారెడ్డి. కొన్ని వందల సినిమాలు... గబ్బర్‌సింగ్‌లో విలన్ ఇల్లు, బృందావనంలో శ్రీహరి ఇల్లు, కందిరీగ, పూలరంగడు, మిర్చి.. ఇలా చాలా సినిమాల షూటింగులు ఆ ఇంట్లోనే జరిగాయి. తమిళ విక్రమార్కుడు కూడా ఇక్కడే షూట్ చేశారు. నాలుగేళ్లలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు ఆరువందల సినిమాల చిత్రీకరణ జరిగిన ఆ ఇంట్లో ప్రస్తుతం తెలుగులో ఓ టాప్‌హీరో షూటింగ్ జరుగుతోంది. దానికి కూడా రవీంద్రారెడ్డి ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ ఇంటిని చిన్న చిన్న మార్పులు చేసి వాడుకుంటే ఈసారి రవీంద్రా ఇంటి రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. తమిళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథనం కోసం ఆ ఇంటికి ద్రవిడ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఎంట్రన్స్ లుక్ కూడా మారిపోయింది. రిచ్ అండ్ లేటెస్ట్గా కనిపించేలా కలర్ఫుల్గా తీర్చిదిద్దారు. అదీ సెట్టే.. ‘మర్యాదరామన్న సినిమాలోనే ట్రైన్ జర్నీ సీన్ చూశారుగా.. ఆ ట్రైన్ కూడా సెట్టే. ఈ ఇంటి పక్కనే రెండు బోగీలు సెట్ వేసి.. ట్రైన్ సీన్‌ను లాగించేశారు. రాయలసీమలో కనిపించే నేటివిటీని చూపిన ఆ సెట్ తర్వాత ఓ ట్రెండ్‌ని సెట్ చేసింది. ఈగ మూవీలో ఇల్లు, అత్తారింటికి దారేది, జులాయి.. ఇలా మిగితా సినిమాల్లో ఇళ్ల సెట్లనూ ఆ దృష్టితో వేసినవే’ అంటూ ముగించారు. -
హెచ్‌ఎంఢీఏ
ఈ నెల 28న సుప్రీం బెంచ్‌కు కోకాపేట వివాదం తీర్పు అనుకూలంగా లేకుంటే భారీ మూల్యం హెచ్ఎండీఏ అధికారుల్లో ఆందోళన సుప్రీంలో వాదనలకు సిద్ధం సాక్షి, సిటీబ్యూరో: సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అనుకూలంగా వస్తే రూ.1500 కోట్లు ఆదాయం... ప్రతికూలంగా వస్తే రూ. 1000 కోట్లు భారం...ఇదీ హెచ్ఎండీఏ పరిస్థితి. కోకాపేట భూముల వ్యవహారం కేసు ఈ నెల 28న బెంచ్‌పైకి వస్తుండడంతో హెచ్ఎండీఏ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన హెచ్ఎండీఏకు ఈ వివాదం జీవన్మరణ సమస్యగా మారింది. దీనిపై బలంగా వాదనలు వినిపించేందుకు అధికారులు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కోకాపేట భూములన్నీ ప్రభుత్వానివేనని, ఆ విషయంలో ఎటువంటి సందేహాలకు తావులేదని ఇప్పటికే సుప్రీం కోర్టుకు నివేదించారు. యాజమాన్యపు హక్కుల విషయంలో వివాదం లేదని, బహిరంగ వేలంలో ఈ భూములను కొనుగోలు చేసిన సంస్థలకు రిజిస్ట్రేషన్‌కు తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. ఆ సంస్థలు ముందుకు రావట్లేదని సుప్రీంకోర్టుకు హెచ్ఎండీఏ విన్నవించింది. వేలంలో భూములు కొన్న సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని గతంలోహైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు అవసరం లేదని నివేదిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో హెచ్ఎండీఏ కౌంటర్లు దాఖలు చేసింది. వీటికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర అడ్వొకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్, సుప్రీం న్యాయవాదులతో కలసి హెచ్ఎండీఏ వాదనను బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో విజయం సాధించేందుకు అధికారులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వస్తే రూ.687 కోట్లు వడ్డీతో సహా సుమారు రూ.1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనుకూలంగా వస్తే సుమారు రూ.1500 కోట్ల ఆదాయం వస్తుంది. వివాదం ఇలా... రాష్ట్ర ప్రభుత్వం నిధుల సేకరణలో భాగంగా 617 ఎకరాల భూమిని గతంలో హెచ్ఎండీఏకు ఇచ్చింది. 