
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలో శుక్రవారం(డిసెంబర్20) బ్లాస్టింగ్ కలకలం రేపింది. కోకాపేటలోని నియోపోలిస్ వెంచర్ వద్ద నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ నిర్వహించింది. ఈ బ్లాస్టింగ్ తీవ్రతతో బండరాళ్లు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపడ్డాయి. రాళ్లను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పరుగులు తీశారు. రాళ్లు పక్కనే ఉన్న అయ్యప్పస్వాముల శిబిరంపై పడ్డాయి.
కాగా, కోకాపేటలోని నియోపోలిస్ వెంచర్ అత్యధిక ధరకు ప్రభుత్వం గతంలో అమ్మిన విషయం తెలిసిందే. ఇక్కడ భూములు కొనుక్కున్న కంపెనీలు నిర్మాణం ప్రారంభించాయి. ఈ నిర్మాణ ప్రక్రియలో భాగంగానే నిర్మాణ సంస్థ బ్లాస్టింగ్ చేపట్టినట్లు సమాచారం.

Comments
Please login to add a commentAdd a comment