
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గండిపేట : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిలిచివున్న కారును ఓ లారి బలంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం తలెత్తింది. భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఘటనాస్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారైనట్టు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.