2007లో ఈ భూములకు వేలం నిర్వహించిన హెచ్ఎండీఏ వివిధ సంస్థలకు విక్రయించింది. ప్రధానంగా గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు 100 ఎకరాలు, ఎంపైర్-1, 2లకు 87 ఎకరాలు మొత్తం 187 ఎకరాల భూమిని వేలంలో విక్రయించింది. అప్పట్లో రియల్ బూమ్ కారణంగా ఎకరా రూ.4.5 కోట్ల నుంచి రూ.14 కోట్ల వరకు ధర పలికింది. వీటి విక్రయం ద్వారా మొత్తం రూ.1755 కోట్లు ఆదాయం వస్తున్నట్లు అప్పట్లో లెక్కతేలింది. వేలం పాటలో ఈ భూములు దక్కించుకున్న 15 సంస్థలు రెండు వాయిదాల్లో రూ.687 కోట్లు చెల్లించాయి. వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. ఆ తర్వాత రియల్ బూమ్ పడిపోవడంతో భూములకు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలో కోకాపేట భూములు కొనుగోలు చేసిన వాటిలో 14 సంస్థలు తాము వేలంపాటలో దక్కించుకున్న భూములకు సంబంధించి యాజమాన్యపు హక్కుల వివాదం ఉందని, తమకు చెప్పుకుండా హెచ్ఎండీఏ దాచి పెట్టిందనే సాకుతో తమ సొమ్మును తిరిగి చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించాయి. వాదోపవాదాల అనంతరం కోకాపేట భూములు వివాదంలో ఉన్న విషయం తెలియజేయకుండా వేలం వేయడాన్ని తప్పుబడుతూ ఆయా సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాలని సింగిల్ జడ్జి 2010లో తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీళ్లు దాఖలు చేసింది హెఎండీఏ. ఈ కేసును లోతుగా పరిశీలించిన ధర్మాసనం గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చుతూ తీర్పు నిచ్చింది. దీంతో హెచ్ఎండీఏ మిగిలిన మొత్తాన్ని చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హడావుడిగా ఆ సంస్థలకు నోటీసులిచ్చింది. ఇందుకు ససేమిరా అంటూ అవి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ దీనిపై తిరిగి ఉత్తర్వులిచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ హెచ్ఎండీఏని సుప్రీం ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చే సింది. ఈ కేసు జులై 4, 2014న చీఫ్ జస్టిస్ బెంచ్‌పైకి రాగా, ఇందులో మొత్తం 11 కేసులున్నాయని, వీటన్నిటిని క్లబ్ చేస్తూ 3 నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కోకాపేట భూముల కేసు ఈ నెల 28న బెంచ్‌పైకి రానుండటంతో హెచ్ఎండీఏలో కలవరం మొదలైంది. టైటిల్ వ్యవహారంలోనూ... కోకాపేటలో 1650 ఎకరాల భూమి మహ్మద్ నస్రత్ జంగ్ బహద్దూర్-1 వారసులదని, వారి ప్రతినిధిని తానంటూ గతంలో కె.ఎస్.బి.అలీ కోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదనల అనంతరం ఆ భూమి ప్రభుత్వానిదేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ 2012 జులైలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌చేస్తూ కె.ఎస్.బి.అలీ సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ ఫైల్ చేశారు. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఆ భూమి విషయంలో యథాతథ స్థితిని (స్టాటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలోనూ హెచ్ఎండీఏ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో పాటు వెకేషన్ పిటిషన్ కూడా వేసింది. ఈ కేసు వచ్చేనెల 26న బెంచ్‌పైకి వచ్చే అవకాశం ఉందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.