
సాక్షి, హైదరాబాద్: సామాన్యులు సైతం సులభంగా ఇంటి నిర్మాణ, లే ఔట్ అనుమతులు పొందేలా ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ‘బిల్డ్ నౌ’ను జీహెచ్‌ఎంసీ (GHMC) అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ్ నౌ’తో భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. స్థలం ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తులు నిర్మించవచ్చో, వదలాల్సిన సెట్‌బ్యాక్‌లు తదితర భవన నిర్మాణ నిబంధనల సమాచారం తెలుపుతుంది. సామాన్యులు ఇంటి అనుమతికి దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుందని, డ్రాయింగ్స్ పరిశీలన నిమిషాల్లోనే పూర్తవుతుందని జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీప్లానర్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రస్తుతం టీజీబీపాస్‌లో ఇన్‌స్టంట్ అప్రూవల్‌కు, మిగతా అనుమతులకు వేర్వేరు విండోస్ ఉండగా, బిల్డ్ నౌలో అన్నింటికీ ఒకే విండోతో త్వరితగతిన అనుమతులు జారీ అవుతాయి. భవన నిర్మాణం పూర్తయ్యాక ఎలా ఉంటుందో కూడా త్రీడీలో చూపుతుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో ప్రారంభించిన దీన్ని క్రమేపీ హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, తెలంగాణ (Telangana) మొత్తం అమల్లోకి తేనున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా గురువారమే ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకున్న ముగ్గురికి అనుమతులు జారీ చేశారు.
ఇలా పని చేస్తుంది..
→ ఏఐతో పాటు సురక్షిత డిజిటల్ ట్రాన్సాక్షన్, స్థలం పరిమాణానికి సంబంధించిన అవగాహన, ఆలోమేషన్ వంటి వాటితో అత్యంత వేగంగా అనుమతుల జారీ.
→ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ వ్యవస్థ సులభతరం.. మెరుపువేగం.
→ 5 నిమిషాల్లోపునే డ్రాయింగ్ పరిశీలన పూర్తవుతుంది. ఇప్పటి వరకు 2–30 రోజుల సమయం పట్టేది.
→ అధునాతన క్యాడ్ ప్లగిన్. డిజైన్ సాఫ్ట్‌వేర్‌తో ప్రత్యక్ష అనుసంధానం.
→ డ్రాయింగ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నదీ లేనిదీ తక్షణమే నిర్ధారిస్తుంది.
→ సాధారణ లోపాలు నివారిస్తూ దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేస్తుంది.
→ వాట్సాప్ ద్వారానూ అప్‌డేట్స్ తెలియజేస్తుంది. ప్రాసెస్ ఫ్లోను దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.
→ సందర్భానుసారం మారే ఫీజులు, టారిఫ్‌లు, ప్రాసెసింగ్ ఫీజులు తక్షణమే నవీకరించుకోవచ్చు. 360 డిగ్రీస్ పారదర్శకత.
→ స్థూల, సూక్ష్మస్థాయిల్లో ప్రాజెక్ట్ పరిస్థితి, పనితీరు పరిశీలన.
→ వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం.
→ పట్టణ నియమ నిబంధనలు మార్పుల్పి క్షణాల్లో అప్‌డేట్ చేసుకోవచ్చు.
→ పాలసీ ఆధారిత అప్‌డేట్స్‌ను రిపోర్టులు, చట్టపర పత్రాల్లో అమలు చేయొచ్చు.
→ అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ ఉంటుంది.
ఎన్ని అంతస్తులైనా..
→ ఇప్పటి వరకు డ్రాయింగ్స్ పరిశీలనకే ఎన్నో రోజులు పట్టేది. బిల్డ్‌నౌతో 7.7 ఎకరాల విస్తీర్ణంలోని హైరైజ్ భవనాలకు, 33 అంతస్తులున్న 5 టవర్లకు, 12 అంతస్తుల ఎమినిటీస్ బ్లాక్‌కు, 22 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియా భవనాలకైనా 5 నిమిషాల్లోనే పరిశీలన పూర్తవుతుంది.
→ సింగిల్ విండోతో వివిధ ప్రభుత్వ విభాగాల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.
→ జియో ఇంటెలిజెన్స్‌తో ఆటోమేటిక్‌గానే మాస్టర్‌ప్లాన్‌లు, సంబంధితమైనవి పరిశీలిస్తుంది.
→ అడ్వాన్స్‌డ్ క్యాడ్ ప్లగిన్ భారీ భవనాలకు సైతం ఆర్కిటెక్టులు, ఇంజినీర్ల సమయాన్ని తగ్గస్తుంది. వారాలు, నెలల నుంచి రెండు మూడు రోజులకు తగ్గుతుంది.
→ క్యాడ్ ప్లగిన్ వినియోగానికి సంబంధించి వెబ్‌సైట్ నుంచి వన్ టూ వన్ వీడియో కన్సల్టేషన్ కూడా జరపొచ్చని చెబుతున్నారు.
→సిటిజెన్ సెంట్రిక్ డిజైన్‌తో పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment